*ఆధ్యాత్మికత అంటే ఏమిటి?*
చాలామందిని వెంటాడే ఒక ప్రశ్న... ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అని. మహోన్నతం, అనంతం, అంతిమం అయిన స్వేచ్ఛ వైపు చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత.
మానవుడిగా, అస్థిత్వం ఉన్న జీవిగా మనం నిర్దిష్టమైన పరిమితులకు లోబడి జీవిస్తున్నాం. అది మన ఉనికిని పరిమితం చేయడం లేదా? మన లోపల ఉన్న ఒక చైతన్యం ఎలాంటి హద్దులకూ లోబడకుండా ఉండాలని కోరుకుంటుంది. అది భౌతికరూపాలకు అతీతమైనది. ఆధ్యాత్మికతతోనే దాన్ని గ్రహించగలం. ‘ఆధ్యాత్మికత’ అంటే ఆకాశం వైపో, నేల వైపో చూస్తూ ఉండడం కాదు. ప్రార్థన చేయడం కాదు, గుళ్ళకూ, గోపురాలకూ వెళ్ళడం కాదు. అది భౌతికమైన పరిమితులకు అతీతమైన ఒక అనుభవం. ఆ అనుభవంలో ప్రయాణిస్తూ ఎలాంటి హద్దులూ లేని చోటుకు లేదా స్థితికి మనం చేరుకుంటాం. ఆ స్థితే అంతిమమైన, దివ్యమైన స్వేచ్ఛ! నిజానికి అలాంటి స్వేచ్ఛ పొందాలనే కాంక్ష ప్రతి మానవుడిలోనూ ఉంటుంది. మరి దాన్ని పొందడం ఎలా? మీరు అనంతమైన స్వేచ్ఛ పొందాలంటే దాని గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. మిమ్మల్ని కట్టేసి ఉంచుతున్న ప్రాపంచిక బంఽధనాల గురించి ఆలోచించండి. ఒక బంధనాన్ని కత్తిరించుకున్నాక కాస్త స్వేచ్ఛ పొందామనే భావన కలుగుతుంది. తరువాత మరో బంధనం గురించి ఆలోచిస్తారు. దాన్ని తొలగించుకున్నాక మరి కాస్త స్వేచ్ఛగా అనిపిస్తుంది. ఇలా ఎన్ని బంధనాలు మిమ్మల్ని కట్టి పడేస్తున్నాయనేది ప్రధానం కాదు. వాటన్నిటినీ మీరు తొలగించుకొనే స్థితి ఒకటి తప్పకుండా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఏదీ బంధించలేదు. అదే ఎదుగుదల. అదే ఆధ్యాత్మిక ప్రస్థానం.
సద్గురు... ✍🏻
No comments:
Post a Comment