Friday, December 20, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి…

          *ఆచార్య సద్బోధన:*
               ➖➖➖✍️


*కర్మలు...!!*```
మోక్షం అంటే సర్వ కర్మ బంధనాల నుండి విడుదల చెందటమే!
విముక్తి చెందటమే, అంటే సర్వకర్మలు నశించిపోవాలి అని!
ఇందులో ప్రారబ్ధకర్మలు ఆ జన్మలో అనుభవించటంతో నశించి పోతున్నాయి, కనుక వాటి గురించి ఆలోచించవలసిన పనిలేదు. 

ఇక సంచిత కర్మలు నేను బ్రహ్మాన్ని అనే నిశ్చయ జ్ఞానంతో నశించి పోతాయి.
అంటే అజ్ఞానంలో ఈ దేహమే నేనని, మనస్సే నేనని, బుద్ధే నేనని వ్యవహరించిన నేను ఇవేవీ నేను కాదు నేను ఆత్మను బ్రహ్మాన్ని అనే అనుభవజ్ఞానాన్ని పొందటంతో సమస్త సంచితకర్మలు నశించిపోతాయి.

ఎందుకంటే నేను బ్రహ్మాన్ని అయినప్పుడు ఈ కర్మలు బ్రహ్మానికి చెందినవి కావు గదా! ఇవన్నీ జీవుడివే గదా! జీవుడు జీవభావాన్ని వదిలేయటంతో ఆ సంచిత కర్మలు కూడా నశించిపోతున్నాయి. 

కలలో స్వప్న పురుషుడు నేరం చేశాడు. ఆ నేరానికి 7 సం॥ ల జైలు శిక్ష పడ్డది. దానిని అనుభవిస్తున్నాడు 2 సం॥ల శిక్ష అనుభవించిన తర్వాత మేలుకున్నాడు, ఇప్పుడు మేలుకున్న వ్యక్తి మిగిలిన 5 సం॥ల శిక్ష అనుభవిస్తాడా?
లేదు గా..! రద్దై పోయిందా..? అంతే. 
ఇక్కడ కూడా జీవుడు చేసిన పాపపుణ్య కర్మల ఫలం జీవుడే అనుభవించాలి.

జీవుడు జీవభావాన్ని అంతం చేసుకొని దేవుడైనప్పుడు ఆయనకెందుకు కర్మఫలానుభవం ఉంటుంది?
స్వప్నంలో చేసిన దాన్ని స్వప్నంలో అనుభవించాలి. జాగ్రత్తులో అది మొత్తం రద్దు.
అలాగే జాగ్రత్ లో చేసినది జాగ్రత్ లో అనుభవించాలి.

“జ్ఞానస్థితిలో అది మొత్తం రద్దు!” కనుక జ్ఞానస్థితిలో ఉన్న జ్ఞాన పురుషుడు ఏ సుఖ దుఃఖాదులను అనుభవించవలసిన పనిలేదు. 

ఇక మిగిలింది ఆగామి కర్మలు. 

ఆగామి కర్మలలో అప్పటికప్పుడు అనుభవించినవి అప్పుడే రద్దైపోతాయి.
సంచితమైనవన్నీ 'నేను బ్రహ్మాన్ని' అనే అనుభవజ్ఞానంతో నశించిపోయాయి...✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment