Friday, December 20, 2024

*****_బ్రతుకు నీది, బాధ్యత నీది, బాధ నీదే...

 *_బ్రతుకు నీది, బాధ్యత నీది, బాధ నీదే... భరించాల్సింది నీవే... నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు.! నీ జీవితం నీది.! ఎవడి కోసమో నువ్వు తలవంచకు.!_*

*_నిన్ను వేలెత్తిచూపే ఏ ఒక్కరు నీ బాధను భరించరు. ఆ బాధ నీవే భరించాలి. నీవునికి నీవే చాటుకోవాలి. పక్క వాడికి నీ బాధలకు ఎలాంటి సంబంధం లేదు. ఏది చేయాలన్నా నువ్వే చేయాలి._*

*_కష్టమైన నష్టమైనా భాదైన ఆనందమైనా నీతో నువ్వే అనుభవించు... ఇక్కడ జరిగేదంతా ఒక జగన్నాటకమే..._*

*_జీవితం అనేది ఒక సినిమా ప్రొజెక్టర్ లాంటిది. ప్రొజెక్టర్లో ఏది ఉంటే అదే తెరపై కనిపిస్తుంది. అలాగే, జీవితమనే సినిమాకు నీవే హీరోవి. దర్శకుడు మాత్రం పైనున్నవాడు. కేవలం నీవు చేసేది నీకున్న పాత్రను అద్భుతంగా పోషించడమే._*

*_ఎందుకంటే, నీవు కేవలం పాత్రధారుడవే కానీ, అసలు సూత్రధారుడు  పైనున్నవాడు అని మరువకు. కేవలం నీవు నియమితమాతృడవే..._*

*_ఎవ్వడిని నమ్మకు. ఎవడి మాట వినకు. నీకు తెలిసింది నువ్వు చెయ్... అంతా ఆ పైవానిపైన వదిలేయ్... అన్ని నాకు తెలుసు అనే వాడిని అస్సలు నమ్మకు..._*

*_ఎందుకంటే ఇక్కడ ఎవడికి ఏమి తెలియదు. ఇదో పెద్ద మాయ ప్రపంచం సమయం వచ్చినప్పుడు అందరూ మహా నటులే జాగ్రత్త..._*

*_అణువణునా నీ కోసం గోతులు తవ్వి కూర్చున్నారు. ఏ గోతిలో పడతావో పడితే ఏమవుతావో గొయ్యి తీసినవాడికి కూడా తెలియదు. ☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌷🌷🌷 🦚🙇‍♂️🦚 🌷🌷🌷

No comments:

Post a Comment