*_"కావు కావు కావు కావు.! ఏవీ శాశ్వతం కావు.! ’’ కాకి ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది._*
*_ఏమని? కావు కావు కావు అని. అనగా ఏవి శాశ్వతం కావు అని.! నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు._*
*_బంధాలు శాశ్వతం కావు. ఏ కోరికలూ శాశ్వతం కావు. నువ్వు చూసేవి చేసేవి ఏవీ శాశ్వతం కావు._*
*_ఎదీ శాశ్వతం కానపుడు మరి ఎందుకు ఇంత తపన.? నీది కాని దాని కోసం నువ్వు ఎంత తపించినా ప్రయోజనము లేదు._*
*_నీకు చెందవల్సింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది. లేనిదాని కోసం ఉన్నదానిని వదులుకోకు.!_*
*_ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకుని మసలుకో.!_*
*_నీ జీవనానికి ఎట్టి ఇబ్బందీ ఉండదు. పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది.☝️_*
*-సదా మీ శ్రేయోభిలాషి...👏*
🌸🌸🌸 🌺🙇♂️🌺 🌸🌸🌸
No comments:
Post a Comment