Wednesday, December 18, 2024

 *ధ్యాన మార్గ*
గీత లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏమి అవరోధాన్ని సృష్టించదు. ఆ అవరోధాన్ని పూర్వమే శ్రీకృష్ణుడు కొట్టివేశాడు. కాబట్టి ఈ నిర్వచనం మంచి ఆలోచనాపరులకు తర్క శీలురకు, నాస్తికులకు, సమాజం పట్ల వ్యతిరేక భావమున్న వారికి విజ్ఞాపనను చేస్తుంది. మామూలుగా ఇందులో మతం ఏమీ లేదు. జీవితం లోనే యోగులుగా ఉండమంటున్నాడు. ఈ మాట అనగానే,
యోగి అంటే ప్రత్యేకమైన వ్యక్తి లాగా ఉండడంకదా! అనుకుంటారు. కొన్ని
కొన్ని ఇంద్రజాలాలను అద్భుతాలను చెయ్యడం అనుకుంటారు. శ్రీకృష్ణుడు నా
ఉద్దేశమదికాదు. సాధారణమైన జీవితంలోనే కొంత అంతర్ముఖంగా ఉండడం
అంటున్నాడు. ఎంత విశ్వ జనీనమయిన వేదాంతమిది! నీవు జీవిస్తూ, పనిచేస్తూ
అందరితో పాటూ వీటన్నితోపాటు నీ మనస్సును, హృదయాన్ని ఒక క్రమ
పద్ధతిలో ఉంచుగోగలుగుతుంటావు. నీలో ఉన్న దివ్యకాంతిని ప్రకటితం గావించడానికి చూస్తుంటావు. ఈ విధంగా ఒకదానితోపాటు మరొక దాని అభివృద్ధి జరుగుతుంటుంది. బాహ్యంగా సామాజికాభివృద్ధి, ఆంతరంగికంగా ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణత కలుగుతుంటుంది. ఈ భావాలు కొన్ని ఆధునిక జీవశాస్త్రం నుంచి కూడా వస్తున్నాయి.
🌿❤️🌴
సాధారణ గృహిణి కాని, పొలంలో రైతుకానీ, ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పెరగవచ్చు. ఇది మనకు సంక్రమించిన జన్మ హక్కు. గీతను బాగా అర్థం చేసుకొని ఎక్కువ మంది ఆ విధంగా ఉండగలిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. గీత అర్థం అవవలసిన విధంగా అర్థమయినట్లు అప్పుడు అనిపిస్తుంది. 'యోగ'మే మనిషి యొక్క అభివృద్ధి, పెరుగుదల, పరిపూర్ణత అవుతుంది. అప్పుడే మనం మనదైన అనంత ఆత్మలో ఉంటాం. అయితే ఒకవేళ పూర్తిగా దానిని పొందలేకపోయినా నేను ఆ మార్గంలోనే ఉన్నాననుకొనే భావన రావాలి.ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనం నిత్యం మనస్సుని పరిశీలించుకుంటూ, మన ప్రవర్తన ఇతర్లతో మన ప్రతి స్పందనను గమనిస్తూ ఉండాలి.
🌿❤️🌴
చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఆటే సర్వస్వమయినట్లు రాత్రిఅవుతున్నది కూడా గమనించకుండా ఆటలాడుతుంటారు. తర్వాత మానసిక పరిపక్వత కలిగినప్పుడు అదంతా  అల్పమైన సంతోషమే అని, ఇంకా ఇంకా ఎక్కువ ఆసందాన్ని వెదుకుతూ పోతుంటారు. బాల్యంలో ఆటలు ఆనందంగా ఉంటే, కొంతకాలానికి పుస్తకాలు చదవడం ఆనందంగా ఉంటుంది.
మరికొంతకాలానికి ఆలోచించడం ఆనందంగా ఉంటుంది.
ఆ తర్వాత ఆత్మానుభూతి ఆనందంగా ఉంటుంది. వయస్సుతోపాటు మన ఆనందాలు మార్పు చెందుతూ వస్తుంటాయి. ఏ ఒక్కచోట ఆగిపోకుండా ఆఖరి స్థితివరకు
వృద్ధిపొందుతూ పోవాలి. ఏ ఒక్క స్థితి కూడా తప్పు అయిందిగా తీసిపార వేయకూడదు. ప్రతి స్థితిలోనూ కొంత విలువయింది ఉంది. కానీ ముందుకుపో, ముందుకుసా అని యజుర్వేదం లో (చరైవేలి, చరైవేలి' అని చెప్పబడింది.
జీవితం ఎక్కడ ఆగిపోయినా జీవముండదు.

No comments:

Post a Comment