*🕉️🚩 శుభోదయం🚩🕉️*
జై శ్రీమన్నారాయణ
18.11.2025, మంగళవారం
*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*కార్తీక మాసం - బహుళ పక్షం*
*తిథి : త్రయోదశి ఉ6.35 వరకు*
*తదుపరి చతుర్దశి*
*వారం : భౌమ్యవాసరే (మంగళవారం)*
*నక్షత్రం : స్వాతి పూర్తి*
*యోగం : ఆయుష్మాన్* *ఉ9.24 వరకు*
*కరణం : వణిజ ఉ6.35 వరకు*
*తదుపరి భద్ర రా7.33 వరకు*
*వర్జ్యం : ఉ11.41 - 1.26*
*దుర్ముహూర్తము : ఉ8.24 - 9.08*
*మరల రా10.28 - 11.19*
*అమృతకాలం : రా10.12 - 11.57*
*రాహుకాలం : మ3.00 - 4.30*
*యమగండ/కేతుకాలం : ఉ9.00 - 10.30*
*సూర్యరాశి: వృశ్చికం*
*చంద్రరాశి: తుల*
*సూర్యోదయం: 6.10*
*సూర్యాస్తమయం: 5.21*
పులిని రాయాల్టీకి చిహ్నంగా సూచిస్తుంటారు. ‘పులి’లా బతకాలి.. అతడు పులి రా.. అంటూ రాజసం, హుందాతనానికి ప్రతికగా పులితో పోల్చుతారు.ఇంతలా పులి గురించి ఎందుకు చెబుతున్నానంటే.. ఈ రోజు నవంబర్ 18కి పులికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టే. పులిని భారత ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించిన రోజు ఈరోజు..
ప్రతి దేశానికి తన ప్రత్యేకతను తెలియజేసే కొన్ని జాతీయ చిహ్నాలు ఉంటాయి. జాతీయ పతాకం, పుష్పం, పక్షి, జంతువు వంటి గుర్తులు ఆ దేశం సంస్కృతి, వైభవం, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. భారతదేశం కూడా అలాంటి అనేక గుర్తులను కలిగి ఉంది.
1972 నవంబర్ 18 వ తేదిన భారత జాతీయ జంతువు గా పెద్దపులి'ని స్వీకరించారు. పులిని మన ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించింది. ..
ఆ సమయంలో దేశవ్యాప్తంగా వేట కారణంగా వన్యప్రాణుల సంఖ్య వేగంగా తగ్గిపోతుండగా, పులి అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం “ప్రాజెక్ట్ టైగర్” అనే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం పులి నివాస ప్రదేశాలను రక్షించడం, వేటను అరికట్టడం, వన్యప్రాణి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం.
"వ్యాఘ్రం"(పులి) అంటే శక్తి, ధైర్యం, చురుకుదనం, గౌరవం అనే భావాలు మనసులో తళుక్కుమంటాయి. ఈ లక్షణాలే భారతదేశం స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయని భావించి, దానినే జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ కూడా రాయల్ బెంగాల్ టైగర్‌ను తమ జాతీయ జంతువుగా గుర్తించింది...
No comments:
Post a Comment