Monday, November 17, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు 🚩

1) నిద్రపోయే ముందు తాను శాశ్వతంగా పడుకోబోయే శ్మశాన వాటికను గుర్తుకు తెచ్చుకోవాలి.
దాని వలన చాలా భ్రాంతులు తొలగిపోతాయి.

2) నది నుండి నీళ్లు తెచ్చాను అంటామే గాని నీళ్లు తేవడానికి ఆధారమైన బిందె విషయాన్ని ప్రస్తావించం. అలా ప్రతి విషయానికీ ఆధారం దైవం. అన్నింటిని గుఱించి ప్రస్తావిస్తామే గాని, వాటికి ఆధారంగా ఉన్న దైవం గుఱించి మరపులో ఉంటాం. అంతేగాని దైవం లేకా కాదు, పొందకా కాదు.

3) ఉన్నది ఒక్కటే" అనుకుని తర్వాత ఏమైనా అనుకో.

4) ప్రపంచం అనేది భగవంతుని క్రీడారంగం. మంచీచెడులు.. గెలుపోటములు జ్ఞాన అజ్ఞానములన్నీ భగవంతుని సొత్తులే.

5) జ్ఞానం అంటే ఇంద్రజాలం కాదు. స్వరూప నిష్ఠ.

No comments:

Post a Comment