శుక్రవారం గ్రహాధిపతి "శుక్రుడు". శుక్రుని అధిష్టాన దైవం "శ్రీ మహాలక్ష్మి" మరియు "శ్రీ ఇంద్రాణి".
శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం శుక్రాయ నమః ||
2. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః ||
3. ఓం ఇంద్రాణియై నమః ||
శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి.
శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి
శుక్రవారం గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది.
దశమి ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణ తిథి. దశమి పుణ్య కార్యాలు, భక్తి కార్యాలు, గృహ ప్రవేశం, ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడం, వివాహా ప్రయత్నాలు, ఆభరణాలు ధరించడం, ప్రయాణాలు, మరియు ముఖ్యమైన వ్యక్తులను కలవడం వంటి పనులకు అనుకూలమైన తిథి.
దశమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, యమధర్మరాజును ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది.
పూర్వా ఫల్గుణి (పుబ్బ) నక్షత్రానికి అధిపతి "శుక్రుడు". అధిష్టాన దేవత "అర్యముడు". ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం.
పూర్వా ఫల్గుణి నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం శుక్రాయ నమః ||
2. ఓం ఆర్యమణే నమః ||
పుబ్బ నక్షత్రం ప్రేమ, ఇంద్రియ సుఖం, శ్రేయస్సు, ఆనందం వంటి అద్భుతమైన భావాలు ఈ నక్షత్రం ద్వారా సానుకూలంగా ప్రభావితమవుతాయి. ఈ నక్షత్రం కొంత వరకు అభివృద్ధి లేదా సృష్టిని సూచిస్తుంది, మరి కొంతవరకు పతనాన్ని లేదా విధ్వంసాన్నిసూచిస్తుంది.
No comments:
Post a Comment