🕉️🚩🚩🕉️
కాలానికి విలువివ్వని వాళ్లు ఏదీ సాధించలేరు.
దుష్టులు వ్యసనాలతో, కలహాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారని భర్తృహరి బోధించాడు. భోగాలకు, సుఖాలకు బానిసలైన వాళ్లు దైవం ప్రసాదించిన అమూల్యమైన కాలాన్ని వృథా చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించరు. అందుకే మనిషి కాలానుగుణంగా ప్రవర్తించి విజయపథాన్ని చేరుకోవాలని చెబుతారు పండితులు. కాలగతిలో మనిషికి ఎన్నో గాయాలు తగులుతాయి. కాలమే వాటిని మాన్పుతుంది. మానసిక బాధలను ఉపశమింపజేసే శక్తి కాలానికి మాత్రమే ఉంది. కాలం గాలానికి ప్రతి ప్రాణి తలవంచక తప్పదు.
భీముడంతటి బలశాలి కొన్నేళ్లు వంటవాడిగా ఉండాల్సి వచ్చింది. రాకుమారుడైన శ్రీరాముడు కారణాంతరాల వల్ల అడవుల పాలు కావాల్సి వచ్చింది.🙏
No comments:
Post a Comment