*నిన్ను ఎవరు మోసం చేయనక్కర్లేదు..*
*నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు.. అన్నీ తెలిసి ఇష్టపడతావు.*
*జీవితంలో ఓడిపోయావు అని తెలుసు కదా... నీ మనసు ఎందుకు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు.*
*అన్నీ తెలిసి కూడా బాధపడతావ్..*
*అన్ని చూస్తూనే మాటలు పడతావ్..*
*ఎందుకంటే నీకు ఒంటరిగా ఉండటం చేత కావట్లేదు కాబట్టి..*
*మౌనంగా ఉండటం నీ వల్ల కావట్లేదు కాబట్టి..*
*నటిస్తూ బ్రతుకుతూ నువ్వు ఉండలేవు కాబట్టి..*
*బాధపడుతూనే బ్రతకాలని తలరాతలోరాసి పెట్టుకున్నావా!*
*నీ మీద ఎవరికీ ప్రేమ లేదని నీ మనసు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు.*
*ఈ నిజాన్ని అంతులేని దుఃఖాన్ని ఎందుకు నీ కళ్ళల్లోనే దాచేస్తున్నావు.*
*ఏడ్చిన పట్టించుకునే వాళ్ళు లేరనా!*
*నీ ఏకాంతంలో నిన్ను నువ్వే ఓదార్చుకుంటూ, నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు..*
*కల్లబొల్లి కబుర్లతో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు..*
*ఎందుకంటే, ఒంటరిగా బతకలేవు కాబట్టి,*
*బ్రతికే దమ్ము లేదు* *కాబట్టి*
*నీకు నువ్వే ఒక క్వశ్చన్ మార్కుల మిగిలిపోతున్నవ్..*
👉నీకు అనిపిస్తుంది కదా, ఇంకా భూమి మీద ఎందుకు ఉన్నాను అని.
🌿కొన్ని బాధ్యతలు నీకోసం ఉన్నాయి,
🌿కొన్ని ప్రాణాలు నిన్ను నమ్ముకున్నాయి.
🌿మానసికంగా నిన్ను నువ్వు చంపేసుకుని వాళ్లకు అన్యాయం చేయకు.
👉ఏడుపుల మధ్యలో నువ్వు పాతి వేసిన నీ ధైర్యాన్ని వెతికి తెచ్చుకో..!
👉బేలగా ఉండకు, అన్ని తట్టుకునే బండ రాయిలా ఉన్నా పర్వాలేదు.!
👉నువ్వు గెలవకపోయినా పర్వాలేదు, గాయాల పాలు మాత్రం మళ్లీ అవ్వకు.!🍁.
No comments:
Post a Comment