ఓం నమో భగవతే శ్రీ రమణాయ
భక్తుడు :
భగవాన్! మోక్షము పొందుటకు గృహస్థు ఏమి చేయాలి?
మహర్షి :
నీవు గృహస్థుడవు అని అనుకోవడం ఎందుకు? సన్యాసి కూడా 'నేను సన్యాసిని' అనే ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది. ఇంటిలోఉన్నా, అడవికి వెళ్లినా మనసు నీ వెంటే వస్తుంది.
ఆలోచనల అన్నిటికీ మూలం కారణం అహం భావన. అదే నీ శరీరాన్ని, విశ్వాన్ని కల్పించి నీవు గృహస్థుడవు అనే భావన కలిగిస్తుంది. ఎప్పుడైతే నీ మనసులో సంసారం అనే భావన వదలుతావో, అప్పుడే నీ మనసు గృహస్థు స్థానంలో సన్యాసిని, ఇంటి స్థానంలో అరణ్యాన్ని నిలుపుతుంది.
కానీ మాససికంగా ఆటంకాలు మిగిలే ఉంటాయి. స్థలం మార్పు వలన అవి ఎక్కువ తక్కువలు కావచ్చు. అసలు ఆటంకం మనసే. ఇంట్లోనైనా, అడవిలోనైనా మనసును జయించుట ముఖ్యం. మనసును జయించడం అడవిలో వీలైతే, ఇంట్లో ఎందుకు వీలుకాదు! పరిసరాలు ఎలా ఉన్నాసరే, ప్రయత్నం మానకూడదు కదా!
పరిసరాలు నీవు కోరినట్లు మారవు. నన్ను చూడు; నేను ఇల్లు వదిలి వచ్చాను; ఇక్కడ కూడా పెద్ద సంసారం(ఆశ్రమం) నడవడం లేదా!
సంవత్సరాల తరబడి నిర్వికల్ప సమాధిలో ఉన్నా, దానిని వదలి బయటకు రాగానే, వారికి విధించి ఉన్న పరిసరాలను ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి పరిసరాలు ఎలా ఉన్నాసరే, నీ సహజ స్థితిలో నిలకడ చెందడం మంచిది.
No comments:
Post a Comment