🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🪔**🕉
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"దీపం విలువ చీకటిలో
రూపాయి విలువ అవసరంలో
స్నేహితుడి విలువ ఒంటరితనంలో తెలుస్తుంది."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"జీవితం నీకు నచ్చినట్లు, నువ్వు మెచ్చినట్లు ఎప్పుడూ ఉండదు. నువ్వు మెచ్చినట్లుగా మలుచుకునే బాధ్యత నీదే. ఆలోచిస్తూ నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే ఏం సాధించలేవు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*_నేటి మాట_*
*భగవంతుణ్ణి మనము ఏమి కోరుకోవాలి??*
లోకమున కనిపించే అన్నింటికీ, ప్రకృతియే ఆధారము.
సృష్టి, స్థితులకు ప్రకృతి యే ఆధారము.
మనకు కనపపించేదంతా ప్రకృతియే!!...
పురుషుడు, స్త్రీ లు, జంతుజాలములు, వృక్షములు, పక్షులు, ఇంకా ఈ కనుపించే వన్నియూ, ప్రకృతే!
ఈ అనంత ప్రకృతి కి, చైతన్యము, ఒక్క పరమాత్మ తప్ప వేరు లేడు...
ఈ రకమైన దృష్టిని పెంచి, అనుభవం కలిగించేది, జప ధ్యాన, నామస్మరణములే!
ఈ ప్రకృతి , సముద్రము ఏమాత్రము చలించిననూ, కోట్ల కొలదీ జీవరాసులన్నియు ధ్వంసం అయి పోతాయి.
ఈ ప్రకృతినే నమ్ముకుని శాంత సౌఖ్యాలు, ఎల్లవేళలా ఉండటం అనేది దుస్సాధ్యం!!...
ఈ ప్రకృతిని లోబరచుకున్న పరమాత్మ యొక్క అను గ్రహానికి ప్రార్థిస్తేనే ఎప్పటికైనా శాశ్వతానందమును పొందగలవు,
లోకములో మనం చూచు పదార్థములన్నీ అశాశ్వతములే!!....
నేడు ఉండి, రేపు ఉండక పోవచ్చు, కనుక లోకమున ఏ వస్తువైనా కోరవలెనన్న, ఒక్క పరమాత్మ నే కోరవలెను.
అటుల కాక, పిల్లలనూ,ధనమునూ, సర్వ సౌఖ్యములనూ కోరి, వారికే వారు, చెప్పక వదలి వెళ్ళునపుడు, తీవ్ర వ్యధ కల్పించు కొనుచున్నారు.
అలా చేసుకుంటే పునరపి జననం పునరపి మరణం తప్పదు కదా!!!..
ఎవరి గూర్చి ఎక్కువ గా ఆలోచించరాదు, ఈ జగత్తు అనే నాటకం లో ఎవరి పాత్ర వారు పోషించుకోవడానికి వచ్చిన వారే!!.
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment