*కార్తీకమాస శివస్తుతి*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*సుగంధి వృత్తం*
హరుని దలచి నొరుల విడచి హఠము గొనుచు పిలిచినన్
పరుగు లిడుచు సుతుగ దలచి వగను నిలచు దయగొనిన్
వరము లడుగ నొడలు మరచు భవుడు ఫలము లెరుగడే
శరణు శరణని స్మరహరుని చరణ యుగళి పొదువరే
*వివరణ:-* వేరే దేవతలను విడచి మనస్సులో ఈశ్వరుని సంపూర్ణంగా నమ్ముచు దీక్షగా పిలిస్తే, పరుగు పరుగున నా సుతుడు పిలుస్తున్నాడని తలచి మన చెంతనే నిలుస్తాడు. అడిగిన వరమేదైనా దాని ఫలితాన్ని ఆలోచించకుండా ఒసగే భోళాశంకరుడు ఈతడు. అట్టి స్మరహరుని శరణు శరణని ఆతని పాదములను భక్తితో పట్టకోండి.
యజ్ఞమూర్తి ద్వారకానాథ్
No comments:
Post a Comment