*జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీలో ఓ తత్వం ఉంటుంది.. ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు, ప్రతీ క్షణం జీవించడమే అని!*
అది నేను స్వయంగా ఎక్స్‌పీరియెన్స్ చేస్తుంటాను. నేను ఏదీ ప్లాన్ చేసుకోను.. *జీవితం ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటాను. ప్లానింగ్ చేసుకోవడం అంటే, లైఫ్ పట్ల ఛాయిస్ మనం తీసుకోవడం లాంటిది. నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, ఇంత డబ్బు సంపాదించాలి, వీళ్లని ప్రసన్నం చేసుకోవాలి, ఇలా ఎదగాలి.. అంటూ లెక్కలేసుకుంటూ బ్రతకడం! ఇలా లెక్కలేసుకుంటూ బ్రతికేటప్పుడు అందులో జీవం ఉండదు.*
నేను ఛాయిస్ ని యూనివర్స్ కి వదిలేస్తాను. ఇందులో *బ్యూటీని JK భలే చెబుతారు. ప్లానింగ్ అనేది రిజల్ట్‌ని ఊహించుకుని, కోరుకున్న రిజల్ట్ రావాలన్న ఆశతో మొదలవుతుంది. ప్లాన్ చేసుకున్నది బెడిసి కొడితే నిరాశతో కుంగిపోతారు. అలాగే ఆ రిజల్ట్ మీద దృష్టి ఉన్నప్పుడు.. ప్రాసెస్ ని ఎంజాయ్ చెయ్యడం అంటూ ఏమీ ఉండదు. దాంతో ప్రతీ క్షణంలో ఉండే బ్యూటీ మనల్ని ఏమాత్రం ఉత్తేజితం చెయ్యదు.*
ఇప్పటి వరకూ నేనేంటో నాకు తెలీదు.. నన్ను కొంతమంది ఓ టెక్నాలజీ నిపుణుడిగానే చూస్తారు. అది వాళ్ల దృష్టిలోని పరిమితి. కొంతమంది ఆధ్యాత్మికంగా చూస్తారు. మరికొంతమంది ఇంకోలా చూస్తారు. ఒకరోజు ఓ ఫిల్మ్ డైరెక్టర్ నుండి కాల్ వస్తుంది.. మేము ఫలానా థీమ్ ఆధారంగా సినిమా తీస్తున్నాం, స్క్రిప్ట్ విషయంలో మీ సపోర్ట్ కావాలని! మరో రోజు ఏదో కాలేజ్ మా విద్యార్థులకి క్లాస్ కావాలని కోరుతుంది. మరో రోజు ఓ సాధకులు మీ ఆధ్యాత్మిక సాధన, పురోగతి గమనిస్తున్నాను.. మిమ్మల్ని కలవాలని కాల్ చేస్తారు!
*వీటిలో ఏది నిజం? ఏదీ నిజం కాదు.. అన్నీ మేఘాలు.. విశ్వం నేననే మేఘాన్ని రకరకాల రూపాలుగా మారుస్తూ వెళుతోంది. నన్ను టెక్నాలజీ నిపుణుడిగా చూసే వారు.. నాలోని మిగతా కోణాల అందాన్ని చూడలేరు. ఒక మనిషి మైండ్ కలిపించే పరిమితమైన లేబుల్స్ వల్ల అనంతమైన విశ్వ శక్తిని నింపుకుని నీటిలా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ప్రవహించే నా తత్వాన్ని కొన్ని మాటల్లో అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం?*
అందుకే నేను విశ్వంతో నడుస్తాను... మనుషుల అంచనాలు, అభిప్రాయాలకు, జడ్జ్‌మెంట్లి తగ్గట్లు కాదు. విశ్వమే నా గురువు!!
- నల్లమోతు శ్రీధర్.
No comments:
Post a Comment