Tuesday, November 18, 2025

 శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

శివానందలహరి – శ్లోకం – 76 

భక్తిర్మహేశపదపుష్కరమావసన్తీ
కాదమ్బినీవ కురుతే పరితోషవర్షమ్ |

సమ్పూరితో భవతి యస్య మనస్తటాక-
స్తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాఽన్యత్ ||

ఎవరి జన్మ సఫలము ? శంకరులేం చెబుతున్నారో‌ చూడండి.

భక్తి మేఘము పరమేశ్వరుని చరణాకాశమును ఆశ్రయించి ఆనందవర్షము కురిపించుచున్నది. (ఆ వర్షానికి)‌ ఎవ్వని మనో‌తటాకము (మనస్సనే చెరువు)‌ నిండిపోతుందో‌ వాని జన్మము అనే‌ పైరు మొత్తము సఫలము. ఇతర జన్మములు సఫలములు కావు.

భగవంతుని పాదములపై భక్తి చేతనే ఆనందప్రాప్తి తద్వారా జన్మ సాఫల్యమూ‌ సాధ్యమని శంకరుల ఉపదేశము.

No comments:

Post a Comment