శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
శివానందలహరి – శ్లోకం – 78
సదుపచారవిధిష్వనుబోధితాం
సవినయాం సహృదమ్ సముపాశ్రితామ్ |
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ ||
భావము
ప్రభూ! పూజావిధానముల
యందు బాగుగా శిక్షణ పొందినదీ, వినయ సంపన్నురాలూ, మంచి మనస్సును ఆశ్రయించి ఉన్నదీ అయిన నా బుద్ధిని, నూతన వధువువలె, సద్గుణములను ఉపదేశించి, ఉద్ధరింపుము.
No comments:
Post a Comment