Tuesday, November 18, 2025

 *ఓం నమః శివాయ హర హర మహాదేవ* 🙏

     శివపూజను 108నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే – ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.

*భవాయ దేవాయ నమః శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః* ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది.

*జిజ్ఞాసువుల ప్రశ్నలకు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు :*

*ప్ర :* *ఉపవాసమున్న రోజున పాటించవలసిన నియమాలేమిటి ? ఆ రోజున చేయకూడని విధులేమిటి?*

*జ :* ఉపవాస దినానికి ముందు రోజు రాత్రి పరాహారం మాత్రమే చేయాలి. అంటే - ముందురోజు ఏకభుక్తముండాలి. ఉపవాసం నాడు ఆరోగ్యం సహకరించని వారు క్షీరమో, ఫలమో మితంగా తీసుకుంటారు. ఆరోగ్యం  సహకరించినప్పుడు మాత్రమే పూర్ణోపవాసం చేయవచ్చు.

*ఉపవాసాది వ్రతాలలో ముఖ్య నియమాలు :*
క్షమ, సత్యం, దయ, జపం, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహం, దేవపూజ,సంతోషం ప్రధాన గుణాలు. దంభాన్ని విడిచి పెట్టాలి. *ఏ దేవతను ఉద్దేశించి ఉపవాసం చేస్తున్నామో ఆ దేవతను ధ్యానించుట, ఆ మంత్రాన్ని జపించుట, ఆ దేవతాపూజ, కథాశ్రవణం, నామ శ్రవణ కీర్తన స్తోత్రాదులు చేయాలి.* అన్నాదుల పైన దృష్టిని పోనీయరాదు. తల స్నానం చేయాలి గానీ,తలంటు (అభ్యంగ) స్నానం చేయరాదు. ఆరోగ్యం సహకరించితే చన్నీళ్ళ స్నానమే శ్రేష్ఠం. తాంబూలం, సుగంధాలంకరణ కూడదు. ముత్తైదువులకు కొన్ని వ్రతాలలో  తాంబూలాదులు స్వీకరించవచ్చు. జలం, కందమూలాదులు, ఫలం, పాలు, హవిస్సు, ఔషధం ఉపవాసానికి భంగాలు కావు. ఆరోజున క్షురకర్మ, ముఖ క్షవరం కూడదు. ఎక్కువగా  నీరు వంటివి స్వీకరించరాదు పగలు నిద్రించరాదు.
కామాసక్తి స్మరణ మాత్రంగా కూడా ఉండరాదు. కన్నీరు, కోపం వంటివి ఉపవాస ఫలాన్ని దక్కనివ్వవు.

*('ఋషిపీఠం' ప్రచురణ 'సమాధానమ్' పుస్తకం నుండి సేకరణ )*

శ్రీ శివ పూజా విధానం

కార్తికమాసాన్ని మించిన మాసం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రత, మహత్తు కలిగిన ఈమాసంలో ప్రతిరోజూ శ్రేష్ఠమైంది. అందులోనూ సోమవారం మహాశివుడికి మరింత ప్రీతికరమైన వారం. కార్తిక సోమవారంనాడు చేసే శివపూజ అత్యుత్తమఫలితాలను ఇస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఈ మాసంలో మీ మీ ఇష్టదేవతల ఆరాధనతో పాటు శివపూజను కూడా ఆచరించి పరమేశ్వరుడి కరుణాకటాక్షాలను కుటుంబసమేతంగా పొందాలని ఆకాంక్షిస్తున్నాం!

ఆచమ్య- (కేశవాది నామాలతో ఆచమనం చేయాలి).

ఓం కేశవాయ స్వాహా!
ఓం నారాయణాయ స్వాహా !
ఓం మాధవాయ స్వాహా !
ఓం గోవిందాయ నమ :
ఓం విష్ణవే నమ :
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీ కేశాయ నమః
ఓం పద్మ నాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్శనాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్చ్యుతాయ నమః
ఓం జనార్దానాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామం ఆచరించాలి.

ఓం భూః ఓం భువః ఓం స్వాః
ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్-సవితుర్-వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ |
ఓం ఆపో జ్యోతియి రసో  మృతం బ్రహ్మ భూర్-భువః స్వర్-ఓం ||

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

శ్లో॥ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥

మమోపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధేశ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగేప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే  మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య....... ప్రదేశే గంగాకావేర్యో: మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్  వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన - .......నామ సంవత్సరే.......యణే ....... ఋతౌ ...... మాసే....... పక్షే ....... శుభతిథౌ........వాసరే యుక్తాయాంశుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం- శుభతిథౌ  శ్రీమాన్ నామ ధేయః శ్రీమతః ....... గోత్రస్య.. నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా సాంబసదా శివముద్దిశ్య పుణ్యకాలే సాంబసదాశివప్రీత్యర్థం  అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యవిజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థంఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం శ్రీ సాంబ సదాశివప్రసాదేన సకుటుంబస్య జ్ఞాన వైరాగ్య మోక్ష ప్రాప్త్యర్థంవర్షే సమస్త సన్మంగళా వాప్యర్థం కల్పోక్త ప్రకారేణ శివపూజాం కరిష్యే  ॥

గణేశస్మరణ

గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలచారు భక్షణమ్ । ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్॥

కుమారస్మరణ

ఉమాకోమలహస్తాబ్జ సంభావితలలాటికమ్ హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజమ్॥

లక్ష్మీనారాయణస్మరణ

యజ్ఞేశ అచ్యుతగోవిన్ద మాధవ అనన్త కేశవ:
కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవ నమోస్తుతే॥

సిద్ధలక్ష్మీ:! మోక్షలక్ష్మీ: జయలక్ష్మి: సరస్వతీ। శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా ॥

నందిస్తుతి

నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ॥

వీరభద్రస్మరణ

వీరభద్ర నమస్తేస్తు శివాజ్ఞాను ప్రవర్తక | దక్షాధ్వర ధ్వంసకాయ భద్రరూపాయతే నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీశచీపురన్ధరాభ్యాం నమః శ్రీఅరున్ధతీ వసిష్ఠాభ్యాం నమః 
శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః

ధ్యానం

ధ్యాయామి శంకరం శంభుం నీలగ్రీవం త్రిలోచనమ్! గంగాధరముమాన్తం నిత్యకల్యాణరూపిణమ్ ॥

గోక్షీర ధవళాకారం చన్ద్రబింబ సమాననమ్ | భస్మభూషిత సర్వాంగం రుద్రాక్షాభరణాన్వితమ్ ||
సాంబసదాశివం ధ్యాయామి.

ఆవాహనం

ఆవాహయామి దేవేశమాదిమధ్యాంత వర్ణితమ్ । ఆధారం సర్వలోకానాం ఆశ్రితార్తి వినాశనమ్ ll  సాంబ సదాశివం ఆవాహయామి.

ఆసనం

ఆసనం గృహ్యతామీశ నిర్మలం స్వర్ణనిర్మితమ్ । ఆధారం సర్వజగతా మంధకాసురసూదన ॥ సాంబ సదాశివాయ నమః ఆసనం సమర్పయామి.

పాద్యం

పాద్యం గృహాణ భగవాన్ పావనం పరమేశ్వర పార్వతీ హృదయానంద! పాపం సర్వం వ్యపోహయ ॥ సాంబసదాశివాయ నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం

అర్ఘ్యం గృహాణ గిరీశ గంధపుష్పాక్షతైర్యుతమ్ | అఘమజ్ఞానమఖిలం నీలకంఠ నివారయ ॥ సాంబసదాశివాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనం

గృహాణాచమనార్థాయ గంగాయ సరిదాహృతమ్ । విమలం జలమీశాన వ్యాధీన్మే వినివారయ ॥
సాంబసదాశివాయ నమః ఆచమనీయం సమర్పయామి.

పంచామృతం

పంచామృతం గృహాణేదం పన్నగేశ్వరభూషణ । పంచవక్త్ర నమస్తుభ్యం పంచపాపాని నాశయ ॥ సాంబసదాశివాయ నమః పంచామృతం సమర్పయామి.

స్నానం

గంగాక్షిన్న జటాభార సోమ సోమార్ధశేఖర । సహ్యజాది సరిత్తోయైః స్నానంకురు సదాశివ ॥
సాంబసదాశివాయ నమః స్నానం సమర్పయామి.

(ఇక్కడ శివుణ్ణి అభిషేకించాలి. అభిషేకించేటప్పుడు "శివాయ నమః" అనే నామాన్ని స్మరిస్తూంటే చాలు. ఆ నామంతో పాటు "ఈశాన తే తత్పురుష నమో ఘోరాయ తే సదా నామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయవై నమః" అనే శ్లోకాన్నీ, "నమశ్శంక రాయ నమశ్శంభవే నమశ్శివాయ నమోభగవతే రుద్రాయ" "నమ శ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే" అనే వాక్యాలను | పఠించాలి. శివలింగం లేనప్పుడు, జలాల్లో బిల్వదళాన్ని ముంచి, ఆ దళంతో అభిషేకాన్ని భావన చేస్తూ శివుని పటంపై నీళ్లు జల్లుతూ స్నాన సేవను చేయవచ్చు.)

వస్త్రం

గజ చర్మ ధరావన్త గరళాంకిత కంధర | దుకూలం గృహ్యతాం దేవ దుర్గతిం మే నివారయ ॥ సాంబసదాశివాయ నమః వస్త్రం సమర్పయామి.

ఉపవీతం

ఉపవీతం గృహాణేశ పవిత్రం పరమం శుభం ! ఉమాకాన్త నమస్తుభ్యముత్తమం దేహి మే ఫలమ్ ॥ సాంబసదాశివాయ నమః ఉపవీతం సమర్పయామి.

ఆభరణం

కుండలాంగద ముఖ్యాని కుండలీశ్వర భూషణ ! భూషణాని గృహాణేశ భూతి భూషిత విగ్రహ ॥ సాంబసదాశివాయ నమః ఆభరణాని సమర్పయామి.

గంధం

గంధం కుంకుమ సంయుక్తం మృగనాభిసమన్వితమ్| మహాదేవ గృహాణేశ మహాపాపవినాశన॥ సాంబసదాశివాయ నమః గంధం సమర్పయామి,

అక్షతలు

అక్షతానక్షత విభో నక్షత్రేశ విభూషణ శుద్ధ స్ఫటిక సంకాశ స్వామిన్ స్వీకురు శంకర ll సాంబసదాశివాయ నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్పం

మల్లికా కుందమందార కమలాదీని శంకర పుష్పాణి బిల్వపత్రాణి గృహాణ కరుణానిధే ॥ సాంబసదాశివాయ నమః పుష్పాణి సమర్పయామి.

అంగ పూజ

పరమాయ నమః పాదౌ పూజయామి,

గుణాతీతాయ నమః గుల్ఫౌ పూజయామి,

జన్మహీనాయ నమః జానునీ పూజయామి,

జగత్పిత్రే నమః జంఘే పూజయామి,

ఉమాపతయే నమః ఊరూ పూజయామి,

గిరీశాయ నమః గుహ్యం పూజయామి,

కరుణాకరాయ నమః కటిం పూజయామి,

నానారూపాయ నమః నాభిం పూజయామి,

ఉత్తమాయ నమః ఉదరం పూజయామి,

వామదేవాయ నమః వక్షం పూజయామి,

బహురూపాయ నమః బాహూన్ పూజయామి,

హరాయ నమః హస్తౌ పూజయామి,

నీలకంఠాయ నమః కంఠం పూజయామి,

పంచముఖాయ నమః ముఖం పూజయామి.

త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి,

ఫాలనేత్రాయ నమః ఫాలం పూజయామి,

శ్రుతిగమ్యాయ నమః శ్రోత్రే పూజయామి,

కపర్దినే నమః   కపర్దం పూజయామి,

శివాయ నమః శిరః పూజయామి,

సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శివాష్టోత్తర శతనామాలతో పూజ

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)

ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)

ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)

ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయ నమః (50)

ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)

ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః (70)

ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)

ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)

ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)

ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (108)

ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిః సమాప్తా

(ఇక్కద బిల్వాష్టకంతో ఒక్కొక్క శ్లోకానికి 'శివాయ నమః' అంటూ బిల్వాన్ని సమర్పించాలి.)

బిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః ।
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణమ్ ॥

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్ ॥

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః ।
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్ ॥

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా ।
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్ ॥

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనమ్ ।
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్ ॥

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ ।
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్ ॥

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణమ్ ॥
దంతి కోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ ।
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్ ॥

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ।
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపనముచ్యతే ।
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్ ॥

అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా ।
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్ ॥

బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్ ॥

----------------

వికల్ప సంకర్పణ

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 1 ॥

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితమ్ ॥ 2 ॥

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ ।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 3 ॥

సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 4 ॥

దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ ।
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితమ్ ॥ 5 ॥

ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ ।
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 6 ॥

కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితమ్ ॥ 7 ॥

ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరమ్ ।
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితమ్ ॥ 8 ॥

ఇతి శ్రీ బిల్వాష్టకమ్ ॥

శర్వాయ క్షితిమూర్తయే నమః రుద్రాయ అగ్నిమూర్తయే నమః భీమాయ ఆకాశమూర్తయే నమః మహాదేవాయ సోమమూర్తయే నమః భవాయ జలమూర్తయే నమః ఉగ్రాయ వాయుమూర్తయే నమః పశుపతయే యజమానమూర్తయే నమః ఈశానాయ సూర్యమూర్తయే నమః ।

ధూపం

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం | ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ॥ సాంబసదాశివాయ నమః ధూపమాఘ్రాపయామి.

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాయోజితం మయా । గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహమ్ । సాంబసదాశివాయ నమః దీపం సమర్పయామి.

నైవేద్యం

అన్నం చతుర్విధం సూప ఫలభక్ష్య సమన్వితం | దధి మధ్వాజ్య సంయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥ సాంబసదాశివాయ నమః అమృత మహానైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి.

తాంబూలం

పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం । కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
సాంబసదాశివాయ నమ: కర్పూర తాంబూలం సమర్పయామి.

నీరాజనం

చంద్రాదిత్యౌచ ధరణీచ విద్యుదగ్నత్వమేవచ | త్వమేవ సర్వజ్యోతీంషి భజ నీరాజనం ప్రభో ॥ సాంబసదాశివాయ నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.

పుష్పాంజలి

మందార నీలోత్పల కుందజాతీ పున్నాగమల్లీ కరవీర పంకజై: పుష్పాంజలిం బిల్వదలైస్తు దేవ సాంబ! త్వదంఘ్రౌ  వినివేశయామి సాంబసదాశివాయ నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారం

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥

సాంబసదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

నమస్కారాలు

మహాదేవ నమస్తేస్తు మన్మథారే నమోస్తుతే | అమృతేశ నమస్తుభ్యం ఆశ్రితార్థ ప్రదాయినే ॥ సాంబసదాశివాయ నమః నమస్కారాన్ సమర్పయామి.

ఛత్రచామరం

త్రాహిమాం దేవదేవేశ తరుణేన్దు శిఖామణే | ఈప్సితం దేహి మే దేవ దయారాశే నమోస్తుతే ॥ సాంబసదాశివాయ నమః చత్రచామర నృత్తగీతం వాద్యాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

ఇదమర్ఘ్యం

పూజాంతే శ్రీరర్ఘ్య ప్రదానం కరిష్యే-
నమః శివాయ సాంబాయ సర్వపాపహరాయ చ | శివదేవ మయాదత్తమిదమర్ఘ్యం గృహాణ ప్రభో ॥ సాంబసదాశివాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్.

మయాకృతాన్యశేషాని పాపాని సుద శంకర | మహాదేవ! మయాదత్తం గృహాణార్ఘ్యం మయా శివ ॥ సాంబ సదాశివాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్.

వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మన్ వ్యోమరూపిణే । నక్షత్రమాలినే దేవ గృహణార్ఘ్యమిదం ప్రభో ॥

సాంబ సదాశివాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్

అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి | గృహాణార్ఘ్యం మయాదత్తం సుప్రీతావరదాభవ ॥ అంబికాయై నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమరర్ఘ్యంమ్.

సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ । గృహాణార్ఘ్యమిదం దత్తం సుప్రీతో వరదోభవ ॥
సుబ్రహ్మణ్యాయ నమః | ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదిమర్ఘ్యమ్.

నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ | గృహణార్ఘ్యమిదం దత్తం నందికేశ నమోస్తుతే ॥ నందికేశాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్.

చండికేశాయ నమః... ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్| అనయా పూజయా అర్ఘ్య ప్రదానేన చ సపరివార: సాంబశివః ప్రియతామ్ ॥

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా. శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ | విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివశివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో! ॥   

No comments:

Post a Comment