Sunday, November 16, 2025

ఈ వీడియో చూశాక, మీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది || Mahatma Gandhi Facts in Telugu

ఈ వీడియో చూశాక, మీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది || Mahatma Gandhi Facts in Telugu

https://youtu.be/x24R1usJyvI?si=7xEISdvq0pjpk9Qy


ఇప్పుడు నేను చెప్పబోయే చీకటి కోణం గురించి తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కాస్త కోపం కూడా రావచ్చు. మరీ ముఖ్యంగా గాంధేయవాదులు ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. ఇప్పటి వరకు గాంధీజీ పై ఉన్న అభిప్రాయం కూడా ఈ వీడియో చూసాక కాస్త మారే అవకాశం లేకపోలేదు. కానీ చరిత్రలో దాచిన విషయాలు నిజాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంతలా ఏ విషయం గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? 77 ఏళ్ల వయసులో గాంధీ గారు చేసిన ఒక ప్రయోగం గురించి అదే బ్రహ్మచర్య ప్రయోగం. దీనినే సెలిబసి ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే ఒకే గదిలో కాదు ఒకే మంచం మీద బట్టలు లేకుండా ఆడవారితో గాంధీ గారు నిద్రించి తనను తాను నిగ్రహించుకోవడానికి చేసిన ప్రయోగమే ఈ బ్రహ్మచర్య ప్రయోగం అవును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లక్షలాది మందిని నడిపించి స్త్రీల హక్కుల గురించి మాట్లాడి స్త్రీలను బలహీనులు అని పిలవడం తప్పు అని చెప్పి నైతిక శక్తిలో స్త్రీలు ఉన్నతమైన వారని చెప్పిన ఆ గాంధీ గారే 70 ఏళ్ల వయసులో ఈ నగ్న ప్రయోగాన్ని చేశారు. కనుక దీని గురించి లోతుగా మీకు నిజాలు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు గాంధీ గారు చేసిన ఈ సెలబస్ ఎక్స్పెరిమెంట్ ఏంటి ఎందుకు ఆయన ఈ ప్రయోగం చేశారు దీనిని ఆయన ఎలా సమర్ధించుకున్నారు అసలు ఈ బ్రహ్మచర్య ప్రయోగంలో గాంధీ గారితో పాటు ఉన్న మహిళలు ఎవరు రండి గాంధీ గారిపై ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయాన్ని మార్చేసే డార్క్ రియాలిటీ గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియో చూసాక తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా గమనిక 77 ఏళ్ల వయసులో గాంధీ గారు చేసిన ఈ సెలబసీ ఎక్స్పెరిమెంట్ గురించి పాజిటివ్ గా తీసుకోవాలా నెగిటివ్ గా తీసుకోవాల అనే విషయాన్ని 10 సార్లు ఆలోచించి చేసిన వీడియో ఇది. ఇందులో ఎక్కడ గాంధీ గారిని కించపరచాలన్న ఉద్దేశం మాకు లేదు. అయితే చరిత్ర దాచిన విషయాల్లో మాత్రం మీరు సైతం తెలుసుకోవాలనే ఈ వీడియోని మీ వరకు తీసుకొచ్చాం. ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే 1946 లో మహాత్మా గాంధీ గారు చేసిన సెలబసి అంటే బ్రహ్మచర్య ప్రయోగం గురించి చర్చించడం అనేది ఒక సున్నితమైన అంశం ఎందుకంటే ఇది గాంధీ గారి జీవితంలోనే వివాదస్పద భాగం చరిత్రకారులు విమర్శకులు దీనిని వేరు వేరు కోణాల్లో చూస్తారు. ఈ ప్రయోగం గాంధీ గారి ఆత్మాధిక నైతిక సాధనలో భాగంగా జరిగింది. కానీ ఇది ఇప్పటి కాలంలో వివాదస్పదంగా మారి విమర్శలకు గురైంది. ఈ సెలబసి ప్రయోగాన్ని అర్థం చేసుకోవడానికి సందర్భం అలాగే ఆనాటి గాంధీ గారి ఆలోచనలని మనం పరిశీలించడం ముఖ్యం గాంధీ గారి జీవితంలో బ్రహ్మచర్యం ఒక కీలకమైన ఆధ్యాత్మదిక సాధన ఆయన బ్రహ్మచర్యాన్ని కేవలం శారీరక నిగ్రహంగానే కాకుండా మనసు ఆలోచనలు అలాగే ఆత్మ యొక్క పవిత్రతను సాధించే మార్గంగా భావించారు. 1906 లో 30 ఏడ ఏళ్ల వయసులో గాంధీ గారు బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నారు. దాన్ని తన అగ్దిక శక్తి మరియు స్వయం నియంత్రణకు పరీక్షగా చూశారు. అసలు ఆయన బ్రహ్మచర్య వ్రతం తీసుకోవడానికి అప్పుడు ఆయన జీవితంలో ఆయన ఆలోచనలో వచ్చిన మార్పుల గురించి వివరంగా తన ఆత్మ కథ అయిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అనే బుక్ లో క్లియర్ గా రాశారు. అవేమిటో ఆయన మాటలుగానే ఇక్కడ మీకు వివరిస్తాను. గాంధీ గారికి లైంగిక జీవితం గురించి ప్రత్యేకమైన దృష్టికోణం ఉండేది. గాంధీ గారు కస్తూర్బా గాంధీని 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఆ కాలంలో ఇది సాధారణం. వారిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. వారు 24 ఏళ్ల పాటు సాధారణ దాంపత్య జీవితం గడిపారు. తర్వాత గాంధీజీ తన జీవితాన్ని తాను తిరిగి చూసుకున్నప్పుడు తనకు భార్య పట్ల తీవ్ర లైంగిక ఆకర్షణ ఉండేదని దాని గురించి స్పష్టంగా తన ఆత్మకథలో రాశారు. ఆయన తన ఆత్మకథలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆమె గురించి ఆలోచించేవాడిని. రాత్రిపూట ఆమెను కలుసుకునే ఆలోచన ఎప్పుడు నన్ను వెంటాడేదని అలాగే తన చదువురాని భార్యకు చదువు నేర్పించాలని ఎప్పుడు అనుకునేవాడినని కానీ తన ప్రేమలో ఉన్న లైంగిక మోహం వలన తనకు చదువు నేర్పించడానికి టైం దొరకలేదని గాంధీ గారు తన ఆత్మకథలో రాశారు. తర్వాత ఆయన లైంగికతపై తన ఆలోచనలని పూర్తిగా మార్చుకున్నారు. తన భార్యతో గడిపిన జీవితం పట్ల సిగ్గుపడ్డారు. తన పబ్లిక్ లైఫ్ మొదలయ్యేలోపు చేసిన ఆ పనులను ఆయన తప్పుగా భావించారు. గాంధీ గారు తన తండ్రి చనిపోయే టైం లో జరిగిన సంఘటన గురించి కూడా డబల్ షేమ్ గా తన బుక్ లో ఇలా వర్ణించారు. ఆ టైంలో ఆయన తండ్రి చాలా అనారోగ్యంగా ఉన్నారు. గాంధీ గారు ప్రతిరోజు ఆయనకి టాబ్లెట్స్ ఇవ్వడం కాళ్ళు మసాజ్ చేయడం వంటి సేవలు చేసేవారు. అదే సమయంలో ఆయన భార్య గర్భవతి అయ్యారు. తర్వాత ఆయన ఈ విషయాన్ని గిల్టీగా గుర్తు చేసుకున్నారు. ప్రతి రాత్రి నా చేతులు నా తండ్రి కాళ్ళను మసాజ్ చేస్తుంటే నా మనసు మాత్రం బెడ్రూమ్ వైపే తిరుగుతుండేది. తన తండ్రి చివర శ్వాస తీసుకునే టైంలో తాను ఆయన పక్కన లేకుండా తన భార్య వద్దకు వెళ్లి శృంగారంలో నిమగ్నమయ్యానని ఆ నిర్ణయాన్ని ఆయన జీవితాంతం చాలా ప్రశ్తాపంగా భావిస్తుంటానని ఆయన తన బుక్ లో గుర్తు చేసుకున్నారు. ఇదే గాంధీజీని తన జీవితంలో బ్రహ్మచర్యం వైపు మలుపు తిప్పిన ముఖ్యమైన కారణం కూడా అయింది. తన తండ్రి చనిపోయే టైంలో చేసిన ఆ పొరపాటు ఆయన మనసులో ముద్రపడి తర్వాత ఆయన శరీర నియంత్రణ ఆత్మశుద్ధి మార్గంలోకి అడుగుపెట్టారు. గాంధీజీకి లైంగికత మీద ఉన్న అభిప్రాయాలు ఆయన వయసు 30 ఏళ్ల చివర్లో అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పూర్తిగా మారాయి. నేను మానవాళికి ఉత్తమమైన సేవ ఎలా చెయ్యగలను అనే ప్రశ్న వేసుకొని పేదరికాన్ని బ్రహ్మచర్యాన్ని స్వీకరించడం ద్వారానే నిజమైన సేవ చేయగలను అని గాంధీ గారు తనకు తాను సమాధానం చెప్పుకున్నారు. అలా 1906 లో 38 ఏళ్ల వయసులో గాంధీ గారు పూర్తి బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నారు. అంటే ఇకపై లైంగిక సంబంధాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ క్షణం నుండి ఆయన తన భార్యతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఆయన తన భార్య కస్తూర్బాతో కూడా మాట్లాడారు. ఆమె దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన తన బుక్ లో రాశారు. గాంధీజీకి బ్రహ్మచర్యం అంటే కేవలం లైంగిక సంబంధాల నుండి దూరంగా ఉండటం మాత్రమే కాదు తన ఆలోచనలో మాటలో చర్యలలో ప్రతి కోరికను నియంత్రించడం ఇది ఆయనక ఒక రకమైన ఆత్మతిక శక్తిని ఇస్తుందని ఆయన నమ్మారు. తాను అనుకున్నట్టుగానే బ్రహ్మచర్యం గాంధీ గారి లైఫ్ స్టైల్ లో మార్పును తీసుకొచ్చింది. దాదాపు 40 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని తీసుకున్న తర్వాత గాంధీజీ పెద్దగా వివాదాలు లేకుండా దీనిని అనుసరించినట్లు కనిపించారు. ఆయన లైంగిక పరిస్థితుల నుండి దూరంగా ఉండేవారు. రాజకీయాలపై దృష్టి పెట్టేవారు పైకి అంతా సాఫీగా కనిపించింది. కానీ ఈ సంవత్సరాల్లో కూడా గాంధీ గారి బ్రహ్మచర్యం వివరణ సాధారణ నిగ్రహానికి మించినది. గాంధీ గారు బ్రహ్మచర్యం అంటే కేవలం విరమణ మాత్రమే కాదు తనను తాను పరీక్షించుకునే ప్రయోగం అని అనుకున్నారు. అదే టైంలో ఆయన కొన్ని వింత ప్రయోగాలు మొదలుపెట్టారు. అవి ఇప్పుడు అంత కరెక్ట్ కావు. ఆయన ఆశ్రమాల్లో కఠినమైన నియమాలు అమలు చేశారు. ఆశ్రమ నియమాల ప్రకారం అబ్బాయిలు అమ్మాయిలు కలిసి స్నానం చేయడం కలిసి నిద్రించడం వంటి నియమాలు ఉండేవి. కానీ వారందరూ పవిత్రతను కాపాడాలి. ఎవరైనా లైంగిక మాటలు మాట్లాడితే లేదా తప్పుగా ప్రవర్తిస్తే వారిని శిక్షించేవారు. అలాగే భార్యా భర్తలు కలిసి ఒకే చోట నిద్రించకూడదు. భర్త తన భార్యతో ఒంటరిగా ఉండకూడదు. ఏ సమయంలోనైనా లైంగిక కోరిక కలిగితే వెంటనే చల్లని నీటితో స్నానం చేయాలని గాంధీజీ చెప్పేవారు. వ్యక్తిగతంగా బ్రహ్మచర్యం స్వీకరించడం అనేది అత్యంత కట్టుబాటు కలిగిన నిర్ణయం అని ఆయన నమ్మారు. ఇది అసాధారణమైన క్రమశిక్షణ శారీరక కోరికలకు అతీతమైన జీవితాన్ని సూచిస్తుంది. ఈ దృష్టిలో ఆ నిర్ణయం మెచ్చుకోదగినది. కానీ గాంధీజీ పెళ్లి చేసుకున్న జంటలను విడిగా పడుకోమని ఎందుకు చెప్పారు? ఆయన బ్రహ్మచర్యం స్వీకరించారని ఇతరుల వ్యక్తిగత సంబంధాల్లో జోకిం చేసుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇతరులకి కఠినమైన నియమాలు పెట్టిన గాంధీ గారు తానే తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవడానికి మహిళలతో క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టారు. 1920 నాటికి ఆయన మార్నింగ్ ఈవెనింగ్ వాక్ టైం లో యువతల భుజాలపై చెయ్యి వేసుకొని నడవడం మొదలు పెట్టారు. వారిని ఆయన సరదాగా నా వాకింగ్ స్టిక్స్ ని పిలిచేవారు. వారిలో ఆయన మనవరాలు అభా అలాగే మను గాంధీ ఉండేవారు. తర్వాత గాంధీ గారు స్వయంగా యువతలతో మసాజ్లు చేయించుకోవడం కొన్నిసార్లు బట్టలు లేకుండా కూడా స్నానాలు చేయడం మొదలు పెట్టారు. ఆయన చుట్టూ మహిళల గ్రూప్ ఏర్పడింది. ఇది స్వీయ నియంత్రణ పవిత్రత పరీక్ష అని దీనికి ఆయన వివరణ ఇచ్చారు. కానీ ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఈ పద్ధతిని చూసి అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి బహిరంగంగానే గాంధీజీని విమర్శించారు. ఇక 1944 లో గాంధీ గారి భార్య కస్తూర్బా గాంధీ చనిపోయిన తర్వాత ఈ ప్రయోగాలు మరింత భయంకరమైన స్థాయికి చేరుకున్నాయి. అసలైన వివాదం 1946 లో తూర్పు బెంగాల్ లోని నో అకలీలో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతం నుంచి మొదలైంది. ఆ టైంలో భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన మతపరమైన ఘర్షణలు జరుగుతున్నాయి. హిందువులు ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. అందుకే గాంధీ గారు ఈ హింసను ఆపడానికి అక్కడికి వెళ్లారు. కానీ ఆయన భారతదేశాన్ని అహింస విముక్తి చేస్తుందని ఐక్యం చేస్తుందని భావించిన పద్ధతులు పని చేయడం లేదు. ఆయన పద్ధతులు ఫెయిల్ అవుతున్నాయి. దాంతో గాంధీజీ తనను తాను ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. నా అహింస ఎందుకు పనిచేయడం లేదు ఈ రక్తపాతాన్ని నేను ఎందుకు ఆపలేకపోతున్నాను అని అనుకున్నారు. నెమ్మదిగా గాంధీజీ దేశ సమస్యలని తన వ్యక్తిగత లైంగిక నిగ్రహ సంఘర్షణలతో ముడిపెట్టడం ప్రారంభించారు. అలా చేసి ఆయన ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చారు. బహుశా తన కోరికలని పూర్తిగా జయించలేక పోయినందున ఇది జరుగుతుంది. కాబట్టి 77 ఏళ్ల వయసులో హింసను ఆపడంపై దృష్టి పెట్టడానికి బదులు గాంధీ యువతలతో ఈ బ్రహ్మచర్య ప్రయోగాలని నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన నమ్మకం ఏంటంటే తనలో లైంగిక భావాల్లో ఏమీ లేవని నిరూపించుకుంటే ఏదో విధంగా ఆయన అహింస మరింత శక్తివంతమయ్యి అది దేశాన్ని రక్షిస్తుందని అనుకున్నారు. ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కదా అసలు గాంధీ గారు ఈ బ్రహ్మచర్య ప్రయోగం గురించి ఎవరితో నిద్రించారో తెలిస్తే ఇంకా విచిత్రంగా అనిపించడమే కాదు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఆ యువతలు మరెవరో కాదు నెంబర్ వన్ మను గాంధీ. ఈమె వయసు కేవలం 18 నుంచి 20 ఏళ్ళు ఈమె గాంధీజీ అన్నయ్య కర్షన్ గాంధీకి మనవరాలు అంటే గాంధీజీకి కూడా మనవరాల వరస ఇక నెంబర్ టూ మరొక బంధువైన అబా గాంధీ ఈమె గాంధీజీ మేనల్లుడు భార్య ఇక నెంబర్ త్రీ డాక్టర్ సుశీలా నయ్యర్ ఈమె గాంధీజీ యొక్క వ్యక్తిగత వైద్యురాలు 30 ఏళ్లప్పటి నుంచి గాంధీజీతో ఉండేవారు. ఈమె గాంధీజీ కార్యదర్శి పారేలాల్ నాయర్ సోదరి. ఈమె గాంధీజీతో స్నానం చేయడం ఆయనకు మసాజ్ చేయడం వంటి పనుల్లో ఉండేది. ఈమెతో స్నానం చేసే టైంలో తన కళ్ళను మూసుకునే వాడినని గాంధీజీ తన బుక్ లో చెప్పారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ఆరోగ్య మంత్రిగా కూడా ఈమె పనిచేశారు. గాంధీ గారి పేరు మీద ఇండియాలో హాస్పిటల్స్ కట్టించింది ఈమెనే ఇక నెంబర్ ఫోర్ 40 ఏళ్ల వయసున్న ప్రభావతి నారాయణ్ ఈమె సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ భార్య ఇక నెంబర్ ఫైవ్ కంచన్ షా ఈమె గాంధీ ఆశ్రమ మేనేజర్ భార్య ఈమె ఒక రాత్రి మాత్రమే ఒప్పుకున్నారు. ఇక నెంబర్ సిక్స్ బీనా పటేల్ ఈమె గాంధీ మేనలుడు కను గాంధీ సోదరి వీరే కాకుండా ఆయన సేవా గ్రామం సబరమతి ఆశ్రమంలో ఉన్న వీర యువతలు ఆయన సూచనల ప్రకారం సహనిద్ర ప్రయోగాలు, సమూహ స్నానాలు ఆహార నియమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొందరు శారీరకంగా దగ్గర లేకుండా కూడా ఆయనతో నిద్రించడం ద్వారా తన నియంత్రణను పరీక్షించేవారిని గాంధీజీ తన ఆత్మకథలో చెప్పారు. ఇక గాంధీ గారి కార్యదర్శి నిర్మల్ కుమార్ బోస్ ఈ విషయాలన్నిటిని తన డైరీలో రాశారు. గాంధీజీ మనువుతో ఇదొక ధైర్యమైన అసలైన ప్రయోగం అని వారి పవిత్రతకు అంతిమ పరీక్ష చెప్పారు. అందుకే గాంధీజీ ఈ యువతల్ని బట్టలు తీసివేసి రాత్రి ఆయన పక్కన నగ్నంగా నిద్రించమని చెప్పేవారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే గాంధీజీనే స్వయంగా ఒక లేఖలో ఈ యువతలు ఈ పని చేయడానికి ఇష్టపడలేదని ఒప్పుకున్నారు. అబ్బా నాతో దాదాపు మూడు రాత్రులు నిద్రించింది. కంచన్ ఒక రాత్రి మాత్రమే నాతో నిద్రించింది. దాదాపు అందరూ ఇష్టం లేకుండానే బట్టలు తీశారు. నేను వారిని ఒత్తిడి చేసినందున వారు అలా చేశారని రాశారు. ఇక్కడ ఇష్టం లేకుండా అంటే వారు చేయడానికి సిద్ధంగా లేరని కానీ గాంధీ గారు ఒత్తిడి చేయడం వల్ల చేశారని అర్థం ఒక క్షణం ఆ మహిళల పరిస్థితి గురించి ఆలోచించండి గాంధీ గారు స్వయంగా వారికి ఇష్టం లేకపోయినా తన ఒత్తిడి వల్ల తనతో నగ్నంగా నిద్రించడానికి బలవంతం పెట్టడంతో ఒప్పుకున్నారు. ఈ యువతలు స్వేచ్ఛగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గాంధీ గారు అడిగినందుకు మాత్రమే చేశారు. అసలు ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పాలంటే గాంధీ గారు ఈ యువతలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు అనడానికి ఎటువంటి ఆధారం లేదు. కానీ ప్రశ్న ఏమిటంటే ఇది సరైనదా 77 ఏళ్ల వృద్ధుడు యువతల బట్టలు తీసి తన పక్కన నిద్రించమని ఒత్తిడి చేయడం సరైనదా అయినా వారు ఖచ్చితంగా ఒప్పుకోకపోయినా ఇలా చేయడం సరైనదేనా అనేది ఇక్కడ ప్రశ్న అంతేకాదు అసలు గాంధీజీ ఇలా ఎందుకు చేశారు? ఇంత గొప్ప సూత్రాలు కలిగిన ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడిన వ్యక్తి ఇలా చేసే ముందు ఆయన మనసులో ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకగా బ్రహ్మచర్య ప్రయోగంలో భాగంగా ఒకే గదిలో లేదా కొన్ని సందర్భాలలో ఒకే మంచం మీద నగ్నంగా నిద్రిస్తూ చేసిన ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం గాంధీ మాటల్లో చెప్పాలంటే తన మనసు అలాగే శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడం అలాగే శారీరక ఆకర్షణల నుండి పూర్తిగా విముక్తి పొందడం ఆయన ఈ ప్రయోగాన్ని తన ఆమెదిక శక్తిని పరీక్షించే మార్గంగా చూశారు. ముఖ్యంగా దేశంలో హింస అశాంతి సమయంలో తన నైతిక స్థైర్యాన్ని నిరూపించుకోవడానికి ఆయన ఈ ప్రయోగాన్ని చేశనని చెప్పారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న మను గాంధీ ఈ విషయాన్ని తమ ఆధ్యాదిక గురువు సూచనలకు అనుగుణంగా చూశారు. ఆమె తన డైరీలో ఈ ప్రయోగాలని గాంధీ గారి యజ్ఞంలో భాగంగా పేర్కొన్నారు. ఇది ఆమెకు ఆధ్యాదిక పవిత్రతను సాధించడంలో సహాయపడిందని ఆమె భావించారు. అసలు ఈ ప్రయోగం చేయడంలో గాంధీ గారి ఉద్దేశం నెంబర్ వన్ ఆత్మ పరీక్ష. గాంధీ గారు తన బ్రహ్మచర్య వ్రతం స్థిరత్వాన్ని పరీక్షించాలనుకున్నారు. ఆయన తన మనసు శుద్ధంగా ఉందని శారీరక ఆకర్షణలకు లొంగిపోనంత స్థిరంగా ఉందని నిరూపించాలనుకున్నారు. ఇక నెంబర్ టూ ఆత్మీతిక శక్తి. గాంధీ గారు బ్రహ్మచర్యాన్ని ఆధ్వర్థిక శక్తికి మూలంగా భావించారు. దేశంలో హింస విభజన సమయంలో ఈ ప్రయోగం తన ఆత్మక సామర్థ్యాన్ని బలోపితం చేస్తుందని ఆయన బలంగా నమ్మారు. నెంబర్ త్రీ స్త్రీ పురుష సమానత్వం. గాంధీ గారు ఈ ప్రయోగంలో స్త్రీలను భాగస్వాములుగా చూశారు. వారిని ఆత్మదిక సాధనలో సమానంగా భావించారు. అయితే ఈ కోణం నేటి దృష్టిలో సమస్యాత్మకంగా కనిపిస్తుంది. గాంధీ గారు మనసులో ఆయన ఏ తప్పు చేయడం లేదని భావించారు. ఆయన దీనిని ఉపవాసం లేదా ధ్యానం వంటి ఆత్మదిక సాధనగా చూశారు. ఆయన దీనిని సత్యంతో నా ప్రయోగాలని కూడా పిలిచారు. ఆయన ఈ ప్రయోగాలని యజ్ఞంగా త్యాగంగా స్వీయ నియంత్రణకు ఉదాహరణగా చూడమని ప్రజలను కోరారు. కానీ సమస్య ఏమిటంటే ఈ ప్రయోగంలో పాల్గొన్న యువతల గురించి కూడా మనం ఆలోచించాలి. గాంధీ గారు అపారమైన శక్తి ప్రభావం కలిగిన వ్యక్తి ఈ యువతలు ఆయనపై పూర్తిగా ఆధారపడేవారు. గాంధీ ఈ ప్రయోగాలని తన ఆధ్యాత్మిక మార్గానికి అవసరమని సమర్థించారు కానీ ఈ యువతల మాట ఏమిటి వారి జీవితాలు వారి భావనల గురించి ఎందుకు ఆలోచించలేదు ఇక గాంధీ గారితో ఇలా క్లోజ్ గా ఉన్న తర్వాత ఆ మహిళల పర్సనల్ లైఫ్ విషయాలను కనుక గమనిస్తే మను గాంధీ ఈ ప్రయోగాలు మొదలైనప్పుడు ఆమె వయసు కేవలం 18 ఏళ్ళు ఆమె తల్లి చనిపోయిన తర్వాత తనకు 15 ఏళ్ల వయసు నుండి గాంధీ గారితో ఉంటుంది. ఆమెకు వేరే కుటుంబం లేదు, డబ్బు లేదు వెళ్ళడానికి స్థలం లేదు. గాంధీ గారు ఆమెకు తండ్రి లాంటి వ్యక్తి మను తన డైరీలో గాంధీ గారి పక్కన నిద్రించడం తనకు నిర్మలంగా ఉంది. ఎలాంటి అసౌక్యరంగా అనిపించలేదని రాసింది. ఆమె గాంధీ గారిని తల్లి లాంటి వ్యక్తిగా చూసింది. కానీ ఒక తల్లి తన బిడ్డను ఎప్పుడూ నగ్నంగా ఉండమని అడగదు కదా తల్లి ఎప్పుడు తన బిడ్డ శ్రేయస్సునే కోరుకుంటుంది. ఇక గాంధీజీ చనిపోయిన తర్వాత మను ఒక గ్రామానికి తిరిగి వెళ్లి 21 సంవత్సరాలు ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా బ్రతికింది. ఇక మనుకు 44 ఏళ్ల వయసులో ఒద్దడి ఒంటరితనంతో క్షయ వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. ఇక తర్వాత అబా గాంధీ ఈమె ఇంకా చిన్నది ఆమెక అప్పుడు 17 ఏళ్ళు లేదా 18 ఏళ్ల వయసు ఆమె గాంధీ గారి మేనల్లుడు కనుని పెళ్లి చేసుకుంది. కానీ గాంధీ గారు ఆమెను కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొనమని ఒప్పించారు. గాంధీ గారు తన లెటర్స్ లో అబ్బా ఇష్టం లేకుండా పాల్గొందని ఆయనను భయపడి మాత్రమే చేసిందని ఒప్పుకున్నారు. ఇది ఎంత తప్పుగా అనిపిస్తుందో కదా ఒక టీనేజ్ అమ్మాయి తన భర్త తాతను బాధ పెట్టడానికి భయపడి బట్టలు తీసింది. ఆమె భర్త కనుకి కూడా ఈ విషయం నచ్చలేదు. కానీ ఆయన గాంధీ గారిని ప్రశ్నించగలిగాడా దీనికి సమాధానం కచ్చితంగా నువ్వు. ఇక గాంధీ గారి మరణం తర్వాత అబా కనువులు గాంధీ గారి జ్ఞాపకాలని ఫోటోగ్రఫీ ద్వారా సేవించడంలో తమ జీవితాన్ని గడిపారు. తమ సొంత జీవితాల కంటే గాంధీ గారి వారసత్వాన్నే ముందుంచారు. ఇక డాక్టర్ సుశీల నయ్యర్ ఈ ప్రయోగాల టైం లో ఆమె వయసు 30 ఉంటుంది. కానీ ఆమెకు 20 ఏళ్ల వయసు నుండి ఈ ప్రయోగాల్లో పాల్గొంటుంది. కొన్నిసార్లు ఆమె గాంధీ గారితో కలిసి బట్టలు లేకుండా స్నానం చేసేది. ఆమె పెళ్లి చేసుకోలేదు ఆమెకి సొంత కుటుంబం లేదు ఆమె మొత్తం జీవితం గాంధీ గారి సేవలో గడిచింది. గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆమె భారతదేశ ఆరోగ్య మంత్రిగా పనిచేసింది. కానీ అది కూడా గాంధీ మిషన్ ను కొనసాగించడంలో భాగంగానే ఆమె గాంధీ పేరిట వైద్య సంస్థలను కట్టింది. ఆయన రికార్డులను మానిటర్ చేసింది. ఆయన రచనలను ట్రాన్స్లేట్ చేసింది. ఇక ప్రభావతి నారాయణ్ మరియు కంచన్ షా వంటి ఇతర మహిళలు కూడా ఇష్టం లేకుండా విధేయతతో పాల్గొన్నారు. ఇది వారికి వ్యక్తిగతంగా చాలా నష్టాన్ని కలిగించింది. ఇక్కడ మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మహిళలు ఎవరు గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వారు చివరి వరకు ఆయన సమర్ధించారు. ఎందుకు ఎందుకంటే వారి మొత్తం జీవితం వారి గుర్తింపు, సామాజిక స్థితి, ఆర్థిక భద్రత అన్ని గాంధీ గారికి విధేయత కలిగి ఉండటంపై ఆధారపడి ఉన్నాయి. ఇక మహాత్మా గాంధీ గారు తన అసాధారణమైన బ్రహ్మచర్య ప్రయోగాలని ఎప్పుడూ దాచలేదు. ఆయన ఈ విషయాలని తన స్నేహితులతో చాలాసార్లు లెటర్స్ ద్వారా బహిరంగంగా పంచుకున్నారు. దాంతో అప్పుడే గాంధీ గారి ఈ లైంగిక ప్రయోగాలని చాలా మంది వ్యతిరేకించారు. తనతో ఉండేవారు వీటిని గందరగోలమైనవని సమర్ధించలేనివి అని అన్నారు. మరొక వ్యక్తి ఈ ప్రయోగాలకు నిరసనగా గాంధీ గారితో పని చేయడం మానేశాడు. ఇక సర్దార్ వల్లభాయి పటేల్ గారు ఈ ప్రయోగాలని నీచమైనవిగా భావించి దీన్ని ఆపాలని గాంధీ గారు చెప్పారు. ఎదురులు కూడా గాంధీ గారితో తమ సంబంధాలను తెంచుకున్నారు. ఆయన అధర్మాన్ని ధర్మంతో గందరగోళం చేస్తున్నారని చెప్పారు. ఇక జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన అభిప్రాయాలని అసాధారణం ప్రకృతి విరుద్ధం అని వ్యాఖ్యానించారు. కానీ గాంధీ గారు ఒప్పుకోకుండా తన చర్యలను ఆధ్యాత్మిక కారణాలుగా సమర్ధించుకున్నారు. వాటిని యజ్ఞంతో సమానం చేశారు. ఇక గాంధీజీ చనిపోయిన తర్వాత ఈ ప్రయోగం గురించిన వివరాలు చరిత్రలో తొలగించారు. గాంధీ గారి గురించి రాసే చరిత్రకారులు ఈ చాప్టర్ ని పూర్తిగా దాటివేయడమో లేదా క్లుప్తంగా ప్రస్తావించి ముందుకు సాగడమో చేసేవారు. స్కూల్ బుక్స్ లో దీని గురించి ప్రస్తావన లేదు లేకపోవడమే మంచిది ప్రభుత్వం దీని గురించి మాట్లాడలేదు దాంతో ఈ ప్రయోగాలు ఎప్పుడు జరగనట్టుగా మారిపోయాయి. ఇక చివరగా చెప్పాలంటే గాంధీ గారు భారత స్వతంత్ర పోరాటంలో ఒక మోరల్ లీడర్ ఆయన స్వయంగా పదవులు, ఆస్తులు, సౌకర్యాలు, ఇష్టాలు అన్నిటిని విడిచి స్వతంత్ర భారత్ తన ఆలోచనతో ప్రజలను ఒక దిశలో నడిపించారు. ఆయుధాలు, హింస, రక్తపాతం లేకుండా అహింస, సత్యాగ్రహం అనే ఆలోచనతో ఒక సామాజిక విప్లవంను తెచ్చారు. తన శరీరాన్ని మనసుని పూర్తిగా నియంత్రించి పవిత్ర జీవితం గడపాలని ఆయన నమ్మారు. ఆ నియంత్రణ ద్వారా ఆయన దేశసేవకు పూర్తిగా అంకితం కావాలనుకున్నారు. అందుకోసం ఆయన చేసిన బ్రహ్మచర్య ప్రయోగం ఆయన జీవితంలో చాలా వివాస్పదమైన అధ్యాయంగా మారింది. ఆయన ఉద్దేశం ఆత్మనిగ్రహం సాధించడమే ఆయన. ఆయన చేసిన పద్ధతి చాలా మందికి అర్థం కాని విధంగా అనిపించింది. యువతలతో కలిసి నిద్రించడం స్నానం చేయడం వంటి ప్రయోగాలు ఆయన ఆత్మతిక పరీక్షగా చెప్పిన అవి చాలా మందికి తప్పు కనిపించాయి. ప్రజలు గాంధీని దేవుడిలా గౌరవించేవారు. అలాంటి వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల చాలా మంది ఆశ్చర్యపోయారు. నిరస చెందారు. తన సత్యాన్వేషంలో ఆయన పరిమితులను దాటి చేయకూడని పద్ధతులు చేసే స్థాయికి చేరిపోయారు. ఇక గాంధీ గారి దగ్గర ఉన్న యువతులు అభా మను సుశీల వంటివారు ఆయనపై ఉన్న గౌరవంతోనే ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. కానీ నేడు చూస్తే ఆ చర్యలు నైతికంగా సరైనవి కావు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన సేవ గొప్పది. ఎవరు దాన్ని తిరస్కరించలేరు. కానీ ఈ బ్రహ్మచర్య ప్రయోగం మాత్రం ఆయన ప్రతిష్టకు కొంత మచ్చ తెచ్చిందని చెప్పాలి. మహాత్మ అని పిలిచే వ్యక్తి కూడా తన సత్యాన్వేషణలో తప్పు దిశలో నడిచాడని అనిపించే ఒక ఉదాహరణగా తన ప్రయోగాలు నిలిచిపోయాయి. మొత్తానికి చెప్పాలంటే గాంధీ గారు నిజాయితీగా జీవించాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నంలో కాస్త పొరపాటు చేశారు. ఆత్మీయక పేరు మీద సత్యం కోసం చేసిన నైతిక హద్దులు దాటకూడదు అనే విషయాన్ని గాంధీ గారి జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. అది తెలిపే ప్రయత్నమే ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంట తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని రెడీగా పెట్టుకోగలరు. థాంక్ యు ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment