*_పుట్టినామా... సచ్చినామా అనేది కాదు.! నీవు పుట్టినందుకు... ఈ సమాజం హర్షించాలి. ఈ పుడమి తల్లి పులకరించాలి... అది కదా.! జీవితం నీవు పుట్టినందుకు ఓ పరమార్థం అలా ఉండాలి జీవితం అంటే..._*
*_ఒక్క చావుతో బంధాలు అన్ని తెగిపోతాయి ఏదో ఒక రోజు._*
*_ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు,_*
*_ఏదో ఒక నాడు... చుట్టూ అందరు ఉన్నా ఎందరు వున్నా సరే... అందరూండంగా, చూస్తుండగా... చివరికి 100 మంది వైద్య నిపుణులను నీ చుట్టూ ఉంచుకున్న... నీ ఆయువు ప్రమాణం అయిపోగానే... మాయమవుతావ్. ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం._*
*_మాయతో పుట్టావు, మాయలో జీవిస్తావు, మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు. ఎంత దౌర్భాగ్యమో కదా.!_*
*_జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు... తల్లి గర్భంలో ఉన్న... మురికి గర్భము నుండి బయటికి రావాలని తహతలాడుతూ ఉంటాడు..._*
*_తల్లి గర్భం నుంచి బయటకి పుట్టిన, అనగా... రావడం తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు. నేనే గొప్పవాడని భోగాలను అనుభవిస్తా ఉంటాడు..._*
*_ఎన్నో అనుభవిస్తావు నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు. నీ కష్టాలకు... నీ సుఖాలకు కారణం నీవే. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే._*
*_ఇలా బ్రతకడానికి కారణం నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే. చేతులారా... సమస్యలను సృష్టించుకున్నదే నీవు... సమస్యల ఫలితాన్ని అనుభవించేది కూడా నీవే..._*
*_ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మకు సిద్ధమవుతావు._*
*_బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదా బతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు. బ్రతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయండి. బ్రతికి ఉన్నప్పుడే తోటి వారి కష్టాన్ని చూసి చలించండి. నీ తోటి వారి బాధలను మీ బాధలుగా అనుభవించండి. వారిని మీ పరిధిలో ఓదార్చండి.._*
*_ఒట్టి చేతులతో వచ్చావు. పది మంది సహకారంతో బ్రతుకుతావు. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు._*
*_చివరికి... రోదిస్తూ... నీ వాళ్ల గురించి విచారిస్తూ... నీ కర్మను అనుభవిస్తూ... ఈ లోకం నుండి కనుమరుగు అవుతావు... ఇంతకు.?_*
*_రాకడెందుకు.? పోకడెందుకు.? రాకడ... పోకడ యొక్క మర్మాన్ని తెలుసుకో...☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌸🌺 🏵️🙇🏻🏵️ 🌺🌸🌺
No comments:
Post a Comment