Saturday, November 15, 2025

 శీర్షిక : బాలలు ...!!

పువ్వులు  హరివిల్లులా
ఆకాశంలో
విరిసి పరిమళాలను 
వెదజల్లుతూ ఉన్నప్పుడల్లా
పిల్లలనవ్వులు 
పున్నమివెన్నెలలా 
గుర్తుకొస్తాయి కాబోలు.

సింగిడి సంతోషమనే
ఇంటికి పాపలు  
చిరునామావుతూ 
కురిపిస్తారు 
తల్లిదండ్రులకు 
ప్రేమామృత 
జల్లులు పాపలు 
కపటంలేని అమాయక 
చక్రవర్తిలు పిల్లలు.

వచ్చిరాని మాటలతో 
కబుర్లు చెప్పినప్పుడల్లా
ఆనంద డోలికల్లో 
ఓలలాడేది
అమ్మానాన్నలు
అమ్మానాన్నలకు పిల్లలే 
ప్రపంచం నేస్తాలు.

భూమి అనే ఇంద్రధనస్సుపై
పిల్లలు తూనీగలై 
గంతులేస్తున్నప్పుడల్లా
ఇసుకతిన్నెల్లో గిజిగాడిలా
గుళ్ళు కడుతుంటారు 
అద్భుతాలు సృష్టించే 
బాలశాస్త్రవేత్తలు పిల్లలు .

పోలె వెంకటయ్య,9951914867.

No comments:

Post a Comment