*ఏ నాదం వేదాల అత్యంత శ్రేష్ఠమైన భాగమో, వినాశం లేని వేదాల నుండి ఉద్భవించినదో, ఆ ఓంకారం మాకు మేధస్సును ప్రసాదించునుగాక.*
*దేవా, మేము అమృతమయుడైన పరబ్రహ్మను గురించిన జ్ఞానాన్ని పొందుతాము గాక.*
*మా శరీరం ఆరోగ్యవంతంగా ఉండుగాక.*
*మా నాలుక మధురాతి మధురమైన మాటలనే పలుకుగాక.*
*చెవులు అనేక మంచి విషయాలనే ఆలకించుగాక.*
*ఓంకార పరబ్రహ్మా! లౌకిక వస్తువుల గురించిన జ్ఞానంచేత నువ్వు ఆవరింపబడి ఉన్నావు. భగవంతుని ప్రాప్తి స్థానం నువ్వు. నేర్చుకున్న దానిని మరచిపోకుండా కాపాడుము.*
No comments:
Post a Comment