Saturday, November 15, 2025

 ⚜️🌾⚜️🌾⚜️🌾⚜️🌾⚜️

*🪔🌾శోక మోహాలకు*  
                  *కారణం* 
           *రాగద్వేషాదులే🌾🪔*

*🪔🪔యేషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం*
*త్వేద్వంద్వ మోహనిర్ముక్తా, భజంతే మాం దృఢవ్రతాః*

*🪔🌾'చిత్తశుద్ధికి కారణమైన సత్కర్మానుష్టానం చేసి, సకల పాపాలనూ నశింపజేసుకొన్న మహానుభావులు రాగద్వేషాల వల్ల కలిగిన అవివేకంచే విడువబడినవారు, నిశ్చయమైన నియమము కలవారై నన్ను పొందుచున్నారు' అని గీతాచార్యుని సందేశం*. 

*🪔🌾నదిలో నీరు ఒక చోట నిర్మలంగా, మరొక చోట కలుషి తంగా ఉంటుంది. అట్లే జీవన ధర్మం కూడా, ఒక చోట సౌమ్యంగా, మరొకసారి రాగద్వేషాదులచే కలుషితంగా ఉంటుంది. మనస్సు దేనిని భావిస్తుందో అదిగానే రూపొందుతుంది. ఆ రూపంతోనే హర్ష, విషాదాలకు అనుభవిస్తుంది. అనుసంధాన బలంతో చిత్తం చంద్రునిలో సైతం, అగ్ని జ్వాలలను చూడగలదు. ఊసర క్షేత్రంలో కూడా రసాయనాన్ని త్రాగి తృప్తి చెందగ లదు. ఆకాశంలో సైతం మహావనాన్ని చూడగలదు. ఇలా చిత్తం దేనిని సంకల్పిస్తుందో దానిని చూడగలదు*.

*"తత్ర కోమోహః కః శోకః* *ఏకత్వమను పశ్యతః"*

*🪔🌾సర్వప్రాణుల యందు ఆద్వయము, ఏకమునగు సచ్చిదానంద పర బ్రహ్మను దర్శించు వానికి శోక, మోహములుండవని 'శ్రుతి వాక్యం' చెబుతున్నది. అంతఃకరణము కలిగిన వారికి శోక, మోహాదులు ఉండవు. రాగద్వేషాదిమలిన రహితులైనవారి మనసు నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 'తుప్పు పట్టిన ఇను మును అయస్కాంతం ఆకర్షించదు. అలాగే రాగద్వేషా లనే తుప్పుపట్టిన చిత్తమునందు బుద్ధిలోపిస్తుంది*. 

*🪔🌾మనసు పరిశుద్ధమైన పిదప మాత్రమే భక్తి ఉదయిస్తుం దంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఇచ్చ, ద్వేషం, సుఖం, దుఃఖం, కామం, క్రోధం, లోభం, మోహం, హర్షం, అసూయ, అహంకారం, నింద, గర్వం, మాత్యర్యం, దంభం, దర్పం మొదలైన దోషములు శమించిన వాడే ప్రశాంతచిత్తుడు. నరులందరి శరీరాలూ పంచభూతాల చేతనే నిర్మాణమై ఉన్నప్పటికీ.. చిత్త శుద్ధిని బట్టి వేర్వేరు గుణాలు ఉంటాయి. అన్ని విధాలైన భయాలకూ ఇంద్రియాలలో ఏర్పడే రాగ ద్వేషాలే కారణం.* 


*🪔🌾అట్టి రాగద్వేషాలు లేకపోవడమే వైరాగ్యం. దేహేంద్రియాదికమైన ఈ దృశ్యజగత్తులో జీన్నవారు మాటిమాటికీ సుఖదుఃఖాదులైన ద్వంద్వాల తాకిడికి లోనై తల్లడిల్లుతారు. తమ ఆత్మ సాన్నిథ్యంలో రమించేవారు ద్వంద్వ క్లేశాలు లేనివారై పరమసుఖం పొందుతారు. జ్ఞాన, వైరాగ్యాలనే రెక్కలు గలవారు భవబంధం నుంచి విముక్తులై స్వస్వరూపానందాన్ని అనుభవిస్తారు. అవి లేని కేవల కర్మనిష్ఠులు జననమరణ రూప సంసార చక్రంలో యాతన పడతారు.*

🌾🪔🌾🪔🌾🪔🌾🪔🌾

No comments:

Post a Comment