⚜️☘️⚜️☘️⚜️☘️⚜️☘️⚜️
*⚜️🪸పాప పుణ్య ఫలములు*
*అనుభవింపక తప్పదు⚜️🪸*
*🪷🌾విశ్వాంతరాళము యొక్క దిక్కులు మానవులకు అగోచర ములు.🌾🪷*
*🪷🌾స్వర్గలోక, భూలోక, పాతాళ లోకములకు దక్షిణ దిక్కుగా నరకలో కము నిలిచియున్నదని పరీక్షిత్తునకు శుకయోగీంద్రులు శ్రీమద్భాగవత ములో వివరించెను. పాపపుణ్య ఫల ములు ప్రారబ్ధమును బట్టి ఈ జన్మ లోనే భూలోకముందు అనుభవిం పక తప్పదు. ఉత్తమమైన మానవ జన్మ లభించినపుడు సద్వినియోగం చేసికొనక దుర్వినియోగముతో పాప ములను మూటగట్టుకొనిన నరక ములో శిక్షలు అనుభవింపక తప్ప దని శుకయోగీంద్రులు తెలియజేసి నారు. ఏ పాపమునకు ఎటువంటి శిక్షలు విధించెదరో కూడా చాలా చక్కగా విశ్లేషించారు*.
*🪷🌾ఇతరుల ధనమును, భార్యలను, నిధి నిక్షేపములను అపహరించి అనుభవించినవారిని దృఢమైన గొలు సులతో బంధించి నవనాడులను ఉక్కిరి బిక్కిరి చేసెదరు. స్నేహితుని భార్యను వంచించి అనుభవించినవా రిని మరుగుతున్న కాలద్రవములో పడవేయుచూ, తిరిగి పైకి లాగుచూ ఘోరముగా శిక్షించెదరు. అమాయ కులను, నిర్దోషులను, బ్రాహ్మణులను బాధించినా, హత్య చేసినా సూకర ముఖమనే పదునైన కోరలుగల కూపములో పడవైచి శిక్షించెదరు. వేదమును నిర్లక్ష్యము చేయు బ్రాహ్మ ణులను, అధర్మవర్తనులను అత్యంత జుగుప్సాకరమైన వైతరణీ నదిలో పడవైచి శిక్షించెదరు. స్వార్థపూరిత మైన వేటను చేయుచూ వన్యమృగ ములను ఏ విధంగా తరిమి చంపు దురో అటులనే యమకింకరులు జీవిని తరిమి తరిమి ఆయుధములతో అణచివేయుదురు. స్వప్రయోజ నము కొరకు దోషభూయిష్టమైన యజ్ఞ యాగాదులు చేయువారిని నర కమున పదునైన రంపములతో కోయుచుందురు*.
*🪷🌾 పశుపక్ష్యాదులను, చిన్నపిల్లలను చెరబట్టి హింసించువా రిని విషజ్వాలలందు పడవేసి శిక్షించె దరు. అతిథికి మర్యాద చేయక అస హ్యపు చూపులు చూసిన వారిని నేత్ర ములు పెకలించి శిక్షించెదరు. పరమ లోభియైన ధనవంతుని సూచీముఖ మనే శిక్షతో పదునైన శూలములతో గ్రుచ్చి గ్రుచ్చి హింసించెదరు. ఇంకనూ అనేక రకములైన నామము లతో నరకమున శిక్షలు గలవు. అమిత సంఖ్యలో యమదూతలు అధర్మవర్తులకు నిరంతరము శిక్షలు అమలు చేయదురని శుకయోగీం ద్రులు పరీక్షిత్తు మహారాజుకు వివరించెను*.
*⚜️🌾నరజన్మ పొందిన జీవుడు పుణ్యఫ లమున స్వర్గలోకవాసము చేసి ఆనం దమును అనుభవించును. పాపఫల మువలన నరకమున శిక్షలు అనుభవించి తిరిగి అనేక యోనులలో జన్మించుచూ ఈ భూలోకమున జీవన చక్రమునందు పడి జీవుడు తిరుగాడుచుండును. అందువలన వేదయుక్తమైన, శాస్త్ర సమ్మతమైన స్వధర్మము పాటించుచు ఆ దేవదే వుని నిత్యస్మరణ చేయువారు నిస్సం శయంగా సచ్చిదానందమును పొందురనుటలో సందేహం లేదని శుకయోగీంద్రులు పరీక్షిత్తునకు సాంత్వన బోధ గావించెను. ఇది మనకు ఒక హెచ్చరిక అని గ్రహించి జాగరూకత పొందెదముగాక.*
🪷🌾🪷🌾🪷🌾🪷🌾🪷
No comments:
Post a Comment