@ కాలజ్ఞానం @
కనిపిస్తోంది
సుస్పష్టంగానే
మన దేశపు భావి ముఖ చిత్రం
పౌష్టికాహారం
అంటూ పేడ తినేవాళ్ళూ
అమృతం అంటూ ఉచ్చ తాగేవాళ్ళూ
మహమ్మారులొస్తే
గో గో అంటూ కంచాలు మోగించేవాళ్ళూ
చప్పట్లు కొడుతూ దీపాలు వెలిగించేవాళ్ళూ
పేదరికం
ఆకలీ నిరుద్యోగం
దోపిడీ పీడనా అణచివేతా అసమానతా
అన్నీ.. అన్నీ .. మరచి
సనాతనమూ సంస్కృతి అంటూ
పూనకాలు తెచ్చుకునేటోళ్ళూ
స్నేహం ప్రేమా మానవత్వం
స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం
భిన్నత్వంలో ఏకత్వం... సమైఖ్యతా
ఇవన్నీ... ఇవన్నీ
నకిలీ విలువలంటూ
ఉన్మాదంతో అరిచేవాళ్ళూ
కూర్చున్న కొమ్మనే
అజ్ఞానంతో తెగనరికేవాళ్ళూ
మెడ విరిచే బెబ్బులికే తల వంచేవాళ్ళూ
ఓ మహాత్మా
ఓ మహర్షీ... రక్షించు నా దేశాన్ని
మతం మాదక ద్రవ్యంతో పిచ్చెత్తిన గుంపు నుండి
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment