Monday, November 17, 2025

 🔱 *ఓం నమశ్శివాయ* 🔱


*వాస్తవంలో జీవించమని వాస్తవాన్ని గ్రహించమని ఆత్మే వాస్తవమని భగవద్గీత  బోధిస్తుంది.....రమణ మహర్షి*🙏🙏🙏


*మనిషి అజ్ఞానంతో తన దేహాన్ని ఆత్మగా భావించి దుఃఖాలు కొనితెచ్చుకుంటున్నాడు.*
*శరీరం వేరనీ, ఆత్మ వేరనీ తెలిస్తే దుఃఖం ఉండదు. ప్రపంచం అంతా ఒక శరీరమే. శరీరం శాశ్వతం కాదు. ఏనాటికైనా నశించిపోతుంది. ఆత్మ ఒక్కటే నిత్యం, శాశ్వతం.*🙏🙏🙏

*ప్రపంచం ఎంత అందంగా ఉన్నా, అది ఎప్పటికో ఒకప్పటికి నశించిపోయేదే కాని శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు. అలాగే మానవశరీరం కూడా. అది ఎన్నటికైనా నశించిపోవలసిందే కనుక శాశ్వతత్వం లేదు*

*జనని గర్భాన పుట్టిన నాటి నుంచి ధరణి గర్భంలో కలిసిపోయేవరకు లోకంలో మనిషిని అనుక్షణం వెంటాడేవి దుఃఖాలు. వీటికి అంతం లేదు. ఒక స్వరూపం లేదు. ఒక స్వభావం లేదు. మనిషి బతికి ఉన్నంతకాలం ఏ క్షణంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా దుఃఖాలు సంభవించవచ్చు.*

*శరీరం గొప్పది కాదనీ, అది నశించిపోయేదనీ, ఆత్మ ఒక్కటే నిత్యం అనుకొన్నప్పుడే మనిషికి దుఃఖం దూరమవుతుంది.* 

*కనుక మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఒక్కటే- 'శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు. శరీరం వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. కనుక మళ్ళీ శరీర రూపమైన జన్మలేకుండా పరమాత్మలో లీనమయ్యే సాయుజ్యముక్తి కలగాలి. అదే శాశ్వతం!'*🙏

No comments:

Post a Comment