2111e4;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀20వ తేదీ…
*పితృకార్యాలకు…*
*కార్తీక అమావాస్య*
➖➖➖✍️
```
కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి.
ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి.
అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును, బిల్వదళాలతో శివుడినీ, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని.
అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్ర వచనం.
ఈ రోజున పితృకార్యాలు నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు.
పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు, తర్పణాలు ఇవ్వడం మంచిది.```
*కార్తిక అమావాస్య రోజు ఆచరించాల్సిన విధి*
కార్తిక అమావాస్య రోజు ఆచరించాల్సిన విధి: ```
కార్తిక అమావాస్య నాడు పంచ పల్లవాలతో(రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు. అశ్వయుజ మరియు కార్తిక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి. స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి. దారిద్య్రాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయవలెను.```
*స్వాతిస్థితే రవా విందు: యది స్వాతి గతో భవేత్*
*పంచత్వ గుదకస్నాయీ కృతాభ్యంగ విధిర:*
*నీరాజితో మహాలక్ష్మీమ్ అర్చయన్ శ్రియమశ్నుతే*```
అనగా సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా లేదా చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా పంచత్వక్ ఉదకములతో అభ్యంగన స్నానమాచ రించి లక్ష్మీనారాయణులకు నీరాజనమిచ్చినచో సంపదలు పొందుతారు. ఆశ్వయుజ కార్తికములే కాక ప్రతీ అమావాస్య మరియు సంక్రమణం నాడు అభ్యంగన స్నానం ఆచరించి రోజంతా ఉపవసించి శక్తి మేర దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఈయవలెను. ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.
హేమాద్రి పురాణానుసారం సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పడు ప్రదోష సమయమున దివిటీలతో, ఆకాశదీపాలతో పితృదేవతలకు దారి చూపవలెను. అలాగే ఆశ్వయుజ, కార్తిక అమావాస్యల నాడు రాత్రి నిద్రించరాదు. ఆరోజు అర్థరాత్రి లక్ష్మీదేవి పురవీధులలో ఆకాశమార్గమున సంచరిస్తూ ఉంటుంది కావున ఇంటి వాకిలిలో, ఇంట్లో ముగ్గులు, తోరణములు, దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ స్తోత్రములు, పూజలు చేయవలెను. ఈవిధంగా చేయని వారింటికి లక్ష్మీదేవి చేరదని పురాణ వచనం. అమావాస్య అపర రాత్రి దాటిన పిదప అనగా బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిపత్ స్పర్శతో
జనులు డప్పులతో అలక్ష్మి(దారిద్య్రం) ని తరిమివేయాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment