Saturday, December 20, 2025

 అక్షరాలంకారం

ఈశ్వరా... నీ అలంకారం... ఓ ఈశ్వరా... నీ అలంకారం నేనవుదురా...

నందన వనం నీవైతే, ధవనంమై, మల్లెనై, మాలనై.... అలంకారం నేనవుదురా...

నిర్మలం సముద్రం నీవైతే, వాన చినుకునై, స్వాతి ముత్యమై... అలంకారం నేనవుదురా...

ఈశ్వరా...నీ అలంకారం... ఓ ఈశ్వరా... నీ అలంకారం నేనవుదురా...

నీలిరంగు ఆకాశం నీవైతే, వాయువై, వెండి మేఘమై, ధూపమై... నాట్యం ఆడు నటరాజు నీవైతే, భావంమై, వాద్యమై, కాలి మువ్వనై...

ఈశ్వరా...నీ అలంకారం... ఓ ఈశ్వరా... నీ అలంకారం నేనవుదురా...

నలుదిక్కులు వెలుగు నీవైతే, అగ్నినై, ఆహుతినై, మంగళమై... ఉప్పొంగే గంగా నీవైతే, అణువై, అలనై, పాద్యమై...

ఈశ్వరా...నీ అలంకారం... ఓ ఈశ్వరా...నీ అలంకారం నేనవుదురా...

పున్నమి చంద్రుడు నీవైతే, తారనై, త్రిపుండ్రమై, నీరాజనమై.. డమరుక నాదం నీవైతే, అనాహతమై, అకారమై, ఓంకారమై...
ఈశ్వరా...నీ అలంకారం... ఓ ఈశ్వరా...నీ అలంకారం నేనవుదురా.

నీ పాద పుష్పాలలో నే అక్షరాలంకారమై నీ సేవలో అర్ఘ్యమై, అభిషేకమై... ఈశ్వరా...నీ అలంకారం

ఓ ఈశ్వరా...నీ అలంకారం నేనవుదురా...

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ.     

No comments:

Post a Comment