Saturday, December 20, 2025

 *సహజంగా వచ్చే ప్రతిభ - టాలెంట్ జన్మతహా సామర్థ్యం!*  
*కష్టపడి సాధించే సామర్థ్యం కర్మతహా సామర్థ్యం!* 

*ఈ రెండిటినీ..*
*ఒక వ్యక్తి సరిగ్గా* *సమన్వయం* *చేసుకోగలిగితేనే* 
*విజయం సులభంగా* *లభిస్తుంది.*

మీకు నచ్చిన పనిని ఆనందంగా, 
సులభంగా చేయగలిగే శక్తి మీ "జన్మతహా" సామర్థ్యం. 
దాన్ని నిరంతరం అభ్యసిస్తూ, 
మరింత మెరుగుపరుచుకోవడం ద్వారా..
మీ "కర్మతహా" సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

ఈ రెండిటినీ విస్మరిస్తే..
మీ ప్రతిభ నిరుపయోగంగా మారుతుంది. 

*కాబట్టి..
*మీ బలాన్ని గుర్తించి, 
*దానికనుగుణంగా..
మీ ప్రయాణాన్ని కొనసాగించండి.*               
❤️💖❤️
*బయట ఉన్నగాలినే పీలుస్తున్నాం.*

*పీల్చిన దానినే బయటికి విడుస్తున్నాం.*

అది నా శ్వాస అంటున్నాం.

పీల్చకముందు ఆ గాలి నాది కాదు.

విడిచిన తరువాత  నాదిగా ఉండదు.

మధ్యలో అది నాది ఎప్పుడైంది ?  

ఏదైనా ఈ ప్రపంచంలో "అది" గా ఉందే గాని " నాది" గా లేదు.

"అది" తెలిస్తే "నాది" ఉండదు.

"నాది" అన్నప్పుడు "అది" తెలిసిరాదు.            


No comments:

Post a Comment