Tuesday, December 30, 2025

 ****షాడో మధుబాబు ****       షాడో మధుబాబు తెలుసా? ఆ.. ఇప్పుడు తెలిసి ఉంటుంది.. ఇప్పటి తరాలకు తెలియదు కానీ..80,90 దశకాల లో.. బాగా వినిపించాడు .. కానీ ఎవరికీ కనిపించలేదు.. ఇప్పుడే ఆయన ను చూడటం అందరూ ..

అరచేయి అంత నవలతో.. మనకి అరచేతిలో ప్రపంచం అంతా చూపించేవారు.

అజ్ఞాతవాసంలోనే 150 పైగా నవల లు రాసి.. షాడో, గంగారాం, శ్రీకర్,, కులకర్ణి, బిందు వంటి పాత్రల ను పాఠకుల కి చేరువ చేసిన మధుసూదనరావు మాస్టారు... @70. హనుమాన్ జంక్షన్ లో ఓ కరణం గారి కుటుంబం లో పుట్టి. నాటకాల పిచ్చి తో హైద్రాబాద్ వెళ్ళిపోయి..అక్కడ కూడా చెడు అనుభవాలు ఎదురైతే.. దేశమంతా తిరిగి.. ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకుని.. బ్రతకటం కోసం సరదా గా మొదలెట్టిన రాత.. ఆయన్ని ఒక పెద్ద రచయిత ను చేసింది. మొదట 50 రూపాయలుకి ఒక నవల రాసేవారు. తర్వాత ఆయన నవలలు లక్షల కాపీ లు కు చేరాయి.

స్వాతి వీక్లీ కోసం 26 సంవత్సరాలు కలం దించకుండా ఆయన రాసిన సీరియల్స్ అప్పట్లో యువతకి పెద్ద కిక్.. స్వర్ణఖడ్గం, కాళికాలయం, చతుర్నేత్రుడు.. సీరియల్ ల కోసం స్వాతి వీక్లీ కొన్న వారే ఎక్కువ.. తర్వాత నవ్య వీక్లీ కి రాస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ.. తను ఒక పెద్ద రచయిత అని తోటి ఉద్యోగులు కి, చుట్టుపక్కల వారికి కూడా తెలియనివ్వని సామాన్య జీవి..

గోల్డెన్ షాడో, షాడో ఇన్ థాయిలాండ్, ఎ బుల్లెట్ ఫర్ షాడో,, టెన్ అగినెస్ట్ షాడో.. షాడో ఇన్ జపాన్,2 మైల్స్ టు ది బోర్డర్, ఘర్షణ.. ఇలా ఎన్నో డిటెక్టివ్ నవల ల సృష్టికర్త.. ఈయన నవలలు రోజుకు 25 పైసలు కు అద్దె కిచ్చి జీవనోపాధి జరుపుకున్న షాపు లెన్నో.. చదువులు ఎగ్గొట్టి ఈయన నవల లు చదివిన కుర్రకారు ఎందరో!

షాడో ఎగిరి ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు.  ....   బుల్లెట్ ఆతని పక్కనుండి వెంట్రుక వాసి లో తప్పుకుని వెళ్ళింది అతని కత్తి ఎంత పదును అంటే వెంట్రుక కూడా చీల్చగలదు..

ఇలా ఉండేవి ఆయన నవల లో సంభాషణలు.

ఎప్పుడూ కూడా ద్వంద అర్థములు,వల్గర్ మాటలు.. విపరీత హింస..ఉండేవి కావు. అసలు లేడీ పాత్ర లే కొన్ని నవలలలో ఉండేవి కావు.

ఎంటర్ ద డ్రాగన్ సినిమా రాక ముందే ఆయన కరాటే గురించి రాసారు.

రచయిత మాత్రమే కాదు.. జంతు ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు కూడా.. ఇప్పటి కీ తాను సామాన్యుడి నని చెప్తూ.. వచ్చే పెన్షన్ తో.. హైద్రాబాద్ లో మాములు గా జీవిస్తున్న ప్రఖ్యాత రచయిత..

చనిపోయేవరకు రాస్తూనే ఉంటానని చెప్పిన నిరంతర అన్వేషి..

సినిమా ల లో అవకాశాలు వచ్చినా ఈయన స్వభావం కి సరిపోక అటు వెళ్లలేదు..

రాయడం అంటే మాటలు కాదు.. ఒక కథ సృజన చేయడానికే రచయిత కి ప్రసవ వేదన.. అలాంటిది ఇన్ని నవలలు రాయడం.. అవి చదివి పాఠకులు ఉర్రూతలూగటం అంటే..

సెల్ ఫోన్ లు.. ఇంటర్నెట్.. కంప్యూటర్,5G ల కాలం లో కి వచ్చేసాం.. గత 20 ఏళ్ల నుండి తెలుగు చదివే వారు కరువై పోయిన కాలం లో బ్రతుకుతున్నాం. డిగ్రీ పాస్ అయిన వాళ్లు కూడా తెలుగు భాష రాయడం, చదవడం.. రాక కిందా మీద పడుతూ,. ఎంగిలి ఆంగ్లం ముక్కలు తో.. బ్రతికేస్తున్న పరిస్థితి..

ఇలాంటి వ్యక్తులు మనకి ఇంకా మనకళ్ళ ముందు ఉన్నారంటే..మన అదృష్టం..

యండమూరి, మల్లాది, సూర్యదేవర, చల్లా సుబ్రమణ్యం, కొమ్మనాపల్లి ..ఇక గతించిన యద్దనపూడి సులోచన రాణి..మాదిరెడ్డి, రామలక్ష్మి. కొమ్మూరి,విశ్వప్రసాద్ వంటి. వాళ్ళు సాహితీ రంగానికి చేసిన కృషి.. చెపితే... ఇప్పటి వారికి చెవిటి వారి ముందు ఊదిన శంఖమే..

రెండు, మూడు రచనలకే.. పెద్ద రచయితలలా ఫోజు లు కొట్టి.. సన్మానాలు.. సత్కారాలు.. పబ్లిసిటి చేయించుకునే.. ఈ కలియుగం లో ..ఇలా ఒక షాడో లా ఉండటం అంటే.. గ్రేట్..... మధుబాబు గారు.

No comments:

Post a Comment