*_🌴 నేటి ప్రపంచమునకు అధ్యాత్మికత అంటే చులకనగా కనిపిస్తుంది కానీ లోతుగా అధ్యయనం చేసి చూస్తే అసలు ప్రపంచం సురక్షితముగా ఉండాలంటే ఆధ్యాత్మికత వలనే సాధ్యం అవుతుంది!. కలుషితమైన భావాలతో నిండిపోయి ఉన్న నేటి ప్రపంచము చాలా వరకూ సుభిక్షముగా ఉన్నదంటే దానికి కారణం ఆధ్యాత్మిక సాధకులే! వీరు లేకుంటే ప్రపంచం ఎప్పుడో అంతం అయిపోయి ఉండేది.. గట్టుపై వేసిన ముళ్ళ కంచే చేను అంతటికీ ఏ విధముగా అయితే రక్షణగా ఉంటుందో అదే విధముగా కుటుంబములో ఒక్కరైనా దైవభక్తులు ఉంటే వారి కుటుంబమునకు అంతటికీ రక్షణ ఉంటుంది. ఇలా కుటుంబం, సమాజములో సాధకులు అంతో ఇంతో ఉండడం వలన వారి భక్తి విశ్వాసాలు ములానా, వారి పుణ్యఫలం కారణం చే కుటుంబము, దేశము, ప్రపంచమునకు రక్షణ కలుగుచున్నది తప్ప డబ్బు, ధనము, సాంకేతికత మున్నగు వాటి వలన కాదు! సమాజమును కలి నుండి కాపాడుకోవాలంటే ఇట్టివారిని కాపాడుకోవాలి. ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణించడానికి కంకణం కట్టుకోవాలి. తద్వారా తమకు, లోక కళ్యాణమునకు పాటుపడాలి.🌴_*
No comments:
Post a Comment