_*జీవితం ఓ ప్రతిబింబం*_
🙏🌹🌴🪔🪔🪔🪔🌴🌹🙏
🪷 ఓ బాలుడు ఒక గుహ దగ్గర నివసిస్తూండేవాడు. ఆ గుహ అవతలి వైపునుంచి గాలి తరగల మీదుగా వస్తుండే ప్రతిధ్వనులు విచిత్రంగా అతనికి. అనిపించేవి. ఆ గుహకు అవతల తనలాంటి మరో చిన్న అబ్బాయి ఉంటున్నాడనీ... అతను తనను వెక్కిరిస్తున్నాడనీ అనుకునేవాడు. 'నాకు నువ్వంటే ఇష్టం లేదు' అని అరిచేవాడు. 'నాకు నువ్వంటే ఇష్టం లేదూ' అనే మాటలు ప్రతిధ్వనిస్తూ ఉండేవి.
🪷 ఆ అబ్బాయి ఓరోజు తన తల్లికి పిర్యాదు చేశాడు. గుహ అవతల ఉండేవాడు చాలా అల్లరబ్బాయి. నాకు వాడంటే ఇష్టమే లేదు.
🪷 ఆ పిల్లవాడికి, తల్లి సలహా ఇచ్చింది.. 'నువ్వంటే నాకిష్టం' అని ఒక్కసారి నువ్వు చెప్పి చూడవచ్చు కదా! అని.
🪷 అమ్మ సలహా పెద్దగా నచ్చకపోయినా... ఆ పిల్లాడు ఒప్పుకున్నాడు. తన అయిష్టతను కష్టపడి అధిగమించాడు. గుహ ముఖం దగ్గర నిలబడి బిగ్గరగా అరిచాడు - 'నువ్వంటే నాకిష్టము.! అని. తిరిగి జవాబు వచ్వింది... 'నువ్వంటే నాకిష్టమే' అని...
🪷 ఆ చిన్నారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. గబగబా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. అమ్మా! అమ్మా! ఆ గుహకి మరోవైపు ఉన్న అబ్బాయి, 'నాకు స్నేహితుడే' అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు.
✅👉 _*అందరూ దాన్ని ప్రతిధ్వని అంటారు. నిజానికి అదే జీవితం. మన ప్రతీ మాటనీ చేతనీ అది మనకి తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. జీవితమంటే ఏదో బ్రహ్మపదార్థం కాదు, కేవలం మన చర్యల ప్రతిబింబమే.*_
✅👉 _*ఈ ప్రపంచంలో చాలా ప్రేమ ఉండాలని మీరు అనుకుంటే... మీ హృదయంలో మరింత ప్రేమని నింపుకోండి. మీ బృందంలో సమర్థత మరింత పెరగాలనుకుంటే ముందు మీ సమర్థతను పెంచుకోండి.*_
✅👉 _*ఈ సూత్రం జీవితంలోని సందర్భాల్లోనూ అన్నిటికీ వర్తిస్తుంది. మీరు అందించే ప్రతీదాన్నీ... జీవితం మీకు తిరిగి ఇచ్చేస్తుంది. అది మంచైనా...! చెడైనా....!*
🙏🌹🌴🪔🪔🪔🪔🌴🌹🙏
ఆత్మీయులైన మీకు శుభసాయంత్రం
No comments:
Post a Comment