మన అలవాట్లలో ....
మనదైన జీవన శైలిలో ....
మన నిత్య జీవిత వ్యవహారంలో
ప్రయత్నపూర్వకంగా
చేసుకునే అతి చిన్నదైన మార్పు....
అత్యంత స్వల్పమైన మార్పు ...
అత్యద్భుతంగా
మార్చేస్తుంది తెలుసా
మన జీవితాన్నే
********
రోజూ ....
ఆలస్యంగా నిద్ర లేచే మీరు
ఈ రోజు నుండీ పెందలకడనే నిద్ర లేచి చూడండి
రోజూ....
అర్థరాత్రి నిద్రించే మీరు....
నేటి నుండీ తొందరగానే విశ్రమించి చూడండి
ఎంత ....
క్రమబద్ధమైపోతుందో
చూస్తుండగానే జీవితం
*********
ఎప్పుడూ
అదరాబదరాగా ...
ఉరుకులు పరుగులు తీసే మీరు
కాస్తంత ...
నిదానంగా నింపాదిగా
క్రమబద్దంగా పనులు చక్కబెట్టుకోండి
నిరంతరం
యంత్రంలా బతుకీడ్చే
లాభనష్టాల తూనికలా వర్తించే మీరు
ఒకింత
స్నేహంగా ప్రేమగా
స్వార్థం వీడి మానవీయంగా పరిమళించండి .
మీ జీవితం
ఎంత అర్థవంతంగా
ప్రకాశిస్తుందో
*********
వికసించనీయండి
మీ పెదాలపై చిరునవ్వులను
ప్రవహించనీయండి
మీ గళం నుండి మధురమైన మాటలను
సాదరంగ ముందుకు
సాచండి మీ చేతులను కరచాలనంకై
నకారాత్మక ఆలోచనలకు
ఎంత మాత్రం చోటీయకండి హృదయంలో
ఎంత మాత్రం వెనుదీయకండి
చేయగలిగిన మేలు త్వరపడి చేయడంలో
**********
రోజుకిన్ని అక్షరాలనైనా
ఆలింగనం చేసుకోండి....
గొంతు విప్పి కూనిరాగాలనైనా
మనసారా పాడుకోండి....
చిన్న పిల్లలతో ఆడుకోండి
అమ్మానాన్నలతో ఊసులాడండి
అమ్మమ్మా తాతయ్యలతో గారాలుపొండి
ఆత్మీయానుబంధాలను బహుశ్రద్ధగా పెనవేసుకోండి.
బుజ్జి పిట్టలకు
గుప్పెడు గింజలో ....
చిన్నారి మొక్కలకు దోసెడు నీటి బొట్లో
బాలెంతలైన వీధి కుక్కలకు ఎంగిలి మెతుకులో ... చేతులారా చిలకరించండి
మీ పరిసరాలనూ
మీ మీ మనసులనూ
ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోండి
*********
అంతే.. అంతే ....
చిన్న.. చిన్న ... మార్పులే
మనసారా యత్నలోపం లేకుండా
ప్రయత్నించి చూడండి
అందరికీ
వినూత్న వత్సర శుభాకాంక్షలు
హృదయపూర్వకంగా
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment