Why did we do bad things even though we know ?
https://youtu.be/PaHwO5OdYwY?si=QnmjuqQiDiPS626U
https://www.youtube.com/watch?v=PaHwO5OdYwY
Transcript:
(00:01) మనోవాంచకు బుద్ధి జ్ఞానానికి మధ్యనున్న భేదమే పాపానికి కారణం అయితే తప్పంతా వాంచదే అయి ఉండాలి దాన్ని ఎలా వదిలించుకోవాలి స్వామీజీ వాంఛ మనసు యొక్క చంచలత్వం దేనినో పొందాలనే నిలుపలేని ఆతృతగా వ్యక్తమైనప్పుడు దాన్నే వాంఛ అంటాం. మన విలువలతో మనమే రాజీపడి పాపకార్యాలను చేయడానికి ప్రోత్సహించడం కోసం మనలోనే ఉన్న పిశాచం అది.
(00:33) వాంఛ ఎంత పెద్దదైతే నీచమైన పాపకార్యం వైపు లాగే శక్తి కూడా అంత బలంగా ఉంటుంది. మనసులో సహజంగా మెదిలే కాంక్షలకు బుద్ధి యొక్క వివేచనా శక్తికి పొంతన లేకపోతే సంక్షోభము దుఃఖము తప్పవు వాంచ వివేకాన్ని మరుగుపరుస్తుంది. ప్రశ్న అయితే శ్రేయో మార్గం బుద్ధికి సంబంధించినదని ప్రేయో మార్గం మనసుకు సంబంధించినదని అనుకోవచ్చా? స్వామీజీ అవును అలా అనుకోవడం సరైనదే అయితే ఈ మనోబుద్ధులు ఒకే త్రాటిపై నడిచేలా చేయడం ఎలా నేను నా అనే కోరికల పుట్ట అయిన అహాన్ని బుద్ధి సమర్ధించే ఒక మహా లక్ష్యానికో మంచి ఆదర్శానికో ఆధీనం చేయాలి.
(01:16) ఈ విధంగా మనోబుద్ధులు సంయోగం కావటాన్నే యోగం అంటారు. మనోబుద్ధులు సమ్మతితో ఏకమైనప్పుడే తగినంత ప్రశాంతత లభించి మనిషి ఈ రెండు మానసిక పరికరాలను అధిగమించే ధ్యానం చేయటానికి అర్హతను సంపాదిస్తాడు. ప్రశ్న అప్పుడప్పుడు మన బుద్ధి సరైనది కాదని చెప్పినా మనం నిగ్రహించుకోలేము. దుఃఖ కారణం అవుతుందని తెలిసినప్పటికీ నిస్సహాయులమైనట్లు చేయకూడనిదే చేస్తామ ఎందుచేత స్వామీజీ మనసుకు మంచి గుణపాఠం నేర్పడానికే అది అలా జరిగిందని వైఖరి అవలంబించండి.
(01:51) దానితో సంబంధం లేని సాక్షిగా మీరు వెనుక నిలబడ నిలబడండి అంతే తరువాత మనసు బాధతోనూ నిరాశతోను మూలుగుతున్నప్పుడు దానికి ఏం కావాలందో దానినే ఇచ్చానని ఇక చేయగలిగింది బాధపడడం మాత్రమేనని దానికి చెప్పండి. దాని మీద కొంచెమైనా దాక్షిణ్యం చూపొద్దు. ఆ నాటకాన్ని చూస్తున్న ప్రేక్షకుడిగా మాత్రమే మీరు ఉండండి. ప్రశ్న దేవుడు మనలోనే ఉన్నాడని మీరు అన్నారు మనం చేసిన పనులు మంచివైనా చెడ్డవైనా అతడు చేసినవే అటువంటప్పుడు శిక్ష మనకఎందుకు పడాలి స్వామీజీ దేవుడు మన ద్వారానే అంతటిని చేయిస్తున్నాడనే సంపూర్ణమైన గ్రహింపుతో మనం చేయాల్సింది చేయకపోవడం చేతనే మనకు
(02:34) శిక్ష పడుతోంది. దేవుడు దైవ కార్యాలను మాత్రమే చేయగలడు మీరు శిక్షలు అనే దుష్ఫలితాలేవి దైవ కార్యాలకు ఉండవు. భగవంతుడు మన అందరిలోనూ ఉన్నాడనే సత్యం తెలియకపోవటం వల్ల పెంపొందే ఇష్టానిష్టాలు స్వార్ధ లోభ మోహాలు మొదలైన పోకడల వల్లనే కర్మ చేసేవాడు దుష్కర్మ చేయటం జరుగుతుంది. మీరు వేరనే అహంతో పని చేసినప్పుడు మీరు శిక్షించబడతారు.
(03:03) మీలో ఉన్న దేవునికి మీరు పాదాక్రాంతులైనప్పుడు శిక్ష ఉండదు. ఈ అల్పమైన నేనును చంపండి. సర్వోత్కృష్టమైన నేనుగా జీవిస్తూ అంతటిని చూడండి ఆలోచించండి కర్మ చేయండి ఆ విధంగా దేవుని నిజమైన ప్రతినిధిగా చేసే కార్యాలన్నీ దైవ కార్యాలే అవుతాయి. అంతేకాక మీ ప్రశ్నలో ఒక విరుద్ధోక్తి కూడా ఉంది. మీలో ఉన్న దేవుడే కర్మలన్నింటిని అవి మంచివైనా చెడ్డవైనా చేయించాడు అంటున్నారు.
(03:33) అలా అంటూనే శిక్ష మీకు ఎందుకు పడిందని అంటున్నారు. భగవంతుడే చేశాడంటే భగవంతునికే శిక్ష పడింది అని కూడా అనాలి కదా చెడ్డ పని చేసిన వానికే శిక్ష పడాలి కదా మీరు ఆత్మార్పణ చేసినప్పుడు అహం పూర్తిగా నశించినప్పుడు స్వతంత్రంగా కర్మ చేసేవాడు గాని శిక్ష పొందేవాడు గాని మీలో ఉండడు భగవంతుడే అంతా చేస్తున్నాడనే మీ ప్రతిపాదన అప్పుడే నిజమవుతుంది.
(03:59) ఆత్మార్పణ ద్వారా మీ అహం భావాన్ని నశింప చేసుకున్నప్పుడు మీ స్వానుభవమే దీనికి రుజువవుతుంది.
No comments:
Post a Comment