The Beauty of Life - by Khalil Gibran/ Telugu motivational quotes
https://m.youtube.com/watch?v=WjwRfHYlPt0
https://www.youtube.com/watch?v=WjwRfHYlPt0
Transcript:
(00:16) [సంగీతం] మీ జ్ఞానాన్ని మోసిన గట్టి పెంకు బద్దలు కావడమే వేదన ఫల హృదయం సూర్యకాంతిలో ప్రకాశించాలంటే పండు పైన ఉన్న రాయి లాంటి గట్టు పెంకు బద్దలు [సంగీతం] కావాలి అలాగే మీరు మీ వేదనను తెలుసుకోవాలి మీ నిత్య జీవిత అనుభవాలకు మీ హృదయం ఆశ్చర్యపడితే మీ సంతోషం కన్నా మీ వేదన తక్కువ ఆశ్చర్యకరమైనది కాదని మీరు తెలుసుకోగలరు [సంగీతం] మీరు మీ పొలాల మీదుగా వచ్చే ఋతువులను ఎల్లప్పుడూ అంగీకరించినట్లే మీ హృదయ సహజ పరివర్తనను కూడా మీరు అంగీకరిస్తారు మరియు మీరు మీ శోకం యొక్క శీతాకాలాలను ప్రశాంతతతో
(01:21) [సంగీతం] చూస్తారు చాలా వరకు మీరు కోరి తెచ్చుకున్నదే మీ వ్యాధ మీ ఆత్మ రుగ్మతను నయం చేయడానికి మీలోని వైద్యుడు ఇచ్చే చేదు మందే వేదన ఆ వైద్యున్ని విశ్వసించి ఆయన ఇచ్చే చేదు మందు మాట్లాడకుండా నిదానంగా [సంగీతం] తాగండి భవరోగ వైద్యుని హస్తం బరువుగా మొరటుగా ఉన్న దాన్ని కూడా సుమారమైన ఒక అదృశ్య హస్తం నడుపుతోంది ఆయన ఇచ్చిన ఔషధ పాత్ర మీ పెదవులను మండించిన సరే తాగండి ఎందుకంటే ఆ పాత్ర తయారు చేయడానికి సృష్టికర్త తన పవిత్రాశ్రములతో ఆ మట్టిని తడిపాడు ఖలీల్ జిబ్రాన్
(02:33) సోమరిగా ఉండటం అంటే ఋతువులకు అపరిచితులుగా ఉండటం అనంతత్వం వైపు గంభీరంగా గర్వంగా సాగిపోయే జీవిత ప్రస్థానం నుంచి వైదొలగడం భూమితోను దాని ఆత్మతోను మీరు సమంగా స్పందించడమే శ్రమించడం పని చేసేటప్పుడు మీరు వేణువులు ఆ వేణువుల ఎదలలో కాలపు గుసగుసలు సంగీత స్వరాలుగా మారుతాయి సమస్త చరాచరం సమకృతిలో కలిసి పాడుతూ ఉంటే మీలో ఎవరు మాత్రం కదలక పలక ఉత్తరిల్లు లాగా పడి ఉంటారు పని ఒక శాపమని శ్రమించడం ఒక దురదృష్టం అని మీలో కొందరు ఎప్పుడూ అంటూ ఉంటారు కానీ నేనంటాను ఆదిలో భూదేవి కలలు కన్నప్పుడే మీరు ఒక పనికి నియమితులైనారు మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు ఆమె కనిన
(03:34) స్వప్నంలోని ఒక భాగం నెరవేర్చిన వారు అవుతారు మిమ్మల్ని మీరు పనిలో ప్రవేశపెట్టుకోవడమే జీవితాన్ని నిజంగా ప్రేమించడం శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం నిగూడమైన జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం కానీ జన్మించుటే పాపం దేహ పోషణే నుదుట రాసిన శాపం అని మీరు బాధల్లో ఉన్నప్పుడు అనుకుంటే నుదుటి శ్రమతో తలరాత కడగవచ్చు అని నేను అంటాను జీవితం అంధకారమయం అని అలసని వారు మీతో అన్న మాట అది మీరు అలసటగా ఉన్నప్పుడు ఆ మాట మీలో ప్రతిధ్వనిస్తుంది ప్రేరణ లేకపోతే జీవితం నిశ్చయంగా అంధకారమయం జ్ఞానం లేకపోతే ప్రేరణ అంతా గుడ్డిదే అవుతుంది శ్రమ పడకపోతే జ్ఞానమంతా వ్యర్థం
(04:34) ప్రేమ లేకపోతే శ్రమ అంతా శూన్యం మీరు ప్రేమతో పని చేస్తున్నప్పుడు మీరు మీతోను ఇతరులతోను మరియు దేవునితోను సత్సంబంధం కలిగి ఉంటారు ప్రేమతో పని చేయడం అంటే హృదయ తంతువుల్ని దారాలుగా తీసి బట్టగా నేసి దాన్ని తమ ప్రియతముడు ధరిస్తాడని అనుకొని పని చేయడం అనురాగంతో గృహ నిర్మాణం చేసి అందుకు తమ ప్రియతముడు నివసిస్తాడని అనుకొని శ్రమించడం ఆప్యాయతతో విత్తనాలు చల్లి ఆనందంతో పంట కోస్తే ఆ ఫలసాయాన్ని తమ ప్రియతముడు అనుభవిస్తాడని అనుకొని కష్టించడం మనసంతటితో రూపొందించిన వాటిని ఆత్మ చైతన్యంతో నింపడం అన్ని ఆయన ఆధీనంలో ఉంచడం మృతి చెందిన మహాత్ములందరూ మీ చుట్టూ నిలబడి
(05:33) మిమ్మల్ని పరిశీలిస్తున్నారు అనుకోవడం తాను చెక్కే చలువురాయిలో తన ఆత్మ స్వరూపాన్ని దర్శించే శిల్పి పొలం దున్నే వాని కన్నా ఘనుడని ఇంద్ర ధనస్సులో వర్ణాల్ని మనసులో గట్టిగా నిలుపుకొని వాటిని నారగొడ్డపై మానవాకృతిలో చిత్రించేవాడు చెప్పులు కుట్టే వాని కన్నా ఘనుడని తరచు మీరు కలలో పలవరించినట్లు అనడం నేను విన్నాను కానీ నేను అంటాను నిద్రపోతూ కాదు మేల్కొన్న కేంద్రీకృతమైన జాగృతిలోంచి అన్నిటికన్నా అతి అల్పమైన గడ్డి పరకలను ఉపేక్షించి బ్రహ్మాండమైన ఓక్ వృక్షాలతో గాలి అతి మధురంగా మాట్లాడదని గాలి గుసగుసలను ఎంతో ప్రేమతో మధుర స్వరాలుగా మలచగలిగిన వాడే ఘనుడని కూడా
(06:26) అంటాను రూపొందిన ప్రేమే పని ఉపేక్ష భావంతో రొట్టె కాలిస్తే అది చేదై సగం ఆకలిని చంపేస్తుంది అయిష్టంతో ద్రాక్షరసం పిండితే అది విషపూరితం అవుతుంది ప్రేమ రహితంగా పని చేయడం కన్నా ఆ పనిని వదిలేసి దేవాలయం వద్ద కూర్చొని సంతోషంతో పని చేసిన వారు ఇచ్చే భిక్ష తీసుకోవడం నయం సంగీతాన్ని ప్రేమించకుండా గంధర్వుడిలా పాడిన ఆ పాట రాత్రింబవల్లు వచ్చే దివ్య నాదాల నుంచి మనిషి చెవులకు మూత వేయడమే [సంగీతం] అవుతుంది ప్రేమ మార్గం కఠినమైన నిటారైనా అది సంజ్ఞ చేయగానే మీరు దాన్ని అనుసరించండి దాని రెక్కల మధ్య ఉన్న కత్తి
(07:31) మిమ్మల్ని గాయపరిచిన అది రెక్కలు విప్పగానే మీరు దాని వశమైపోండి శిశిరం తోటనంతటిని ధ్వంసం చేసినట్లు ప్రేమవాని మీ కలల్ని తునాతునకులు చేసిన అది మీతో సంభాషించినప్పుడు మీరు దాన్ని విశ్వసించండి ప్రేమ మిమ్మల్ని పట్టాభిషిక్తుల్ని చేసినట్లే అది మిమ్మల్ని సిలువ కూడా వేయిస్తుంది అది మీ పురోభివృద్ధికి తోడ్పడుతున్నట్లే మిమ్మల్ని నశింపజేయడానికి సిద్ధమవుతుంది అది మీ ఔన్నత్యం పైకి అగసి సూర్యకాంతిలో చలించే మీ మృదు అధరాన్ని చుంబించినట్లే కిందికి దిగి భూమిని గట్టిగా అంటి పెట్టుకున్న మీ పాదాలను [సంగీతం] ఊపేస్తుంది పండిన ధాన్యం కంకుల్ని కోసి
(08:30) కొప్పగా పోసినట్లే ప్రేమ మిమ్మల్ని తన దగ్గరకు తీసుకుంటుంది ధాన్యాన్ని రాలగొట్టినట్లు ప్రేమ మిమ్మల్ని బంధ విముక్తులను చేస్తుంది మీరు సహజ స్వభావులుగా ఉండాలని మిమ్మల్ని సంపూర్ణ స్వేచ్ఛాపరులను చేయాలని ధాన్యాన్ని దంచినట్లు ప్రేమ మిమ్మల్ని దంచి పొట్టంతటనే చిరుగుతుంది మీరు సాధు స్వభావులుగా ఉండాలని ప్రేమ మిమ్మల్ని బాగా కలిపి దగ్గరగా చేరుస్తుంది దేవతా నైవేద్యానికి పనికి వచ్చే పవిత్ర పదార్థంగా మిమ్మల్ని తయారు చేయాలని తన పవిత్ర అగ్నికి మిమ్మల్ని ఆహుతి చేస్తుంది మీ హృదయ రహస్యాలు మీరు తెలుసుకునేందుకు ప్రేమ ఇవన్నీ చేస్తుంది మీకోసం ఆ సంగతులన్నీ తెలుసుకున్న మీరు
(09:30) అనుభవ జ్ఞానంతో జీవన హృదయంలో ఒక భాగం అవుతారు మీరు మీ భయాల వల్ల ప్రేమ నుంచి శాంతిని సంతోషాన్ని వెతుకుతారు సహజత్వాన్ని మూసుకోవడం కన్నా ప్రేమ ప్రాంగణం దాటి వెళ్ళిపోవడం నయం మీరు అలా దాటి వెళ్లి క్రమరహిత ప్రపంచంలో నవ్వుతారు కానీ మీ నవ్వంతటిని నవ్వలేరు ఏడుస్తారు కానీ మీ ఏడుపు అంతటనే ఏడవలేరు ప్రేమ తనను తప్ప మరేమీ ఇవ్వలేదు ప్రేమ ప్రేమను తప్ప మరి దేని నుంచి ఏదీ తీసుకోదు ప్రేమ స్వయం పరిపూర్ణం ప్రేమకు ప్రేమ చాలు మీరు ప్రేమించినప్పుడు ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు అనడం కన్నా ఈశ్వర హృదయంలో నేను ఉన్నాను అనడం ఉత్తమం ప్రేమకు మార్గం చూపి
(10:32) నడపగలను అనుకోకండి మీరు యోగ్యులని ప్రేమ గుర్తిస్తే అదే మీకు దారి చూపి నడుపుతుంది తనను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం లేదు మీరు ప్రేమిస్తే ఆ ప్రేమకు అనుగుణంగా మీలో కొన్ని కోరికలు కలిగితే అవి రాత్రివేళ మధురంగా పాడేందుకు కరిగి పరిగెత్తే సెలయేరుగా మారాలని అతి సుకుమారకు బాధను అర్థం చేసుకోవాలని ప్రేమానుభవంతో గాయపడాలని సంకల్పంతో సంతోషంతో రక్తం కార్చాలని తెరుచుకున్న హృదయ కవాటంతో ఉదయం మేల్కోవాలని ప్రేమించడానికి మరో రోజు లభ్యమైనందుకు ధన్యవాదాలు అర్పించాలని ప్రేమ పారవశ్యంలో మధ్యాహ్న వేళ విశ్రాంతిగా ఉండాలని అని సూర్యాస్తమయ
(11:32) వేళ కృతజ్ఞతతో ఇల్లు చేరాక ప్రియతముని కోసం హృదయంలో ప్రార్థిస్తూ పెదవులపై స్తుతి గీతాలు ఆలపిస్తూ నిద్రించాలని [సంగీతం] కోరుకోండి ఆద రహిత విషాదమే ఆనందం ఏ బావిలో నుంచి మీ నవ్వులు పెళ్లి బుక్కుతాయో ఆ బావే అప్పుడప్పుడు మీ కన్నీళ్లతో నిండుతుంది అది అట్లా కాకపోతే మరి అట్లా సంభవం దుఃఖం మిమ్మల్ని లోలోపలికి తొలిచే కొద్దీ మీరు మరింత పరమానందాన్ని అనుభవిస్తారు మీ మధుపాత్ర కుమ్మరి వాని కొలుములో కాలినదే కదా మీ ఆత్మను ఉపశమింపజేసే వీణ ఉలితో తొలచబడిందే
(12:37) కదా ఆనందంగా ఉన్నప్పుడు అంతరాత్మలోనికి చూసుకోండి ఏదైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుందో అదే మీకు ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుంటారు దుఃఖంతో ఉన్నప్పుడు మీ హృదయాంతరాలంలోనికి చూసుకోండి చెప్పాలంటే మీరు సంతోషం పొందడానికి ఏదైతే కారణం అవుతుందో దాని కోసమే మీరు విలపిస్తారని తెలుసుకుంటారు [సంగీతం] దుఃఖం కన్నా ఆనందం గొప్పదని మీలో కొందరు అంటారు కాదు దుఃఖమే గొప్పది అంటారు మరికొందరు కానీ ఆ రెండు అభేద్యమైనవని నేను అంటాను ఆ రెండు ఎప్పుడూ కలిసే వస్తాయి ఒకటి మీ సహపంక్తిని భోజనానికి కూర్చుంటే రెండోది మీ సయ్యపై నిద్రిస్తూ ఉంటుందని మర్చిపోకండి త్రాసులోని సిబ్బెలు మాదిరిగా
(13:43) మీరు సుఖ దుఃఖాల మధ్య వేలాడుతూ ఉంటారు సుఖ దుఃఖాలు అనేవి లేనప్పుడే మీరు స్థిరంగా నిశ్చలంగా ఉంటారు సకల ఐశ్వర్య ఈశ్వరుడు తన వెండి బంగారాల్ని తోచుకోవడానికి మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీ సుఖ దుఃఖాలు క్రిందా మీదలు అవుతాయి ఖలీల్ జిబ్రాన్ [సంగీతం] ఓటమి ఓ నా ఓటమి నీవు నా ఏకాంతానివి మరియు నా వైరాగ్యానివి వెయ్యి విజయాల కంటే నువ్వు నాకు ప్రియమైన దానివి మరియు ప్రపంచ కీర్తి కంటే నా హృదయానికి మధురమైన దానివి [సంగీతం]
(14:48) ఓటమి ఓ నా ఓటమి నీవు నా ఆత్మ జ్ఞానానివి నేను ఎదుర్కొనే నా ధిక్కరనివి వేగంగా చురుకుగా అడుగులు వేస్తూ ముందుకు సాగే యవ్వనం ఇంకా నాలో ఉన్నదని నీ ద్వారా నాకు తెలుసు కాలానికి నిలవలేని విజయాల వలలో చిక్కుకో రాదని నీ ద్వారా నేను తెలుసుకున్నాను ఈ ప్రపంచం చేత విస్మరించబడడం లో విమర్శించబడడంలోనూ తద్వారా ఏకాంతాన్ని ప్రేమించడంలోనూ ఉన్న మాధుర్యాన్ని నీ వలననే నేను గ్రహించాను ఓటమి ఓ నా
(15:51) ఓటమి నన్ను కాపాడే ఖడ్గానివి మరియు డాలువు నీవే సింహాసనాన్ని ఆశించడం అంటే బానిసత్వాన్ని కోరుకోవడమేనని ఇతరులను అర్థం చేసుకోవడం అంటే వారి హృదయానికి దగ్గర కావడమేనని నీ నుండి నేను [సంగీతం] గ్రహించాను పండిన పండ్లు నేలపై రాలినట్లు గ్రహించడం అంటే ఒకరి సంపూర్ణతను చేరుకోవడమనే నీ కనులలో నేను చదివాను ఓటమి ఓ నా ఓటమి నీవు నా ధైర్య సహచరుడివి నా గీతాలు మరియు నా ఏడుపులు మరియు నా నిశ్శబ్దాలను నీవు మాత్రమే [సంగీతం]
(16:57) వింటావు నీవు తప్ప మరెవరు రెక్కల చప్పుడు గురించి సముద్రాల ఆర్తి గురించి రాత్రిపూట మండే పర్వతాల గురించి నాతో సంభాషించరు ఓటమి ఓ నా ఓటమి మరణం అంటే ఎరుగని మొండి ధైర్యమా నువ్వు నేను కలిసి పెను ఉప్పెనలో పరిహసించుకుందాం మనలో చనిపోయే వారందరికీ మనం ఇరువురం కలిసి సమాధులు తవ్వుదాం ప్రేమకు మరో ఉద్దేశ్యం లేదు దృఢమైన చిత్తంతో సూర్యకాంతిలో ప్రజ్వలిస్తూ ప్రమాదానికి ప్రమాదంలా నిలువున [సంగీతం] నిలుద్దాం ఖలీల్ జిబ్రాన్ మీరు మీతో పాటు నవ్విన వ్యక్తిని
(18:13) మర్చిపోతారేమో కానీ మీతో పాటుగా ఏడ్చిన వ్యక్తిని ఎన్నటికీ [సంగీతం] మర్చిపోలేరు కలయకకు మరొక రూపమే జ్ఞాపకం ఉన్న మరొక రూపం [సంగీతం] మర్చిపోవడం మనలో నిజమైన సుగుణాలు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటాయి మనం అలవర్చుకున్న సుగుణాలు మాత్రం వసపెట్టల్లా వాగేస్తూ ఉంటాయి ప్రేమకు మార్గం చూపి నడపగలను అనుకోకండి మీరు యోగ్యులని ప్రేమ గుర్తిస్తే అదే మీకు దారి చూపి నడుపుతుంది తనను తాను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం లేదు ఎటువంటి భయాన్నైనా మీరు
(19:22) తోసేయాలనుకుంటే ఆ భయం యొక్క ఆసనం మీ హృదయంలోనే ఉంది కానీ భయపెట్టేవారు చేతిలో లేదు అని గ్రహించాలి మీ మోహావేశానికి మీ తృష్ణకు వ్యతిరేకంగా మీ వివేకం మీ న్యాయ నిర్ణయం యుద్ధం చేయడం వల్ల తరచు మీ ఆంతర్యం రణరంగంగా మారుతూ [సంగీతం] ఉంటుంది మీ పిల్లలు మీ పిల్లలు కారు వారు మీ ద్వారా ఆవిర్భవిస్తారే కానీ మీ నుంచి కాదు వారు మీతో ఉన్న మీకు సంబంధించిన వారు కారు [సంగీతం] నిజం చెప్పాలంటే జీవితానికి జీవితమే ఇస్తుంది దానం మీరు దానపరులు అనుకుంటారు కానీ మీరు
(20:30) కేవలం సాక్షులు [సంగీతం] మాత్రమే ఆనందంగా ఉన్నప్పుడు మీ ఆంతర్యంలోనికి చూసుకోండి ఏదైతే మీకు దుఃఖాన్ని కలిగిస్తుందో అదే మీకు ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుంటారు మీరు సంతోషం పొందడానికి ఏదైతే కారణం అవుతుందో దాని కోసమే మీరు విలపిస్తున్నారు [సంగీతం] ఒక గురువు తన విశ్వాసాన్ని ప్రేమను శిష్యులకు ఇవ్వగలడేమో కానీ తన జ్ఞానాన్ని మాత్రం ఇవ్వలేడు వివేకవంతుడైన గురువు అయితే వారిని తన జ్ఞాన మందిరంలో ప్రవేశించమని ఆజ్ఞాపించడు కానీ వారిని వారి మానసిక ప్రాంగణం వరకు నడిపించుకొని [సంగీతం] పోతాడు మీ మీ ఆలోచనలతో మీరు శాంతంగా లేనప్పుడు మాటల్లో
(21:34) దిగుతారు మీరు మీ హృదయపు ఏకాంతమందు ఒంటరిగా ఎక్కువ సేపు నిలవలేనప్పుడు మీరు మీ పెదవుల్లో నివసిస్తారు శబ్దం అంటే మీకు ఒక వేడుక [సంగీతం] వినోదం సౌందర్యమే జీవితం తన దివ్యమైన వదనం మిడిముసుగును తొలగించిన జీవితమే సౌందర్యం కానీ మీరే ఆ జీవితం మీరే ఆ ముసుగు తనను తాను అద్దంలో చూసుకునే దివ్యత్వమే సౌందర్యం కానీ మీరే ఆ దివ్యత్వం మీరే ఆ అద్దం మీరు మృత్యువు రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు దాన్ని మీ జీవన హృదయంలో వెతకకపోతే ఇంకెట్లా కనుక్కోగలరు నేను సత్యాన్ని కనుక్కున్నాను
(22:41) అనడం కన్నా నేను సత్యాన్ని కనుక్కున్నాను అని అనడం నయం నేను ఆత్మ మార్గాన్ని కనుక్కున్నాను అనడం కన్నా నా మార్గాన నడుస్తున్న ఆత్మను కలుసుకున్నాను అని అనడం నయం మనసు ముక్కలైతేనే దాన్ని తెరవడం సాధ్యమవుతుంది నేను మాట్లాడే వారి నుండి మౌనం అసహనం నుండి సహనం మరియు దయ లేని వారి నుండి దయ నేర్చుకున్నాను ఇంకా విచిత్రం నేను ఆ గురువులకు కృతజ్ఞత లేని వాడిని [సంగీతం] ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మరియు మనస్సును అర్థం చేసుకోవడానికి అతను ఇప్పటికే ఏమి సాధించాడో చూడకండి కానీ అతను ఏమి కోరుకుంటున్నాడో
(23:49) చూడండి మన సంతోషాలు మరియు బాధలను మనం అనుభవించక ముందే ఎంచుకుంటాం జీవితానికి తన హృదయపు లోతుల్ని పాటగా పాడే గాయకుడు దొరకనప్పుడు అది తన మనసును విప్పి చెప్పడానికి ఒక తాత్వికున్ని సృష్టిస్తుంది నీ నోటి నిండా ఆహారం ఉన్నప్పుడు స్వరమెత్తి ఎలా పాడగలుగుతావు చేతి నిండా బంగారం ఉన్నప్పుడు చెయ్యి ఎత్తి ఎలా దీవించగలుగుతావు [సంగీతం] ఆకాశంపై భూమి రాసే కవితలే చెట్లు మనమేమో ఆ చెట్లను నరికేసి కాగితాలుగా మార్చేస్తున్నాం అవి మాత్రం మనలో డొల్లతనాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాయి మనుషులు తమ హృదయాల్ని
(24:58) ఆత్మాభిమానాన్ని చంపుకొని సిగ్గు విడిచి మీ ముందు నిలిచి అర్ధించారంటే అసలు మీరు ఎవరో మీరు [సంగీతం] తెలుసుకోండి మీ నగ్న పాద స్పర్శ పుడమి తల్లికి పులకరింపుని గాలి మీ ముంగురులతో ఆడుకోవడానికి ఆశపడుతుందని మీరు మర్చిపోకండి [సంగీతం] గుడి పునాది రాయి కన్నా మూర్తిగా మలిచిన మూలస్థానం రాయి గొప్పది కాదు [సంగీతం] ఖలీల్ జిబ్రాన్ [సంగీతం]
No comments:
Post a Comment