బాడీ షేమింగ్ - వేమన పద్యం - విశ్లేషణ - స్త్రీలకు మాత్రమే? Vemana padyalu with meaning
https://youtu.be/4iN9ZzUWs8w?si=Gf2v2SZkESNTCDJ8
https://www.youtube.com/watch?v=4iN9ZzUWs8w
Transcript:
(00:00) నటుడు శివాజీ స్త్రీల వస్త్రధారణ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదస్పదమైనాయి. మరి ఆయన వ్యాఖ్యలకి వేమడ పద్యానికి సంబంధం ఏంటి? కొంతకాలం క్రితం గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు కూడా తమ ప్రవచనాలలో స్త్రీల వస్త్రధారణ గురించి కొన్ని వివాదస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకి వేమన పద్యానికి సంబంధం ఏంటి? దీఘ్నో కి స్వాగతం దిగ్నాశోకిస్వాగతం నమస్కారం ది నాగరాశ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం స్త్రీ వ్యామోహం అనేది అన్నిటికంటే బలమైనది.
(00:41) గొప్ప తపస్సు చేసే యతులు సైతం ఆశకు లోనై తమ మార్గాన్ని మర్చిపోతుంటారు. అయితే ఏ వస్తువునైనా లేదా ఏ వ్యక్తిని చూసినప్పుడు ఆకర్షణకు లోని కాకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తన లక్ష్యం వైపు సాగిపోయేవారే నిజమైన శుద్ధాత్ములు అంటాడు భీమనగారు. అట్లాగే మరో పద్యంలో అందమైన స్త్రీలను చూసినప్పుడు అపారమైన ధన కనక వస్తు వాహనాలను చూసినప్పుడు రుచికరమైన షడ్రసోపేయుతమైనటువంటి భోజనాన్ని చూసినప్పుడు ఎంతటి గొప్పవారికైనా మనసులో కోరిక కలగడం సహజం అంటాడు వేమన గారు మరో పద్యంలో ఆడుపాపజాతి అన్నిటికంటెను ఆశ చేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందును విశ్వదాభిరామ వినురవేమ
(01:22) పద్యం అద్భుతంగా ఉంది కదా మరొక్కసారి విందాం ఆడు పాపజాతి అన్నిటికంటెను ఆశ చేతయతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములెందును విశ్వదాభిరామ వినునవేమ ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా ఏంటంటే స్త్రీ వ్యామోహం అనేది అన్నిటికంటే బలమైనది. ఇక్కడ పాపజాతి అంటే స్త్రీలు చెడ్డవారని కాదు వారిపై కలిగే అతి వ్యామోహం మనిషిని దారి తప్పిస్తుందని అర్థం.
(01:50) గొప్ప తపస్సు చేసే యతులు సైతం ఆశకు లోనై తమ మార్గాన్ని మర్చిపోతుంటారు. అయితే ఏ వస్తువునైనా లేదా వ్యక్తిని చూసినప్పుడు ఆకర్షణకు లోను కాకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తన లక్ష్యం వైపు సాగిపోయేవారే నిజమైన శుద్ధాత్ములు అంటాడు వేమన గారు. నటుడు శివాజీ ఒక సందర్భంలో బిగ్ బాస్ వంటి షోలలో లేదా ఇంటర్వ్యూలలో స్త్రీల శరీర ఆకృతి లేదా దుస్తువుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో వివాదస్పదమయ్యాయి.
(02:16) ఈ పద్యాన్ని ఆ ఉదంతంతో పోల్చి మనం ఇట్లా విశ్లేషించుకోవచ్చు. వేమణ పద్యంలో చూచి విడుచువారు అనే పదం చాలా ముఖ్యం అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి రూపంపై విమర్శలు చేయకుండా లేదా వ్యామోహ పడకుండా ఉండడం శివాజీ వ్యాఖ్యలు బాడిషమింగ్ అంటే శరీర ఆకృతిని విమర్శించడం కిందికి వస్తే అది వేమన చెప్పిన శుద్ధాత్మ లక్షణానికి విరుద్ధమైనది. యతులు సైతం మోసపోతారని వేమన చెప్పడం ద్వారా మనిషి తన చూపును ఆలోచనను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.
(02:48) ఎదుటివారి శరీర అవయవాల గురించి లేదా ఆకృతి గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది ఒక రకమైన అపరిపక్వతను సూచిస్తుంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఒక వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కానీ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నవారు బాడీ షేమింగ్ చేయడం వల్ల అది ఇతరుల పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. వేమన గారు చెప్పినట్లు చూచి విడిచిపెట్టడం అంటే జడ్జ్ చేయకుండా వదిలి పెట్టడం నేటి కాలానికి ఎంతో అవసరం.
(03:16) నేడుఇస్గ్రఫేస్బ వంటి మాధ్యమాలలో కేవలం బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల యువత బాడీ షేమింగ్ కు గురవుతున్నారు. వేమన చెప్పినట్లు రూపంపై ఆశ పెంచుకోవడం లేదా దాని గురించి విమర్శించడం రెండు మానసిక బలహీనతలే. స్త్రీని ఒక వస్తువులా చూడడం అనేది నేటికి పెద్ద సమస్య. వేమన ఈ పద్యం ద్వారా పురుషులకు చెప్పేది ఏంటంటే చూపులో దోషం ఉండకూడదు మనసును నిర్మలంగా ఉంచుకోవాలి.
(03:46) అంటే అధికారం మేధస్సు ఉన్నవారు కూడా చిన్నపాటి ప్రలోభాలకు లోనై తమ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది నేటి రాజకీయ సినీ రంగాల్లో మనం తరచుగా చూస్తున్నాం. ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ పద్యం కేవలం స్త్రీల గురించి కాదు అది ఒక వ్యక్తి యొక్క మానసిక పరిణతి గురించి చెబుతుంది. అందం లేదా ఆకర్షణ అనేది తాత్కాలికం.
(04:06) దాన్ని చూసి మురిసిపోవడం లేదా విమర్శించడం మానేసి మన పనిపైన మనం దృష్టి పెట్టాలి. ఎదుటివారి శరీర ఆకృతిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. చూచి విడుచుట అంటే విమర్శించకుండా గౌరవించడం అని కూడా అర్థం చేసుకోవచ్చు. కోరికలు లేదా వ్యామోహాలు మనిషిని పతనానికి దారితీస్తాయి. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడే అసలైన గొప్పవాడు. బాహ్య ప్రపంచాన్ని మార్చడం కంటే మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడం ముఖ్యం.
(04:31) వేమన చెప్పినట్లుగా బాహ్య సౌందర్యం పట్ల విపరీతమైన ఆశ లేదా దానిపైన అనవసరమైన విమర్శలు మనిషిని దిగజారుస్తాయి. ప్రతి వ్యక్తిని ఒక మనిషిగా గౌరవిస్తూ మనసును వికారాలకు లోను కాకుండా ఉంచుకోవడమే శ్రేష్కరం ఆడువారి గన్న నర్థంబు పొడగన్నా సారమైన రుచుల చవుల గన్న నయ్యగాండ్రకైన నాశలు పుట్టవా విశ్వదాభిరామ వినరవేమ ఈ పద్యం చాలా గొప్పగా ఉంది అద్భుతంగా ఉంది మరొకసారి విందాం.
(04:59) ఆడువారి గన్న నర్థంబు పొడగన్న సారమైన రుచులు చవులు గన్న నయ్యగాండ్రకైన నాశలు పుట్టవా విశ్వదాభిరామ విడరవేమ అందమైన స్త్రీలను చూసినప్పుడు అపారమైన ధన కనక వస్తు వాహనాలను చూసినప్పుడు రుచికరమైన షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని చూసినప్పుడు ఎంతటి గొప్పవారికైనా అంటే అయ్యగానండ్రరు అంటే పండితులు లేదా జితేంద్రియులైనటువంటి పురుషులు మనసులో కోరికలు కలగడం సహజం ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలోని ఆక ఆకర్షణలకు లోను కావడం మానవ నైజమని వేమన గారు ఈ పద్యం ద్వారా తెలియపరుస్తున్నారు.
(05:32) ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి లక్ష్మీ నరసింహారావు గారు అనేక సందర్భాల్లో స్త్రీల వస్త్రధారణ బాడీ షేమింగ్ అంటే ముఖ్యంగా శరీరా ఆకృతిని ప్రదర్శించేలా ఉండేటటువంటి దుస్తువుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో వివాదస్పదమైనాయి. వేమన పద్యం చూసినప్పుడు ఆశ పుట్టడం సహజం అని చెబితే గరికపాటి గారు ఆ ఆశ పుట్టడానికి కారణమయ్యేలా ప్రేరేపించేలా ప్రవర్తించకండి అని స్త్రీలకు సూచిస్తున్నారు.
(06:00) గరికపాటి గారి వాదన ప్రకారం మనిషి మనసు చంచలమైంది. వేమన గారు చెప్పినట్లు కాబట్టి పురుషుల మనసు వికలం అవ్వకుండా ఉండాలంటే స్త్రీలు తమ వస్త్రధారణలో ప్రవర్తనలో హుందాతనాన్ని పాటించాలని ఆయన అంటారు. అయితే ఆధునిక సమాజంలో దీనిని బాడీ షేమింగ్ గా లేదా విక్టిం బ్లేమింగ్ గా అంటే బాధిత పక్షాన్నే తప్పుపట్టడంగా కొందరు చూస్తారు. వేమల పద్యం ఒక సత్యాన్ని చెబితే గరికపాటి గారు ఆ సత్యం నుంచి తప్పించుకోవడానికి నియమాన్ని సూచిస్తున్నారు.
(06:30) నేటి సమాజంలో ఆకర్షణలు పెరిగాయి. సోషల్ మీడియా గ్లామర్ ప్రపంచం వేమన చెప్పిన ఆశలను మరింత ప్రేరేపిస్తున్నాయి. ఈ క్రమంలో స్త్రీ పురుషుల బాధ్యతలను ఇట్లా విశ్లేషించుకోవచ్చు. వేమన చెప్పినట్లు ఆశ పుట్టడం సహజం కానీ దాన్ని నిగ్రహించుకోవడం పురుషుడి సంస్కారం ఎదుటివారిని వస్తువుగా కాక వ్యక్తిగా చూడాలి. ఇది పురుషుల బాధ్యత.
(06:55) ఇక స్త్రీల బాధ్యత సమాజంలో తన గౌరవానికి భంగం కలగకుండా సందర్భోచితమైనటువంటి వస్త్రధారణ మరియు ఆత్మగౌరవంతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది స్త్రీల బాధ్యత. చూపులో దోషం లేకుండా చూసుకోవడం ఒకరు ఎలా ఉన్నా తన మనసును అదుపులో ఉంచుకోవడమే అయ్యగారి అంటే గొప్ప వ్యక్తి యొక్క లక్షణం ఇది పురుషుల బాధ్యత తన స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బందిగా మారకుండా సమాజంలోని సంప్రదాయాలను వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకోవడం ఇది స్త్రీల బాధ్యత స్త్రీల భాషేమింగ్ చేయకుండా వారి శారీరక ఆకృతిపై అసభ్య వ్యాఖ్యలు చేయకుండా ఉండడం కనీస ధర్మం ఇది పురుషుల బాధ్యత బాహ్య సౌందర్య కంటే అంతర్గత వ్యక్తిత్వానికి
(07:37) ప్రాధాన్యతను ఇస్తూ యువతకు ఆదర్శంగా నిలబడడం ఇది స్త్రీల బాధ్యత. వేమణ మధ్యం పురుషుడి బలహీనతను ఎత్తిచూపింది. దాన్ని అంగీకరిస్తూనే ఆధునిక పురుషుడు ఆ బలహీనతలను జయించాలి. ఆమె ఇలా ఉంది కాబట్టే నా మనసు పాడైంది అనడం పలాయనవాదం. మనసును నియంత్రించుకోవడం అనేది పురుషుడి ప్రాథమిక బాధ్యత. సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పకుండా ఉండాలి.
(08:04) ఇక్కడ స్త్రీల బాధ్యత గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ద ఓనర్స్ ఆన్ వమెన్ స్త్రీలకు స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతయుతంగా ఉండాలి. గరికపాటి వారి వంటివారు చెప్పే మాటల్లోని కఠినత్వాన్ని పక్కన పెడితే అందులోని ముందస్తు జాగ్రత్త అనే అంశాన్ని మనం గమనించాలి. సమాజంలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకునేలా ప్రవర్తించడం అనేది వివేకం.
(08:30) వేమన పద్యం ఒక యదార్థాన్ని మన ముందు ఉంచింది. ఆ యదార్థాన్ని ఎదుర్కోవడానికి మనకు కావలసింది సంస్కారం ధనం కామం ఆహారం ఈ మూడింటిపై అతి వ్యామోహం మనిషిని పతనానికి దారి తీస్తుంది. స్త్రీ తన పరిధిని పురుషుడు తన చూపును సరిచేసుకున్నప్పుడు సమాజంలో బాడీ షేమింగ్ లేదా వేధింపులకు తా ఉండదు. ఇంద్రియ నిగ్రహం కేవలం మునులకు మాత్రమే కాదు సామాన్యులకు కూడా అవసరంని మనం గుర్తించాలి.
(09:00) ఆశ పుట్టడం ప్రకృతి సిద్ధమైతే ఆ ఆశను అదుపు చేయడం సంస్కృతి సిద్ధం గరికపాటి వారి మాటలు పురాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తే ఆధునిక కాలం వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్య సమతోలిత పాటించడం అనేది నేటి అవసరం. ఆడువారి గన్న నర్థంపు పుడగన్న సారమైన రుచులు జవులగన్న నయ్యగాండ్రకైన నాశలు పుట్టవా విశ్వదాభిరామ వినురవేమ అందమైన స్త్రీలను చూసినప్పుడు అపారమైన ధన కనక వస్తు వాహనాలను చూసినప్పుడు రుచికరమైన షడ్రసోపేదమైన భోజనాన్ని చూసినప్పుడు ఎంతటి గొప్పవారికైనా మనసులో కోరికలు కలగడం సహజం ఆడు పాపజాతి ఎన్నిటికంటెను ఆశ చేతయతులు మోసపోరే చూచి విడుచువారు
(09:45) శుద్ధాత్ములెందును విశ్వదాభిరామ వినురవేమ స్త్రీ వ్యామోహం అనేది అన్నిటికంటే బలమైనది. గొప్ప తపస్సు చేసే యతులు సైతం ఆశకు లోనై తమ మార్గాన్ని మర్చిపోతుంటారు. అయితే ఏ వస్తువునైనా లేదా వ్యక్తిని చూసినప్పుడు ఆకర్షణకు లోను కాకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తన లక్ష్యం వైపు సాగిపోయేవారే నిజమైన శుద్ధాత్ములు.
(10:11) మన వీడియో మీకు గాని బాగా నచ్చినట్లయతే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పంచుకుంటారని సవినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి శుభం భుయాత్
No comments:
Post a Comment