*వాళ్ళు!*
*******
సూద్రుల పేరుతో
మానవ శక్తిని
సర్వ నాశనం
చేసారు'వాళ్ళు'!
వేల యేండ్లు గా
ఇదేపనిలో'వాళ్ళు'
దేశాన్ని నాశనం
చేసే శిక్షణేవాళ్ళది!
క్రమశిక్షణలో'వాళ్ళు'
గొప్పవాళ్లంటాడు!
ఒక నటనాయకుడి
'ఉవాచ' విన్నారా?
మానవత్వం లేని
వివక్షల పనిలో
మతాంధులు'వాళ్ళు'!
అది క్రమశిక్షణట!
ఎలా అంటావు?
ఆలోచించావా?
చరిత్ర తెలీదా?
చదువు సోదరా!
లోకాయతులు
చార్వాకుల నుండి
ఫూలే అంబేద్కర్
వరకు చదువు!
అంబేద్కర్ బాధంతా
అదేకదా నాయకా!
ఆవేశంలో నువ్వు
సర్టిఫై చెయ్యకు!
వాళ్ళ క్రమశిక్షణ
దేశంకోసం కాదు!
అగ్రత్వం కోసం!
అది అహంకారం!
అహంకారమే కాదు
అమానుషత్వం!
అస్పృస్య తకు
కారణం 'వాళ్ళే'!
మనుషుల మధ్య
అంటరానితనం
ఇప్పటికీ 'వాళ్ళు'
కొనసాగిస్తున్నారు!
పదిరోజుల క్రితం
అస్సాం ముఖ్యమంత్రి
సూద్రులు తమకు
సేవలకే పుట్టారంటాడు!
నిన్నకాక మొన్న
అమిత్ షా అంబేద్కర్ను
కించపరచింది
ఎందుకనుకున్నావ్?
ఇవీ 'వాళ్ళ' పనులు
అది క్రమశిక్షణా?
సిగ్గుపడాలి మనం!
కాస్త ఆలోచించు!
వాళ్ళు మనదేశం
రావటం రావటం
ద్రవిడసంస్కృతిని
నాశనం చేశారు!
వివక్షలు లేని
మనలో మనకు
తక్కువ ఎక్కువలు
సృష్టించారు!
అవే నేటికీ మనల్ని
పట్టి పీడిస్తున్నాయి!
వాళ్ళ పద్మవ్యూహంలో
నువ్వూ ఇరుక్కున్నావ్!
ఈ పోరు ఏనాటిదో!
మనం వదలినా
వాళ్ళు వదలరు! అదే
వాళ్ళ క్రమశిక్షణ!
ఈ దేశం ఇలాగే
చాతుర్వర్ణాలతో
కులాలతో మతాలతో
కొట్టుకు చచ్చిపోవాలి!
వాళ్ళు మాత్రం
సూద్రుల సేవలతో
అగ్రతాంబూలంతో
పెత్తనం చేస్తారు!
ఏదో అనుకుంటే
ఏదో అయింది నువ్వూ
వాళ్ళ వలలో చిక్కి
నాశనమయ్యావు!
ఇంకా సమయం ఉంది
కాస్త ఆలోచించు!
చరిత్రబాగా చదువు!
తెలుస్తారు 'వాళ్ళు'!
********
(సూద్ర =ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇబీసీ, ఆదివాసీ + స్త్రీలంతా)
-- తమ్మినేని అక్కిరాజు
27-12-2024
( from Fb memory)
No comments:
Post a Comment