Monday, December 29, 2025

భార్యల అనారోగ్యానికి భర్తలే కారకులా?A shocking study ||Dr PrasadaMurthy

భార్యల అనారోగ్యానికి భర్తలే కారకులా?A shocking study ||Dr PrasadaMurthy

https://m.youtube.com/watch?v=ITI3Vgddhto


https://www.youtube.com/watch?v=ITI3Vgddhto

Transcript:
(00:01) మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి స్త్రీలు తాము ఎదుర్కొనేటటువంటి అనారోగ్యాలలో దాదాపు 90 శాతానికి కారణం కేవలం తమ శరీరాల్లో ఉండే లోపాలు లేదా శరీరాల్లో జరిగేటటువంటి ఏవేవో కారణాలు పరిణామాలు కాదు ఆ అనారోగ్యాలకు ఎక్కువగా కారణం తమ జీవన భాగస్వాములే తమ జీవన సహచరులే అంటే స్త్రీలు ఒప్పుకుంటారా అసలు ఈ విషయం చాలామందికి తెలుసా మిత్రులారా దీనికి సంబంధించి సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి ఒక రిపోర్టు నా చేతుల్లో ఉందండి.
(00:46) చూడండి ఇది వై ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఈస్ యన్ అండర్ రికగ్నైజడ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్ అనేది రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్ లో ఏముంది అనేి చాలా ఆశ్చర్యకరమైనటువంటి దిగ్భ్రాంతి కలిగించేటటువంటి ముఖ్యంగా మహిళలకే కాదు మహిళలతో పాటు ఈ సమస్త మానవ సమాజంలో సగభాగమైన పురుషులు కూడా దిగ్భ్రాంతి చెంది తమను తాము దోషులుగా ఎక్కడో ఒక చోట ఐడెంటిఫై చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రిపోర్ట్ కల్పిస్తుంది అన్నమాట సో ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్త మొత్తంగా చెప్పుకున్నాం మన వాళ్ళు ఏం చెప్పారు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నారు కదా
(01:41) అంటే స్త్రీలు ఎక్కడ సంచరిస్తే అక్కడ దేవతలు ఉన్నట్టే అని అబ్బా ఎంత గొప్ప మాట చెప్పారు మన వాళ్ళనో అనుకుంటాం మనం కానీ ఆ గొప్ప మాట చెప్పినటువంటి మహానుభావులే నా స్త్రీ స్వాతంత్ర అర్హతి అని కూడా చెప్పారు స్త్రీకి ఎలాంటి స్వాతంత్రయం లేదు చెయ్య మీద అంటే పక్క మీద రంభలాగా అన్నం తినిపించేటప్పుడు తల్లిలాగా సేవ చేసుకునేటప్పుడు బానిసలాగా సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలాగా ఉండాలి కాబట్టి ఇక ఆ స్త్రీకి స్వాతంత్రం అంటూ ఏమి లేదు అని చెప్పి కూడా మనవాళ్లే చెప్పారు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మొత్తం సౌత్ ఏషియాలో మహిళలు ముఖ్యంగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి మహిళలు
(02:27) ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలకు ప్రధానమైనటువంటి కారణము వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ వైలెన్స్ ఇది మనం డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటి మాట విన్నాం కదా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడము తన్నడము హింసకు గురి చేయడము ఇట్లాంటివి పైకి కనిపించేవి అన్నమాట అసలు తాము డొమెస్టిక్ వైలెన్స్ కి పాల్పడుతున్నాము అని అవతల వాళ్ళకి తెలియదు తాము డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతున్నామ అని ఇవతలి వాళ్ళకి తెలియదు ఒక అదృశ్యమైనటువంటి హింస మనలో సగభాగమైనటువంటి స్త్రీ జాతిని నానా రకాల నానా రకాల జబ్బులకు గురి చేసి వాళ్ళని ఒక రోజులో కాదు ఒక సంవత్సరంలో
(03:21) కాదు క్రమక్రమంగా క్రమక్రమంగా అనారోగ్యానికి వాళ్ళు కునారిల్లిపోయేటట్టు చేస్తూ ఉందన్నమాట ఇది ఈ రిపోర్ట్ చెప్తున్నది ఏమిటయ్యా అంటే నిజంగా తమ లైఫ్ పార్ట్నర్ ద్వారా తాము ఎదుర్కునేటటువంటి ఈ హింస ఏదైతే ఉందో అదృశ్య హింస అంటాం ఇన్విజిబుల్ విజిబుల్ విజిబుల్ వయలెన్స్ మనకు తెలుసు పోలీస్ కంప్లైంట్లు వస్తాయి అది వస్తాయి తగలబెట్టేసాడు అంటారు అది అంటారు ఇది అంటారు లేదా వాడికి హింస భరించలేక తాను తగలపెట్టుకోవడం ఇవన్నీ కూడా దెబ్బలు కొట్టడం పోలీసుల కంప్లైంట్ ఇవన్నీ కూడా పైకి కని కనిపించేటటువంటి దీస్ ఆర్ ఆల్ ద విజిబుల్ వైలెన్సెస్ కానీ
(04:03) ఇన్విజిబుల్ వైలెన్స్ ద్వారానే 90% మహిళలు అనారోగ్యానికి పాలవుతున్నారు గురవుతున్నారు అనేటటువంటిది ఈ రిపోర్టు ఈ రిపోర్టు ఎందుకు హెల్త్ కేర్ సిస్టం లో ఒక ఆ ఈ గృహ హింస అనేటటువంటిది ఇంటిమేట్ పార్ట్నర్ ద్వారా మహిళలు ఎదుర్కునేటటువంటి ఈ హింస మన హెల్త్ కేర్ సిస్టంలో లోనే ఒక ఆ పాఠ్యాంశంగా లేదా చాలా కీలకమైనటువంటి అంశంగా ఎందుకు చేరలేదు హెల్త్ కేర్ సిస్టమే పట్టించుకోలేదు అనేటటువంటిది ఈ మొత్తం ఓవరాల్ గా ఈ సర్వే చెప్తుందండి.
(04:44) ముందు ఈ సర్వే ఏం చెప్పింది అనేటటువంటిది చెప్పి దీనికి రెండు రకాల రెమిడీస్ ఉంటాయి. అవి ఏమిటి అనేటటువంటిది వీళ్ళు ఒకటే రెమిడీ గురించి మాట్లాడారు ఈ రిపోర్ట్ లో ఒకటి ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పినటువంటిది ఈ ఓవరాల్ గా తన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నాడో తన భర్త గాని తన సహచరుడు గాని ఇంటిమేట్ పార్ట్నర్ అతని ద్వారా తాను ఎదుర్కునేటటువంటి హింస ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటటువంటి జబ్బులు మానసిక లేదా శారీరక అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్మోకింగ్ ద్వారా లేదా ఒబెసిటీ స్థూలకాయం ద్వారా లేదా ఆల్కహాల్ యూసేజ్ ద్వారా వచ్చేటటువంటి జబ్బుల కంటే
(05:36) తీవ్రమైనటువంటి జబ్బులు వస్తున్నాయి అని ఈ స్టడీ కనుక్కున్నదండి ఇది ఏ స్టడీ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2023 మొత్తం సౌత్ ఏషియ షాలో ఉన్నటువంటి మహిళలందరి గురించి చెప్పి మన ఇండియాలో ముఖ్యంగా మహిళల మీద కూడా కేస్ స్టడీలు ఇచ్చారు. ఒక 34 ఇయర్స్ మహిళ హాస్పిటల్ కి వెళ్తుంది వాళ్ళఏదో రక్తహీనతకి లేదా యంజైటీ కి టాబ్లెట్స్ ఇస్తున్నారు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు వెళ్తున్నారు వస్తుంది లేదా గుండె దడ అంటుంది నిద్ర పట్టడం లేదు అంటుంది మైగ్రేన్ పెయిన్ అంటుంది విపరీతమైనటువంటి స్ట్రెస్ అంటుంది వాళ్ళు ఏవేవో టాబ్లెట్లు
(06:23) తీసి పంపించేస్తున్నారు అన్నమాట చాలా కాలానికి ఆమె విపరీతమైనటువంటి ఈ అనారోగ్యానికి గురైపోయిన తర్వాత ఒక జూనియర్ డాక్టర్ ఐడెంటిఫై చేసిందంట. ఆమె ఎదుర్కున్నటువంటిది ఏమిటయ్యా అంటే చాలా సంవత్సరాలుగా తన భర్త ద్వారా ఆమె ఆమెకు చాలా లాంగ్ హిస్టరీని అంతా కూడా జూనియర్ డాక్టర్ బయటకి తీస్తే తెలిసింది ఏమిటయ్యా అంటే చాలా సంవత్సరాలుగా ఆమె మీద ఫిజికల్ వైలెన్స్ జరుగుతా ఉంది.
(06:52) ఆమె ఎక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేదు బిడ్డలకు చెప్పుకోలేదు ఇరుగు పొరుగుకు చెప్పుకోలేదు స్నేహితులకు చెప్పుకోలేదు పోలీసులకు అసలే కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే చెబితే భర్త వదిలేస్తాడు పిల్లలు అన్యాయం అయిపోతారు ఎంతసేపు పిల్లలు పిల్లలు కడుపున పుట్టిన బిడ్డల కోసమే ఆలోచిస్తారు కాబట్టి మహిళలు సో ఆ ఆ దీర్ఘకాలికంగా జరుగుతున్న వైలెన్స్ మరిటల్ రేపు అంటే తన సమ్మతి లేకుండా తనను ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అనేటటువంటిది ఆ లైంగికమైన తన తృప్తిని తీర్చుకోవడం కోసం మగవాళ్ళు దుర్మార్గంగా అది కూడా ఒక రకమైనటువంటి బలాత్కారం లాగే అనుభవించడం అనేటటువంటిది పార్ట్నర్ యొక్క సమ్మతి లేదు
(07:30) పార్ట్నర్ యొక్క ఆనందంతో తృప్తితో తనకు సంబంధమే లేదు అన్నట్టుగా చేసేటటువంటి దాన్ని మరిటల్ రేప్ అంటాం. అలాగే ఎకనామిక్ కంట్రోల్ ఎకనామిక్ కంట్రోల్ ఆర్థికమైనటువంటి స్వాతంత్రం ఉండదు భర్త మీద ఆధారపడడం వాడు ఇస్తే తినడం లేకపోతే లేదు వస్తుండడం లేదా భర్త ఆ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి మొత్తం కుటుంబాన్ని అప్పుల పాలు చేసి కకావికలు చేస్తే అనివార్యంగా తాను ఏదో పనులు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా రకరకాల భయాలు ఆందోళనలు ఆమెకు ఉన్నాయి.
(08:04) ఆ కారణంగా ఆమెకు అనేక రకాలైనటువంటి మెంటల్ స్ట్రెస్ గాని ఫిజికల్ డిసార్డర్స్ గాని రకరకాలుగా కడుపు నొప్పి, వెన్ను నొప్పి రకరకాల తలనొప్పి ఇట్లాంటివన్నీ కూడా వచ్చి ఆమెకి ఇన్ని ఇన్ని అనారోగ్యాలు రావడానికి కారణం తన ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అని చెప్పి వీళ్ళు చెప్పి ఈ రిపోర్ట్ లో ఆ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చాలా సీనియర్ డాక్టర్లు వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమిటయ్యా అంటే మా వైద్యశాస్త్రం లో మాకు నేర్పింది ఏమిటయ్యా అంటే ఎవరైనా వస్తే వాళ్ళ సింటమ్స్ చూసి వాళ్ళకి మందులు ఇవ్వడం వరకే మాకు తెలుసు అదే నేర్పుతారు.
(08:47) కానీ ఈ ఈ మన దగ్గరికి వచ్చే రోగులు ముఖ్యంగా మహిళలు వాళ్ళు జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి స్ట్రెస్ ఏమిటి ఒత్తిడి ఏమిటి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి ఆ కోత ఏమిటి ఆ యాతన ఏమిటి ఆ వ్యతలు ఏమిటి కథలు ఏమిటి ఇవి డాక్టర్లు తెలుసుకోరు. సింటమ్స్ కి మందులు ఇస్తారు తప్ప ఆ సింటమ్స్ కి కారణాల్ని తెలుసుకొని ట్రీట్ చేయాలనేటటువంటిది వైద్యశాస్త్రంలో ఎక్కడ ఎప్పుడు చెప్పరు అని చెప్పేసి వాళ్ళు ఈ రిపోర్ట్ లో చాలామంది డాక్టర్స్ చెప్పారన్నమాట మిత్రులారా సో చాలామంది వెళితే మీకు షుగర్ కంప్లైంట్ ఉందని లేదా
(09:37) మీకు బీపి కంప్లైంట్ ఉందని లేదా మీకు తల తలనొప్పు మైగ్రేన్ నొప్పి ఉందని మీకు వెన్ను నొప్పి ఉందని బ్యాక్ పెయిన్ ఉందని నీ పెయిన్ ఉందని అరచేతుల్లో పెయిన్ ఉందని ఇట్లాగా రకరకాలు వాటికి మందులు ఇవ్వడం లేదా అన్నిటికీ ఒకటే మందులాగా ఒక మల్టీ విటమిన్ పడేసేయడం ఇచ్చేసేయడం ఇదే జరుగుతూ ఉంది.
(09:58) కానీ మోస్ట్ ఆఫ్ ది లేడీస్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ హోప్ వీళ్ళలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల్లో 99% వాళ్ళు సుదీర్ఘంగా జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి గృహింస ఇది పైకి కనిపించేటటువంటి గృహింస కాదు దీన్ని అయ్యా దీన్ని మీరు ఈ హెల్త్ కేర్ సిస్టం లో ఒక భాగాన్ని చేయాలి అని చెప్పి మొన్న లాస్ట్ మంత్ ఎక్కడ తిరువనంతపురంలో శ్రీ ఉత్తరాడం తిరునాల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జరిగినటువంటి ఒక పెద్ద కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది.
(10:41) సో ఈ డిస్కషన్ లో ఏమిటయ్యా అంటే ఇక ఈ ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేటటువంటిది అవుట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టం కాదు హెల్త్ కేర్ సిస్టం లో ఒక భాగాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక మహిళ డాక్టర్ దగ్గరికి వస్తే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వద్దాం ఇప్పుడు అర్థమైపోయింది కదా చాలా మంది చాలా జబ్బులతో ఆ బాధపడుతూ ఉంటారు వాళ్ళని భర్తలే తీసుకెళ్తూ ఉంటారు హాస్పిటల్కి కానీ ఆ భర్తకు తెలియదు తన ద్వారానే ఆమెకి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి ఆ భార్యకు కూడా తెలిీదు భర్తతో దానికి ఇన్ని బాధలు వచ్చాయి అని చెప్పేసి ఇదొక పెద్ద డ్రామా
(11:17) అన్నమాట సో దీన్ని ట్రీట్ చేసేటటువంటి సిస్టం ఉండాలి హెల్త్ కేర్ సిస్టం లోనే అసలు మనం మన వైద్య శాస్త్రంలోనే మొత్తం ఆ వైద్యులక అందరికీ ఇచ్చేటటువంటి శిక్షణలోనే ఒక భాగాన్ని చేయాలి ఈ స్త్రీల అనారోగ్యం అనేటటువంటి దాన్ని అని చెప్పి అంటే వాళ్ళకు వచ్చేటటువంటి జబ్బుల్ని ట్రీట్ చేయడం కాదు ఆ జబ్బులకు కారణాలు ఉంటాయి వాటిని కూడా అంటే ఇక్కడ వైద్యులు కేవలం వైద్యులుగానే కాదు మానసిక వైద్యులుగా కూడా మారాలి తమ దగ్గరకు వచ్చేటటువంటి మహిళల అనారోగ్యాన్ని స్టడీ చేసి వాళ్ళ యొక్క ఆ జీవితాలలోకి కూడా తొంగి చూసి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆమెకు మాత్రం
(12:01) ఆమెకు మందులు వాడమని ఆమెకు చెప్పడం కాదు జాగ్రత్తలు ఆమె ఇంటిమేట్ పార్ట్నర్ కి కూడా చెప్పాలి వాలి అవసరమైతే హెచ్చరికలు కూడా ఇవ్వాలి ఇది డాక్టర్లు చేయాల్సినటువంటి రెండు రకాల వైద్యం అన్నమాట ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ స్టడీలో మనకి చెప్పిందన్నమాట మిత్రులారా చాలా అంటే ఇక్కడ ఇక్కడ మనం కేవలం స్త్రీలు తాము ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధలకి ఈ కష్టాలకి ఆరోగ్యపరమైనటువంటి ఇన్ని రకాల జబ్బులకి తనతో నిత్యం సంసారం చేసేటటువంటి సహచరుడే కారణం అని తెలిస్తే దిగ్భ్రాంతి చెందుతారు గానీ చాలా విషయాలలో తాము అనుభవించేటటువంటి ఇన్విజిబుల్ వైలెన్స్ ఉంటుందన్నమాట వాళ్ళ
(12:50) వాళ్ళ మీద నిరంతరము సాగేటటువంటి ఒత్తిడి అణచివేత ఉంటుంది వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఇది గమనించాలి ఇది సరే వైద్యశాస్త్రపరంగా వీళ్ళు చెప్పారు వైద్యశాస్త్రంలో కూడా దీన్ని ఒక భాగం చేయాలి వచ్చిన దగ్గరికి వచ్చినటువంటి స్త్రీల యొక్క మానసిక స్థితిగతులు తో పాటు వాళ్ళ జీవన స్థితిగతులు కూడా తెలుసుకోవాలనేటటువంటిది ఒక పాయింట అది వైద్యశాస్త్రానికి వదిలేద్దాం.
(13:14) ఇంకా సోషల్ పర్స్పెక్టివ్ కి వస్తే ఈ సామాజిక పరమైనటువంటి అంశానికి వస్తే జీవితానికి సంబంధించి తమ జీవన భాగస్వాముల పట్ల పురుషులు ఎంత అపరమత్తంగా ఉంటున్నారు ఎంత బాధ్యతగా ఉంటున్నారు ఎంత కర్తవ్యంతో ఉంటున్నారు పైకేదో ప్రేమ పైకేదో ఆ నాకు అంత ఉంది ఇంత ఉంది అని చెప్పడం కాదు ఆచరణలో వాళ్ళు తమ భాగస్వాముల పట్ల ఎంత అప్రమత్త ఆచర ఆచరణలో ఎంత ప్రేమగా ఉంటున్నారు ఏమిటి అనేది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో వాళ్ళకి మనం ఏ విధమైనటువంటి బాధ పెడుతున్నామా హింస పెడుతున్నామా వాళ్ళని వాళ్ళకి అందించాల్సినటువంటిది వాస్తవంగా మాటల్లోనే ప్రేమ ఇస్తున్నామా లేకపోతే
(13:57) చేతల్లో కూడా ఏమఇస్తున్నామా అనేటటువంటిది వాళ్ళు కూడా గమనించుకోవాలి ఇది రెండు రకాలుగా ఇది సోషల్ ప్రాబ్లం ఇంకోటి సొసైటల్ ప్రాబ్లం సామాజిక సమస్య అలాగే ఇంకొకటి వ్యక్తిగతమైనటువంటి సాంసారిక సమస్య ఈ సామాజిక సమస్యను కొద్దో గొప్పో ప్రభుత్వాలు డాక్టర్లు తీరుస్తారు కానీ వ్యక్తిగతమైనటువంటి ఈ సమస్యను వ్యక్తులే తీర్చుకోవాలి.
(14:24) వీటన్నిటికంటే తమ జీవన భాగస్వాములు వీటిని అర్థం చేసుకోరు. దాదాపు 90% అర్థం చేసుకోరు. డబ్బులు తీసుకొచ్చి పడేస్తున్నాం కదా. నువ్వు అది చేస్తున్నావ్ ఇది చేస్తున్నావ్ అని వదిలేస్తారండి. గాలికి వదిలేస్తారన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మహిళలకఅందరికీ కూడా చాలా ఈ మధ్య సోషల్ గ్రూప్స్ వచ్చాయండి నిన్ననే నేను ఆదివారం మ్యాగజిన్ లో చదివానువాట్ గ్రూప్స్ వచ్చాయి చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్ వచ్చాయి ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఏస్త్రీ తాను ఎదుర్కుంటున్నటువంటి ఈ వైలెన్స్ ఏదైతే ఉందో విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ డొమెస్టిక్ వైలెన్స్ ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని
(15:05) దాన్ని ఇతరులకు చెప్పుకోవాలి స్నేహితులకు కనీసం చెప్పుకోవాలి వైద్యులకు చెప్పుకోవాలి తమకు ట్రీట్ చేసేటటువంటి వైద్యులకు చెప్పుకోవాలి ఇంకా తీవ్రమైతే కన్న తల్లిదండ్రులకు చెప్పుకోవాలి తోడపుట్టిన వాళ్ళకి చెప్పుకోవాలి ఇంకా తీవ్రమైతే అవసరమైతే ఇదిగో ఈ సామాజికమైనటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాటితో టై అప్ అయి ఉండాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సరే ఇక తీవ్రతి తీవ్రమం అయితే తెగిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళం అదంతా అల్టిమేట్ లాస్ట్ ఆల్టర్నేటివ్ అది కానీ వీళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నమాట ఏది కూడా దాచుకోకూడదు ఏది కూడా దాచి పెట్టుకోకూడదు.
(15:46) ఆ దాచి పెట్టుకోవడం వల్ల తాను కుణారిల్లిపోతుంది తాను కృంగిపోతుంది తాను కృషించిపోతుంది తద్వారా ఏ పిల్లల భవిష్యత్తు కోసం తాను ఆందోళన పడుతుందో ఆ పిల్లలు కూడా అనాధలైపోతారు తాను సరే సరే పోతుంది. సో ఓవరాల్ గా మిత్రులారా రకరకాల WhatsApp గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ లో గ్రూప్స్ ఉంటాయి, సొసైటీ గ్రూప్స్ ఉంటాయి అలాగే వల్టరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి తాముకు వచ్చినటువంటి సమస్యని వాళ్ళతో కూడా చర్చించాలి వైద్యులతో కూడా చర్చించాలి.
(16:18) అప్పుడు సరే ఇక ఇప్పుడు వీళ్ళు ఈ స్టడీలో కనుగొన్నటువంటి ఈ విషయాలని మరి ప్రభుత్వాలు ఎంతవరకు పట్టించుకుంటాయి లేదా వైద్యశాస్త్ర నిపుణులు ఎంతవరకు పట్టించుకుంటారు ఏమిటి అనేటటువంటిది అది మనకు తెలియదు ఆ వాళ్ళు సాధారణంగా దీని మీద ఇంకా చాలా స్టడీస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ ఈ విషయాల పట్ల బహుశా శ్రద్ధ తీసుకోవచ్చు కానీ ఇండివిడ్యువల్ గా తీసుకునేటటువంటి శ్రద్ధ ఇండివిడ్యువల్ గా చైతన్యంగా ఉండడం అనేటటువంటిది చాలా అవసరం అండి ప్రతి స్త్రీకి ముఖ్యంగా అలాగే ప్రతి పురుషుడు కూడా నేను డబ్బు తీసుకొచ్చి పడేస్తున్నాను కదా అని చెప్పేసి కాదు అలా
(16:54) కాదు తన జీవితంలో సగభాగమైనటువంటి వ్యక్తికి ఎదురవుతున్నటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి సమస్యలు తన ద్వారా ఏమైనా వస్తున్నాయా వాటికి తాను ఏమైనా పరోక్షంగా తనకు తెలియకుండానే కారణం అవుతానా అని పురుషుడు కూడా తెలుసుకోవాలి ఈ రిపోర్ట్ ద్వారా నాకు నేను తెలుసుకునేటటువంటిది అది నేను కూడా గమనించింది అది బహుశా నేను కూడా నా లోపలికి చూసుకోవాలి అనేటటువంటి ఒక చైతన్యాన్ని ఈ రిపోర్ట్ ఇచ్చింది.
(17:24) ఏది ఏమైనా వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా అని కాదు ఆ కారణాలకు ఉన్నటువంటి ఆ వేళ్ళు ఉన్నాయా ఆ వేళ్ళని కత్తిరించేటటువంటి ఒక గొప్ప విప్లవం జరగాలి అది ఇట్లాంటి స్టడీస్ జరిగితేనే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి మిత్రులారా. ఈ విషయాలు మిగిలిన మిత్రులకు కూడా పంచుకోండి ముఖ్యంగా స్త్రీలు తప్పనిసరిగా జాగరూకతతో అప్రమత్తతతో చైతన్యంగా ఉండండి అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మీ పిల్లల్ని కాపాడుకుంటారు మీ చుట్టూ వాతావరణాన్ని కాపాడుతారు మీ సంసారాన్ని కాపాడుకుంటారు తద్వారా ఈ సమాజానికి కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వగలుగుతారు థాంక్యూ
(18:05) నచ్చితే మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో

No comments:

Post a Comment