మీ జీవనానికి ఒక సరళత్వం ఉంది అదేమంటే సజావుగా "జీవించడమే".
ఆ సహజత్వాన్ని ఆలోచనలతోటి సంయోగపరచకండి.
మీరు ఒక స్పష్టమైన " మహాఉనికి " మాత్రమే
దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు.
ప్రకటించుకున్నప్పుడు మాత్రమే అస్థిత్వం ఉంది దానిని మీరు "నేను" గా అనుభవిస్తారు.
నేను అనేది కేవలం ప్రకటితం మాత్రమే దానికి ఎలాంటి అర్థ పరమార్థాలను జోడించకండి.
మీ అనుభవం మీకు స్పష్టంగా ఉంది దాన్ని దేనితోటి పోల్చుకోకుండా మార్చకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండటమే మీ సహజ నైజం.
ఊరకనుడటమే మీ సహజ స్థితి అదే నీ నిజస్థితి దానిని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు ఎందుకంటే ?
నిజస్థితి ప్రకటితానికి "తెలియని" స్థితి.
Vissuji
http://youtube.com/post/Ugkx6HTdEIkU7OVWlhxoM3zfiMmWUVwY7sAJ?si=pDUPWisAieQS8RRh
No comments:
Post a Comment