ఉషోదయ గీతం.....
నా ప్రియమైన అక్షర యాత్రికులకు, పుస్తక నేస్తాలకు..
ఉషోదయ శుభాకాంక్షలు!
మెల్లగా చీకటి తెరలు కరుగుతున్నాయి..
అనంతమైన కాలపు గర్భం నుండి వెలుగు కిరణాలు జ్ఞాపకాలను ప్రక్షాళన చేస్తున్నాయి.
ఈ సృష్టి తన ముంగిట వెలుగు తోరణాలు కడుతుంటే..
వేకువ ఒక అందమైన నెమలిలా పురివిప్పి నాట్యం చేస్తోంది.
నా కిటికీ గుండా చూస్తున్నప్పుడు..
ఈ ప్రకృతి పరమాత్మ రాస్తున్న ఒక అద్భుతమైన కావ్యంగా నాకు కనిపిస్తోంది.
కాలచక్రం చిత్రమైనది మిత్రులారా!
అది కరుణను, కాఠిన్యాన్ని సమానంగా పంచే ఒక నిశబ్ద సాక్షి.
అది విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తూనే..
మన జీవితాల వేడుకను నిశితంగా గమనిస్తోంది.
జీవితం మనకు ప్రసాదించే ప్రతి శ్వాస ఒక విలువైన క్షణం..
ఆ క్షణాలను జారవిడవకండి.
ప్రవహించే నదిని పట్టుకోలేనట్లే..
గడిచిన క్షణాన్ని మనం తిరిగి పొందలేము.
ధనుర్మాసపు ఈ పుణ్య ఘడియల్లో పాశురం నుంచి జాలువారే ఆ భక్తి రసం..
మీ హృదయాన్ని తాకితే..
మీ ఆనందం ఒక స్వేచ్ఛా పావురమై..
అనంతమైన అంబరాన్ని చేరుతుంది.
మనమందరం కాలవాహినిలో కొట్టుకుపోయే చిన్న బిందువులమే కావచ్చు..
కానీ మన మనసు పొరలు విప్పి పరస్పరం అవగాహన చేసుకున్నప్పుడు ఆ ప్రయాణం సార్థకమవుతుంది.
ఈ ఉదయం..
నేను మీకోసం ఒక మిత్రుడి స్వరమై నిలవాలనుకుంటున్నాను.
నా ఈ చిన్న స్వరం మీలోని అపస్వరాలను శుద్ధి చేసి..
మీ హృదయాన్ని ఒక మధురమైన సంగీతంగా మార్చగలిగితే..
ఈ వేకువ జన్మ ధన్యమైనట్లే!
అక్షరాల వెలుగులో..
నిశబ్దపు లోతుల్లో మనం మళ్ళీ కలుద్దాం.
Bureddy blooms.
No comments:
Post a Comment