ప్రాణాలకు తెగించి రాక్షసులకు ఉరిశిక్ష వేయించింది: హ్యాట్సాఫ్ మేడం👌👌| Brave Constable Revathi | SMP
Author Name:SriMedia Prime
Youtube Channel Url:https://www.youtube.com/@SriMediaPrime
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7YVFJ5Z_87c
Transcript:
(00:00) సాతాకుళం పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్స్ లో కీలక సాక్షి హెడ్ కానిస్టేబుల్ రేవతి ఆమె తన సహచరులకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే 10 మంది పోలీసులు పోలీస్ స్టేషన్ను హత్యలు చేసే గదులుగా మార్చేశారు. మానవత్వం మరిచి జనం సొమ్ముతో జీతాలు తీసుకునే కాకీలు జనం సొమ్ముతో కట్టిన స్టేషన్ే నరక లోకంగా మార్చారు.
(00:23) జయరాజ్ అతని కొడుకు బెనిక్స్ ను అత్యంత దారుణంగా రాత్రంతా హింసించి చంపారు నీచలు. ఇక మొత్తానికి దుర్మార్గులకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందనేదానికి ప్రత్యక్ష సాక్షి హెడ్ కానిస్టేబుల్ రేవతి మాత్రమే. ఆమె ఏం చెప్పింది? న్యాయమూర్తి రాసిన 683 పేజీల తీర్పులో రేవతి చెప్పిన సాక్ష్యం వింటే మనకు వణుకు పుడుతుంది.
(00:44) ఇలాంటి వాళ్లకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి మేపుతున్నామా అని జనం చేదరించుకోక తప్పదు. ఎందుకంటే జనం కోసం పని చేయాల్సిన పోలీసులు రాక్షసుల్లా మారితే ఈ 10 మందిలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతి చోటా ఉంటారు. చట్టం న్యాయం సూత్రాలను వదిలేసి కాకీ చొక్క ఉంది కదా అని ప్రజలను హింసించే రాక్షసులు అంతటా ఉన్నారు.
(01:05) సమయం వచ్చినప్పుడు వారికి కూడా ఇలానే న్యాయస్థానంలో ఉరుశిక్ష కాకపోయినా జైలు శిక్ష మాత్రం కాయం. మరి అసలు రేవతి న్యాయం వైపు ఎలా నిలబడింది? తన డిపార్ట్మెంట్ పరువును ఎలా కాపాడింది? ఆ రోజు ఆ 10 మంది రాక్షసుల హింసాకాండ ఎలా సాగిందిఅనేది ఈ తీర్పులో న్యాయమూర్తి రాశారు. తీర్పులో రేవతి చెప్పిన సాక్ష్యాలు ఏంటో చూద్దాం. జయరాజ్ అతని కొడుకు బెనిక్స్ ను అప్పటికే పోలీసులు విపరీతంగా కొట్టారు.
(01:30) ఇద్దరిని ఎస్ఐ గణేష్ స్టేషన్ లో నిలబెట్టాడు. రేపు కోర్టుకు తీసుకెళ్తున్న న్యాయమూర్తికి మీరేం చెబుతారురా అని గట్టిగా అడిగాడు. ఆరోజు జూన్ 19, 2020 రాత్రి 11:30ర దాటింది. ఇద్దరూ కాముగా ఉన్నారు. మళ్ళీ బెదిరింపు వాయిస్ తో ఎస్ఐ గణేష్ గట్టిగా అడిగాడు. ఏంట్రా మాట్లాడరఏంటి అన్నాడు. జయరాజ్ ఏం మాట్లాడలేదు. కానీ 31 ఏళ్ళ బెనిక్స్ మాత్రం పోలీసులు చావ బాధారని చెబుతానని గట్టిగానే సమాధానం ఇచ్చాడు.
(01:55) అవునా నిన్ను పోలీసులు కొట్టారా మా మీద చెబుతావారా అసలు కొట్టడం అంటే టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాడు గణేష్ అంతే నరూప రాక్షసుడిగా మారాడు. ఇద్దరిని గోడకు చేతులు పెట్టి అటు తిరిగి నిలబడమని ఆదేశించాడు. ఓ లావుపాటి కర్రతో రీపు పిరుతుల మీద విచక్షణ రహితంగా కొట్టాడు. అలా కొడుతూనే మళ్ళీ ఇలా మాట్లాడుతావా అంటూ ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని కొడుతూనే ఉన్నాడు.
(02:21) మళ్ళీ కాసేపోయిన తర్వాత మరో ఇద్దరు పోలీసులతో కలిసి ఒకరిని నిలబెట్టి మరొకరిని చూడమని మార్చి మార్చి తండ్రి కొడుకులను చావబాదారు. తన కొడుకును కొట్టొద్దని జయరాజ్ కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించలేదు. నువ్వు చూడాల్సిందే అంటూ బెదిరించాడు. అక్కడ ఉన్న వారంతా కలిస్తే విపరీతంగా కొట్టిన తర్వాత బెనక్స్ శరీరం నుంచి రక్తం కారణం మొదలైంది. వెంటనే ఫ్లోర్ మీద బెనక్స్ కొప్పుకొలిపోయాడు మళ్ళీ లేపారు.
(02:45) రక్తం కారుతున్న సరే బెనెక్స్ ని కొడుతూనే ఉన్నారు. అరేయ్ ఈ రక్తం ఎవడు క్లీన్ చేస్తాడు నీ బ్లడ్ నువ్వే క్లీన్ చేయమని ఆదేశించాడు. కనీసం నడవలేకపోతున్నాడు బెనెక్స్ అయినా సరే తన బనియన్ తో రక్తాన్ని తుడిచాడు. ఆ తర్వాత దాన్ని నేరస్తంగా బాత్్రూమ్ పక్కన విసిరేసాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఇతర ఎస్ఐలను వాళ్ళఏమైనా తిన్నారా అని అడిగాడు తినలేదని చెప్పారు.
(03:06) అంటే పోలీసులు తెచ్చిన ఆహారం వాళ్ళకు నచ్చలేదా లేదంటే గర్వంగా ఫీల్ అవుతున్నారా అంటూ మళ్ళీ లాకప్ రూమ్లోకి వెళ్లి చావబాబదారు. అప్పుడు రావతి బయట హాల్లో కూర్చొని ఉంది. వారి అరుపులను ప్రాదేయ పట్టాన్ని ఆమె విన్నారు. కానీ ఏమి చెప్పలేకపోయారు. ఎందుకంటే సిఐ నుంచి ఎస్ఐల వరకు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇద్దరి మీద రాక్షసుల్లా కొడుతుంటే ఆమె ఏమి చేయలేకపోయారు.
(03:30) చివరకు తాము తింటామని బ్రతిమలాడటంతో కొట్టటం ఆపేశరు. అయితే ఆ రాత్రి సమయంలో కూడా రేవతి హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీలో ఉన్నారు. ఆ సాయంత్రంఆరు నుంచి రాత్రి 8 గంటల సమయంలో తన పిల్లలకు ఆహారం తినిపించడానికి వెళ్ళారు ఆమె మళ్ళీ వచ్చేశారు. అప్పటికే ఇంట్రాగేషన్ పేరుతో గణేష్ దారుణంగా కొడుతూనే ఉన్నాడు. స్టేషన్ లోని ఎడమ వైపు ఉన్న గదిలో టేబుల్ మీద బెనిక్స్ ని పడుకోబెట్టారు. తల కిందికి ఉంచారు.
(03:52) హెడ్ కానిస్టేబుల్ సామి దొరై ఓ చేతిని బలంగా లాగే పట్టుకున్నాడు. మరో కానిస్టేబుల్ వేలుముత్తు కూడా మరో చేతిని లాగి పట్టుకుంటే ఎస్ఐ బాలకృష్ణన్ విపరీతంగా పిరుదుల మీద అరికాళ్ళు అలాగే కాళ్ళ మీద కూడా కొడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే రేవతి ఎస్ఐ కి సెల్యూట్ చేయడానికి వచ్చింది. తాను వచ్చానని చెప్పడానికి వెంటనే బాలకృష్ణను కొట్టడం ఆపేసి బయటక వచ్చాడు.
(04:13) వాడు ఏం చేశడో తెలుసా మన పోలీసులను తోసేసాడు. టేబుల్ మీద ఉన్న వాటిని పొగరతో తోసేసాడు. అందుకే కొడుతున్నాం. నీ వాట నీకు ఉంది నువ్వు కూడా ఓ రౌండ్ కొట్టమని రేవతికి చెప్పాడు. కానీ నేను కొట్టను సార్ అంటూ ఆమె భయంతో బయటిక వచ్చేసింది. అప్పటికే రక్తం వచ్చేలా తండ్రి కొడుకలను చావబాదారు. పోలీసులు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు. లోపల ఎవ్వరూ లేరు.
(04:35) అప్పుడే రేవతి లోనికి వెళ్ళింది. లాకప్ లో మూలుగుతో ఉన్న బెనిక్స్ జయరాజ్ ను ఏమైందని అడిగింది. మా నాన్నని ఎందుకు కొట్టారని నిలదీశాను. అందుకే ఇద్దరిని కలిపి కొడుతున్నారని మూలుగుతూ చెప్పారు. ఇద్దరు నొప్పితో విలవలలాడిపోతున్నారు. అయితే అసలు వీళ్ళని పోలీసులు ఎందుకు కొడుతున్నారు ఎందుకంతలా మృగాల్లా మారారో కూడా రేవతి చెప్పుకొచ్చారు.
(04:55) అసలు ఏం జరిగిందంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎస్తే బాలకృష్ణ కానిస్టేబుల్ తో కలిసి రౌండ్స్ కి వెళ్ళారు. అక్కడ ఉన్న వారిని బెదిరించారు. బయట గుంపులుగా నిలబడితే తోలు తీస్తాను ఏమనుకుంటున్నారు అంటూ హెచ్చరించారు ఆయన. అయితే వ్యాపారం చేసుకుంటున్న తాము ఎలా బ్రతకాలని అక్కడే ఉన్న జయరాజ్ అన్నారు. నా సంగతి నీకు తెలియదురోయ్ తోలు తీస్తే తట్టుకోలేరంటూ మరోసారి హెచ్చరించారు ఆయన మాకు కూడా తెలుస్తారు అన్నాడు అంతే బాలకృష్ణ ఈగో హర్ట్ అయిపోయింది.
(05:19) మా తోలు తీస్తావా అంటూ జయరాజును తీసుకెళ్లి చావబాదాడు. మా నాన్నను ఎందుకలా చావ బాదారని స్టేషన్ కి వెళ్లి నిలదీసినందుకు కొడుకును కూడా కొట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టి కొడుతూనే ఉన్నారు. ఇక అదే రోజు రాత్రి మళ్ళీ రాత్రి 1:00గంట సమయంలో సిఐ శ్రీధర్ వచ్చాడు. లోపల జయరాజ్ బెనిక్స్ ను రెండు సెల్స్ లో చావు బాత్ూ ఉన్నారు.
(05:39) బయట హాల్ లో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆయన కూడా ఎందుకురా కొడుతుంటే సౌండ్స్ వస్తున్నాయి వాడిని చూసావా బెనిక్స్ ఎలా ఉన్నాడో ఒక్కడే 100 ఇడ్లీలు తినేవాడిలా ఉన్నాడు. ఎంత కొట్టినా వాడు తట్టుకోగలడు. వాడికి ఇంకా వాయించండిని రచ్చగొట్టాడు. అలా ఆపకుండా కొడుతూనే ఉన్నారు. చివరకు రక్తంతో గోడలు తడిచిపోయాయి. నేల మీద రక్తం కారింది. అది చూడలేక రావతి బయటకవచ్చి నిలబడ్డారు.
(06:01) రాత్రిమూడు గంటల సమయంలో సిఐ గణేష్ ఎస్ఐ బాలకృష్ణలు మళ్ళీ స్టేషన్ కి వచ్చి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే సిఐ మాత్రం మురుగన్నని పిలిచి చెప్పాడు. వాళ్ళద్దరికీ బట్టలు ఇవ్వకండి. నగ్నంగానే లాకప్ లో అలానే ఉంచమన్నాడు. అలా కోపంతో బయటికి వెళ్ళిపోయాడు సిఐ. అందరూ వెళ్ళిపోయాక రేవతి సాముదరాయ్ మాత్రమే నైట్ డ్యూటీలో ఉన్నారు.
(06:21) తండ్రి కొడుకులు ఇద్దరూ గోడకు నీరసంగా వాలి ఉన్నారు. ఏమైనా కావాలని అడగ్గా ఇద్దరు నీళ్లు కావాలన్నారు. ఆమె నీళ్లు తెచ్చించారు. తాగలేకుండా ఉంటే తానే స్వయంగా నీళ్లుు తాగించారు. అయితే స్టేషన్ లో ఫ్లాస్క్ లో టీ ఉంది. పాపం వాళ్ళు ఆకలితో ఉన్నట్టుంది. టీ ఇవ్వన బాగా గాయాలతో ఉన్నారని సామి దొరనే అడిగారు రేవతి. అతను అక్కర్లేదన్నాడు. దీంతో ఆమె భయపడ్డారు.
(06:42) అయినా వారి ప్రాణంపై ఆమెకు కంగారు మొదలైంది. మధ్య మధ్యలో వెళ్లి చూడటం మొదలు పెట్టింది. ఆ గాయాలు చూసి ఎక్కడ చనిపోతారో అనే భయం ఆమెకు కలిగింది. తెల్లారే వరకు కొనఊపిరితోనే ఉన్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అయితే తాము కోర్టుకు చెబుతామని బెనిక్స్ మూలుగుతూ చెప్పాడు. అందుకు రేవతి మీరు ఈ పోలీసులను ఏమి చేయలేరు.
(07:03) ముందు మీ ప్రాణాలు కాపాడుకోండిని సలహా ఇచ్చారు ఆమె. ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బట్టలు మార్చి కోర్టుకు అటనుంచి రిమాండ్ కు తరళించారు. అయితే స్టేషన్ను శుభ్రం చేయించాలని సిఐఎస్ఐలు చెప్పారు. ఒక శుభ్రం చేసే పనివాడు స్టేషన్ కి వచ్చాడు. అతను మోగ వ్యక్తి మాట్లాడలేడు. హార్పిక్ లైజాల్ తీసుకొని వచ్చాడు.
(07:22) కానీ లాకప్ రూమ్లో రక్తం వాసన గుప్పమంటుంది. ముక్కు మూసుకుంటేనే మొత్తం క్లీన్ చేశాడు. అయితే మరునాడే తండ్రి కొడుకులు చనిపోయారన్న వార్త రేవతిని నిద్రపోనివ్వలేదు. ఆ తర్వాత సిబిఐ విచారణ మొదలైన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పారు. 47వ సాక్షిగా తన కొలీగ్స్ చేసిన ఘోర హత్యలను ఆమె పోసగుచ్చినట్లు సిబిఐ కి వివరించారు. మీరు పోలీసులను ఏమీ చేయలేరని ఆమె జయరాజ్ బెనిక్స్ కి చెప్పారు.
(07:46) నిజంగానే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ వారికి జరిగిన అన్యాయాన్ని తాను సరి చేయాలనుకున్నారు. ఆమె ధైర్యం నిజం వైపు నిలబడి తండ్రి కొడుకులను గెలిపించారు. 10 మంది రాక్షసుల్లో ఒకడు కరోనాతో చనిపోగా మిగిలిన తొమ్మిది మందికి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆ విధంగా ఆ రాత్రి గడిచింది. ఇప్పుడు చెప్పండి ఈ నరూప రాక్షసులకి ఉరి శిక్ష సరైందేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.
(08:09) ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment