"Was Your Life Decided Before Birth? | పుట్టకముందే నిర్ణయమైంది | Vedic Truth"
Author Name:Aryavarta Stories
Youtube Channel Url:https://www.youtube.com/@aryavarta_stories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VpPxuoa0N74
Transcript:
(00:01) ఒక్కసారి ఆలోచించు ఈ భూమిపై నువ్వు పుట్టడం అనేది నిజంగా యాదృశ్చికమా ఇప్పుడు ఉన్న వాళ్లే నీకు తల్లిదండ్రులుగా ఎందుకు ఉన్నారు అనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళకే నువ్వు ఎందుకు పుట్టావు ఈ దేశంలో ఈ ఇంట్లో ఈ కుటుంబంలో ఈ శరీరంతో ఈ రూపంతోనే నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా మనకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించారు.
(00:26) పుట్టడం అనేది అలా జరిగిపోతుంది. జీవితం అనేది అలా గడిచిపోతుంది. ఎవరి తలరాత ఎలా ఉంటే వాళ్ళకు అలాంటి జీవితమే దొరుకుతుంది అని. కానీ వేదాలు అలా చెప్పలేదు. ఉపనిషత్తులు అలా చెప్పలేదు. గరుడ పురాణం కూడా అలా చెప్పలేదు. అవి చెప్పేది పూర్తిగా వేరే విషయం. నీ పుట్టుక యాక్సిడెంట్ కాదు నీ జీవితం రాండమ కాదు. నువ్వు పుట్టకముందే నీ జీవితానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోబడ్డాయి.
(00:55) ఆ నిర్ణయాలు వినగానే నువ్వు షాక్ అవుతావు. కానీ ఆ నిర్ణయాల వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వం ఉంది. ఈ రహస్యం గనుక నీకు అర్థమైతే నీ తల్లిదండ్రులను నువ్వు చూసే విధానం మారిపోతుంది. నీ కష్టాలను చూసే విధానం మారిపోతుంది. నీ జీవితాన్ని చూసే దృష్టి కూడా పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న జీవితమంతా నిజమని నువ్వు అనుకోవచ్చు.
(01:21) కానీ అది పూర్తిగా సత్యం కాదు నువ్వు ఈ శరీరం కాదు ఈ పేరు కాదు ఈ వయసు కాదు ఈ జన్మతోనే మొదలైన వ్యక్తివి కూడా కాదు ఇది ఎందుకు అంటున్నాను అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః అని అంటే ఈ శ్లోకానికి అర్థం మీరు ఇప్పటికే ఎన్నో సార్లు వినే ఉంటారు ఆత్మను ఆయుధాలు ఖండించలేవు అగ్ని కాల్చలేదు నీరుత తడపలేదు గాలి ఎండబెట్టలేదు అనేది దీని అర్థం.
(01:53) అయితే ఇది కేవలం ఒక శ్లోకం కాదు ఇది మన అసల స్వరూపం గురించిన ఒక సంకేతం. ఒక్కసారి గమనించు శరీరం పుడుతుంది పెరుగుతుంది మారుతుంది చివరికి నశిస్తుంది. కానీ మీ లోపల ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటికీ మారడం లేదు. అది కాలంతో మారదు. అది కాలానికి అతీతం. అది నిన్ను చిన్నప్పటి నుండి చూస్తుంది. ఇప్పుడు చూస్తుంది. అది ఇప్పటికీ ఎప్పటికీ నిశ్చలంగానే ఉంటుంది.
(02:22) అంటే నీ కథ ఈ జన్మతోనే మొదలు కాలేదు. నువ్వు పుట్టకముందే నీ ఉనికి ఉంది. ఈ ఒక్క విషయం నీకు స్పష్టంగా అర్థమైతే ఈ జన్మకు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టే. కటోపనిషత్తు కూడా చెబుతుంది. ఆత్మ నిత్యమైనది అది పుట్టదు చావదు నశించదు అని. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. మనకు సాధారణంగా జీవితం అంటే పుట్టడం నుండి చనిపోవడం వరకు మాత్రమని అనిపిస్తుంది.
(02:50) కానీ వేదాంతం ప్రకారం జీవితం అనేది ఒకే జన్మ కాదు అది ఒక దీర్ఘ ప్రయాణం ఒక జన్మ ఒక పాఠం మరో జన్మ మరో అనుభవం ఇంకో జన్మ మరో ఎదుగుదల ఇలా ఆత్మ పరిపూర్ణతను చేరే వరకు జన్మ జన్మల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒక శరీరం ముగిసిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? మరో జన్మను ఎలా ఎంచుకుంటుంది? అనేది ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది.
(03:19) గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ తన కర్మల ప్రకారం ఒక స్థితిలోకి వెళుతుంది. ఆత్మ తన వెంట తీసుకెళ్ళేది ఏమిటో తెలుసా? డబ్బు కాదు, పేరు కాదు, శరీరం కాదు, సంబంధాలు కాదు ఆత్మ తన వెంట తీసుకెళ్లేది కర్మ మాత్రమే. నువ్వు చేసిన పనులు నువ్వు కలిగించిన బాధ నువ్వు ఇచ్చిన ప్రేమ నువ్వు నేర్చుకున్న పాఠాలు నువ్వు వదిలేసిన కోరికలు నువ్వు పూర్తి చేయని అనుభవాలు ఇవన్నీ ఆత్మతో పాటు ఉంటాయి.
(03:51) అంటే మరణం అనేది ముగింపు కాదు మరణం అనేది ఒక రివ్యూ పాయింట్ మాత్రమే శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ వెనక్కి తిరిగి చూస్తుంది. గత జన్మలో నేను ఏం నేర్చుకున్నాను ఇంకా ఏం మిగిలిపోయింది ఏ బంధాలు ఇంకా పూర్తి కాలేదు ఏ కర్మలు ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నాయి ఏ అనుభవాలు ఇంకా అవసరం ఉన్నాయి అని ఈ సమీక్ష పూర్తయ్యాకే తదుపరి జన్మకు మార్గం సిద్ధమవుతుంది.
(04:18) యోగ వశిష్టం వేదాంత భావం కర్మ సిద్ధాంతం అన్ని కలిపి మనకు ఒక విషయాన్ని చెప్తాయి. తదుపరి జన్మ అనేది శిక్ష కాదు అది విద్య అని ఆత్మను ఎవ్వరూ కోపంతో పంపించరు ఆత్మ తన అభివృద్ధి కోసం మళ్ళీ మళ్ళీ వస్తుంది. కొన్ని పాఠాలు ప్రేమ ద్వారా నేర్చుకుంటుంది. కొన్ని పాఠాలు నష్టాల ద్వారా నేర్చుకుంటుంది. కొన్ని పాఠాలు ఒంటరితనం ద్వారా నేర్చుకుంటుంది.
(04:43) కొన్ని పాఠాలు వైఫల్యం ద్వారా నేర్చుకుంటుంది. కొన్ని పాఠాలు విజయంతోనే నేర్చుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో నీకు ఏ అనుభవాలు అవసరమో, ఏ వాతావరణం అవసరమో, ఏ సంబంధాలు అవసరమో, అవన్నీ నీ కర్మ ప్రయాణానికి అనుగుణంగా నిర్ణయం అవుతాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మీ తల్లిని కూడా మీరే ఎంచుకున్నారా? అనేది. ఈ ప్రశ్న చాలా గొప్పది.
(05:08) ఎందుకంటే మనం సాధారణంగా అనుకునేది ఏమిటంటే మన తల్లిదండ్రులు మనకు సహజంగానే వచ్చారు అని. కానీ వేదాంత తత్వం ఇంకో కోణాన్ని చూపిస్తుంది. ఆత్మ తన తదుపరి జన్మకు సిద్ధమయ్యే సమయంలో తనకు అవసరమైన కర్మ పాఠాలకు సరిపోయే వాతావరణంలోకి ప్రవేశిస్తుంది అని ఇది లిటరల్ గా చైర్ మీద కూర్చుని ఎంపిక చేసుకోవడం కాదు ఇది కర్మపరంగా జరిగే సరిపోలిక.
(05:34) ఒక ఆత్మకు ఈ జన్మలో సహనాన్ని నేర్చుకోవాలి అని ఉంటే అలాంటి పాఠం నేర్పగల కుటుంబంలో పుడుతుంది. మరొక ఆత్మకు ప్రేమ యొక్క లోతు అర్థం కావాలి అని అనుకుంటే ప్రేమ, త్యాగం, బంధం ఈ మూడు బలంగా ఉండే ఇంట్లో పుడుతుంది. ఇంకో ఆత్మకు బాధ ద్వారా వికాసం అవసరం అని అనుకుంటే సవాళ్లు ఎక్కువగా ఉండే వాతావరణంలో పుడుతుంది. అంటే అది ఎలాంటి వాతావరణం ఉన్న కుటుంబమో మీకు తెలుసు కదా.
(05:56) కాబట్టి మీ తల్లి యాద్రచ్చికంగా రాలేదు. మీ తండ్రి కూడా మీకు యాదృచ్చికంగా రాలేదు. వాళ్ళు మీ ఆత్మ ప్రయాణానికి అవసరమైన పాత్రదారులు. ఇక్కడ ఒక విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వేదాంతం చెప్తున్నది బ్లేమ్ చేయమని కాదు పూర్తిగా అర్థం చేసుకోమని ఎందుకంటే ఒక తల్లి కేవలం శరీరానికి జన్మ ఇవ్వదు. తల్లి ఆత్మ ప్రయాణానికి ద్వారం అవుతుంది.
(06:20) ఒక తండ్రి కేవలం కుటుంబాన్ని నడపడు. నీ కర్మల అన్ఫ్లోడింగ్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. నీ అన్నదమ్ములు అక్కా చెల్లెలు భార్యా భర్త స్నేహితులు నీకు బాధ ఇచ్చిన వాళ్ళు నీకు గొప్ప ప్రేమ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ యాదృచ్చికంగా వచ్చిన వాళ్ళు కాదు నీ ఆత్మ అభ్యాసంలో భాగమైన వ్యక్తులు ఇది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎలా ఆలోచించడం మొదలు పెడతావు ఎలా అంటే ఈ వ్యక్తి నా జీవితంలోకి ఎందుకు వచ్చాడు ఇతను నాకు ఏ పాఠం నేర్పిస్తాడు ఈ బంధం వెనుక ఏ కర్మ ఉంది అని నువ్వు ఇలా ఆలోచించినప్పుడు నీ జీవితం మీద నీకు అసహనం తగ్గుతుంది నీ జీవితం మీద అర్థం నీకు బాగా
(06:59) పెరుగుతుంది. కొన్ని బంధాలు మొదటి చూపులోనే స్పెషల్ గా అనిపిస్తాయి. కొంతమందిని చూసిన వెంటనే ఫెమిలారిటీగా అనిపిస్తుంది. కొందరి దగ్గరేమో అన్ఎక్స్ప్లైనెడ్ కంఫర్ట్ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంటుంది? వేదాంతం దృష్టిలో అది కొత్త బంధం కాదు. అది పాత ప్రయాణం యొక్క కొనసాగింపు కావచ్చు. ప్రత్యేకంగా తల్లి బంధం.
(07:22) మీ తల్లి ఒడిలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఎందుకు ఉంటుంది ఆమె బాధపడితే మీలో ఏదో తెలియని ఫీల్ కలుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ బంధం కేవలం ఈ జన్మలో మొదలైనది కాదని వేదాంతం చూచిస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీ తల్లిదండ్రులు మాత్రమే కాదు మీరు పుట్టిన స్థలం కూడా ముందే నిర్ణయించబడిందా అనేది. మనకి ఇది చిన్న విషయంగా అనిపిస్తుంది.
(07:46) [సంగీతం] ఏ దేశంలో పుట్టాం, ఏ రాష్ట్రంలో పుట్టాం, ఏ ఊరిలో పుట్టాం, ఏ భాష మాట్లాడుతున్నాం, ఇవి సాధారణ విషయాలే కదా అని అనిపిస్తాయి కానీ వేద దృష్టిలో స్థలం కూడా శక్తి కలిగినదే. ప్రతి ప్రదేశానికి తన సొంత స్పందన ఉంటుంది. తన సొంత వాతావరణం ఉంటుంది. తన సొంత కార్మిక్ ఫీల్డ్ ఉంటుంది. కొన్ని ప్రదేశాలు వైరాగ్యాన్ని పెంచుతాయి. కొన్ని ప్రదేశాలు భోగాన్ని పెంచుతాయి.
(08:12) కొన్ని ప్రదేశాలు విద్యకు అనుకూలం. కొన్ని ప్రదేశాలు పరీక్షలకు అనుకూలం. కొన్ని ప్రదేశాలు ఆధ్యాత్మిక మేలుకొలుపులకు సహాయం చేస్తాయి. అంటే నీ ఆత్మకు ఏ నెల సరిపోతుందో ఏ సంస్కృతి అవసరమో ఏ కుటుంబ వాతావరణం అవసరమో దానికి అనుగుణంగానే జన్మస్థలం కూడా లభిస్తుంది. మన పురాణాలు వేదాలు మన భారతభూమిని ప్రత్యేకంగా ఎందుకు చూస్తాయో తెలుసా? ఇది కేవలం దేశభక్తి వల్ల కాదు ఈ భూమి వేల సంవత్సరాల తపస్సులను మోసింది. ఇప్పటికీ మోస్తూనే ఉంది.
(08:46) ఈ నేలపై ఋషులు ధ్యానం చేశారు. మహర్షులు జ్ఞానాన్ని పొందారు. మంత్రాలు ఉచ్చరించబడ్డాయి. యజ్ఞాలు జరిగాయి. ఆధ్యాత్మిక ప్రకంపనలు నిల్వమయ్యాయి. అందుకే ఈ భూమిలో పుట్టడం కూడా ఒక ప్రత్యేక అవకాశం అని భావించారు. అంటే ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి గొప్పవాడని కాదు కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అదనపు అవకాశం ఉందని భావించారు.
(09:10) అందువల్ల ఏ చోట పుట్టమన్నది కూడా యాద్రచచికం కాదు అనే భావనకు వేదాంతం బలంఇస్తుంది. ఇప్పటివరకు మనం తల్లిదండ్రులు జన్మస్థలం గురించి చూసాం. కానీ ఇప్పుడు ఇంకా సూక్ష్మమైన విషయం ఉంది. నువ్వు పుట్టిన సమయం కూడా ఇంపార్టెంటేనా అనేది. వేదాంత జ్యోతిష్యం ప్రకారం అవును నువ్వు పుట్టిన క్షణం యాదృశకం కాదు అది అర్థం ఉన్న క్షణం కానీ చాలామంది ఒక తప్పు చేస్తారు.
(09:36) గ్రహాలు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు గ్రహాలు నిన్ను నడిపించవు అవి నిన్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. అవి నీపై ప్రభావం చూపడం కాదు నీ కర్మల స్థితిని బయట పెడతాయి. ఒక్కసారి ఇలా ఆలోచించు గడియారం టైం ని చూపిస్తుంది. కానీ టైం ని తయారు చేయదు కదా అలాగే నువ్వు పుట్టిన క్షణంలో ఉన్న గ్రహస్థితులు నీ కర్మల స్థితిని చూపించే సంకేతాలు మాత్రమే అవి నీ జీవితాన్ని సృష్టించవు.
(10:03) కానీ నీ జీవితం ఏ దిశలో ఉందో తెలియజేస్తాయి. అయితే అవి అదే క్షణంలో ఎందుకు అలైన్ అయ్యాయి. ఎందుకంటే నీ ఆత్మ ఈ ప్రపంచంలోకి ప్రవేశించడానికి సరిపోయే సరైన క్షణం అది. అదేమి యాదృచికం కాదు అది సమన్వయం నీ కర్మ సమయం సృష్టి ఈ మూడు ఒకే బిందువులో కలిసిన క్షణమే నీ జననం జరుగుతుంది. అయితే ఇక్కడ దీనికి ఒక లోతైన భావం ఉంది.
(10:28) నువ్వు పుట్టిన క్షణం ఒక నిమిషం ముందు ఒక్క నిమిషం తర్వాతో కాదు ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లోనే ఎందుకంటే అది నీ కార్మిక్ బ్లూ ప్రింట్ కి అనుగుణమైన ప్రవేశ ద్వారం ఇది వినడానికి చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. కానీ ఈ భావం చెప్పేది ఏమిటంటే జీవితం అనేది రాండమ కాదు దానికి రిథం ఉంది దానికి ఆర్డర్ ఉంది. దానికి అదృశ్య మేధస్సు ఉంది అని ఇప్పుడు ఇక్కడ చాలామంది ఒక డౌట్ ని అడగవచ్చు అన్నీ ముందే నిర్ణయించబడితే మరి మన జీవితంలో మనక ఏం పాత్ర ఉంది మనం ఏదైనా మార్చగలమా లేక అంతా ఫిక్స్ అయిపోయిందా అని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వేదాలు గీత వేదాంతం ఇవి ఎక్కడా ఇలా చెప్పలేవు అన్ని ఫిక్స్
(11:07) అయిపోయాయి ఏం చేయలేం అని అవి చెప్తున్నది ఒక సమతుల్యం మన జీవితంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ప్రారబ్ద కర్మ రెండవది ది క్రియామణ కర్మ ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల ఇప్పటికే పండిన ఫలితాలు ఈ జన్మలో తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితులు ఎగ్జాంపుల్ కి నువ్వు ఎవరి ఇంట పుడతావు కొన్ని ముఖ్యమైన సంఘటనలు కొన్ని పరీక్షలు తప్పించుకోలేని అనుభవాలు ఇవి ప్రారబ్ధానికి చెందుతాయి కానీ క్రియామాణ కర్మ అంటే ఈ క్షణంలో నువ్వు చేస్తున్న ఎంపికలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఎలా స్పందిస్తున్నావు ఎలా జీవిస్తున్నావు ఎలాంటి నిర్ణయాలు
(11:45) తీసుకుంటున్నావు ఇవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఇదే క్రియామణ కర్మ అంటే అంటే నీ జీవితంలో కొన్ని చాప్టర్స్ ముందే సెట్ అయి ఉండవచ్చు కానీ ఆ చాప్టర్స్ తో నువ్వు ఎలా జీవిస్తావో అది నీ చేతిలోనే ఉంటుంది. నీకు బాధ వచ్చిందనుకో అది ప్రారబ్ధం కావచ్చు. కానీ ఆ బాధతో నువ్వు ఎరిగిపోతావా లేక మరింత లోతుగా ఎదుగుతావా అనేది అది నీ ఎంపిక.
(12:10) నీకు పేదరికం వచ్చిందనుకో అది ఒక కర్మ పరిస్థితి కావచ్చు. కానీ నువ్వు అక్కడే ఆగిపోతావా లేక దాన్ని వికాసంగా మార్చుకుంటావా అది నీ క్రియమన కర్మ. ఇది చాలా ఇంపవరింగ్ ట్రూత్ ఎందుకంటే వేదాలు మన చేతిలో ఏమీ లేదు అని చెప్పడం లేదు. మన చేతిలో చాలా ఉంది అని చెప్తున్నాయి. ప్రతిక్షణం మనం కొత్త కర్మను క్రియేట్ చేస్తున్నాం. అంటే జన్మ ముందే కొన్ని విషయాలు నిర్ణయమైన జీవితం మొత్తం నీకు లాక్ కాలేదు.
(12:37) అక్కడే స్వేచ్ఛ ఉంది అక్కడే సాధన ఉంది అక్కడే ఆధ్యాత్మిక వికాసం ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక అసలైన గొప్ప ప్రశ్న మరి ఈ జన్మలో నీ పని ఏమిటి అనేది ఈ ప్రశ్న అడగడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది జీవితాన్ని మొత్తం గడిపేస్తారు కానీ ఎందుకు వచ్చాము అని అడగరు ధనం సంపాదించడానికి వచ్చామా కుటుంబం కోసం వచ్చామా విజయం కోసం వచ్చామా పేరు ప్రతిష్ట కోసం వచ్చామా అని కానీ వేదాలు దీనికోసం ఒక అద్భుతమైన ఫ్రేమ్ వర్క్ ఇస్తాయి మనుష్య జీవితానికి నాలుగు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి ధర్మం అర్థం కామం మోక్షం ధర్మం అంటే నీకు తగిన కర్తవ్యాన్ని సత్యంగా నిర్వర్తించడం అర్థం అంటే
(13:16) జీవితానికి అవసరమైన సంపద సాధనను సంపాదించడం కామం అంటే జీవితంలో సహజమైన కోరికలను సంతులితంగా అనుభవించడం మోక్షం అంటే అహంకారం బంధనం అవిద్యను దాటుకొని ఆత్మ విముక్తి వైపు సాగడం ఈ నాలుగు లక్ష్యాలు అర్థమైతే జీవితంలో జరిగే ప్రతి విషయం కొత్తగా కనిపించడం మొదలవుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఆలోచిస్తావు.
(13:41) విజయం వచ్చినప్పుడు ఇది నా అహంకారాన్ని పెంచుతుందా లేక నా ధర్మాన్ని బలపరుస్తుందా అని ప్రశ్నిస్తావు. ప్రేమ విఫలమైనప్పుడు ఇది నా హృదయాన్ని పగలగొట్టడానికి వచ్చిందా లేక నాకు బంధం యొక్క అసలు స్వరూపాన్ని నేర్పించడానికి వచ్చిందా అని ఆలోచిస్తావు. నీకు అనుకోని నష్టం వచ్చినప్పుడు అది శిక్ష కాదు.
(14:02) ఇది ఒక మార్పు కావచ్చు అని అర్థం చేసుకుంటావు. ఇదే వేదాంత దృష్టి జీవితంలో ఏది అర్థం లేకుండా జరగదు ప్రతి అనుభవం లేదా నీ కర్మఫలం లేదా నీ ఆత్మకు అవసరమైన పాఠం లేదా నీ మేలుకొలుపు కోసం వచ్చిన పిలుపు అన్నీ ఒక అర్థంతోనే జరుగుతాయి. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఒకసారి నీ జీవితాన్ని వెనక్కి చూడు నీ జీవితంలో పదే పదే తిరిగి వస్తున్న సమస్య ఏది అదే నీ ఆత్మ ఇంకా పూర్తి చేయని పాఠం కావచ్చు.
(14:28) నువ్వు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుందా? అయితే అక్కడే నీకు నేర్చుకోవలసిన పాఠం ఉంది. ఎవరైనా మళ్ళీ మళ్ళీ నీ జీవితంలోకి ఒకే రకమైన బాధను కలిగిస్తున్నారా అయితే అక్కడే నీ కర్మ పాటర్న్ ఉంది. నిన్ను ఏ పని సహజంగా ఆకర్షిస్తోంది అది నీ ఆత్మకు తెలిసిన మార్గం కావచ్చు. నిన్ను ఏ దారి పిలుస్తుంది అది నీ ధర్మానికి సంకేతం కావచ్చు.
(14:52) అందుకే జీవితాన్ని కేవలం సమస్యగా చూడకుండా ఒక సంకేతంగా కూడా చూడాలి. ఈ జ్ఞానం నీకు అర్థమైన తర్వాత మొదట మారేది ఏమిటంటే నీ తల్లిదండ్రులను చూసే దృష్టి వాళ్ళు సంపూర్ణంగా ఉండకపోవచ్చు వాళ్ళు తప్పులు చేసి ఉండవచ్చు వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకోపోయి ఉండవచ్చు కానీ వాళ్ళు నీ ఆత్మ ప్రయాణంలో ఒక ఇంపార్టెంట్ పాత్రని పోషించారు. ఇది నీకు అర్థమైనప్పుడు నింద కంటే వారి మీద కృతజ్ఞత ఎక్కువవుతుంది.
(15:19) అలాగే నీ కష్టాలను చూసే దృష్టి కూడా మారుతుంది. ఎందుకు నాకే ఇలా జరిగింది అనే ప్రశ్న తగ్గిపోయి దీని వల్ల నేను ఏం నేర్చుకోవాలి అనే ప్రశ్న నీలో పుడుతుంది. ఇదే ఆధ్యాత్మిక మలుపు బాధిత భావం నుండి అన్వేషకుడి భావంలోకి మారడం ఇదే ఈ జ్ఞానం ఇచ్చే అసలైన బలం ఇప్పుడు చివరిగా ఒక్కసారి నీ జీవితాన్ని ప్రశాంతంగా చూసి ఆలోచించు నీలో పదే పదే మేల్కొనే కోరిక ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావ్? ఏ బాధ నిన్ను లోతుగా మార్చింది ఏ బంధం నిన్ను మేలుకొలిపింది? ఏ నష్టం నిన్ను నిజానికి దగ్గర చేసింది ఏ ప్రశ్న నిన్ను వదలడం లేదు అక్కడే నీ ఆత్మ పని దాగి ఉండొచ్చు అక్కడే
(15:57) నీ జన్మ రహస్యం ఉండొచ్చు అక్కడే నువ్వు ఎందుకు ఈ జీవితాన్ని ఎంచుకున్నావో అర్థం కావచ్చు ఎందుకంటే ఈ జన్మ నీ మీద బలవంతంగా పడిన జీవితం కాదు ఇది నీ ఆత్మ ప్రయాణంలో ఒక ఇంపార్టెంట్ అధ్యాయం. అందుకే ఇప్పటి నుంచి నీ జీవితాన్ని తక్కువగా అనుకోకు నీ కష్టాలను శాపంగా అనుకోకు నీ తల్లిదండ్రులను యాదృశ్చికంగా అనుకోకు నీ పుట్టుకను ఒక చిన్న సంఘటనగా చూడకు వేదాలు చెబుతున్నాయి నీ జన్మకు అర్థం ఉంది.
(16:25) నీ జీవితానికి దిశ ఉంది. నీ ఆత్మకు ఒక పిలుపు ఉంది అని కాబట్టి దాన్ని విను దాన్ని గమనించు దానితో జీవించు ఒక్కసారి నిజాయితిగా చెప్పు. నీ జీవితంలో పదే పదే వస్తున్న పాఠం ఏదని నీకు అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి కామెంట్ లో చెప్పు ఈ జ్ఞానం నీకు కొంచెమైన కొత్త దృష్టి ఇచ్చిందంటే ఎస్ అని కూడా మరొకసారి కామెంట్ చేయి ఇలాంటి మరిన్ని విశ్వ రహస్యాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి.
(16:56) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment