Saturday, April 11, 2026

దేవుడు ఎందుకు కష్టాలిస్తాడు | Why Bad Things Happen to Good People | Satyagrahi

దేవుడు ఎందుకు కష్టాలిస్తాడు | Why Bad Things Happen to Good People | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SFJBFU7mOS0



Transcript:
(00:00) మనం చేసే ప్రార్థన కన్నా మనం కలిగి ఉండే నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఈ మాట వినడానికి చాలా బాగుంది కదా కానీ నిజ జీవితంలో వచ్చేసరికి మనం దీన్ని ఎంతవరకు పాటిస్తున్నాం. ఒకసారి మీ మనసుని అడగండి జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు మనందరం చాలా గొప్పగా మాట్లాడుతాం. కానీ ఎప్పుడైతే ఒక చిన్న కష్టం తలుపు తడుతుందో మనలో ఉన్న ధైర్యం నీరుగారిపోతుంది.
(00:23) వెంటనే మన నోటి నుంచి వచ్చే మొదటి మాట దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి. చాలా మందికి భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడమో లేదా దీపం వెలిగించడమో మాత్రమే అనుకుంటారు. కానీ నిజమైన భక్తి అంటే ఫలితం మీకు అనుకూలంగా రానప్పుడు కూడా నిశ్చలంగా ఉండగలగడం. ఈరోజు మనలో చాలా మంది పడుతున్న అతి పెద్ద ఇబ్బంది ఏమిటంటే మనం దేవుడిని లేదా ప్రకృతిని ఒక బిజినెస్ పార్ట్నర్ లా చూస్తున్నాం. నేను నీకు ఇది ఇస్తాను.
(00:48) నువ్వు నాకు అది చేయని ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. కోరికలు తీరకపోతే వెంటనే నిరాశ, కోపం, చిరాకు, నాస్తికత్వం కూడా వస్తుంది. మీరు గమనించారా మన ప్రార్థనలో కృతజ్ఞత కన్నా కోరికలే ఎక్కువ ఉంటాయి. ఈ ఆందోళన ఈ అశాంతి మనల్ని లోపల చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సమస్య బయట ఎక్కడో లేదు. మన లోపల ఉన్న నమ్మకం అనే పునాది కదలడం వల్లే మనలో ఈ అలజడి మొదలవుతుంది.
(01:14) అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని వెనుకున్న అసలు కారణం మన అహంకారం. మన జీవితం మనమే నడుపుతున్నాం. ప్రతిది మన ప్లాన్ ప్రకారమే జరగాలి అనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే మన ప్లాన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు మనం తట్టుకోలేం. నిమ్ కరోలి బాబా గారు చెప్పిన ఒక గొప్ప మాట ఉంది. అంతా ఆయన ఇష్టం.
(01:34) ఇక్కడ ఆయన అంటే కేవలం ఒక దేవుడని కాదు ఈ విశ్వాన్ని నడిపించే ఒక మహా శక్తి అని అర్థం. మనం సమస్యల్లో ఉన్నప్పుడు బయట పడటానికి ప్రధాన కారణం ఏంటి? మనకి రాబోయే కాలం మీద నమ్మకం లేకపోవడం. మనం కేవలం ప్రస్తుత క్షణంలో ఉన్న నష్టాన్ని చూసి కుంగిపోవడం. కానీ ఆ నష్టం వెనుక దాగి ఉన్న పెద్ద లాభాన్ని లేదా ఒక పెద్ద పాటాన్ని మనం చూడలేం.
(01:56) నమ్మకం కోల్పోవడం అనేది ఒక మనిషికి జరిగే అతి పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైతే నయం చేసుకోవచ్చు. కానీ తనని నడిపించే శక్తి మీద నమ్మకం కోల్పోతే ఆ మనిషి మానసిక శక్తి పూర్తిగా కోల్పోతాడు. చీకటి గదిలో ఉన్నప్పుడు దీపం లేకపోవడం కన్నా కళ్ళు లేకపోవడం ఎంత ప్రమాదమో కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మకం లేకపోవడం అంతకన్నా ప్రమాదం ఈ అపనమ్మకం వల్లనే మనకి ఒత్తిడి డిప్రెషన్ వస్తూ ఉంటాయి మరి ఈ స్థితి నుంచి బయటపడటం ఎలాగా దీనికి పరిష్కారం చాలా సరళమైనది కానీ ఆచరించడానికి కొంచెం పట్టుదల కావాలి అదే శరణాగతి శరణాగతి అంటే
(02:34) చేతులు ఎత్తేయడం కాదు నా వల్ల అయినంత కష్టపడతాను ఆ పైన ఫలితం ఆ విశ్వానికి వదిలేస్తాను అని నమ్మడం నీమ్ కరోలిీ బాబా జీవితం మనం నేర్చుకోవాల్సింది ఇదే ఆయన దగ్గరికి వచ్చే భక్తులకి ఆయన పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందరికీ ప్రేమను పంచండి అందరికీ సేవ చేయండి భగవంతుని స్మరించండి అని మాత్రమే చెప్పారు. ప్రతిదీ మన మంచికే జరుగుతుందని నమ్మటం మొదలు పెట్టిన రోజు మీ మనసు నుంచి సగం భారం తగ్గిపోతుంది.
(03:04) ఒక తలుపు మూసుకుపోయిందంటే దానికన్నా మెరుగైన తలుపు మరొకటి తెరుచుకుంటుందని అర్థం. ఆ నమ్మకం మీలో ఉన్నప్పుడు మీరు కష్టాన్ని చూసి భయపడరు. దాన్ని ఒక అనుభవంగా స్వీకరిస్తారు. మీరు ఆందోళన చెందడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కేవలం మీ శక్తి మాత్రమే వృధా అవుతుంది. మీ అహంకారాన్ని పక్కన పెట్టి నేను నిమిత్త మాత్రున్ని మాత్రమే అని భావించినప్పుడు ఆ విశ్వమే మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తుంది.
(03:29) ఇది కేవలం మాటలు కాదు, ఒక అద్భుతమైన అనుభవం. ఆ అనుభవం కలగాలంటే ముందు మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వాలి. సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? దీనికి ఒక చిన్న రహస్యం ఉంది అదే కృతజ్ఞత ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మీ దగ్గర ఉన్న వాటిని గౌరవించడం నేర్చుకోండి ఉదాహరణకి కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి అది చాలు మనిషికి కళ్ళు కనిపిస్తున్నాయి చెవులు వినిపిస్తున్నాయి నడవగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం ఇవి చాలు కదా మనకు లేని వాటి గురించి ఏడవడం కన్నా ఉన్న వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. మీకున్న ఈ
(04:07) ప్రాణం ఈ శరీరం చుట్టూ ఉన్న మనుషులు ఇవన్నీ ఒక అద్భుతం కదా కష్టకాలంలో కూడా ఇది కూడా గడిచిపోతుంది అనే ధైర్యంతో ఉండండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రపు అలలు ఎలాగైతే పైకి లేచి మళ్ళీ కిందకి పడతాయో జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అంతే మీరు చేయాల్సిందల్లా మీ పనిని మీరు నిబద్ధతతో చేయండి. మిగిలినది ఆ శక్తికి వదిలేయండి.
(04:32) నిరంతరం కృతజ్ఞతతో ఉండే మనసులోకి ప్రతికూల ఆలోచనలు రావు. ఎప్పుడైతే మీరు కంప్లైంట్స్ చేయడం ఆపేసి ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరే గమనిస్తారు కాబట్టి మారాలి అంటే రేపటి వరకు అక్కర్లేదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి బాయ్

No comments:

Post a Comment