స్వార్థము వదిలి బ్రతికితే
వ్యర్థమైన బ్రతుకునకు
అర్థము చేకూర్చే నిజమైన
పరమార్థము తెలిసేనా?
దొరకని తీరాలతో
ఇరుకున పడ్డ హృదయపు
కొరుకుడు పడని కాలపు
జాలము తెలిసేనా?
మమకారపు మాయలతో
అహంకారపు గుప్పెట చిక్కి
తిరస్కారపు బారిని పడక
కనికారం దొరికే దారి తెలిసేనా?
అవమానపు బాధలు
బహుమానంగా ఇచ్చి
అభిమానించే బంధాలను
అనుమానించడం తెలిసేనా?
చేరిక లేని మనసులకు
కోరిక కలిగేలా చేసే
తీరిక దొరికే బాటను చూపే
పూనిక మనసుకు తెలిసేనా?
కలిమికి అందక వెలిగే
విలువల వెల తెలిసి
చెలిమిని సొంతం చేసుకునే
బలిమిని కానుక ఇమ్మని వేడుతూ..
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment