Friday, April 10, 2026

చాణక్యుని గురించి మీకు తెలియని రహస్యాలు | Unknown Facts About Chanakya in Telugu | Chanakya History

చాణక్యుని గురించి మీకు తెలియని రహస్యాలు | Unknown Facts About Chanakya in Telugu | Chanakya History

Author Name:VRV Facts In Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@VRVFactsInTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yLt3dd_jkvM



Transcript:
(00:02) మిత్రులారా ఒకే ఒక బ్రాహ్మణుడు ఒక మహా సామ్రాజ్యాన్ని కోల్చేయగలడా అతనికి జరిగిన ఒకే ఒక్క అవమానం వలన భారతదేశ చరిత్ర మారిపోయిందా అతడి ఒక్క శపదం వలన కొన్ని తరాల భవిష్యత్తును నిర్దేశించగలిగిందా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే 2400 సంవత్సరాల క్రితం మన దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇది ఒక బ్రాహ్మణుడి కథ కాదు.
(00:25) ఇది ఒక యుగాన్ని శాసించిన మేధావి చరిత్ర. ఒక సామాన్య బ్రాహ్మణుడు అఖండ భారత నిర్మాణానికి పునాది వేసిన ఆచార్య చాణక్యుడి అద్భుతమైన చరిత్ర. అలాంటి చాణక్యుడి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి. [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(01:13) [సంగీతం] [సంగీతం] క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం మన దేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. వీటిని మహాజనపదాలు అనేవారు. ఆ సమయంలో తక్షశీల ప్రాంతంలోని చెనక గ్రామంలో శనకుడు మరియు శనేశ్వరి అనే ఒక నిరుపేద బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారు గొప్ప పండితులు ధర్మనిష్టాపరులు. ఆ దంపతుల జీవితంలో అన్నీ ఉన్నా సంతానం లేదనే లోటు వారిని వేధిస్తూ ఉండేది.
(01:48) వారు చేసిన పూజల ఫలితమో లేక ఆ భగవంతుడే భారతదేశ భవిష్యత్తును మార్చడానికి ఒక శక్తిని పంపించాలనుకున్నాడో ఏమో శనేశ్వరి గర్భం దాల్చి ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కానీ ఆ పిల్లాడిని చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మరికొందరు భయపడ్డారు కూడా ఎందుకంటే అప్పుడే పుట్టిన ఆ పిల్లాడి నోట్లో అప్పటికే ఒక పన్ను మొలిచింది. అది అపూర్వం అసాధారణం.
(02:11) ఆ పిల్లాడి జాతకాన్ని చూసిన ఒక జ్యోతిష్యుడు చనకుడితో ఇలా అన్నాడు ఓ చనక నీ పుత్రుడు సామాన్యుడు కాదు పుట్టుకతోనే పండుతో పుట్టడం రాజయోగానికి సంకేతం ఇతడు మహారాజు అయి రాజ్యాలను ఏలుతాడు. కానీ రాజు అయితే తన కుటుంబాన్ని తన వాళ్ళను దూరం చేసుకుంటాడు. అధికారం రాజభోగాలు అతడిని ఒంటరిని చేస్తాయి. అయితే దీనికి ఇంకో మార్గం కూడా ఉంది.
(02:38) నీ కుమారుడు రాజు కాకపోతే రాజులను సృష్టించేవాడు అవుతాడు. ఇతడి వ్యూహాల ముందు ఇతడి మేదస్సు ముందు ఎంతటి రాజులైనా తలవంచాల్సిందే నీ కొడుకు చక్రవర్తులను నడిపించే సూత్రధారి అవుతాడు అన్నాడు. ఆ జ్యోతిష్యుడి మాటలు విన్న జనకుడికి తన కొడుకు రాజుగా మారి తమకు దూరం కావడం ఇష్టం లేదు. తన పుత్రుడు తనతోనే ధర్మ మార్గంలోనే ఉండాలని కోరుకున్నాడు. అందుకే తన కుమారుడి రాజయోగాన్ని ఖండించడానికి ఆ పిల్లాడి పంటిని తీసివేయించాడు.
(03:05) భవిష్యత్తులో తన పుత్రుడు రాజ్యాధికారానికి దూరంగా జ్ఞాన మార్గంలో పయనిస్తాడని జనకుడు భావించాడు. కానీ విధిరాతను ఎవరు మార్చగలరు ఆ పిల్లాడి పను తీసేసిన నుదిటి రాతను ఎవరు చెరపలేరు. ఆ అబ్బాయికి విష్ణుగుప్తుడు అని నామకరణ చేశారు. చనకుడికి పుట్టాడు కాబట్టి తన తండ్రి పేరు వలన చాణక్యుడు అయ్యాడు. అయితే విష్ణుగుప్తుడి బాల్యం మిగతా పిల్లల్లా కాదు.
(03:30) అతనికి ఆటల మీద కన్నా అక్షరాల మీదే ఆసక్తి ఎక్కువ. తన తోటి పిల్లలు గోలీలాడుతుంటే అతడు మాత్రం చెట్టు కింద కూర్చొని పండితులతో వాదనలు చేసేవాడు. విష్ణుగుప్తుడి ప్రశ్నలకు ఆ పండితులే కొన్నిసార్లు తలలు పట్టుకునేవారు. విష్ణుగుప్తుడి తండ్రి చెనకుడే అతనికి మొదటి గురువు పురాణాలు, శాస్త్రాలు, వేదాలు ఇలా తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని అవలీలుగా నేర్చుకునేవాడు.
(03:53) అయితే ఒకసారి చిన్న వయసులో ఉన్న విష్ణుగుప్తుడు తన తల్లితో కలిసి నడుస్తుండగా దారిలో అతని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. [సంగీతం] అప్పుడు ఆ ముల్లును తీసేసి ఆ గాయానికి మందు రాసింది తల్లి. కానీ ఆ పిల్లవాడు అక్కడితో ఆగలేదు. విష్ణుగుప్తుడు కొంచెం మజ్జిగా తీసుకొని ఆ ముల్లపొద మొదట్లో పోయడం మొదలు పెట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయిన తల్లి విష్ణుగుప్త ఏం చేస్తున్నావు అని అడిగింది.
(04:15) అప్పుడు ఆ పిల్లవాడు ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు. అమ్మ ఈ ముల్లు నా కాలికి గుచ్చుకొని నన్ను బాధ పెట్టింది. ఈ ముల్ల పొదను ఇక్కడే వదిలేస్తే రేపు ఇంకెంతో మందిని గాయపరుస్తుంది. అందుకే ఈ ముల్లపొద మొదట్లో పుల్లటి మజ్జిగా పోస్తున్నాను. దానివల్ల చీమలు వచ్చి ఈ పొదను మొత్తం తినేస్తాయి. ఏదైనా సమస్యను పైపైన తుడిచేయడం కాదు అమ్మ మూలాల నుండి పెకిలించి వేయాలి అన్నాడు.
(04:39) అప్పుడు ఆ తల్లికి నోట మాట రాలేదు. అంత చిన్న వయసులోనే శత్రువును సమూలంగా ఎలా నాశనం చేయాలో ఆలోచించిన అతని తెలివి భవిష్యత్తులో ఒక మహా సామ్రాజ్యపు పునాదులనే కదిలించబోతుందని ఆ తల్లి అప్పుడు ఊహించి ఉండదు. ఎప్పుడైనా సమస్యను చూసి భయపడటం కాదు దాని మూలాలను కనుగొని నాశనం చేయాలి. ఇదే చాణక్య నీతికి పునాది. అయితే విష్ణుగుప్తుని జ్ఞానదాహం చెనక గ్రామంలో తీరేది కాదు.
(05:06) ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా కేంద్రం జ్ఞానానికి స్వర్గధామం అయిన తక్షశిల విశ్వవిద్యాలయకు వెళ్ళవలసిన సమయం వచ్చింది. తక్షశిల అది కేవలం ఒక యూనివర్సిటీ కాదు అది ఒక విజ్ఞాన ప్రపంచం. ప్రపంచ దేశాల నుండి రాజకుమారులు పండితుల పిల్లలు వచ్చి అక్కడ విద్యను అభ్యసించేవారు. తక్షశీలలో రాజనీతి, యుద్ధతంత్రం, జ్యోతిష్యం, అర్థశాస్త్రం, వైద్యం, తర్కం ఇలా 64 కలలలో శిక్షణ ఇచ్చేవారు.
(05:34) అలాంటి తక్షశీలలో 15 ఏళ్ల విష్ణుగుప్తుడును అడుగుపెట్టాడు. అతని అపారమైన జ్ఞాపక శక్తి, చురుకుదనం, తార్కిక ఆలోచనా విధానం అక్కడి ఆచార్యులను మంత్రములను చేశాయి. విష్ణుగుప్తుడు ఏ శాస్త్రాన్నైనా ఒక్కసారి వింటే చాలు దానిని పూర్తిగా గ్రహించేవాడు. అలా కొద్ది కాలంలోనే విద్యార్థిగా వెళ్ళిన విష్ణుగుప్తుడు తక్షశిల ఆచార్యులకి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
(05:55) విష్ణుగుప్తుని ప్రతిభను గుర్తించిన తక్షశిల అతడిని విద్యార్థి నుండి ఆచార్యుడిగా మార్చింది. ఆ విధంగా విష్ణుగుప్తుడు ఆచార్య చాణక్యుడు అయ్యాడు. అయితే ఆయన బోధించే విధానం కొత్తగా ఉండేది. కేవలం గ్రంథాల్లో ఉన్నది చెప్పడమే కాదు కథలతో నిజ జీవిత ఉదాహరణలతో విద్యార్థుల మెదడుకు పదును పెట్టేవాడు. చాణక్యుడు తరగతి గది ఒక ఆలోచన ప్రయోగశాలలా ఉండేది.
(06:19) రాజ్యం అంటే ఏంటి మహారాజు ఎలా ఉండాలి అసలు పన్నులు ఎందుకు వసూలు చేయాలి మిత్రువులను ఎలా కాపాడుకోవాలి? శత్రువులతో ఎలా వ్యవహరించాలి లాంటి ప్రశ్నలకు చాణక్యుడు చెప్పే సమాధానాలు ఆనాటి రాజకీయ పరిస్థితులకు అర్థం పట్టేవి. అయితే తక్షశిలలో ఆచార్య చాణకుడు జ్ఞానబోధ చేస్తున్న సమయంలో పశ్చిమం నుండి ఒక పెను తుఫాను భారతదేశం వైపు దూసుకొస్తుంది. అదే ప్రపంచ విజేత కావాలని కలలు కంటున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అతను పర్షియన్ సామ్రాజ్యాన్ని కూల్చి మధ్య ఆసియాను దాటి ఆపై హిందూ కుష్ పర్వతాలను అధిగమించి అలెగ్జాండర్ సైన్య సింధూ నది తీరానికి చేరుకుంది. అలెగ్జాండర్ లక్ష్యం ఒకటే
(06:54) సంపదలతో తులుతూగుతున్న భారతదేశాన్ని ఆక్రమించుకోవడం కానీ ఆ సమయంలో భారతదేశం పరిస్థితి బాగాలేదు. రాజుల మధ్య నమ్మకం ఐక్యత లేదు. పక్క రాజ్యంపై దాడి చేసి తమ సరిహద్దులను పెంచుకోవాలని స్వాగర్థం తప్ప భారతదేశం మొత్తాన్ని ఒకటిగా చూసే దృష్టి ఏ రాజుకి లేదు. అయితే తక్షశల పాలకుడైన అంబి అలెగ్జాండర్ తో యుద్ధం చేయకుండా అతనికి సాగిలపడి స్వాగతం పలికాడు.
(07:18) అంబికి పొరుగురాజు జీలం నది అవతల ఉన్న పౌరవ రాజ్యాధిపతి పురుషోత్తమునిపై పగతో అంబి అలెగ్జాండర్ కు సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. జరుగుతున్న పరిణామాలన్నీ తక్షశిలలో ఉన్న చాణక్యుడిని తీవ్రంగా కలిచివేశాయి. ఒక విదేశీయుడు మన దేశానికి వచ్చి మన రాజుల మధ్య ఉన్న గొడవలని ఆసరాగా చేసుకొని మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వస్తుంటే ఈ రాజులంతా ఏం చేస్తున్నారు? విదేశీయుడితో పోరాడకుండా అతనికి దాసోహం అంటున్నారు.
(07:44) ఇది మన దేశానికి ఎంతో పెద్ద అవమానం సమస్య అలెగ్జాండర్ కాదు మన రాజులలో ఐక్యత లేకపోవడమే అసలు సమస్య. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒకే చక్రవర్తి కింద ఒక అఖండమైన శక్తిగా మారనంత కాలం అలెగ్జాండర్ లాంటి విదేశీయులు వస్తూనే ఉంటారు మనల్ని దోచుకుంటూనే ఉంటారు. అప్పుడే మొట్టమొదటిసారి చాణక్యుడి మదిలో అఖండ భారతం అనే బీజం వేసింది.
(08:08) ఆచార్య చాణక్యుడు తక్షశిలలో ఉండలేకపోయాడు. జ్ఞానబోధన చేసే సమయం ఇది కాదని దేశాన్ని మేల్కొల్పవలసిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద సామ్రాజ్యమైన మగధ రాజ్యం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎందుకంటే మగధ చక్రవర్తి ఒక పిలుపునిస్తే మిగతా రాజులందరూ ఏకమై అలెగ్జాండర్ ను తరిమి కొట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు.
(08:31) అందుకే చాణక్యుడు మగధ చక్రవర్తిని కలిసి భారతదేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించి రాజులందరినీ ఏకం చేయమని కోరాలని అనుకున్నాడు. కానీ చాణక్యుడు ఊహించలేదు. ఆ ప్రయాణం తన జీవితాన్నే కాదు మొత్తం భారతదేశ భవిష్యత్తుని మార్చేస్తుందని ఆనాటి భారతదేశంలో అత్యంత ధనిక శక్తివంతమైన నగరం పాటలీ పుత్రం ఇది నందవంశ చక్రవర్తుల రాజధాని స్వర్గాన్ని తలపించే రాజప్రసాదంలో మగధ సింహాసనాన్ని చక్రవర్తి ధననందుడు అధిష్టించి ఉన్నాడు.
(09:01) పేరుకు తగ్గట్టే ధననందుడికి ధనం మీద ఉన్న యావ మరే దాని మీద లేదు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వారి రక్తాన్ని పీల్చి పనులు వసూలు చేస్తూ తన ఖజానాను నింపుకోవడమే ధరనందుడు ఏకైక లక్ష్యం. ఇతడు మహా పరాక్రమవంతుడైన మహా పద్మనందుడి కుమారుడే కానీ తండ్రిలోని పరాక్రమం ఇతనికి రాలేదు. తన తండ్రి అధికారం సంపాదించిన అపారమైన సంపద ఇతనిలో అంతులేని అహంకారాన్ని నింపాయి.
(09:26) ప్రజలు అతడిని చూసి భయపడేవారు కానీ మనసులో అసహించుకునేవారు. అలాంటి ధననందుడి ఆస్థానానికి ఆచార్య చాణక్యుడు దేశభక్తి అనే నిప్పును గుండెల్లో మోసుకుంటూ వచ్చాడు. చాణక్యుడు వచ్చిన సమయానికి రాజప్రసాదంలో ఒక పెద్ద దానసత్ర నడుస్తుంది. బ్రాహ్మణులను పండితులను ఆహ్వానించి ధననందుడు వారందరికీ భోజనం పెట్టి దానధర్మాలు చేస్తున్నాడు.
(09:49) అది ధననందుడు మంచితనానికి నిదర్శనం కాదు తన గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికి చేస్తున్న ఒక ప్రదర్శన మాత్రమే ఆ దానసత్రంలోకి చాణక్యుడు ప్రవేశించాడు. అయితే అక్కడ ప్రధాన ఆచార్యుడి కోసం ఒక ఉన్నతమైన ఆసనం ఏర్పాటు చేయబడి ఉంది. దానిపై కూర్చోవడానికి మిగతా పండితులఎవరు సహసించడం లేదు. కానీ ఆచార్య చాణక్యుడు తన అర్హతపై ఉన్న నమ్మకంతో నిస్సంకోచంగా వెళ్లి ఆ ఆసనంపై ఆశనుడయ్యాడు.
(10:16) అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఈయన ఇంత ధైర్యం ఎక్కడిది ఎక్కడి నుండి వచ్చాడు రాజుగారి అనుమతి లేకుండా ప్రధాన ఆసనాన్ని అధిష్టించాడు అని మాట్లాడుకుంటున్నారు. వెంటనే ఈ విషయం గూడచారుల ద్వారా విలాసాలు తేలియాడుతున్న ధననందుడికి చేరింది. కోపంతో రగిలిపోతున్న ధననందుడు ఆ దానసత్రంలోకి ప్రవేశించాడు. అందవిహీనంగా బక్కపరచగా సాదాసీద బట్టల్లో ఉన్నతాసనంపై కూర్చున్న చాణక్యుడిని చూడగానే ధననందుడి కళ్ళు ఎర్రబడి అహంకారం కట్టలు తెంచుకుంది.
(10:45) అక్కడున్న వారందరూ వినేలా హేలనగా అవమానకరంగా పగలబడి నవ్వుతూ ఇలా అరిచాడు. నా ఆసనంపై కూర్చోవడానికి ఎంత ధైర్యం వీడికి వీడిని పండితుడని పిలిచింది ఎవరు రూపం చూస్తే బిచ్చగాడిలా ఉన్నాడు. సైనికులారా తక్షణమే వీడిని నా కళ్ళ ముందు నుండి ఈడ్చి బయట పడేయండి అన్నాడు. సైనికులు వచ్చి అత్యంత దారుణంగా చాణక్యుడి జుట్టు పట్టుకొని ఈడ్చి ఆసర నుండి కిందకు లాగారు.
(11:11) అయితే ఈ గొడవలో బ్రాహ్మణులు ఎంతో పవిత్రంగా భావించే ఆయన శిఖ అంటే జుట్టుముడి ఊడిపోయి జుట్టు విరబోసుకుంది. అంతే ఆ సమయం ఆచార్య చాణక్యుడు అనే ఒక పండితుడు మరణించి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఒక ప్రచండమైన శక్తి జన్మించింది. అతని కళ్ళు అగ్ని పర్వతంలా మండుతున్నాయి. ధననందుడు ఇంకా హేలనగా నవ్వుతూనే ఉన్నాడు. కింద పడిన చాణక్యుడు నెమ్మదిగా లేచి నిలబడి ఇలా అన్నాడు.
(11:34) అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మూర్ఖుడా నువ్వు అవమానించింది నన్ను కాదు నా రూపంలో ఉన్న జ్ఞానాన్ని ఈ దేశ భవిష్యత్తు కోసం నేను తెచ్చిన ఆశను ఊడ్చి పడేశవు. ఈరోజు ఈ నిండు సభ సాక్షిగా నేను ఒక శపదం చేస్తున్నాను. నాకు ఈ అవమానం జరగడానికి కారణమైన నిన్ను నీ విలాసాలను నీ సర్వస్వాన్ని నీ అహంకారాన్ని నాశనం చేసే వరకు నీ నంద వంశాన్ని సమూలంగా నాశనం చేసే వరకు నేను నా శిఖను ముడివేయను.
(12:02) ఎప్పుడైతే నీ వంశం అంతరించి నీ నెత్తురుతో ఈ మగదీల తడుస్తుందో ఆ నెత్తురి చేతులతోనే నా ఈ శిఖను తిరిగి ముడివేస్తాను అని శబదం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఒంటరిగా మిగిలిపోయిన ఆ బ్రాహ్మణుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వెనుక సైన్యం లేకుండా ఆకాశమంతా ఎత్తున ఉన్న మగధ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలడు? ఒక సామాన్య బాలుడిని అఖండ భారత చక్రవర్తిగా మార్చిన అద్భుత ప్రయాణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
(12:29) చాణక్యుడి ముందున్నది ఒకే ఒక ప్రశ్న. అపారమైన ధనబలం అంతులేని సైనిక బలం ఉన్న మగధ చక్రవర్తి ధననందుడిని ఎలా ఓడించాలి? దానికి సమాధానం ఒకటే ఒక ఆయుధం కావాలి. కానీ అది బాణం కాదు కత్తి కాదు ఉక్కుతో చేసిన ఆయుధం అంతకంటే కాదు ఒక సజీవమైన ఆయుధం కావాలి. ధననందుడి పాలన పట్ల విసిగిపోయిన ప్రజలందరినీ ఏకం చేయగల ఒక అయస్కాంతం కావాలి.
(12:55) నాయకత్వ లక్షణాలు ధైర్యం పరాక్రమం ప్రజల పట్ల ప్రేమ ఉన్న ఒక యువకెరటం కావాలి. తన ఆలోచనలకు ప్రాణం పోసి తన వ్యూహాలకు ఆకారం ఇచ్చి తన శపదాన్ని నెరవేర్చగల ఆయుధం కోసం చాణక్యుడి అన్వేషణ మొదలైంది. పాటలీ పుత్ర నుండి బయటకు వచ్చిన చాణక్యుడు మగధ సామ్రాజ్యంలోని గ్రామ గ్రామాన తిరిగాడు. ఎక్కడ చూసినా ధననందుడి అధికారులు ప్రజలను పీక్కు తింటున్నారు.
(13:17) ప్రజల కలలో నిస్సహాయత. న్యాయం ధనవంతులకే చుట్టంగా మారింది. పన్నుల భారం మోయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది చాణక్యుడు ప్రతీకారాగ్నికి మరింత ఆజ్యం పోసింది. తన శపదం కేవలం వ్యక్తిగతమైనది కాదని భారతదేశ ప్రజల విముక్తి కోసం అని గ్రహించాడు. చాణక్యుడు పోరాటం ధననందుడిపై కాదు ఆ రాక్షస పాలనపై అని అర్థమైంది. చాణక్యుడు ఎంతో మంది యువకులను పరిశీలించాడు. సేనాధిపతులను గమనించాడు.
(13:44) రాజకుమారులను కలిశాడు. కానీ ఎవరిలోనూ తాను వెతుకుతున్న ఆ నిప్పు కనిపించలేదు. కొందరికి జ్ఞానం ఉంది కానీ ప్రజలను నడిపించే ఆకర్షణ లేదు. కొందరికి ధైర్యం ఉంది కానీ వివేకం లేదు. చాలా మంది ధననందుకి భయపడి బ్రతికే పిరికి వాళ్లే రోజులు గడుస్తూ వారాలు నెలలుగా మారుతున్నాయి. ఎంతకాలం అయినా అతని అన్వేషణ ఫలించడం లేదు.
(14:09) అసలు నా శపదం నెరవేరుతుందా? ఇంతకీ నేను ఊహించుకుంటున్న నాయకుడు అసలు ఉన్నాడా లేక అది నా బ్రమ అని తనకు తానే ప్రశ్నించుకునేవాడు. కానీ తన విరబోసుకున్న జుట్టును చూసుకున్న ప్రతిసారి అతనిలోని నిరాశ ఆవిరై పట్టుదల పదింతలు అయ్యేది. అయితే అలసిపోయిన చాణక్యుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమంది పిల్లల కేకలు వినిపించాయి.
(14:30) చాణక్యుడు అటువైపు చూశాడు. అక్కడ 10 12 ఏళ్ల వయసు పిల్లల గుంపు రాజకీలం అనే ఆట ఆడుకుంటున్నారు. అంటే రాజుగారి ఆట. ఆ పిల్లల గుంపులో ఒక బాలుడు ఒక పెద్ద రాయిని సింహాసనంగా చేసుకొని దానిపై రాజులా కూర్చున్నాడు. అతని మాటలో చూపులో నడకలో ఒక తెలియని అధికారం గంభీరత ఉన్నాయి. ఆ పిల్లల సమస్యలకు అతను రాజులాగా ఊహించుకొని తీర్పు చెప్పడం చూసి చెట్టు చాటున ఉన్న చాణక్యుడు స్తంభించిపోయాడు.
(14:57) ఒక మహా చక్రవర్తికి ఉండాల్సిన వివేకం న్యాయదృష్టి అన్ని ఆ బాలుడిలో ఉన్నాయి. ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు ఇతను పుట్టుకతోనే రాజు తాను వెతుకుతున్న వజ్రం దొరికిందని చాణక్యుడు సంతోషించాడు. ఆట ముగిసిన తర్వాత చాణక్యుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్లి బాలక నీ పేరు ఏమిటి అని అడిగాడు. చంద్రగుప్తుడు అని గంభీరంగా సమాధానం ఇచ్చాడు. చాణక్యుడు వెంటనే ఆ బాలుడి తల్లి దగ్గరికి వెళ్లి చంద్రగుప్తుడికి గొప్ప విద్యను అందించి ఉన్నత స్థానంలో నిలబడతానని మాట ఇచ్చి తనతో పాటు తీసుకువెళ్తానని కోరాడు.
(15:29) ఆ బాలుడి తల్లి అందుకు అంగీకరించగా అఖండ భారత చక్రవర్తిగా మార్చే బాధ్యతను ఆచార్య చాణక్యుడు స్వీకరించాడు. అలా వారిద్దరి ప్రయాణం ఆ రోజు మొదలైంది. చాణక్యుడు చంద్రగుప్తుడిని తక్షశిలకు తీసుకువచ్చాడు. ఆ బాలుడు వజ్రం లాంటివాడు కానీ వజ్రం ప్రకాశించాలంటే దాన్ని సానబెట్టాలి. చాణక్యుడు చంద్రగుప్తుడిని కేవలం ఒక యోధుడిగా కాదు ఒక సంపూర్ణ పాలకుడిగా తీర్చిదిద్దడం మొదలు పెట్టాడు.
(15:54) అలా ఎనిమిది సంవత్సరాలు చంద్రగుప్తుని జీవితం ఒక కఠోరమైన తపస్సులా సాగింది. ప్రపంచంలోని అత్యుత్తమ యోధుల వద్ద గదా యుద్ధం అశ్వశాస్త్రం, కత్తిసాము, విలువిద్య ఇలా ప్రతి యుద్ధ విద్యలోనూ ఆరి తేరేలా చేశాడు. చాణక్యుడు స్వయంగా గురువై చంద్రగుప్తుడు మెదరకు పదును పెట్టి అర్థశాస్త్రం, దండనీతి, వ్యూహ రచన నేర్పించాడు. అయితే ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుడితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా ఒక గుడిసెలో ఒక తల్లి తన బిడ్డకు వేడి రొట్టి తినడానికి ఇచ్చింది.
(16:25) అప్పుడు ఆ బాలుడు ఆత్రంగా రొట్టె మధ్యలో చెయ్యి పెట్టి చెయ్యి కాల్చుకున్నాడు. ఆ తల్లి రొట్టెను అంచల నుండి కొద్ది కొద్దిగా తింటే చెయ్యి కాలదు అని చెప్పింది. చూసావా చంద్రగుప్త ఒక సామాన్య తల్లి కూడా మనకు ఎంత గొప్ప పాఠం చెప్పిందో మన లక్ష్యం మగధ సింహాసనమే కానీ మన మొదటి దారి పాటలీ పుత్రంపై ఉండకూడదు. మనం ముందుగా ధననందు పాలనలో బలహీనంగా ఉన్న సరిహద్దు రాజ్యాలను గెలవాలి.
(16:51) అంతేకాదు మన సైన్యాన్ని పెంచుకొని ప్రజల మద్దతును కూడగట్టాలి. చిన్న చిన్న రాజ్యాలు మన వశం చేసుకున్న తర్వాత అప్పుడు కేంద్రంపై దాడి చేయాలి. అప్పుడు విజయం మనదే అన్నాడు. అయితే ఒకరోజు చాణక్యుడు చంద్రగుప్తుడిని ఒక ఎత్తన కొండపైకి తీసుకువెళ్ళాడు. ఆ కొండపై నుండి చూస్తే భారతదేశపు వాయువ్య సరిహద్దు ప్రాంతాలు కనిపిస్తున్నాయి. చాణక్యుడు ఆ దిశగా చూపిస్తూ చంద్రగుప్తుడితో ఇలా అన్నాడు.
(17:16) అవే అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత గ్రీకుల పాలనలో మగ్గిపోతున్న ప్రాంతాలు ఈ గడ్డ మనది కానీ దాన్ని విదేశీయులు పాలిస్తున్నారు. మనం అక్కడికి వెళ్లి విదేశీ పాలన నుండి వారికి విముక్తి కల్పిద్దాం. వారి మద్దతే మన బలం అవుతుంది. వారే మన సైన్యం అవుతారు. మొదట మన దేశం నుండి ఈ గ్రీకులను తరిమికొడదాం. ఆ తర్వాత మన దృష్టిని పాటలీ పుత్రం వైపు సారిద్దాం అన్నాడు.
(17:39) ఆచార్య చాణక్యుడి మాటలు చంద్రగుప్తుడి రక్తంలో ఉత్తేజాన్ని నింపాయి. చంద్రగుప్తుడు తన కత్తిని దూసి తన లక్ష్యం వైపు చూశాడు. చాణక్యుడు ప్రణాళిక ప్రకారం వారి మొదటి లక్ష్యం మగద కాదు వారి మొదటి అడుగు అలెగ్జాండర్ మన దేశం నుండి వెళ్ళిపోయాక అతని ప్రతినిధులు పాలిస్తున్న వాయువ్య సరిహద్దు ప్రాంతాలు. చాణక్యుడు తెరవెనుక ఉండి వ్యూహాలు రచిస్తుంటే చంద్రగుప్తుడు వాటిని యుద్ధభూమిలో అమలుపరిచాడు.
(18:01) వారు పాటించింది గెరిల్లా యుద్ధతంత్రం అంటే మెరుపు దాడులు చేసి శత్రువుల సరఫరా మార్గాలను దెబ్బతీయడం. అలా చంద్రగుప్తుడు చిన్న చిన్న గ్రీకు సైనిక స్థావరాలపై దాడి చేసేవాడు. ప్రతి విజయంతో మాజీ సైనికులు స్థానిక యువకులు గిరిజనులు వచ్చి అతని సైన్యంలో చేరేవారు. వందల మంది సైన్యం వేల మందిగా మారారు. చంద్రగుప్తుడు కేవలం ఒక యోధుడిలా కాకుండా తమలో ఒకడిగా తమను రక్షించడానికి వచ్చిన దేవుడిలా ప్రజలకు కనిపించాడు.
(18:29) ఆచార్య చాణక్యుడు రాజనీతి చంద్రగుప్తుడు పరాక్రమం ముందు గ్రీకు సేనాధిపతులు నిలవలేకపోయారు. కొన్ని సంవత్సరాల్లోనే వాయువ్య భారతదేశం మొత్తం విదేశీ పాలన నుండి విముక్తి పొందింది. ఇప్పుడు ఆ ప్రాంతం చంద్రగుప్తుడి ఆధీనంలోకి వచ్చి ఒక రాజ్యం లాగా ఏర్పడింది. ప్రజల మద్దతుతో పాటు లక్షలాది సైనికులతో కూడిన ఒక అజయమైన సైన్యం ఉంది. గ్రీకులపై సాధించిన విజయంతో చంద్రగుప్తుడి సైన్యంలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.
(18:54) మగధ రాజ్యాన్ని జయించడం సులభమే అని వారు భావించారు. కానీ ధననందుడు బలహీనుడు కావచ్చు అహంకారి కావచ్చు కానీ అతని సైన్యం చాలా పెద్దది శక్తివంతమైనది. నంద సామ్రాజ్యం యొక్క సైనిక శక్తి ముందు చంద్రగుప్తుడి సైన్యం భారీ నష్టాలను చవి చూసి వెనుక తిరగాల్సి వచ్చింది. సైనికులలో నిరాశ ఆవహించింది. ఇది వారికి తగిలిన మొదటి పెద్ద దెబ్బ.
(19:19) తర్వాత చాణక్యుడి కొత్త వ్యూహం మొదలైంది. మగధ సామ్రాజ్యం జోలికి వెళ్ళకుండా దాని సరిహద్దు రాష్ట్రాలపై దాడులు చేయడం ప్రారంభించారు. ఎక్కడైతే ప్రజలు నందరాజుల పట్ల కోపంగా ఉన్నారో అక్కడ విప్లవాలను ప్రోత్సహించారు. ధననందుడి పాలనపై అసంతృప్తితో ఉన్న స్థానిక పాలకులతో గిరిజన తెగలతో పొత్తులు పెట్టుకున్నారు. కొంత కాలానికి మగధ సామ్రాజ్యం యొక్క అంచులు ఒక్కొక్కడిగా చంద్రగుప్తుడి వశం కాసాగాయి.
(19:43) ఒక పెద్ద చెట్టు యొక్క వేలను నరికేస్తున్నట్టుగా చాణక్యుడు మగధ సామ్రాజ్యం యొక్క పునాదులను బలహీనపరిచాడు. ధననందుడికి ఆహారం సైనికులు ఆయుధాలు అందే మార్గాలని మూసుకుపోసాగాయి. అందుకు రగిలిపోయిన ధననందుడు అత్యంత క్రూరమైన అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ అస్త్రమే విషకన్య. చిన్నప్పటి నుండి కొద్ది కొద్దిగా విషం ఇస్తూ పెంచిన ఒక అమ్మాయి.
(20:06) ఆ అందమైన అమ్మాయి శరీరం మొత్తం విషపూరితం. ఆమెతో శారీరకంగా కలిసిన ఆమె ముద్దు పెట్టిన మరణం తద్యం అటువంటి ఒక విషకన్యను పంపించి చంద్రగుప్తుడిని వశపరుచుకొని అతన్ని అంతం చేయవన్నారు. ఆమె చంద్రగుప్తుడు శిబిరంలోకి ప్రవేశించి తన నాట్యంతో అందంతో అందరిని ఆకట్టుకుంది. చివరికి చంద్రగుప్తుడు కూడా ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ ఆ శిబిరంలో చాణక్యుడు ఉన్నాడు.
(20:32) అతని మెదడు ఒక అప్రమత్తమైన కోట. ఆయన కళ్ళు డేగ కళ్ళు ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని పసిగట్టి తన గూడచల ద్వారా అసలు నిజాన్ని తెలుసుకున్నాడు. విషకన్య చంద్రగుప్తుడికి పానీయం అందించబోతుండగా చాణక్యుడు అడ్డుపడి ఆ పానీయాన్ని ఒక పువ్వుపై పోశాడు. ఆ పువ్వు నల్లగా మారి మారిపోయింది. వెంటనే విషకన్యను బంధించారు. ఆ సంఘటనతో చంద్రగుప్తుడికి ధనందుడు నీచత్వం పూర్తిగా అర్థమయింది.
(21:01) ఇక ఆలస్యం చేయకూడదని పాటలీ పుత్రం కోటపై చంద్రగుప్తుడి సైన్యం విరుచుకపడింది. ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు భయంకరంగా సాగింది. ఒకవైపు దేశభక్తితో విముక్తి కోసం పోరాడుతున్న చంద్రగుప్తుడి సైన్యం మరోవైపు అహంకారంతో పోరాడుతున్న నంద సైన్యం చివరికి నంద సైన్యం ఓడిపోయి ధర్మమే గెలిచింది ప్రజల సైన్యమే గెలిచింది. చంద్రగుప్తుడు విజేతగా పాటలీపుత్రుడులోకి అడుగుపెట్టాడు.
(21:24) అదే రాజ్యసభ. ఎక్కడైతే కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు అవమానించబడ్డాడో ఎక్కడైతే ఒక భీకర శపదం పుట్టిందో ఎక్కడైతే జ్ఞానం హేలనకు గురైందో అదే సభలోకి ఆచార్య చాణక్యుడు ఇప్పుడు ఒక విజేతగా అడుగుపెట్టాడు. అందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవంతో నమస్కరించాడు. మగధ చక్రవర్తి చంద్రగుప్తుడు కూడా సింహాసనం దిగి తన గురువు పాదాలకు నమస్కరించాడు.
(21:48) అప్పుడు ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుడిని చూసి చిరునవ్వు నవ్వి తను విరబోసుకున్న జుట్టును చూసుకున్నాడు. ఆ క్షణం ఆ అవమాన జ్వాల చల్లారి నందవంశ నామరూపాలు లేకుండా పోయింది. తన శపదం పూర్తయింది. చాణక్యుడు తన శిఖను తిరిగి ముడివేశాడు. చాణక్యుడి శిఖ కేవలం జుట్టుకు వేసిన ముడి కాదు అది మన భారతదేశంలో చెల్లా చెదురైన రాజ్యాలన్నిటిని కలిపి పెట్టిన ఒక ఐక్యతా బంధం అంతేకాదు అఖండ భారతం అనే ఒక మహా సామ్రాజ్యానికి వేసిన పునాది రాయి అయితే అక్కడితో చాణక్యుడి పని అయిపోలేదు.
(22:22) నిజానికి అసలైన పని అప్పుడే మొదలైంది. ధననందుడిపై ప్రతీకారం తీర్చుకోవడం ఆయన లక్ష్యంలో ఒక భాగం మాత్రమే కానీ చాణక్యుడి అసలు లక్ష్యం ఒక సుస్థిరమైన ధర్మబద్ధమైన ప్రజారంజకమైన రాజ్యాన్ని స్థాపించడం. మగధ రాజ్యానికి చంద్రగుప్తుడు చక్రవర్తి అయితే చాణక్యుడు ఆ సామ్రాజ్యం యొక్క ప్రధానమంత్రిగా మారాడు. ఆయన తన అనుభవాన్ని అపారమైన జ్ఞానాన్ని రంగరించి అర్థశాస్త్రం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు.
(22:50) అర్థశాస్త్రం కేవలం ఒక పుస్తకం కాదు అది ఒక జాతికి రాజ్యాంగం అందులో ఒక రాజ్యానికి కావలసిన ప్రతి అంశాన్ని పొందుపరిచాడు. మహారాజు యొక్క విధులు, బాధ్యతలు, శక్తివంతమైన గూడచారి వ్యవస్థ, నేరాలను అరికట్టడం, న్యాయాన్ని అందించడం, సమర్థవంతమైన పనుల విధానం, విదేశాంగ నీతి, యుద్ధ నియమాలు, ప్రజా సంక్షేమమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పిన మొట్టమొదటి గ్రంథం అది.
(23:15) ఆఫ్ఘానిస్తాన్ నుండి కర్ణాటక వరకు గుజరాత్ నుండి బెంగాల్ వరకు మౌర్య సామ్రాజ్యం విస్తరించింది. చంద్రగుప్త మౌర్యుడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులసూగారు. అయితే చంద్రగుప్తుడు మగధ సింహాసనాన్ని అధిష్టించినప్పటికీ భారతదేశం ఇంకా పూర్తిగా ఏకం కాలేదు. వాయువ్య ప్రాంతం ఇంకా అస్థిరంగా ఉంది. అలెగ్జాండర్ మరణం తర్వాత సెల్యూకస్ స్వతంత్రుడయ్యాడు.
(23:40) క్రీస్తుపూర్వం 305 లో సెల్యూకస్ ఒక బారి గ్రీకు సైన్యంతో సింధూ నదిని దాటి భారతదేశంపై దండయాత్రకు వచ్చాడు. అలెగ్జాండర్ సైన్యాన్ని ఎదుర్కోలేకనే ఎందరో భారతీయ రాజులు ఓడిపోయారు. అలాంటిది ఇప్పుడు అతని సేనాని అంతకంటే పెద్ద సైన్యంతో వస్తున్నాడు. మగధ సామ్రాజ్య మంత్రులు సేనాపతులు ఆందోళన చెందారు. కానీ చాణక్యుడి ఆలోచన వేరుగా ఉంది.
(24:05) అతని ముఖంలో భయం లేదు. ఆందోళన లేదు ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. అప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రగుప్తుని నాయకత్వంలో 6 లక్షల పదాతి దలం 9వేల యుద్ధ ఏనుగులు 30వేల అశ్వక దలం ఉన్న ఒక మహా సైన్యం కదిలింది. గ్రీకు సైనికులు అంత పెద్ద పెద్ద యుద్ధ ఏనుగులను ఎప్పుడూ చూడలేదు. ఆ యుద్ధ ఏనుగులు గ్రీకుల వ్యూహాలను చిన్నాభిన్నం చేశాయి.
(24:32) చాణక్యుడి వ్యూహాలు చంద్రగుప్తుడు పరాక్రమం ముందు సెల్యూకస్ నికేటర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయిన సెల్యూకస్ చంద్రగుప్తుడితో సంధికి వచ్చాడు. చాణక్యుడు యుద్ధంలో గెలిచిన అహంకారంతో ప్రవర్తించకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక అద్భుతమైన ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. శత్రుత్వాన్ని స్నేహంగా మార్చడానికి సెల్యూకస్ తన కుమార్తె హెలేనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
(24:57) ఒక భారతీయ చక్రవర్తి ఒక గ్రీకు రాకుమాని వివాహం చేసుకోవడం భారతదేశ చరిత్రలో అదే మొదటిసారి వారు పెళ్లి చేసుకోవడం రెండు సామ్రాజ్యాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది. చంద్రగుప్తుడు సెల్యూకస్ స్నేహానికి గుర్తుగా 500 యుద్ధ ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు. ఆ గజాలు ఆ తర్వాత కాలంలో ఇతర యుద్ధాలలో సెల్యూకస్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ పెళ్లి చాణక్యుడి దురదృష్టికి రాజనీతికి ఒక మచ్చతునక.
(25:23) ఇంత పెద్ద మగధ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. చాణక్యుడు రాజ ప్రసాదంలో నివసించకుండా పాటలీ పుత్రం శివార్లలో ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. మట్టి పాత్రలో భోజనం చేస్తూ నేలపై నిద్రించేవాడు. చక్రవర్తి ఇచ్చే జీతాన్ని తీసుకోకుండా తన అవసరాలకు సరిపడా మాత్రమే ఉంచుకొని మిగిలినది ప్రజల సంక్షేమానికి దానం చేసేవాడు.
(25:48) చాణక్యుడి దృష్టిలో అధికారం అనేది సేవ చేయడానికి ఒక అవకాశం. అంతేకానీ అనుభవించడానికి కాదు అయితే చాణక్యుడు చంద్రగుప్తుడిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. శత్రువులు చంద్రగుప్తుడిని విష ప్రయోగం చేసి చంపే అవకాశం ఉందని చాణక్యుడికి తెలుసు. అందుకే దీని నుండి చంద్రగుప్తుడిని కాపాడటానికి ఒక ప్రమాదకరమైన ఉపాయం పన్నాడు.
(26:10) అదేంటంటే ప్రతిరోజు చంద్రగుప్తుడికి తెలియకుండా అతని భోజనంలో చాలా కొద్ది మోతాదులో విషాన్ని కలపడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ప్రతిరోజు విషం మోతాదును పెంచుతూ వెళ్ళాడు. దానివలన చంద్రగుప్తుడి శరీరం విషానికి అలవాటు పడింది. చంద్రగుప్తుడికి భవిష్యత్తులో ఎవరైనా విష ప్రయోగం చేసినా అది అతనిపై పని చేయకుండా ఒక రకమైన రోగ నిరోధక శక్తి వస్తుందని చాణక్యుడి ఆలోచన.
(26:33) అయితే ఒకరోజు చంద్రగుప్తుడు తన భార్య గర్భవతిగా ఉన్న రాణి దుర్దరతో కలిసి భోజనం చేస్తున్నాడు. భార్య మీద ప్రేమతో తన పల్లెల్లోని ఆహారాన్ని ఒక ముద్ద తీసి ఆమెకు తినిపించాడు. కానీ ఆ ఆహారంలో చాణిక్యుడు కలిపిన విషం ఉంది. చంద్రగుప్తుడి శరీరం ఆ విషానికి అలవాటు పడింది. కానీ రాణి దుర్దర శరీరం కాదు ఆ విషం తిన్న వెంటనే దుర్ధర కుప్ప కూలిపోయింది.
(26:59) వెంటనే చాణక్యుడు అక్కడికి పరిగెత్తుకు వచ్చి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ సమయంలో రాణిని బ్రతికించడం అసాధ్యం. కానీ ఆమె గర్భంలో ఉన్న బిడ్డ మౌర్యవంశ వారసుడు బ్రతకాలి. అప్పుడు ఆచార్య చాణక్యుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన కత్తిని తీసి రాణి గర్భాన్ని చీల్చి బిడ్డను బయటకు తీశాడు. బిడ్డను బయటకు తీసేటప్పటికే ఒక విషపు బిందువు ఆ బిడ్డ నుదిటిపై పడింది.
(27:22) బాలుడిపై ఆ విషపు చుక్క కారణంగా ఆ పిల్లవాడికి బిందుసారుడు అని పేరు పెట్టారు. అయితే చాణక్యుడు వారసుడిని కాపాడగలిగాడు. కానీ ఒక తల్లిని బలి పెట్టాల్సి వచ్చింది. రాణి చనిపోవడం చాణక్యుడి జీవితంలో ఒక మాయని మచ్చగా ఒక తీరని వేదనగా మిగిలిపోయింది. చంద్రగుప్త మౌర్యుడు సుమారు 24 సంవత్సరాల పాటు ఒక చక్రవర్తిగా మౌర్య సామ్రాజ్యాన్ని ఏలిన తర్వాత అతని జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది.
(27:52) యుద్ధాలు రాజనీతి కుట్రలతో విసిగిపోయిన చంద్రగుప్తుడు జీవితంలో శాంతిని ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. భద్రబాహు అనే ఒక జైన గురువు ప్రభావంతో చంద్రగుప్తుడు జైనమతాన్ని స్వీకరించాడు. తన కుమారుడైన బిందుసారుడికి రాజ్యాన్ని అప్పగించి ఒక సాధారణ సన్యాసిగా మగధ రాజ భోగాలన్నిటిని విడిచిపెట్టి కర్ణాటకలోని శ్రావణ బెలగోలకు వెళ్ళిపోయాడు.
(28:14) కొంతకాలం తర్వాత జైన సాంప్రదాయం ప్రకారం సల్లేఖన వ్రతాన్ని ఆచరించాడు. అంటే ఆహారం తీసుకోకుండా ప్రశాంతంగా దేహాన్ని చాలించాడు. ఒక మహా చక్రవర్తి తన జీవిత చరమాంకంలో సర్వసంఘ పరిత్యాగిగా మారడం చరిత్రలోనే ఒక అరుదైన విషయం. అయితే చంద్రగుప్తుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాణక్యుడు తన సేవలను ఆపలేదు. బిందుసారుడికి కూడా గురువుగా ప్రధానమంత్రిగా తన బాధ్యతలు కొనసాగించాడు.
(28:41) కానీ చాణక్యుడి కీర్తి అధికారం రాజుపై ఆయనకున్న పట్టు ఆస్థానంలోని ఇతర మంత్రులకు ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా సుబంధు అనే ఒక మంత్రికి చాణక్యుడు అంటే తీవ్రమైన అసూయ ద్వేషం ఉండేవి. ఆ ఆచార్య చాణక్యుడిని ఎలాగైనా రాజు దృష్టిలో నుండి అధికారం నుండి తొలగించాలని సుబంధు కుట్రపన్నాడు. అతను బిందుసారుడి వద్దకు వెళ్లి నెమ్మదిగా చాణక్యుడిపై విషం నూరిపోయడం మొదలు పెట్టాడు.
(29:10) ఏమని అంటే మహారాజా మీరు మీ ప్రధానమంత్రి చాణక్యుడిని గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ ఆయనే మీ కన్నతల్లి రాణి దుర్దర మరణానికి కారణం అని చెప్పాడు. ఎందుకంటే బిందుసారుడికి తన తల్లి ఎలా చనిపోయిందో తెలియదు. సుబంధు మాట వినగానే రాజు దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఏం మాట్లాడుతున్నావ్ నా తల్లి మరణానికి ఆచార్య చాణిక్యుడు ఎలా కారణం అవుతాడు అని అడిగాడు.
(29:34) అప్పుడు సుబంధు జరిగిన విషయాన్ని వేరే విధంగా చెప్పాడు. ఈ కపట చాణక్యుడు మీ తండ్రి చంద్రగుప్తుడిని చంపాలని కుట్రపన్ని ఆయన భోజనంలో విషం కలిపాడు. కానీ అనుకోకుండా ఆ భోజనాన్ని మీ తల్లి తిని చనిపోయింది. ఆచార్య చాణక్యుడే మీ తల్లిని చంపిన హంతకుడు అని కట్టుకదా అల్లాడు. సుబంధు మాటలు విన్న బిందుసారుడు విచక్షణ కోల్పోయాడు. తాను పుట్టినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడి తన తండ్రికి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి పెట్టిన గురువు పైనే అనుమానం పెంచుకున్నాడు.
(30:01) కోపంతో రగిలిపోయి నిజానిజాలు తెలుసుకోకుండా నేరుగా చాణక్యుడి వద్దకు వెళ్ళలేదు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఆచార్య చాణక్యుడు తీవ్రంగా బాధపడ్డాడు. ఎవరిని నా కన్న కొడుకులా చూసుకున్నానో ఎవరికోసం నా జీవితాన్ని త్యాగం చేశానో ఆ బిందుసారుడే నన్ను అనుమానిస్తున్నాడా నా స్వామి భక్తికి నా త్యాగానికి ఇదే నా వెల నేను హంతకుడినని నమ్ముతున్నాడా అని తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు.
(30:28) ఆవేదనతో అవమానంతో ఆచార్య చాణక్యుడు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి తన కుటీరానికి వెళ్ళిపోయి ప్రాయోపవేశం ప్రారంభించాడు. అంటే ఆహారం నీరు త్యజించి మరణానికి సిద్ధపడటం అలా కొంతకాలం తర్వాత రాని దుర్ధర మరణం వెనుక ఉన్న అసలు నిజం బిందుసార చక్రవర్తికి తెలిసింది. ఆచార్య చాణక్యుడు తన తండ్రిని కాపాడడానికే ఆ పని చేశాడని అది ఒక ప్రమాదం అని తెలుసుకున్నాడు.
(30:55) బిందుసారుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయి చాణక్యుడి కుటీరానికి పరిగెత్తాడు. బిందుసారుడు ఆచార్య చాణక్యుడిని క్షమించమని తిరిగి రాజసౌదానికి రమ్మని ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ చాణక్యుడు ఆస్థానానికి తిరిగి రాలేదు. మౌన దీక్షలో ఉన్న 75 ఏళ్ల చాణక్యుడు చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన గురువు భారత చరిత్ర మార్చిన మహనీయుడు చివరికి ఆకలితోనే క్షీణించి క్రీస్తుపూర్వం 275లో మరణించాడు.
(31:21) ఆ తర్వాత బిందుసారుడు చాణక్య మరణానికి కారణమైన సుబందుకు మరణ దండన విధించాడు. ఆచార్య చాణక్యుడి అవమానంతో మొదలైన ప్రయాణం ఒక మహా సామ్రాజ్య స్థాపనతో ముగిసింది. చాణక్యుడు ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన నీతి సూత్రాలు ఆయన ఆలోచనలు ఆయన నిర్మించిన దేశభక్తి ఈ మట్టిలో ఈ గాలిలో మనందరిలో నేటికి జీవించే ఉన్నాయి. చాణక్యుడు చెప్పేది ఒకటే శత్రువు ఎంత బలవంతుడైనా నీ వ్యూహం పదునుగా ఉంటే గెలుపు నీదే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీ సంకల్పం ఉక్కులా ఉంటే విజయం నీదే.
(31:56) ఆచార్య చాణక్యుడు కేవలం తన మేదస్సుతో ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించి కొన్ని వేల సంవత్సరాల పాటు భారతదేశానికి మార్గ నిర్దేశనం చేసే అద్భుతమైన గ్రంథాన్ని అందించి చరిత్ర గతిని మార్చిన ఒక యుగ పురుషుడు. ఇదండ చాణక్యుడికి సంబంధించిన కొన్ని విషయాలు. ఓవరాల్ గా చాణక్యుడి గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
(32:19) అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేసి హెల్ప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment