Thursday, April 9, 2026

 *నేటి మాట*
 
         _ఫలితం *ఆశించి* కష్ట పడితే *బాదే* కలుగుతుంది..చేసే పని *ఆనందం* గా చేస్తే *సంతోషం* కలుగుతుంది._

       _ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక *గొప్పతనం* ఉంటుంది. మనకు దానిని చూసే *గుణం* ఉండాలి.. అభినందించే *మనసు* ఉండాలి._

      _ఎవరైనా మన  *సహాయం* కోరుతున్నారంటే మన  పాపఖర్మల నుండి *విముక్తి* కలగటానికి అవకాశం ఈ రూపంలో  లభించినట్లే.. అవకాశం *సద్వినియోగం* చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పరమేశ్వరునికి *కృతజ్ఞతలు* తెలియచేద్దాం._

     _*జీవితంలో* తన వైపు ఇతరులు విసిరే *రాళ్లతో* తన ఎదుగుదలకు *పునాదులు* వేసుకునే *వాడే* తెలివైన *వ్యక్తి* ఒక్కటే గుర్తుంచుకోండి మనం *ఏపని* చేసినా అది అందరికి *నచ్చదు* ఎంతమంచి *పనిచేసినా* కొంతమంది *మూర్కులు* విమర్శిస్తూనే వుంటారు అందుకే అన్నారు *కదా పెద్దలు లోకులు కాకులు అని !*._

     _నిజంగా నువ్వంటే *ఇష్టం* ఉన్న వారు , నీపై *ప్రేమ* ఉన్న వారు నీకు ఎన్ని *కష్టాలు* వచ్చినా నీవు ఎన్ని *ఇబ్బందులు* ఎదురైనా *నన్ను* మాత్రం ఎప్పటికి *వదులుకోకు* . ఈ *మాట* బాగా *గుర్తుంచుకో నేస్తమా* ._

       _మన *సంస్కారం* చెబుతుంది *కుటుంబం* ఎలాంటిదో. మనం *మాట్లాడే మాటలు* చెబుతాయి *స్వభావం* ఏమిటో. మనం చేసే *వాదన* చెబుతుంది *జ్ఞానం* ఎంత ఉందో. మనం *చూసే చూపు* చెబుతుంది *ఉద్దేశం ఏమిటో*.మన *వినయం* చెబుతుంది నేర్చిన *విద్య* ఎలాంటిదో . మనం *ఇచ్చింది* మరచిపోవడం , యితరులవద్ద *పుచ్చుకున్నది జ్ఞాపకం గా ఉంచుకోవడమే స్నేహం* ._

🌲🌾🌲🌾🌲🌾🌲🌾🌲

No comments:

Post a Comment