Thursday, April 9, 2026

 నీటి అద్దంలో బొట్టు సర్దుకుని 
ఏటి నీటితో మాటలాడి 
మొద్దు నిదురోతున్న భువిని 
ముద్దుబిడ్డగా చుంబించాలని..

గిరులను తల నిమిరి 
పుడమితో కరచాలనం చేసి 
వాగుతో ముచ్చట్లాడి 
ఊరిని మేలుకొలపాలని...

తూరుపు ఎరుపుగా మార్చి 
నేరుపుగా మబ్బుల  దాటి 
చేరువగా  కిరణాలు పంపి 
వరుసగా క్షణాలు నింపాలని....

వడిగా అడుగులు కదుపుతూ 
జడిగా వెలుగులు కురిపిస్తూ 
వేడిని నీటికి పంపించి 
తడిని మొయిలుకు చేర్చాలని...

తరులకు పోషణ అందిస్తూ 
నరులకు స్వస్థత చేకూరుస్తూ 
ఎరుగని సేవలు ఎన్నో చేసి 
ధరణికి కుశలము నివ్వాలని...

దూరము నున్నా మానక 
నీమముగా నింగిని వెడలి 
క్షామపు జాడలు లేకుండా 
క్షేమముగా నేలను ఉంచ ఏతెంచు..

ప్రత్యక్ష నారాయణునికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment