Thursday, April 9, 2026

 గగనపు నీడను హాయిగా 
శిఖరపు అండలో వాలుగా 
భువనపు అందం పెంచుతూ 
చిత్తరువంటి సౌందర్యం!

కొత్తగా తోచే ఆనందంలో 
మరోలోకంలో విహరిస్తూ 
మైమరచి పోయేలా 
మురిపించె పరవశం!

వదిలి వెళ్లాలనిపించక 
అక్కడే చిక్కడిపోయిన 
మనసులో తుళ్లిపడే 
సంతోషపు  తరంగం!

కంటికి పాకిన 
గుండెలోని సంబరపు 
మెరుపేదో కళ్ళల్లో 
నిలిచిపోయినట్టు ఉత్సాహం

పూలచెట్టు ఊపితే 
రాలుతున్న పువ్వులల్లే 
పెదవిపై మొలుస్తున్న 
చిన్ని చిన్ని నవ్వులు...

ప్రత్యూష సమయంలో 
ప్రకాశపు కిరణాలతో 
ప్రసరించు వెలుగులు పంచుతూ 
ప్రమోదపు సంపద తెచ్చే...

వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment