Swami Vidya Prakashananda Giri AI Video | Swami Vidya Prakashananda Latest
Author Name:Telugu Vedanta
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguVedanta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mo5jDpSN6og
Transcript:
(00:00) మూడు దృష్టాంతములు ఇస్తారండి కృష్ణ పరమాత్మ నిన్న టైం లేక నేను చెప్పలేదు మొదటిది అద్దం ఎంత శుభ్రంగా ఉంటుందండి నిర్మలంగా ఉంటుందండి అద్దం కానీ దుమ్ము వచ్చి కప్పేసిందండి దుమ్ము వచ్చి కప్పితే ముఖం కనిపిస్తుందా చెప్పండి కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అద్దంలో కొత్తగా రిఫ్లెక్టివ్ పవర్ పెట్టవలసిన పని లేదండి ఇట్ ఇస్ ఆల్రెడీదర్ బట్వాట్వ హవ టుడు ఈస్ టు రిమూవ్ ది డర్ట్ అంతే దానికి ఉన్నటువంటి దుమ్ము తుడిస్తే చాలు మన పని పూర్తి అయిపోతుంది చక్కగా ముఖం కనిపిస్తుంది చూసారా ఆ దృష్టాంతం చెప్పినారు ధూమేనావ్రయతే యదర్శోమలేనచ ఆదర్శం అంటే అర్థం ఆదర్శం అంటే మలనం చేత
(00:35) ఎట్లా ఉందో ధూమం చూడండి అగ్ని దీప్యమానంగా ప్రకాశిస్తున్నది మండుతున్నది కానీ పొగ పొగ వచ్చి దాన్ని కప్పేసిందండి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి విసురుతారు చూసారా విసిరి ఆ పొగ అంతా పోగొడతారు చక్కగా అగ్ని దేదదిప్యమానంగా ఉంటుందండి చూడండి రెండు దృష్టాంతాలు మూడవది యతో నావృతోగర్భః తల్లి గర్భంలో బిడ్డ మావి మావి చేత కప్పబడతాడు చూడండి జన్మించిన పుట్టిన తర్వాత మావి బద్దలైపోతుంది బిడ్డ బయటికి వస్తాడండి చూసారా పగిలిపోతుంది అదేవిధంగా మూడు దృష్టాంతములు చెప్పారు ఓ అర్జున అనేక జన్మార్జితమైనటువంటి ఈ దుర్గుణములు ఉన్నాయి చూడండి ఇవి మానవుని
(01:10) అధోగతికి తీసుకొస్తున్నాయి ఇప్పుడు ఏం చేయవలెను శుద్ధం చేయవలెను అద్దం బాగా ఉండాలంటే మురికిన ఎట్లా తుడవలెనో అగ్ని దీప్యమానంగా ఉండాలంటే ఎట్లా విసరవలనో మావి ఎట్లా తొలగిపోవలెనో అదేవిధంగా చూడండి ధూమేనావయతేవయదర్శోమలేనచ యతోేనావృతో గర్భస్తధతనేద మావృతం కాబట్టి విచారణ చేత తన మనసును పరిశోధించాలి. దీని పేరు ఇంగ్లీష్ లో ఇంట్రాస్పెక్షన్ అంటారు ఆత్మ పరిశోధన వెరీ ఎసెన్షియల్ సాధకుడైన వారు ఊరికే ముక్కు మూసుకొని జపాలు చేస్తే పూర్తి చేస్తే కాదండి అది అసలు విషయం ఏమిటంటే ధ్యానం ధ్యానం అంటే ఏమిటి ఇన్ వాట్ సిచువేషన్ ఇస్ మై మైండ్ అది నా మనసు ఎక్కడికి పోతున్నది ఎక్కడ
(01:49) ఉన్నది ఏ విధంగా ఉన్నది బాగా విచారణ చేయండి దాంట్లో ఉన్నటువంటి గుణ దుర్గుణాలన్నీ కొంచెం విచారణ చేయాలని విచారణ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివేకం చేత పారద్రోలాలి చాలామంది కొన్ని నియమాలు పెట్టుకుంటారండి కానీ వివేకం జోడించరండి వివేకం జోడించినందు ఏమవుతుందో తెలుసా అండి ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని అక్కడక్కడ చాదస్తం చాదస్తంగా పరిణామం కలుగుతుంది కొందరు నిలదీసి అడుగుతున్నారు ఏవండీ ఇదేమిటి ఇట్లా ఉంది ఏంటి మీ నియమాలన్నీ అని చాదస్తం ఇంకా మారిపోతున్నదండి ఎందుకో వివేకం డిస్క్రిమినేషన్ లేదండి అక్కడ ఏ చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది
(02:23) ఒక అల్లుడుగారు ఉన్నారండి ఇటువంటి ఉపన్యాసాలకు వచ్చారు ఆయన కొన్ని నియమాలు పెట్టుకున్నారండి ఆ ఎవరికీ తెలియదండి ఆయన నియమాలు పెట్టుకు ఏ నియమం తెలుసాండి భోజన టైంలో మాట్లాడకూడదు అని ఆయన నియమం పెట్టుకుంది అది ఎవరికీ తెలియదండి అత్తగారు పిలిచి ఆహ్వానం చేశారండి రాయండి మా ఇంటికి భోజనానికి రండిఅని అల్లుడుగారిని ఆహ్వానం చేశారు అల్లుడుగారు వచ్చారంటే ఇంకా సామాన్యం అండి ఓ పెద్ద పెద్ద పిండి వంటలు బ్రహ్మాండంగా చేసేసిందండి అత్తగారు సరిగా భోజనకాలంలో వడ్డిస్తున్నదండి ఎవరు అత్తగారు వడ్డిస్తుంటే ఈయన నియమం ఉందండి ఎవరికీ తెలీదు అత్తగారికి తెలియదు భోజన కాలంలో
(02:54) మాట్లాడకూడదు మాట్లాడకూడదు నిజమేనండి అదొక ఆచారం ఉంది స్నానేచ భోజనే హోమే జపే మౌనం సమాశ్రయేత్ అని పెద్దలు చెప్తారు స్నానం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు మౌనం పాటించండి అని ఈయన గారు ఆ నియమం పెట్టుకున్నాడు మంచిదే మరి అత్తగారు వడ్డిస్తుంటే చాలు అని అనొచ్చు కదా పోనీ నోటితో అనకపోయినా ఇట్లా చేతితో ఇట్లా అట్లా అంటే ఆపేస్తారు కదా ఆ లేదు మౌనం అంతే మౌనం ఈ అత్తగారు వడ్డిస్తున్నది వడ్డిస్తున్నది కొండ కొండ మోస్తర వడ్డిస్తున్నదండి ఈయన చాలు అని అంటే కదా అన్నాడు అందుచేత ఓహో ఈయన గారికి ఆకలిగా ఉందేమో అని ఎక్కువగా వడ్డించేసిందండి బాగా
(03:25) తర్వాత ఇంకొక నియమం ఉందండి అది ఎవరికీ చెప్పలేదండి పెట్టిన వస్తువు పారేయకూడదు అని నియమం [ఆయాసపడటం] [నవ్వు] [గురకలు] ఇక చూడండి ఇక పారేయకూడదుగా లేపాడు లేపాడు ఊపిరి తిరగకుండా తినేసాడండి ఎందుకంటే పారేయకూడదుగా మళ్ళ ఎప్పుడు ఇస్తరి ఖాళీ అయిందో మళ్ళీ అత్తగారు పరిగెత్తుకవచ్చింది గురు ఈయన గారికి ఆకలి జాస్తిగా ఉందని మళ్ళీ వడ్డిచ్చింద పోనీ చాలని అనకూడదు చెప్పండి ఊరికెట్టి చెయ్యి అనొచ్చు కదా దీని పేరే చేతస్త అంటారు వివేకం కలపకుండా నియమాలు పెడితే ఇది ఇట్లాగే జరుగుతుందండి ఆఖరికండి మళ్ళీ అత్తగారు కొండలు పెట్టి టేసింది మళ్లా పారేయకూడదుగా మళ్ళా లేపాడు
(03:59) లేపాడు తిన్నాడు తిన్నాడు ఆఖరికండి ఇ కంట్రోల్ తప్పిపోయిందండి ఎందుకంటే ఓవర్లోడ్ చేశారు కాబట్టి కింద పడిపో పీట మీద అట్లా పడ్డాడండి అల్లుడుగారు అందరూ పరిగెత్తుకొచ్చి ఇదేమిటి అల్లుడుగారు పడిపోయినారుని డాక్టర్ గారు పిలిపించారండి డాక్టర్ వెంటనే పల్చ చూచాడు ఏం జబ్బు లేదు ఓవర్లోడ్ కేస్ అన్నాడండి ఆయన [నవ్వు] చూడండి ఇట్లా ఆధ్యాత్మిక విషయాలు మంచివేనండి కానీ కొంచెం బుర్ర తెలివి వివేకంతో దాన్ని ఆచరించాలని చూసారా ఆ ఏవండీ భోజనం పెడుతుంటే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టకూడదు చాలని చెప్పకూడదు లేదండి ఈ చాదస్థపు నియమాలు పెట్టుకొని నాశనం
(04:31) అయిపోయినాడు. కనుక ఆధ్యాత్మిక విషయంలో కొంచెం జాగ్రత్త అవుతే డిస్క్రిమినేషన్ అంటారు ఇంగ్లీష్ లో డిస్క్రిమినేట్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్ ఊరికే గుడ్డిగా ఆచరించడం కాదండి ఈ ఆధ్యాత్మిక విషయం ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఎవ్రీథింగ్ సైంటిఫిక్ ఇది కపోల కల్పితమైనటువంటి సిద్ధాంతాలు కాదండి ఇది ప్రతిదీ కూడా మనం ఆచరణ చేసి అనుభూతం అనుభూతిని పొందవచ్చు అండి ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒకచోట చెప్పినారు ప్రత్యక్షవగమం ధర్మ్యం అర్జున ఇది ప్రత్యక్షంగా దీనికి రిజల్ట్స్ పొందవచ్చు అన్నారు పరోక్షం కాదు ఇంకొక లోకానికి వెళ్ళిన తర్వాత మోక్షం కాదు అత్ర
(05:03) బ్రహ్మ సమస్ుతే ఇక్కడే మోక్షం పొందటానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా కర్మ అనేటువంటిది చక్కగా చేయటానికి ఈ జ్ఞానం యొక్క సహాయం తీసుకొని చేయవలన ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఇటు లెఫ్ట్ రైట్ రెండు కూడా జ్ఞానం పెట్టేసినారు అంటే ఏమిటి మధ్యలో కర్మ బోధిస్తూ ఇటువైపు జ్ఞానం ఇటువైపు జ్ఞానం ఈరోజు నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం విచారణ చేస్తున్నారు.
(05:25) మొట్టమొదట్లో కృష్ణుడు ఏం చెప్పలేదండి అది కృష్ణుడు రెండు వాక్యములు మొదట్లో చెప్తారు తరువాత దాని గూర్చినటువంటి విశాలమైనటువంటి భావాన్ని ఉపదేశం చేస్తారు అండి మొట్టమొదట ఏం చెప్తున్నారు అంటే అర్జున మీకు కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ చెప్పినాను కదా మీకు కొత్తగా ఇప్పుడు చెప్పటం కాదు ఇదివరకే ఒక మహాత్ముని యొక్క మహానీయునికి బోధ చేసేసాను ఇది మీకు చెప్పిన బోధ ఉందే మీకు కొత్తగా చెప్పడం కాదు ఇదివరకే ఒకరికి చెప్పేసాను ఎవరు సూర్యభగవాను సూర్యభగవానుడికి నేను బోధ చేసినాను అన్నారు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షవాకవేబ్రవి
(06:04) ఏవం పరంపరా ప్రాప్తమం రాజర్షయోవిదు సకాలేహమహతాయోగోనష్టపరంతప అర్జున మీకు చెప్పినటువంటి బోధ ఇదివరకు సూర్య భగవానునికి ఉపదేశం చేసినాను అన్నాడు వెంటనే అర్జును గారికి ఒక సందేహం వచ్చేసింది కృష్ణ ఇదేంటి మీరు ఇట్లా చెప్తున్నారు మీరు ఇటీవల కదా దేవకీగర్ లో ఏదో కొద్ది సంవత్సరాల కిందట కదా మీరు జన్మించింది సూర్య భగవానుడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి ఓ అనాది అనాది కోట్ల కోట్ల కొలది సంవత్సరాల కింద సూర్యుడు గారు జన్మించినారు కదా మీరు ఇప్పుడిప్పుడు పుట్టినటువంటి మీరు సూర్యునికి పూర్వం మీరు ఉపదేశం చేశారంటే ఎట్టా నమ్మేది నేను ఏవండీ అందరికీ అర్థమైందా కృష్ణుడు గారు
(06:42) ఇటీవల దేవకీయ గర్భంలో జన్మించినారు సూర్యుడు ఎప్పుడు జన్మించినాడు కోట్ల కొలది సంవత్సరాల కింద జన్మించినాడు వీరు నేను పూర్వం సూర్యుడికి చెప్పాడంటే వీరు ఎక్కడున్నారు పూర్వం అనేటువంటి సంశయం కలి కలిగిందండి ఎవరికి అర్జును గారికి అందరికీ అర్థమైందా అండి ఆ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానియాంత్వమాద ప్రవక్తవానితే కృష్ణ మీరు మొదట్లో వారికి ఉపదేశం చేశారుని ఎట్లా నమ్మేది మీరు ఇటీవల వచ్చిన వారు కదా వారు అనాది కాలం నుంచి ఉన్నటువంటి వారు కదా చాలా కాలం నుంచి మీరు వారికి ఉపదేశం చేశారంటే నేను ఎట్లా విశ్వసించేది అని ప్రశ్న అడిగారు అందరికీ
(07:15) అర్థమైందా అండి కృష్ణుడు గారు వెంటనే దానికి సమాధానం చెప్పారు. నాయనా అర్జున నేను ఇప్పుడిప్పుడు పుట్టానా అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యత్మమాయ అజ్యః అజ అంటే పుట్టుక లేదు నాకు ఆ నేను పుట్టాను అంటే ఒక ఆహారం తీసుకున్నాను అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది ఏమిటది పరిత్రాణయ సాధునాం వినాశాయ చదుష్కృతాం ఎప్పుడెప్పుడు లోకంలో అధర్మం విజృంభిస్తుందో ధర్మం దిగజారిపోతుందో అప్పుడు నేను ఒక ఆకారం వేసుకుంటాను అంతేగాని ఇప్పుడు పుట్టిన వాడిని కాదు అంటాడండి భగవంతుని యొక్క యధార్థ స్వరూపం మనం తెలుసుకోవాలండి వారి
(07:55) యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోవాలి భగవంతుడు ఎందుకు పుట్టాడు చెప్పండి ఎందుకు ఈ ఆకారం గ్రహిం దీని పేరే అవతారం అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడే గీతలో ఈ అధ్యాయంలోనే చెప్తారు ఇది యదా యదా అంటే ఎప్పుడు చూడండి యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం చూడండి ధర్మం ఎప్పుడు క్షీణించిపోతుందో అప్పుడు నేను ఆకారం ధరిస్తాను మన భారతంలో చూడండి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా అధర్మాన్ని ఆచరిస్తుంటే కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం గ్రహించినాడు అదేవిధంగా రామాయణ కాలంలో ఈ రాక్షసులంతా విజృంభించి రావణాసురుడు ఇటువంటివారు
(08:29) ఉన్నందువల్ల అప్పుడు ఒక ఆకారం ధరించవలసి వచ్చిందండి ఈ అవతారములు అన్నిటి యొక్క ఉద్దేశం ఒకటేనండి ఏమిటి చెప్పండి ధర్మాన్ని ఉద్ధరించటం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రపంచంలో ధర్మమును మించింది ఇంకోటి లేదండి అది అసలు గీత మొదలుపెట్టింది కూడా ధర్మం చూడండి ధర్మక్షేత్రే మొదటి అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పినాను మీకు ఎంత శుభప్రదమైనటువంటి పదం అండి ధర్మం అది అయ్యా దేవుడు గొప్పవాడే మరి దేవుని ఎట్లా పొందగలం వాట్ ఇస్ ది వే టు రీచ్ గాడ్ ధర్మం చూసారా దారి మనం తెలుసుకోకుండా దేవుడు మంచి గొప్పవాడేనండి గాడ్ ఇస్ గ్రేట్ బట్హౌ టు రీచ్ హిim హౌ టురిలైజహిim
(09:03) చెప్పండివాట్ ఇస్ దివే టు రీచ్ గాడ్ అది తెలుసుకోవటం లేదండి దేవుడు మంచివాడే గొప్పవాడే అని చెప్పి స్తోత్రం మంచిదే కానీ చాలదే ఎట్లా దేవుని పొందగలరు మీరు దేవుడు ఏం చెప్పినాడు గీతలో చెప్పండి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మము స్థాపించుట కొరకు నేను అవతారం ఎత్తున్నాను అని చెప్పినప్పుడు వీడు అధర్మం ఎట్లా ఆచరిస్తాడు దైవభక్తి ఎట్లా అవుతుంది చెప్పండి అది చేసేది అధర్మం అన్యాయం అవినీతి చేయటం అక్కడికి వెళ్లి కృష్ణాయ నమః రెండు పువ్వులు వేస్తాడు దేవుడి మీద చూడండి కృష్ణాయ నమః వాసుదేవాయ నమః ఒక టెంకాయ కొడతాడు ఇంతేనా దాంతో పోతుందండి ఈ అధర్మం చెప్పండి కనుకనే
(09:37) ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉందండి అది ఆ యథార్ధంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు ధర్మం మనని రక్షించే దేవుడు అని చెప్పి అంటున్నాం మంచిదే దేన్ని చూసి రక్షిస్తారు ఆనాడు ద్రౌపది దేవిని రక్షించినారంటే దేన్ని చూచి రక్షించినారు చెప్పండి ఆ ధర్మం అనేటువంటిది ధర్మో రక్షతి రక్షిత అది ధర్మం మనల్ని కాపాడుతుంది ఎప్పుడు ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ఆ ధర్మో రక్షితి రక్షితి అంటే ధర్మం మనం ఆచరిస్తుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఏమిటి ధర్మం చెప్పండి విశ్వ శాసనం భగవానుడు ఈ విశ్వం అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడే కొన్ని శాసనములు పెట్టాడు దాని పేరే విశ్వశాసనం ఏమిటి
(10:10) చెప్పండి ఇదివరకు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను పాపము చేత దుఃఖం పుణ్యము చేత సుఖం జ్ఞానము చేత మోక్షం ఇదండి శాసనం ఈ శాసనం అనేది తూచా తప్పకుండా జరుగుతున్నదండి ఇప్పుడు ఎవరైనా గొప్ప అధికారి గొప్ప ధనవంతుడు గొప్ప విద్యావంతుడు పాపం చేశడు అనుకోండి హి మస్ట్ సఫర్ అంతే తప్పకుండా ఎందుకంటే వారి గొప్పతనం ఎంత ఉన్నప్పటికిని కూడా శాసనం కదా ఆ శాసనాన్ని ఎవరైనా ధిక్కరించగలరా చెప్పండి ఇప్పుడు పైనుంచే ఒక రాయి వదలండి రాయి వదిలితే ఎక్కడ పడుతుంది కింద పడుతుంది ఎందుకు పడాలి రాయి వదిలితే పైకి ఎందుకు పో కూడదు దేర్ ఇస్ ఏ లా వర్కింగ్
(10:49) దేర్ ఏమిటి ఆ లా గ్రావిటీ లా ఆఫ్ గ్రావిటీ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది దాని చేత రాయి కింద పడింది రాయ కాదండి ఒక పండు ఒక పండు చెట్టు మీద పడితే కింద పడుతుంది కానీ పైకి వేరదండి ఎందుకు ద లా ఇస్ వర్కింగ్ దేర్ అదేవిధంగా ఒకాయనండి ఒక పెద్ద గవర్నర్ గారు మెట్లు ఎక్కుతున్నాడండి ఒక గవర్నర్ గారు మెట్లు ఎక్కుతుంటే కాలు జారిందండి కాలు జారితే కింద అమాంతంగా దొల్లి దొల్లి కింద పడ్డాడండి కింద పడితే జనమంతా చేరారు ఆ గవర్నర్ గారు అంటున్నారు నేను గవర్నర్ అయినా కాళ్ళు ఎరిగినయే అన్నాడండి అయ్యా గవర్నర్ అయితే ఇరగ మరి పడ్డాడు ఒక లా ఇస్ వర్కింగ్ దేర్ అక్కడ శాసనం
(11:22) పనిచేస్తున్నదండి ఎటువంటి గొప్పవాడైనా కింద పడితే కాళ్ళు ఎరుగుతాయండి అదేవిధంగా ఎప్పుడు రావణాసురుడు ఎన్నో సిద్ధులు ఉన్నాయి కానీ అపచారం అపవిత్రమైనటువంటి హృదయం ఉంటే ఆయన ఏమైనా ఉద్ధరింపబడ్డాడా చెప్పండి ఎందుకు ఈ విధంగా పతనం పొందినాడు చెప్పండి అది ఆ క్యారెక్టర్ లేదు మొరాలిటీ లేదు హృదయ పరిశుద్ది లేదు భగవంతుడు ఏం చేయగలడు ఇట్ ఇస్ ఏ లా చూడండి పాపము చేత దుఃఖం అని చెప్పి వచ్చినప్పుడు ఆ పాపాన్ని మనం ఎంత శీఘ్రంగా కరివేస్తే అంత మంచిదండి అది మీరు అడగొచ్చు ఏమండి చేసిన పాపం పోతుందా అని భగవద్గీతలో చెప్పినారు నాయనా ఏదో తెలుసో తెలియకో ఇదవరకు జరిపి ఉంటారు పాపం ఇప్పుడు
(11:56) పుణ్యాన్ని సంపాదించండిఅని రేపు ఏడవ అధ్యాయంలో ఒక చక్కని శ్లోకం రేపు ఏడు వస్తుందండి విజ్ఞాన విజ్ఞాన యోగం యేషాం త్వంతగతం పాపం జనాం పుణ్యకర్మణం తేద్వంద్వమోహ నిర్ముక్త భజంతేమాం దృడవ్రత అంతగతం పాపం పుణ్యకర్మణం పుణ పుణ్యకార్యముల చేత ఎవరి యొక్క పాపం రహితమైందో అంటారు అక్కడ ప్లస్ మైనస్ అనేది కన్ బి రిమూవడ్ బై ప్లస్ చూసారా ఇప్పుడు అప్పు ఉందండి రుణం ఏడుస్తే ఎట్లా చెప్పండి ఏదో పొరపాటున అప్పు చేశాడు ఇప్పుడు సంపాదించండి ధనం సంపాదించి ఆ రుణాన్ని పోగొట్టండి అంతేగాని ఊరికే ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి అది కనుక ఏదో తెలుసో తెలియకో పూర్వజన్మలో గాని
(12:35) చిన్నప్పుడు గాని ఏదో పాపం చేశారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నాయన ఇప్పుడు పశ్చాత్తాప పడు చేసింది పొరపాటు అని చెప్పి గ్రహించి దాన్ని పుణ్యం చేత రహితం చేసి ఇక మీదట పాపంలో ఏలు పెట్టొద్దు అదండి ఈరోజే వస్తుంది ఆ శ్లోకం వచ్చినప్పుడు నేను చెప్తాను అపిచేదసి పాపేభ్యసర్వేభ్యస్పాపకృత్తమః తమః సూపర్లేటివ్ మహా పాపం చేసినప్పటికిని కూడా సర్వం జ్ఞానప్లవేనైవాజనం సంతరిష జ్ఞానం అనే నౌక చేత ఈ మహా పాప సముద్రాన్ని అవలీలుగా దాటవచ్చును అన్నాడు కనుక ఇక మనంఏమి కుంగిపోవాల్సిన పని లేదండి ఏదో జరిగిపోయింది ఏమిటో జరిగిపోయింది ఇకమీదట యక్ట్ యక్ట్ ఇన్ ద livingంగ్
(13:13) ప్రెసెంట్ల లెట్ ద డెడ్ పాస్ బీ ఇట్స్ డెడ్ అన్నాడు ఒక మహానీయుడు గతించిన దాన్ని గూర్చి ఏడవబాకండి ఇప్పుడు చక్కగా భగవంతుని ధ్యానం చేస్తూ వారి యొక్క సిద్ధాంతములో ఆచరణలు పెడుతూ ఉంటే చాలండిది ఇప్పుడు జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తున్నారు భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏది వాట్ ఇస్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్ దేవుడు అంటే ఇప్పుడు ఎవరైనా అడగండి ఏవండీ దేవుడు అంటే ఎవరు ఆ దేవాలయం చూపిస్తారండి దేవాలయం ఆ దేవాలయంలో ఒక దేవుడు ఉన్నాడు ఆయనే దేవుడు చూసారా వారి భావాలు అంతవరకే పోతాయండిరా విశాలమైనటువంటి భావం మనం గ్రహించాలండి భగవంతుడు హి ఇస్
(13:48) నాట్ లిమిటెడ్ యా ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూడండి లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ బ్యాంకు లిమిటెడ్ ఇట్లా ఉంటాయి కదా భగవంతుడు లిమిటెడ్ కంపెనీ కాదండి అన్లిమిటెడ్ అది బ్రహ్మాండం అంతా వ్యాపించిందండి అది ఒకచోట ఉండేటువంటిది కాదు ఆ ఆనాడు భారతంలో జరిగిన విషయం చెప్తున్నాను ఆ దుశాసనుడు జుట్టు పట్టుక ఈడ్చుక వచ్చాడండి ఎక్కడ కౌరవ సభలో ఎవరికి అమ్మగారిని ఈడ్చుకొస్తే ఎవరు కాపాడేది అమ్మగారిని ఎవ్వరు పట్టించు కోలేదండి ఒక్కసారి కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసింది పాహిమాం పాహిమాం అని ఒక చక్కని శ్లోకం చెప్పిందండి చూడండి ఆ శ్లోకం
(14:20) చూడండి గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపిజనప్రియ కౌరవయహి పరిభూతమాంకింనజానాసికేశవ గోవింద ద్వారకావాసి ద్వారకావాసి అయినటువంటి కృష్ణ కౌరవులు నన్ను అవమానం చేస్తున్నారు రక్షించండి అని ప్రార్థన చేసి నో రిప్లై ఇప్పుడు మనం ఎవరికైనా మనియాటిని పంపిస్తే చేరినట్టు గుర్తు ఎక్నాలెడ్జ్ వస్తుందండి మనకి తెలుగు రాసేది కానీ ఈ అమ్మగారు కృష్ణుడిని ప్రార్థన చేశారు రిసీప్ట్ రాలేదండి ఎక్నాలెడ్జ్మెంట్ రాలా అంటే ఏమిటి సహాయం రాలేదండి అప్పుడు అయ్యో ఎంత డెలికేట్ మూమెంట్ చెప్పండి అది ఒక క్షణం ఆలస్యం అయిపోతే అవమానం కలిగేటువంటి టైం కదా అప్పుడు చాలా బాధపడిందండి ఇదేమిటి కృష్ణ
(14:59) పరమాత్మ రక్త రక్షకుడు ఆర్త రక్షకుడు అని చెప్పి పేరు ఉందే మరి నేను అబల ప్రార్థన చేస్తుంటే ఏమి రిప్లై రాయలేదే అని మళల వెంటనే ఇంకొక ప్రార్థన చేసింది ఏమిటో చూడండి కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవిందా కురుమధ్యే అవసీదతే బ్రహ్మాండమంతా వ్యాపించిన కృష్ణ నన్ను రక్షించు అన్నదం వెంటనే తండోపతండంగా చీరలు వచ్చేసినయండి అమ్మగారు కాపాడబడ్డారు చూడండి మొదటి ప్రేయర్ కి రెండో ప్రేయర్ కి ఎంత భేదమో చూడండి మొదటి ఏమన్నది గోవింద ద్వారకావాసన్ చూడండి దేవుని లిమిట్ చేసిందండి ద్వారక ద్వారకలో ఉండే కృష్ణ అన్నది చూసారా అది సరైన డెఫినిషన్ కాదండి
(15:41) భగవంతుని యొక్క యధార్థ ైనటువంటి స్వరూపం అది కాదు ద్వారకలో ఉండే లిమిటెడ్ కాదా చెప్పండి లేదు రెండవ ప్రార్థనలో ఏమున్నది యు ఆర్ ఆల్ పర్వైడింగ్ అనేసింది చూడండి కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావనా ప్రపన్నాం పాయుగోవిందా కురుమధ్యే అవసీదతి వెంటనే రిప్లై వచ్చేసిందండి కానీ ద్రౌపది మనసులో ఈ సందే ఇది ఉన్నది ఆ ఏనాడైనా కృష్ణుడిని అడిగి తీరాలి ఏమిటిది భక్తవత్సలుడు అని పేరు పెట్టుకొని నా బోటి అబల మంచి సీరియస్ మోమెంట్ లో ప్రార్థన చేస్తే ఇంత ఆలస్యంగా నా సహాయం చేసేది వెంటనే సహాయం చేస్తే ఎంత బాగుండును అడుగుదాం అని ఒకనాడు ఏకాంతంగా
(16:17) కృష్ణుడిని కలుసుకుందండి ఎవరు ద్రౌపది ఏవండీ కృష్ణుడు గారు మీరు బిరుదుల లిస్టు ఎంత ఉన్నదో చూడండి ఆ అనాధరక్షకుడు ఆర్ భక్తవత్సలుడు ఎన్నో ఉన్నాయి కదా నాబోటి దీనురాలు ఆ నిండు సభలో అవమాన పడుతుంటే మిమ్మల్ని ప్రార్థన చేస్తే అంత ఆలస్యంగా సహాయం చేశారు ఏమిటండి అని అడిగిందండి వెంటనే కృష్ణుడు మీరు ఏమని ప్రార్థన చేశారు చెప్పండి ద్వారకావాసిన్ అన్నారు కదా ద్వారకలో ఉండే కృష్ణ నన్ను రక్షించ మీరు ఢిల్లీలో ఉన్నారు నేను ద్వారకలో ఉన్నాను ద్వారక నుంచి ఢిల్లీకి రాకెట్ స్పీడ్ తో వచ్చిన 10 నిమిషాలు పడుతుంది కదా అన్నాడంట ఎంత చక్కగా చెప్పాడు నేను ద్వారకలో
(16:53) ఉండేవాడినా అని చెప్పి చక్కగా మందలించినాడు చూసారా రెండవది కరెక్ట్ డెఫినిషన్ చూడండి విశ్వాత్మన్ విశ్వభావన ఆల్ పర్వేడింగ్ గాడ్ చూడండి నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేసి ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేసింది అది కరెక్ట్ డెఫినిషన్ అండి భగవంతుడు ఒక చోట ఉండేవాడు కాదు బ్రహ్మాండం అంతా ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇదే ఆన్సర్ అండి నాయనా నేను ఇప్పుడిప్పుడు పుట్టాను అని చెప్పి అనుకుంటున్నావేమో కాదు నాయనా అపరం బహునిమే వ్యతీతాని జన్మానితవచార్జున తాన్యహం వేద సర్వాని నత్వం వేతపరంతప అజోపిసన్ అవ్యయత్మ భూతానామేశ్వరోపిసన్ ప్రకృతిం స్వామదిష్టాయ సంభవామ్యత్మమాయ
(17:33) ఈ రెండు శ్లోకాలుండి చాలా అద్భుతంగా ఉంది భగవంతుని యొక్క అవతార ఉద్దేశం చెప్తున్నారండి యదాయదాహిధర్మస్య నిర్భవతి భారత అద్యుత్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధునాం వినాశాయచదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఇప్పుడు చూడండి ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం కదండీ జ్ఞానంలోకి దిగుతున్నారండి ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే జ్ఞానయోగం అని పేరు పెట్టారు కానీ జ్ఞానము యొక్క స్వరూపాన్ని లోతుగా విచారణ చేయలేదు ఇప్పుడు జ్ఞానం యొక్క లోతు లో ప్రవేశించలేదండి ఎప్పుడు ప్రవేశిస్తారో తెలుసునా 13వ అధ్యాయం చూడండి దాని పేరు
(18:14) జ్ఞాన శట్కం ఆ ఆరు అధ్యాయములో అఖండమైనటువంటి జ్ఞానతత్వం బోధిస్తారండి ఎప్పుడు 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర నుంచి చివరి వరకు ఇప్పుడు మరి జ్ఞానయోగం అని పేరు పెట్టారే జ్ఞానము యొక్క మహిమ జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గూర్చి వర్ణిస్తున్నారు. ఏ విధంగా వర్ణిస్తున్నారు ఐదు ఉపమానాలు ఐదు ఉపమానములు చెప్తున్నారండి ఈ అధ్యాయంలో జ్ఞానం అంటే ఎంత గొప్పదో చూడండి అది ఆ మొదట్లో ఆ పేర్లు చెప్తున్నాను వినండి జ్ఞాన తపస్సు నెంబర్ వన్ రెండు జ్ఞాన యజ్ఞం మూడు జ్ఞాననౌక నాలుగు జ్ఞాన అగ్ని ఐదు జ్ఞాన ఖడ్గం నాలుగు ఉపమానములతో చక్కగా ఈ జ్ఞానము యొక్క
(18:57) ఆధిక్యతను వర్ణిస్తున్నారండి ఆ మొదటిది చూడండి జ్ఞాన తపస్సు సామాన్యంగా తపస్సు అంటే అందరూ కంగారుపడిపోతున్నారు అయ్యో మేము చేయలేం మేము గృహస్తులం కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ఎండలో చస్తూ ఉపవాసాలు చేస్తూ మేము ఎక్కడ అవలంబించగలం ఈ తపస్సులు అని చెప్పి అంటున్నారు శ్రీకృష్ణ భరణ డోంట్ వర్రీ మీరు అటువంటి భయపడ ఏం భయపడబాకండి జ్ఞానం అంటే చెప్తున్నారు వినండి ఇది యథార్ధమైన తపస్సు తపస్సు అంటే అర్థం ఏమిటి తప్ తప్పు అంటే కాల్చడం దేన్ని కాల్చడం చెప్పండి తపింపు ఇప్పుడు చూడండి బంగారం బంగారంలో ఇతర లోహాలు వచ్చి కలిసినయి అనుకోండి మట్టం ఆ మట్టం బంగారాన్ని షరాబు గారు ఏం
(19:33) చేస్తారు మీరు వెంటనే మార్కెట్ కి తీసుకెళ్తే వాల్యూ ఉండదండిది దాన్ని బాగా పుటం పుటం పెట్టి దాంట్లో ఉన్న ఇతర లోహాలన్నీ ఆవిర అయిపోతాయి చూడండి ఆవిరైపోయిన తర్వాత ఏం మిగులుతుంది మేలిమి మేలిమి బంగారం ఆ మేలిమి బంగారం గనుక తీసుకుపోతే ఎంతో విలువ ఉంటుందండి దానికి చూసారా అదే విధంగా ఈ మానవుని యొక్క చరిత్ర చాలా హీనంగా ఉంటుందండి ఈ హీనమైనటువంటి చరిత్ర వల్ల వాడికి వాల్యూ లేకపోతున్నది దాన్ని బాగా తప్పింప చేయాలంటే సాధన చూసారా సాధన గనుక చేస్తే ఆ మాలిన్యం అంతా ఎగిరి అవతల పోతుందండి ఏమిటి ఆ మాలిన్యం చెప్పండి ఒక లిస్ట్ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ
(20:07) దాన్ని బాగా తపింప చేయండి చూడండి [గొంతు సవరించుకోవడం] యథా సువర్ణం సువర్ణం యొక్క దృష్టాంతం మన శాస్త్రంలో చెప్తున్నారు యతకంచ సువర్ణాది మిళితం రజతాదిన అల్పమూల్యం ప్రజాయేతజీవోపి అహంయుతః జీవుడు అహంకారం మమకారం కామక్రోధాదులు కలిగి ఉంటే వాల్యూ లేదు వాడికి వాడు కేవలం పరమాత్మ స్వరూపుడు అయినప్పటికిని ఈ మాలిన్యం వాడిలో చేరింది ఇప్పుడు ఏం చేయవలెనం దానికి పుటం పెట్టాలి పుటం పెట్టాం అంటే సాధన చేసి వాటిని తొలగించాలి దేన్ని అవినీతి అధర్మం అన్యాయం దంబం అసూయ ద్వేషం అపకారం ఇటువంటివన్నీ కూడా మనం బాగా కాల్చి పారేయాలి వాటిని తపింప చేయడం అదేనండి తపస్సు అంతేగాని
(20:49) కాళ్ళు పైకెత్తడం తలకాయ కింద పెట్టడం ఉపవాసాలు చేయటం ఇది తపస్సు యదార్థం యొక్క తపస్సు యొక్క యదార్థ స్వరూపం కాదండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి తపస్సు [గొంతు సవరించుకోవడం] వీతరాగ భయక్రోధ మన్మయామాముపాశ్రతాః బహవోజ్ఞాన తపసాపూతామద్భావమాగతః చక్కని శ్లోకం అండిది వీత రాగ భయ క్రోధ చూడండి దుర్గుణముల యొక్క లిస్ట్ చెప్పాడు ఏమిటి చెప్పండి ఆశ కోపం అసూయ ద్వేషం భయం ఇవన్నీ కూడా ఈ దుర్గుణములు హృదయంలో ఉన్నాయండి అనేకమందికి దాంట్లో హృదయంలో బాగా దాగి ఉన్నాయి తెలుసుకోవడం లేదండి జనుడు తెలుసుకోవడం లేదు నాలో ఈ పాడు గుణాలు ఉన్నాయి అని చెప్పి చాలా మందికి
(21:31) తెలియదండి తెలుసుకోవాలి అది ఇప్పుడు ఇంట్లోనండి దొంగ ఉంటే మనం కనిపెట్టటంలా చెప్పండి ఇంట్లో ఎవడైనా వచ్చి ఏవండో మీ ఇంట్లో నేను కాపురం ఉంటాను అంటే నోరు మూసుకో పోవయ్యా అంటారు ముందు ఎందుకంటే ఒక దొంగ ఇంట్లో ప్రవేశించినాడు అంటే వాడు ఊరికే పోడండి ఏదో తస్కరించుకొని పోతాడు అది అదే విధంగా హృదయంలో ఉండేటువంటి ఆ దైవ బలాన్ని వాడు నాశనం చేస్తూ ఉంటాడండి ఏది ఈ దుష్ట అసురమైనటువంటి సంపద అది ఈ అసుర గుణములు ఉన్నాయి చూడండి ఇవి హృదయాన్నంతా పీల్చి పిప్పి చేస్తాయి మానవుడికి అశాంతిని దుఃఖాన్ని తెస్తాయండి అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సు ఆ ఈ జ్ఞాన
(22:05) తపస్సు ఎవరైనా చక్కగా ఇడ్ల దగ్గర కూర్చొని చేయొచ్చు ఇదేదో బయట ఏదో వాసనాలు వేయటం కానీ కాళ్ళు పైకెత్తడం కానీ దానికి సంబంధించింది కాదండి ఇది హృదయ పరిశుద్ధి ఆ హృదయ పరిశోధన చేసుకొని దుర్గుణమలో వెంటనే మెడపెట్టి గంటి అవతలు పారేయాలండి ఆలస్యం చేయకూడదండి ఆలస్యం చేస్తే ఏమవుతుంది జ్ఞాన రత్నాన్ని అపహరించుకొని పోతుందండి కామక్రోధస్య లోభస్య గేహేతిష్టంతితస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత్తగా ఉండండి జ్ఞానం అనేటువంటి రత్నం కష్టపడి ఎన్ని జన్మల నుంచో మనం సంపాదించుకున్నాం దాన్నే ఇది తస్కరించుకొని దొంగిలించుకొని పోతున్నాయి ఎవరు ఈ దుర్మార్గులైనటువంటి
(22:42) రాక్షసులది కొంచెం జాగ్రత్తగా మనసు మీద ఇంద్రియముల మీద నిగా ఉండాలండి [గొంతు సవరించుకోవడం] మనసుపైన జయము పొందన్నా ఇంద్రియంబుల టక్కు దూచి మోసపోకన్నా దేహమందలి చతుర చోరుల చర్యలన్నియు గాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుత వానిన నెల్లను తరిమి వైచుము తత్వసారము తెలిసికోరన్నా తత్వసారం ఆ మనసుని ఇంద్రియాలని కొంచెం జయించడానికి ప్రయత్నం చేయాలండి ఈ ఆధ్యాత్మికం అంటే చాలామంది కంగారుపడుతున్నారు ఏమో ఈ సాధన మేము చేస్తామో లేదో అని ఏమి కష్టం లేదండి తనలో ఉండేటువంటి తనకంటే కిందండి ఇంద్రియాలు ఇవన్నీ ఎవరండి నిన్నటి దినం శ్రీకృష్ణ పరమాత్మ ఒక గ్రేడ్ చూడండి పైన ఆత్మ చూడండి
(23:30) కింద దేహం కర్మేంద్రియం చూడండి ఈ దేహం దాటి కర్మేంద్రియం కర్మేంద్రియం దాటి జ్ఞానేంద్రియం తర్వాత మనసు తర్వాత బుద్ధి తర్వాత ఆత్మ చూడండి బుద్ధికి సాక్షి మన స్థానం ఎక్కడంటే సుపీరియర్ పొజిషన్ కేవలం కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఒక శక్తి చేత మనం అవమానింపబడుతుంటే ఎంత సిగ్గుండండి చెప్పండి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ మనస్సు మనల్ని అవమానం చేస్తున్నాయి అంటే నిజంగా అది పరు నష్టం ఉండేది పరు ప్రతిష్టలంతా నాశనం చేస్తున్నాయండి దానికి లోంగకూడదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి దినం ఏవం బుద్ధే పరంబుద్వా సమస్తభ్యాత్మనమాత్మన
(24:08) జయశత్రుం మహాబాహో కామరూపం దురాసదం నాయనా ఈ శత్రువును ఓడించేయ లేకపోతే దూరంగా తరివేసేయండి అట్లాగన లేకపోతే ఏమవుతుంది ఇంత కష్టపడి మనం మానవ జన్మ పొందినప్పటికి దురుపయోగం అయిపోతుంది అన్నది ఆఖరి కళ్ళు మూసుకునే టైంలో ఏమిటండీ వీడు సంపాదించేది చెప్పండి ఎన్నో కష్టపడి సంపాదించుకున్నాడు వస్తువులన్నీ ఏవైనా ప్రయోజనం ఉన్నదా తన యొక్క ఆత్మోన్నతికి ఏమైనా ఉపయోగించినయా రాబోయే జన్మ శుద్ధంగా ఉండటానికి ఉపయోగించినయా లేదు కదా మరి అటువంటప్పుడు వేస్ట్ కదండీ హ్యూమన్ బర్త్ ఇస్ వేస్ట్ అది అట్లా ఎప్పుడు ఉండకూడదు జాగ్రత్తగా మన అంత్యకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికీ
(24:41) తెలియదు కాబట్టి ఈ లోపలనే బహు జాగ్రత్తగా ఉండి తన యొక్క చరిత్ర తన యొక్క మొరాలిటీ చాలా శుద్ధంగా ఉండేటట్టు చూడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనం ఎన్ని తపస్సులు ఎన్ని ఏైనా చేయనండి మనం చేసేటువంటి కర్మ గనుక శుద్ధంగా లేకపోతే ఏం ప్రయోజనం లేదండి చూసారా మానవుని కాపాడేది తన యొక్క పుణ్య కర్మ తన యొక్క దైవ కర్మ తన యొక్క పరోపకార కర్మ అదండి మానవుని కాపాడేది అది శుద్ధంగా లేకపోతే ఎట్లా చెప్పండి అది జరపకపోతే ఎట్లా చెప్పండి అది కనుక ఈ కర్మ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఏవండీ ఆ శుద్ధంగా ఉండేటట్టు చూడాలి వివేకానంద
(25:17) స్వామి ఒక చక్కని వాక్యం చెప్పారండి ఆ హూ సోస్ musస్ట్ రేప్ అన్నాడండి ఎవరు ఏ విత్తనం నాడితే ఆ ఫలితం వస్తుంది అన్నాడు చూడండి సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అని 13 పద్యాలు ఇంగ్లీష్ లో రాశరండి దానిలో ఒకటి సోస్ musస్ట్ రేప్ దేసే అండ్కాuse musస్ట్ బ్రింగ్ ది షూర్ ఎఫెక్ట్ గుడ్ గుడ్ అండ్ బాడ్ బాడ్ నన్ ఎస్కేప్ ది లా అన్నాడు శాసనాన్ని ఎవరు దిక్కలించలేరు అన్నాడు మంచి చేస్తే మంచి వస్తుంది చెడ్డ లేస్తే చెడ్డ కలుగుతుంది అన్నాడు దాన్ని అని తెలుగులో చెప్పారు వినండి అవని అవని అంటే భూమి అవని జల్లినదిద్దియో అదియపండు కారణంబును బట్టియే కార్యముండు చెడ్డ
(25:58) చెడ్డకును మంచి మంచికిని గలుగు దీనిని తప్పించుకొనుటకు తెరవు లేదు మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు చూసారా పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే ఇప్పుడు చూడండి ఎంత మందో మేడలు కట్టుకొని ఏమో ఆనందంగా బతుకుతున్నారు చూడండి పూరి గుడిసెల్లో కొందరు బాధపడుతున్నారండి కారణం ఏమిటి చెప్పండి సామాన్యంగా కొందరు ఎవర ఏదైనా బాధలు కలిగితే రోగాలు వచ్చినా ఏవచ్చినా దేవుడు గారికి దండం పెట్టి దేవుడు గారు నాకు ఎందుకు ఈ బాధలన్నీ ఇస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేస్తాడు.
(26:28) దేవా ఎందుకు నాకు ఈ కష్టాలు ఇస్తున్నారు కారణంబును బట్టి ఏ కార్యముండు చెడ్డ చెడ్డకును మంచి మంచికిని గలుగు దీన్ని తప్పించుకొనుటకు తెరవు లేదు మానవుడు ఏ పాపం చేస్తే పాపం అనుభవించాల్సిందే శిక్షలు చూసారా పుణ్యం చేస్తే పుణ్యం యొక్క ఫలితమైనటువంటి సుఖం అనుభవించవలసిందే ఇప్పుడు చూడండి ఎంతమందో మేడలు కట్టుకొని ఏమో ఆనందంగా బతుకుతున్నారు చూడండి పూరి గుడిసల్లో కొందరు బాధపడుతున్నారండి కారణం సర్వభూతేషు నమే ద్వేషో స్తినప్రియః ఏభజంతితమాం భక్త్యమయతేతేషుచాప్యహం నాకుఅందరి మీద సమభావన ఉన్నది చూడండి ఒకరు ఉదనం ఒకరు బాగుపడాలి ఒకరు కష్టపడాలని నాకు అభిప్రాయం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ
(27:10) భగవద్గీతలో ఒక వాక్యం చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆనందపడుతున్నారంటే ఎవరైనా దుఃఖపడుతున్నారంటే దానికి కారణం భగవంతుడు కాదండి ఏమిటి చెప్పండి వాడి కర్మ వాడు పూర్వ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో చేసిన కర్మే దానికి కారణం అది గనుక శుభప్రదంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అకార్డింగ్ టు లా చక్కని వారు సంపదను అనుభవిస్తారు చూడండి ఇప్పుడు ఎందరో సంపదలు అనుభవించి ఆనందపడుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారు కొందరు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్స్ లో బాధపడుతున్నారు కొందరు గుడిసల్లో పడి తిండి లేక అవస్థ పడుతున్నారు దీనికంతటికీ నీ కారణం ఏమిటో చెప్పండి ఇది వాడు
(27:40) చేసినటువంటి కర్మ ఫలితం కనుకనే ఒకాయన ఈ మధ్య ఏవండీ మీరందరూ దేవుళ్ళకే దండం పెడుతున్నారు కానీ నేను నా కర్మకి దండం పెడతాను అన్నాడండి ఒకాయన ఎంత బాగుందో చూడండి తస్మై నమః కర్మణే కర్మ శుద్ధంగా లేకపోతే దేవుడు మాత్రం ఏం చేయగలడు వాడి కర్మను అనుసరించే దేవుడు ఫలితం ఇస్తాడండిది ఆ చూసారా కనుక ఇప్పుడు ఎవరైనా దుఃఖ పడుతున్నారు అంటే భగవంతుడు కారణం కాదఅది ఆరా భగవంతుడు ఎటువంటి వారో తెలుసాండి మనకు ఉత్తరాలు ఇస్తారు చూడండి పోస్ట్ రన్నర్ పోస్ట్ రన్నర్ సైకిల్ మీద ఇక్కడి నుంచి వచ్చి మనకి ఉత్తరాలు అన్ని టెలిగ్రామలు ఇవన్నీ ఇస్తుంటారే అటువంటి
(28:15) వారండి ఎవరు భగవంతుడు ఆ ఏ ఉత్తరమో దాంట్లో ఏ మేటర్ ఉందో దానికి రన్నర్ కి సంబంధం లేదండి మీకు ఏ ఉత్తరం వస్తుందో దాన్ని ఇస్తారు కానీ ఉత్తరంలో మేటర్ కి వారికి కి సంబంధం లేదండి అది ఈ మధ్య ఒక రన్నర్ అండి ఒక టెలిగ్రామ్ పట్టుకొచ్చాడండి మంచి స్పీడ్ తో వచ్చాడు ఒక రెండు దగ్గర ఆగి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడండి ఆ ఇంటి ఆయన టెలిగ్రామ రాగానే గుండె కొంచెం అదిరిపోయిందండి ఎందుకంటే రెండు రకాలుగా ఉంటాయండి శుభవార్త రావచ్చు అశుభ వార్త రావచ్చు టెలిగ్రామ లో అందుచేత గాబరా పడి ఆ పోస్టర్ రన్నర్ అక్కడే ఉన్నాడు వాడు ముందే చించాడండి ఏది టెలిగ్రామ్ చదివితే ఎంత
(28:48) ఆనందకరమైనటువంటి వార్త వచ్చిందంటే చెప్పటానికి లేదండి ది మ్యారేజ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఇన్ లా సెటిల్డ్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ మీ బావమర్ది గారి వివాహం నిశ్చయమైంది వెంటనే బయలుదేరండి అని టెలిగ్రామ వచ్చిందండి ఎంత ఆనందపడ్డాడు అంటే చూడండి పెళ్లి చేసేవాడు అవస్థ పడతాడు కానీ చూసేవాడు ఆనంద పడతాడుండి ఆ అందువల్ల ఈ టెలిగ్రామ రాంగానే ఐదు రోజులు హాయిగా అక్కడికి వెళ్లి ఆ సో ఆనందంగా ఉండొచ్చుఅని చెప్పి ఆ ఆనంద వార్త తెచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు పోస్ట్ ఆయన కదా అక్కడ ఒక మాల ఉందండి పుష్పమాల అది మెళలో వేసి సన్మానం చేశడండి ఆహా శుభవార్త తెచ్చావయ్యా
(29:21) మహానుభావా అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడండి వెళ్ళిపోయి ఈయన ఈయన గుడ్డలు సర్దుకుంటున్నాడు ఊరి ప్రయాణం చేస్తాం పెళ్లికి అని మళ్ళా అరగంట అయిన తర్వాత ఇంకో టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు అండి వాడే వాడి ముందే చించుకున్నాడండి నారాయణ అశుభవార్త వచ్చిందండి ఏమని తెలుసు యువర్ ఫాదర్ ఇన్ లా ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ మీ మామగారు పరలోకానికి సిద్ధం వెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వరగా రావాల్సింది అని చెప్పేసి చూసారా ఈ వార్త ఎవరు తెచ్చింది ఆ రన్నరే ఏవండీ ఆయనక ఏమైనా సంబంధం ఉందా కోపం మండిపోయిందండి పాడు వార్త తెచ్చాడు నిజంగా కర్ర ఉంటే దంచి
(29:51) పారేసేవాడండి ఇదంతా తెచ్చింది ఎవరిది తిట్టండి వాడి రన్నరే అయినప్పటికిన వారికి ఏమి సంబంధం లేదు వీడి కర్మ ఎట్లా కాలిందో దాన్ని బట్టి వార్తలు వచ్చినాయండి అదేవిధంగా జీవుడు తాను చేసేటువంటి పుణ్య కర్మ వల్ల సుఖం అనుభవిస్తున్నాడు పాప కర్మ వల్ల దుఃఖం అనుభవిస్తున్నాడు దీనికి భగవంతునికి సంబంధం లేదు ఇట్ ఇస్ ఏ లా అది ఎందుక నేను చెప్పాను విశ్వశాసన కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అనేకమైనటువంటి దుర్గుణాలు చెప్పి ఈ దుర్గుణములు పోగొట్టడమే తపస్సు చూడండి వీతరాగ భయ క్రోధ క్రోధ ఈ కోపం అనేటువంటిది మొన్న రెండవ అధ్యాయంలో కూడా బాగా చెప్పారండి
(30:24) మొట్టమొదట కోరిక ఆ కోరికను అనుభవిస్తామని వెళితే వెంటనే ఎవరైనా అడ్డు పెడితే వాడి మీద కోపం కోపం గనుక వస్తే కళ్ళు తాగినట్టు అయిపోతుందని మొన్న చెప్పారండి చెప్పలేదండి క్రోధ్భవతి సమ్మోహః సమ్మోహం అంటే మైకం చూడండి కోపం వస్తే ఏమి దిక్కు తెలియదండి ఎవడితో ఎవడి మీద కోపమో అది కూడా మర్చిపోతాడు సమ్మోహం అంటే ఏమిటి మెమరీ కొత్తిగా పోతుందండి హైపు చూడండి కళ్ళు తాగితే ఎట్లా ఉంటాడో అట్లా అయిపోతుందండి కోపం అనేటువంటిది అంత పాడుగుణం అండి అది అది వచ్చినప్పుడు అందరిని కొడతాడు తిడతాడు చేయరాని పనులు అన్నీ చేస్తాడండి అది ఆ అందుచేతనే చూడండి పూర్వం పిచ్చి కుక్కలు
(30:57) ఎవరినైనా కరిస్తే ఆ మందు లేవండి ఇప్పుడు కనిపెట్టారు ఏది పిచ్చి కుక్క గనక కరిస్తే 14 ఇంజెక్షన్స్ కని వేస్తే ఆ విషం పోతుందండి పూర్వకాలం ఆ విషం పోయేటువంటి వెరుగుడు తెలియదు కాబట్టి పిచ్చి కుక్క కరిస్తే ఏమవుతుందో తెలుసా అండి ఆ కరిచినవాడు కుక్క మోస్తర్ అరుస్తాడండి ఈ పిచ్చి కుక్క మోస్తర్ అరిచి పిచ్చి కుక్క మోస్తర్ అందరిని కరుస్తాడండి కరిచి చచ్చిపోతాడు ఇదండి పిచ్చి కుక్క యొక్క ప్రభావం అది పూర్వం అండి ఈ మందులు లేని టైంలో ఒక పిచ్చి కుక్క ఒకాయన కరిచిందండి కరిస్తే వాడు వెంటనే ఒక తెల్లకాయితం మీద గబగబ ఏదో రాస్తున్నాడండి స్నేహితుడు వచ్చి ఏమయ్యా
(31:31) పిచ్చి కుక్క కరిచింది నువ్వు చచ్చిపోతావ అని చెప్పి విల్లునామా రాస్తున్నావా అని అడిగాడండి కాదు ఎవరిని కరవాలో లిస్టు రాసుకుంటున్నాను అన్నాడండి [నవ్వు] ఈ కోపం కూడా అటువంటిదే నండి చూసారా పిచ్చి కుక్క మోస్తాడండి కళ్ళు కైపు కైపులో పడిపోతాడు వాడు ఎవరిని కోపగిస్తున్నాడో అది కూడా మర్చిపోతాడు శ్రీకృష్ణ పరమాత్మ సైకాలజీ చెప్పుకొచ్చారండి మొన్న రెండవ అధ్యాయం చూడండి ధ్యాయతో విషయాన్పంసః సంగస్తేషుపజాయతే సంగతంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే చూడండి ఒక్కొక్కటి తర్వాత ఒకటి తర్వాత క్రోధ్భవతి సమ్మోహ క్రోధ్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశత్ బుద్ధినాశో
(32:16) బుద్ధినాశ ప్రణస్యతే డౌన్ఫాల్ గోతిలో పడిపోతాడు చూడండి ఒకవికా వికారం వచ్చేటప్పటికి తర్వాత క్రమ క్రమ క్రమంగా దిగజారిపోతున్నాడండి దేనివల్ల కళ్ళు కళ్ళు తాగినట్టు అయిపోతుందండి ఈ పాడుగుణాల వల్ల అందుచేత బివేర్ జాగ్రత్తగా ఉండండి తపస్సు చేయండి సాధన చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన తపస్సును గూర్చి చెప్పారండి ఇప్పుడు ఈ అధ్యాయంలో కర్మయోగాన్ని గూర్చి కొంచెం చక్కగా ప్రస్తావన వచ్చిందండి నిన్న కర్మను గూర్చి బాగా చెప్పారు కదా ఈ అధ్యాయంలో మళ్ళా చెప్తున్నారండి ఇది ఆ కర్మ కర్మ యోగము యొక్క స్వరూపం ఏమిటో నిన్నటి జనం చెప్పిన విషయం ఏమిటో తెలుసా
(32:48) అండి భగవద్గీతలో చెప్పిన కర్మ ఆసనం వేసుకొని కళ్ళు మూసుకుని ముక్కు మూసుకని కూర్చోవడం కాదండి మీ ఉద్యోగం మీ వ్యాపారం మీ వ్యవసాయం చక్కగా చేస్తూండండి కానీ పవిత్ర హృదయంతో చేయండి చూసారా ఒక ప్రాణికి అపకారం లేకుండా చేస్తే ఆ కార్యమే ధ్యానం కింద మారిపోతుంది వర్క్ విల్ బి ట్రాన్స్ఫామడ్ ఇటు వర్షిప్ చూసారా దాంట్లో గనుక డివినిటీ గనుక ఉంటే ఆ దివ్యత్వం గనుక జోడిస్తే సామాన్యమైనటువంటి కార్యం యజ్ఞంగా మారిపోతుందని భగవద్గీతలో చెప్తున్నారు చూసారా నడక నడకగా భావించకుండా భగవంతుని యొక్క ప్రదక్షణ షణంగా ఎందుకు మార్చుకోకూడదు అంటారండి పెద్దలు నిద్ర
(33:24) జడమైనటువంటి నిద్రగా కాకుండా నిద్ర పోయేటప్పుడు ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు నిద్ర ప్రారంభించేప్పుడు ప్రార్థన పొద్దున్నే లేవంగానే ప్రార్థన చేస్తే మధ్యలో ఉన్నటువంటి నిద్ర ధ్యానంగా మారిపోతుందండి చూసారా ఇట్ విల్ బి చేంజ్డ్ ఇంటూ మెడిటేషన్ ఆ సమాధిగా మారిపోతుందండి ఇటువంటి కీలకములు ముంచుకొని గ్రహించి 24 గంటలు ధ్యానంగా మనం మార్చుకోవచ్చుండి చూసారా ధ్యానం అంటే కొద్దిసేపు అరగంట సేపు కూర్చోవడం కాదు భగవద్గీత చెప్పిన ధ్యానం చూసారా మీ యొక్క వర్క్ మీ యొక్క సామాన్య ైనటువంటి కార్యక్రమం దైనందిన కార్యక్రమం కూడా ధ్యానంగా మార్చుకోవచ్చు ఇప్పుడు
(33:55) గాంధీ మహాత్ముడుండి ఆఫ్రికాలో పాకీ దొడ్లు ఊడిచాడండి పాకీ దొడ్లు ఊడిచినారు ఏ భావనంతో చేసినారు చెప్పండి ఆయుషల్ బిజడ్నాట్ బై ది వర్క్ యుడు బట్ బై దిమోటివ్ విత్ వచ్ యుడు ఇట్ చూసారా పెద్దలు ఏం చెప్తున్నారు నాయనా నువ్వు ఏ పని చేస్తావో దాని వల్ల నువ్వు పెద్ద గొప్పవాడవని కాదు ఏ ఉద్దేశం చేత చేస్తున్నావో అది గొప్పది గాంధీ గారు పాతిలో ఊడిచినాడు అంటే ఏ భావంతో ఓడిచినారు నారాయణ స్వరూపులు జీవులు ఆ ప్రాణికోట్లంతా దైవ స్వరూపం వారికి సేవ చేస్తున్నాను వారికి కైంకర్యం చేస్తున్నాను ఇదే దైవ కైంకర్యం అని చెప్పి అనుకున్నారు చూసారా కనుక ఆ పని చిన్నది అని మీరు ఎప్పుడు
(34:30) అనుకోబాకండి పాకీ పని అది ఏ భావంతో చేస్తున్నారో అది గొప్పదండి మళ్ళీ చెప్తున్నాను యుషషల్ బిజడ్నాట్ బై ది వర్క్ యుడు బట్షల్ బి జడ్జడ్నాట్ బై ది వర్క్ యుడు బట్ బై దిమోటివ్ విత్ వచ్ యుడు ఇట్ అది ఏ భావంతో చేస్తున్నారో అది చాలా గొప్పదండి సరే కర్మ పెద్ద పెద్ద కర్మాలు చేయమని ఎప్పుడు చెప్పలేదు యజ్ఞాలు ఇవన్నీ చేయమని చెప్పి ఎవరు చెప్పలేదు చిన్న పనైనా పెద్ద బుద్ధితో దైవ బుద్ధితో పరోపకార బుద్ధితో చేస్తే అది యజ్ఞంగా మారిపోతుంది అదండి భగవద్గీత యొక్క కర్మ రహస్యం ఆ ఏమో పెద్ద పెద్ద కర్మలు చేయమని చెప్పలేదు ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం ఉందండి ఆ
(35:05) దిగ్రేట్నెస్ ఆఫ్ ఏ మన్ లైస్ నాట్ ఇన్ డయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్వే బట్ ఇన్ డయింగ్స్మాల్ థింగ్స్ ఇన్ ఏగ్రేట్వే అర్థమైందా మళ్ళీ చెప్తున్నాను గ్రేట్నెస్ ఆఫ్ ఏ మన్ లైస్ నాట్ ఇన్ డయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వేబట్ ఇన్ డయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే మనిషి యొక్క గొప్పతనం పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదు చిన్న కార్యం పెద్ద బుద్ధితో చేయాలి అదండి కర్మయోగం నిన్న శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది.
(35:31) అవతార మూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ డ్రైవర్ డ్రైవర్ గా ఉన్నారంటే కారణం ఏమిటండి చెప్పండి ఎవరైనా బండికి డ్రైవర్ గా ఉంటారా అని ఆ మహనీయుడు ఆ కార్యక్రమం తీసుకున్నారంటే దాంట్లో ఎంత పాఠం ఎటువంటి పాఠం బోధిస్తున్నారు సర్వీస్ టు హ్యూమానిటీ అదండి ఆ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఏ కార్యం చేసినప్పటికినీ అది దాంట్లో గొప్పతనం ఉన్నదండి ఎప్పుడు పవిత్ర భావంతో కూడి ఉంటే ఆ సరే ఇప్పుడు చిన్న దృష్టాంతం చెప్తాను మీరు రోడ్డు మీద పోతున్నారండి రోడ్డు మీద పోతుంటే రోడ్డు మధ్యలో ఇంత రాయి ఇంత రాయి ఉన్నదండి మీరు మీరు నిజంగా ఆలోచన చేయాలి ఈ రాయి ఎవరికైనా కాలికి
(36:02) తగిలితే దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ రాయిని తీసి పక్కన పారేస్తున్నాను అని గనుక ఆ రాయిని దూరంగా పారేస్తే రాజసూయ యజ్ఞం అయంత ఫలితం వస్తుందండి చూసారా అది చిన్న పని అని అనుకోబాకండి రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదైనా దాంట్లో ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం ఉందంటే చెప్పడానికి లేదండి ఒక ప్రాణికి మీరు ఉపకారం కలుగజేసిన వారు అవుతారు చూసారా అదండీ చిన్న కార్యమైనా పెద్ద బుద్ధితో చేయాలి అది భగవద్గీత యొక్క రహస్యం అది ఇప్పుడు మీ ఇంట్లో నుండి నీళ్ళ తొట్టి ఉందండి నీళ్ళతోటి దాంట్లో నీళ్ళు ఉన్నాయి నిండ ఒక చీమ దాంట్లో పడి గిలగల తన్నుకుంటుందండి తన్నుకుంటూ ఉంటే మీరు
(36:34) పక్కనుంచి పోతూ చూచారండి వెంటనే ఏం చేయాలో తెలుసండి ఆ చీమను ఏలుతో ఎత్తి దూరంగా దొలపండి ప్రాణాన్ని దానం చేసిన వారు అవుతారు చూసారా ప్రాణదానం చేసిన వారు అవుతారు ఆ చీమ అట్ట కొట్టుకుంటూ ఉంటే మీరు పక్కనే పోయి నేను ఎమ్మే బ్యాస్ అయినాను చీమను ఎందుకు కాపాడాలని అటు పోబాకండి ఊరికే ఆ ఏవండీ మన మోస్తర ప్రాణి ఒకటి గిలగిల తన్నుకు చస్తుంటే ఏలుతో తీసి దాన్ని కాపాడే శక్తి మనకు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేయకూడదు ఒక ప్రాణికి ఎందుకు ఉపకారం చేయకూడదు అది చిన్న కార్యం అయినప్పటికిన పెద్ద బుద్ధితో చేయాలి చూసారా అది భగవద్గీతలో బోధించేది
(37:06) చిన్న కార్యం ఎప్పుడు అనుకోబాకండి ప్రతి కార్యం కూడా గంభీరమైనటువంటి కార్యక్రమం అందులో ఒక ప్రాణికి ఉపకారం చేస్తున్నావ అంటే అది మహత్తరమైనటువంటి పవిత్ర కార్యం అండి అది ఇది కర్మయోగం యొక్క రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి దినం చెప్పినారు ఈ రోజు కూడా కర్మ సంబంధమైంది కొద్దిగా చెప్పారండి యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ దగ్ధ కర్మానం తమాహు పండితంబుధ జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఎవరు ఈ కర్మలో ఉండేటువంటి కాలుష్యం రహితం చేశారో వారే పండితులు అన్నారు ఇంకొక శ్లోకం నిరాశర్యత చిత్తాత్మ చక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వప్నోతికిల్విషం
(37:46) కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు ఏవండీ కర్మ చేసినప్పటికిని తగులుకోరు అంటున్నాడు చూడండి ఇప్పుడు మానవుడు ఒక కర్మ చేస్తూ ఎట్లా ఉన్నాడో తెలుసా అండి అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే దాంట్లో తగులుకు పోతున్నాడు నేను చేస్తున్నానని అహం దీని పేరు ఇంగ్లీష్లో ఈగోయిజం అంటారు ఈ ఇగోయిజం ఈగోయిస్టిక్ టెంపరర్మెంట్ మానవుడిని హతం మారుస్తున్నదండి నేను చేస్తున్నానని కర్తృత్వం వాడి అడ్డుపడుతున్నదండి ఈ ప్రపంచంలోనండి విశ్వమంతటినీ మనిపులేట్ చేసే ఒక మహత్తరమైన శక్తి ఉన్నది కదండీ మనం ఎవరమండి దాని దగ్గర చెప్పండి ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండం ఒక్కసారి మీరు
(38:21) ఆకాశాన్ని చూడండి ఎప్పుడైనా అమావాస్య నాడు మేఘములు లేనప్పుడు చూడండి ఆకాశం ఆహాహ ఎన్ని అగనిత లైనటువంటి నక్షత్రములు గలాక్సీ అంటారు గలాక్సీ అంటే పాలకొంత ఓ దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర ఎన్నో నక్షత్రాలు ఎవరండి ఆ నక్షత్రాలు అంటే ఏమిటండి మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం చూడండి దిసన్ ఇస్ ది నియరెస్ట్ స్టార్ ఆ నక్షత్రములో దగ్గరక వచ్చిన నక్షత్రం పేరు సూర్యుడుండి తొమ్మిది కోట్ల మైళలు దూరంలో ఉన్నాడు చూడండి ఆ నక్షత్రములన్ని కోటాను కోట్ల మైళ్లు మనం దూరం లెక్కపెట్టలేమండి దాని పేరు లైట్ ఇయర్ అంటారు లైట్ ఇయర్ అంటే ఒక్క సంవత్సరానికి లైట్ యొక్క వేగం
(38:55) ఎంత దూరం పోతుందో అటువంటి లైట్ ఇయర్స్ ఎన్నో దూరా అటువంటి కాంతి సంవత్సరాల దూరాల్లో ఉన్నాయండి మన దాని పేరు ఎస్ట్రానామికల్ ఫిగర్స్ అంటారు మనం ఏమి ఊహించలేమండి అది ఆ ఇమాజినేషన్ కూడా పోవదండి అంత దూరంలో ఉన్నాయండి చూసారా వేగం కాంతి యొక్క వేగం చెప్తున్నాను 186000 మైల్స్ పర్ సెకండ్ ఒక సెకండ్ కన్ను తెరిచి కన్నులు మూసే లోపల 186వ000 మైళలు పోతుందండి కాంతి ఆ కాంతితో లెక్క వేశరండి ఆ యార్డ్ యార్డ్ డిస్ట్రిక్ట్ తో లెక్క వేశరు కొన్ని సంవత్సరాలు దూరంలో ఉన్నాయండి నక్షత్రాలు మరి ఎవరండి దాన్ని ఎంత జ్ఞాని మనం ఒక్క ఒక్క సూర్యుడు దగ్గరే ఇంత చూడండి
(39:35) తొమ్మిది గ్రహాలు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి. ఎంత కరెక్ట్ గా తిరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదండీ గంటకి 1000 మైళలు తిరుగుతున్నదండి ఈ భూమి చూడండి తన చుట్టూ తాను 1000 మైళలు గంటకి చూడండి ఎంత స్పీడ్ చూడండి మనకేమి తెలియటం లేదు కదా గిరగిర 24 గంటలు అయ్యేప్పటికి సూర్యుడు మళ్ళా అస్తమిస్తున్నాడు మళ్ళా ఉదయిస్తున్నాడు ఇదంతా ఎట్లా ఈ మట్టి ముద్ద తిరుగుతుంది జడమైన మట్టి ముద్ద ఎట్లా తిరుగుతుంది చెప్పండి అది దేర్ మస్ట్ బి సంవన్ ఒక చైతన్యమైనటువంటి శక్తి లేకపోతే ఇది తిరగడం అసాధ్యం అండి సూర్యుని చుట్టూ మళ్ళా సంవత్సరానికి ఒకసారి కోటాను కోట్ల
(40:03) మైళ్లంతా ప్రయాణం చేస్తున్నది ఎవరండీ ఇదంతా చేసేది చెప్పండి ఒక జడ జడమైనటువంటి స్థితి ఇటువంటి చేయగలదా లేదు ఒక చైతన్యమైన దానికి ఏదైనా పేరు పెట్టుకోండి కాల్ ఇట్ బై ఎనీ నేమ్ మీరు దేవుడు అనండి ఇంకొక పేరు పెట్టుకోండి బట్ దేర్ ఇస్ ఏ డివైన్ పవర్ దేర్ ఇస్ ఏ స్పిరిచువల్ పవర్ బిహైండ్ అది అది లేకపోతే ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా మీ గుండె ఆడుతున్నది కదా ఎవరు ఆడిస్తున్నారు చెప్పండి మనకేమైనా శక్తి ఉన్నదా రక్తం ప్రవహిస్తున్నది అంటే మనం ఏమైనా దాంట్లో బాధ్యత స్వీకరించాం ఏమీ లేదు కదా మనం ఊరికే కూర్చున్నాం ఇప్పుడు చూడండి ఇంటికి వెళ్లి ఒక ముద్ద నోట్లో
(40:32) వేసుకుంటాం పండుకుంటాం జీర్ణం చేసేది ఎవరు అహం వైశ్వానరోభూతి ప్రాణినాం దేహమాశ్రితః రేపు 15వ అధ్యాయంలో కృష్ణ అర్జున మీరు భోజనం చేస్తున్న ధాన్యం ఎవరు ఇస్తున్నారు నేను గాం ఆవిశభూతానిధారయమోసపుషమిచ సర్వాసోమోభత్వరసాత్మకః ఈ విధంగా భగవానుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మానవుడు ఆలోచన లేకుండా నేను అనేటువంటి ఈగోయిజం ఎందుకు వచ్చింది చెప్పండి మధ్యలో అహం ఈ కర్తృత్వం ఎందుకు వచ్చింది చెప్పండి ఒక పల్లెటూరు వాడండి ఇంతవరకు ఎప్పుడు ప్రయాణం చేయలేదండి రైలు ప్రయాణం మూట కట్టుకొని రైలుకు ప్రయాణం బయలుదేరాడు ఎవరు పల్లెటూరు వాడు టికెట్ కొన్నాడు రైల్లో కూర్చున్నాడండి కూర్చుంటే
(41:14) తన మీద నెత్తి గుడ్డల మూట అంతా ఉన్నదండి నెత్తిన అట్లాగే వెళ్లి కూర్చున్నాడు నెత్తిన గుడ్డల మూట ఉంది చూచాడు ఓ కింద ట్రంకు పెట్టలు ఆ క్యారేజ్ నిండ ట్రంకు పెట్టెలు మనుషులు ఈ బరువు అంతా చూసి అయ్యో ఇప్పటికే రైలుకి చాలా బరువు అయిపోయింది నా మూట కూడా దించితే రైలుకి ఇంకా భారం అయిపోతుంది నా మూట నేనే మోసుకుంటాను అని నెత్తిని పెట్టి కూర్చున్నాడండి రైల్లో పక్కన వాళ్ళంతా తిట్టారు ఏమయ్యా ఎక్కడ పుట్టావు ఊళలో కొట్టావా అడవిలో కొట్టావా అని అడిగాడు ఆ నీ నెత్తిన మూట కింద పెట్టవాయ్ ఎందుకు బరువుతో చస్తావు నువ్వు నువ్వు కింద పెట్టిన నెత్తిన పెట్టిన
(41:45) మోసేది నువ్వు కాదు రైలు మోస్తుంది అనవసరంగా ఎందుకు బాధపడతావ్ చూసారా అదే విధంగా జీవుడు ఏమో కర్తృత్వం పెట్టుకొని ఈ బ్రహ్మాండంలో తానేమో పెద్ద చేస్తున్నట్టుగా ఉంది ఎవరండీ చేసేది ఈ అఖండమైనటువంటి జీవుడు ఎప్పుడు వచ్చాడు నూరేళ్ళ కింద లోపల వాడు ఉన్నాడా నూరేళ్ళు అయిన తర్వాత వాడు ఉంటాడా చెప్పండి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎవరండీ ఇదంతా మనిపులేట్ చేసేది చెప్పండి మనిపులేట్ చేసేది ఒక అఖండమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తి మీద విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు కర్మ శుద్ధమైపోతుంది చూసారా నిష్కామత్ కర్మ దైవార్పిత కర్మ అహంకార రహితమైనటువంటి
(42:18) కర్మ అన్ అటాచ్డ్ కర్మ శ్రీ కృష్ణవర్మ కర్మ చేయొద్దు అని చెప్పలేదు డు యువర్ వర్క్ డ యువర్ డ్యూటీ బట్ డు ఇట్ అన్ అటాచ్డ్ ఇది తగులుకోకుండా చేయమని చెప్పి శ్రీ కృష్ణవర్మ ఈరోజు తిరిగి కర్మయోగం యొక్క ప్రస్తావన తీసుకొచ్చినారండి తీసుకొచ్చి ఇప్పుడు 24వ శ్లోకం ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకొని నోట్ చేసుకోండి ఇది బాగా కంఠస్తం చేయండి ఎందుకు అని మీరు అడగొచ్చు భోజనం చేసేటప్పుడు అండి ఇస్తట్లో అన్ని వస్తువులు వడ్డించిన తర్వాత చేతిలో తీర్థం తీసుకోండి తీర్థం తీసుకొని దైవ భావనతో ఏవండీ ఈ శ్లోకం చెప్పండి బ్రహ్మర్పణం బ్రహ్మవిర్ బ్రహ్మజ్ఞ బ్రహ్మణహుతం
(42:55) బ్రహ్మైవతేనగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అద్భుతమైన శ్లోకం అండి ఈ శ్లోకం చదివి నీళ్లుు చల్లండి అన్నం మీద దైవార్పణ భావంతోనండి దాన్ని భుజిస్తే ఎంత పవిత్రమైపోతుంది అంటే రక్తం అంతా శుద్ధమైపోతుంది. ఎప్పుడు రక్తం శుద్ధమైందో దిమాగ్ దిమాగ్ అంటే మైండ్ శుద్ధమైపోతుంది ఎప్పుడు మనసు శుద్ధమైందో మంచి భావాలు మంచి సంకల్పాలు కలుగుతాయండి దైవ భావన కలుగుతుంది చూసారా కాబట్టి మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మనకు దైవభావన బాగా కలగాలంటే మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
(43:28) ఈరోజు కూడా అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషువతి ఆహారంలో నియమపూర్వకంగా ఉండటం ఒక యజ్ఞం అన్నాడండి ఈరోజు యజ్ఞం ఇది నియతాహారాః ఆహార విషయంలో ఇప్పుడు టైం లేదు సంక్షేపంగా నాలుగు నియమాలు చెప్తాను వినండి రేపు మళ్ళా వస్తుందండి ఆరవ అధ్యాయంలో ఆహార ప్రస్తావన సాత్విక ఆహారం మితాహారం దైవార్పిత ఆహారం న్యాయార్జిత ఆహారం నాలుగు విధాలుగా పరిశుద్ధంగా ఉండాలని అర్ధ మళ్ళీ చెప్తున్నాను సాత్విక ఆహారం మితాహారం దైవార్పిత ఆహారం న్యాయార్జిత ఆహారం ఈ విధంగా ఆహార నియమం కూడా ఒక యజ్ఞం కింద వర్ణించి అన్ని యజ్ఞములలో శ్రేష్టమైనటువంటి యజ్ఞం జ్ఞాన యజ్ఞం అని చెప్తున్నారండి ఉదారా సర్వయేవైతే చూడండి ఆ
(44:14) యజ్ఞములు చూడండి శ్రేయాన్ ద్రవ్యమయద యజ్ఞ జ్ఞాన యజ్ఞపరంతప సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే ప్రపంచంలో అనేక యజ్ఞాలు అశ్వమేధ యజ్ఞం రాజసు యజ్ఞం ఇంకా అనేక యజ్ఞాలు ఉన్నాయి డబ్బుతో కూడింది అంగబలం అర్థబలం కానీ జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే శ్రేష్టం దీంట్లో ఖర్చు లేదండి చక్కగా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేసుకుంటే చాలండి అది అన్నిటికంటే సుపీరియర్ సాక్రిఫైస్ అది గొప్ప యజ్ఞం అని శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఆదిక్యత ఇచ్చినాడు చూడండి శ్రేయాన్ ద్రవ్యమయ యజ్ఞ జ్ఞాన యజ్ఞపరంతప ఏ కార్యం చేసిన ఆఖరికి జ్ఞానంలో కలిసిపోవాల్సిందే చూడండి రెండైన జ్ఞాన
(44:53) తపస్సు జ్ఞాన యజ్ఞం ఇప్పుడు ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పద్ధతి ఏమిటి తెలుసుకొని తరించాలంటే ఈ జ్ఞానం పద్ధతి ఏమిటి దానికి ఎటికెట్ ఎటికెట్ చెప్తున్నారు అంటే పద్ధతి సదాచారం ఆ అనుభవజ్ఞులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళండి సాష్టాంగ నమస్కారం చేయండి ప్రేమతో దయతో భక్తితో వారిని ప్రశ్నించండి మీరు కమాండ్ చేయొద్దు డిమాండ్ చేయొద్దు అంటున్నారండి ఆ శ్లోకం చాలా గంభీరమైన శ్లోకం తద్వది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః పెద్దల దగ్గరికి వెళ్లి ఊరికి కమాండ్ చేయొద్దు వినయ విధేయతలతో వారిని పరిప్రశ్న ప్రశ్న అంటే ఊరికి అడగటం పరిప్రశ్న అంటే
(45:38) వినయంతో అడగటం అయ్యా మహానుభావా ఈ సంసార కోపంలో నానా బాధలు పొందుతున్నాం దయచేసి ఈ బాధలు తొలగటానికి ఉపాయం సెలవివ్వండి ఎంత చక్కని ప్రశ్న చూడండి ఎంతో వినయం ఒబీడియన్స్ ఆ పెద్దల దగ్గరండి ఎంత ఒబీడియంట్ గా ఉంటే అంత మంచిదండి అది ఎట్లా ఉండాలంటే హనుమంతుడు అది శ్రీరామచంద్రుని దగ్గర హనుమంతుడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలండి పెద్దల దగ్గర కనుక దానికి ఎటికట్టు ఏ విధంగా సదాచారం మనం ఆచరించాలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పినారు ఇక జ్ఞాన నౌక మూడవది జ్ఞాన నౌక మహా పాప సముద్రం ఉన్నది అనుకోండి ఈ పాప సముద్రంలో ఉన్నప్పటికిన ఎవరు ఏం కంగారు
(46:15) పడబాకండి చక్కని జ్ఞానం అనేటువంటి తెప్ప తెచ్చుకోండి అవలీలుగా దాటవచ్చును అంటున్నారు చూడండి అపితేసి పాపేభ్యసర్వ పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవావృజినం సంతరిష్యసే వాల్మీకి చూడండి పూర్వం పూర్వాశ్రమంలో ఎంత ఎటువంటి కార్యములు చేసినారో మీకు తెలుసు కదా కానీ ఆ రామనామం ఆ తారకాన్ని చక్కగా భక్తితో జపం చేసినారు హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నారు ఆత్మజ్ఞానం వారికి చక్కగా కలిగింది తాను ధరించడమే కాకుండా లోకాన్నంతటిని ధరించినారు రామాయణం అనేటువంటి మహా కావ్యాన్ని రాసినారు యోగ వాశిష్టం అనేటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన సంబంధ గ్రంథాన్ని రాసినారు ఏవండీ ఈ
(46:51) పరిణామం ఎట్లా వచ్చింది చెప్పండి అది కనుక పూర్వం ఈ పాపం చేయను ఏమైనా చేయనండి ప్లీజ్ డోంట్ కేర్ ఇప్పుడు చేయవలసింది శుద్ధమైనటువంటి కార్యం వాటిని కడిగివేసి నూతన మార్గంలో ప్రవేశిస్తాం ఎంత ధైర్యం ఇస్తున్నారో చూడండి కొందరు పాపులు ఏడుస్తున్నారు వాళ్ళని కొందరు నిరుత్సాహ పరుస్తున్నారు ఏమోయ్ నువ్వు పో నువ్వు మంచి కులం కాదు పెద్ద కులం కాదు నువ్వు ఊరు బయటికి పో ఈ పల్లికి పో ఆ పల్లికి పో నువ్వు ఇక్కడ గుడిలోకి రావడానికి లేదు అధికారం నీకు ఈ విధంగా చెప్తుంటే ఎంత నిరుత్సాహ పడతాడు చెప్పండి భగవద్గీత అట్లా చెప్పనే లేదు ఉత్తమైన ఉపనిషత్తులు అట్లా
(47:24) చెప్పనే లేదండి ఆ ఏ మతమైనా ఏ జాతి అయినప్పటికిని ఎవరైనప్పటికిని కూడా తరించడానికి అవకాశం ఉందండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం అనేటువంటి నౌక గనుక తెచ్చుకుంటే పాప సముద్రం కూడా అవలీలగా దాటవచ్చును ఇప్పుడు నాలుగవది జ్ఞాన అగ్ని చూడండి జ్ఞాన అగ్ని ఇంకొకటి ఉందండి జ్ఞాన ఖడ్గం అదైతే ఈ అధ్యాయం పూర్తఅయిపోతుంది జ్ఞాన అగ్ని యతంసమిదోగ్ని భస్మసాత్కురోతేర్జున జ్ఞానాగ్ని సర్వ సర్వకర్మాణి భస్మసాత్కురుతేతా అనేక జన్మల్లో చేసిన కర్మ పేరుకొని పోయిందండి అక్కడ దాని పేరు సంచితం సంచిత కర్మ అనేటువంటిది కొండలాదిగా ఉన్నదండి దాంట్లోనుంచి కొద్దిగా కర్మ తీసుకొని
(48:03) ప్రారబ్ధం ఒక శరీరాన్ని ధరించి ఈదుకుంటున్నాడు సంసారం ఇప్పుడు ఆ సంచి సంచి సంచి సంచి సంచి సంచి సంచి సంచి సంచి సంచి సంచిత కర్మ అంతా నశిస్తే తప్ప జన్మ రాహిత్యం కలగదు ఎట్లా నశించాలి దానికి కృష్ణ పరమాత్మ ఉపాయం చెప్తున్నాడు ఇలా కట్టెలు కొండలాదిగా కట్టెలు ఉన్నాయి అనుకోండి నిప్పురవ్వ ఒక నిప్పు రవ్వ దాని కింద పెట్టండి చాలు ఎంత చక్కని ఉపాయం ఏమిటి నిప్పురవ జ్ఞానాగ్ని జ్ఞానం అనేటువంటి అగ్ని చేత కర్మ కట్టెలన్నీ ధ్వంసమైపోతాయని మనకి వాగ్దానం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గ్యారెంటీగా చెప్పేస్తున్నారు యతంసమిదోగ్ని భస్మసాత్జున జ్ఞానాగ్ని సర్వ కర్మాణి ప్లీజ్ అండర్లైన్
(48:37) సర్వకర్మ ప్రారబ్ధం కూడా ఎగిరిపోతుందండి అవుతే నామకార్థంగా ఉంటుందనుకోండి శరీరం ఏమి బంధనం ఉండదండి సర్వ కర్మణి అన్ని భస్సం అయిపోతాయి ఎవరికి జ్ఞాన అగ్ని కలవారికి అది జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్కురుతేతా ఇంకొకటి ఉందండి జ్ఞాన ఖడ్గం మానవునికి ఈ కార్యక్రమం మనం ఆచరణలో పెడుతుంటే అనేక సందేహాలు వస్తాయండి అనేక సందేహాలు వస్తాయి వచ్చినప్పుడు ఏమి కన్ఫ్యూషన్ కంగారు పడకూడదండి ఇది నాచురల్ ఎందుకంటే ఈ మార్గం కొత్తది కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అందరికీ దీంట్లో అనేక సందేహాలు రావచ్చును ఏమి కంగారు పడకుండా మహనీయులు చెప్పిన వాక్యం మీద ఫెయిత్ విశ్వాసం కలిగింది ఆ
(49:15) విశ్వాసంతో మీరు ప్రొసీడ్ కాండి ఏవండీ మేము గుడ్డిగా ఎట్టా నమ్మేది అని ఎవరైనా అడిగితే అయ్యా గుడ్డి నమ్మకమో ఏ నమ్మకమో అది కొంచెం దూరంగా పెట్టండి ముందు నమ్మండి ప్రొసీడ్ ప్రొసీడ్ అయిన తర్వాత మీరు ఫలితం మీకే తెలుస్తుంది ఆ మీరు దాని యొక్క ఫలితములు వెంటనే తెలుసుకుంటారు ఇది కేవలం కపోల కల్పితమైనటువంటి ప్రోగ్రాం కాదండి ఈ స్పిరిచువల్ ప్రోగ్రాం ఉన్నది చూడండి అది [గొంతు సవరించుకోవడం] థియరటికల్ కాదు ప్రాక్టికల్ ప్రత్యక్షవగమం ధర్మ్యం అని గీతలో చెప్పింది యు కెన్ సీ గాడ్ డైరెక్ట్లీ యు కెన్ రియలైజ్ గాడ్ హియర్ అండ్ నౌ అని చెప్పి పెద్దలంతా
(49:46) బోధిస్తూ ఉంటే మనం ఎందుకు ట్రై చేయకూడదు ముందు నమ్మకం చూడు శ్రద్ధావాన్లభతే జ్ఞానం ఆహ లాస్ట్ లో చెప్పిన శ్లోకం అండి ఇది నాయనా అర్జున జ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే పెద్దల మీద గురువు మీద దైవం మీద తన మీద శాస్త్రం మీద విశ్వాసం నాలుగు విశ్వాసములుండి జ్ఞాపకం పెట్టుకోండి ఫెయిత్ అన్ ది మాస్టర్ ఫెయిత్ అన్ గాడ్ ఫెయిత్ అన్ స్క్రిప్చర్స్ ఫెయిత్ అన్ హిimసెల్ఫ్ అది గురువు మీద దైవం మీద శాస్త్రం మీద తన మీద విశ్వాసం ఎవరికి అంత విశ్వాసం ఉన్నదో నాలుగి మీద అద్భుతమైనటువంటి పరిణామం కలుగుతాయండి మొదట పెడుతు ఇప్పుడు చూడండి ఆధ్యాత్మిక రంగంలో
(50:22) మొదలు పెట్టంగానే ఇది నిజమా అది నిజమా ఇది సత్యమా అది సత్యమా అసలు కృష్ణుడు ఉన్నాడా గీత చెప్పాడా చెప్పింది ఫలితం వస్తుంది ఎందుకండీ ఇదంతా ఈ సరే కృష్ణుడు చెప్పాడు నమ్మండి నమ్మిన తర్వాత దాన్ని ఆచరించండి మనకు ఫలితం కలకపోతే అప్పుడు అడగండి రామకృష్ణ వరంశ గారు వివేకానంద్ ఎన్నో ప్రశ్నలు అడిగారండి కానీ పరమహంస గారు నాయన సాధన చెయ్యి నాలుగు సంవత్సరములు చెప్పిన సాధన చెయ్యి తర్వాత అడుగు అన్నారండి వివేకానంద తర్వాత అడగలేదు అండి అన్ని అనుభవాలు వారికి కలిగిపోయినాయి సందేహాలన్నీ తొలగిపోయింది అర్జునుడు గారు అన్నట్టు నష్టోమోహస్మృతిలత
(50:55) ప్రసాదాన్మయచుత స్థితోస్గత సందేహకరిషే వచనంతవ అన్నారు వివేకానంద ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని వాక్యం అంటే ఈ ఆధ్యాత్మిక విషయం ఎట్లా అనుభవానికి వస్తుంది ఇప్పుడు జ్ఞానాన్ని గురించి చక్కగా చెప్పారు కదా ఈ జ్ఞానం ఎట్లా వస్తుందంటే తత్ స్వయం ఈ జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా గొప్పది అంటున్నారు నహి జ్ఞానే నేనసదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మనివిందతి స్వయం ప్లీజ్ అండర్లైన్ ఈ ఆత్మజ్ఞానం ఎట్లా లభిస్తుంది అంటే గురువుగారు బోధిస్తారు పెద్దలు బోధిస్తారు ఆచరించవలసింది ఎవరు స్వయం తాను స్వయంగా ఆచరణ చేయాలండి ఇప్పుడు చాలా దుఃఖాలు
(51:37) ఉన్నాయండి ఇతరులు చేత తొలగిపోతాయి ఆకలి దుఃఖం తాను భోజనం చేస్తే తప్ప తీరదండి శంకరాచార్యుల వారు ఇదే విషయం మస్తకన్యస్తభారాదే దుఃఖమన్యే నివార్యతే నీ శిరస్సు మీద కట్టెలు మోపు ఉంటే ఇతరులు తీసి నీకు ఆనందం కలుగజేస్తారు మీకు ఆకలి అయితే వాళ్ళు ఏం చేస్తారు మీరు అన్నం తినాలి చుదాదికృత దుఃఖంతో వినాశవేననకేనచితు ఆకలి దుఃఖం మనం మనం స్వయంగా ముద్ద నోట్లో వేసుకొని ఆకలి తీర్చుకోవాలి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే స్వయం అన్నాడు తాను స్వయంగా సాధన చేయాలి లేకపోతే ఎట్లా పోతుంది అండి ఈ దుఃఖం ఇప్పుడు ఈ కాలంలో
(52:13) నుండి సోమరుతనం ఎక్కువైపోయింది కొందరు శిష్యులు సరిైన ప్రయత్నాలు చేయటం లేదు అందువల్ల గురువు పొందినటువంటి అమోఘమైనటువంటి స్థితిని వీళ్ళు పొందలేకపోతున్నారండి ఒక ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన విషయం చెప్తున్నాను పిల్లవాడు అల్లరి చేశాడండి మాస్టర్ గారు శిక్ష విధించారు చిన్న క్లాస్ అండి ఎలిమెంటరీ క్లాస్ శిక్ష విధించాడు ఏం శిక్షో తెలుసా అండి ఒరేయ్ నువ్వు పొరపాటు చేశవ్ తప్పు చేశవ్ మూడు గుంజలు తీయరా అన్నాడు గుంజలు అంటే బస్కీలు అంటారేమో ఇక్కడ మూడు బస్కీలు ఈ చేతితో ఈ చెయ్యి పట్టుకొని ఈ చెయ్యి పట్టుకొని కూర్చొని లేవాలండి దాని పేరు బస్కీ అంటారు
(52:45) ఆమె ఆ వైపు అండి ఇది తెల చాలా సర్కార్ జిల్లాలో గుంజలు అంటారు అన్నది ఆ ఒరేయ్ నాయనా నువ్వు తప్పు చేసావు మూడు బస్కీలు తీరా అన్నాడు సార్ బస్కే అంటే ఏమిటి అన్నాడు వాడు మరి వాడు తెలియకపోతే ఎట్టా చేస్తాడు ఆ శిక్ష చెప్పండి ఆ తెలిస్తే మాస్టర్ గారు చేసి చూపించాల్సిందే తప్పదు ఇంకా ఆ జాగ్రత్తగా చూడరా అని ఈ చేత్తో ఈ చెయ్యి పట్టి ఆ ఇదిగో ఇట్టా పట్టుకో కూర్చొని లే దాని పేరు బస్ కి అన్నాడు సార్ ఆ లేచేటప్పుడు ఎంత స్పీడ్ తో లేవాలో చూడలేదండి ఇంకొకసారి చూడండి మాస్టర్ గారు ఏమన్నారు మూడు బస్ కెలు తీరా అన్నాడు చూడండి వీడు ఏం చేస్తున్నాడు స్వామి ఆ
(53:18) స్పీడ్ ఎంత స్పీడ్ తో లేవాలో తెలియదు ఇంకొకసారి చూపించండి మళల మరి చూపించకపోతే వాడు ఎట్లా చేస్తాడు మళ్ళా ఇట్లా పట్టుకొని లేచాడండి మాస్టర్ గారు ఆ తీయరా మూడు కొంచెం మూడు బాస్కెళ్ళ అన్నారు సార్ ఈ చేతితో ఈ చెవి నేను సరిగ్గా చూడలేదండి దేన్ని పట్టాలో నేను చూడలేదు సరిగా ఇంకొకసారి చూపించండి అన్నాడు అప్పుడు మాస్టర్ గారు ఈ చేతితో ఈ చెవిరా అని ఇట్లా కూర్చొని లేచాడండి తీరా మూడు బస్సుక సార్ మన ఇద్దరిలో ఎవరో ఒకడు తీస్తే చాలదా అన్నాడు వాడు [నవ్వు] వాడు ఏ ముహూర్తంలో పుట్టాడు మాస్టర్ గారి చేత మూడు బస్కెలు తీయించాడండి వాడు ఇది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇది చెల్లదండి
(53:53) చూసారా ఎవడి అవస్థ వాడు పడాల్సిందే ఆ కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ స్వయం అన్నారు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే తత్స్వయం యోగసంసిద్ధకాలేనాత్మనివిందతే ఎవరికి వస్తుంది ఇది శ్రద్ధ కలిగిన వారు శ్రద్ధావాన్ లవతే జ్ఞానం తత్పరసమ్యతేంద్రియ జ్ఞానం లబ్వా పరాంశాంతిం అతిరేనాధిగచ్ఛతి కాలేన ఆత్మను విందే చూడు ఈ ఒక్కదానికి చెప్పి నేను విరమిస్తున్నాను ఈ అధ్యాయం కాలేన అర్జున ఇది గనుక సాధన చేస్తుంటే ఎప్పుడు మోక్షం అందుతుంది అని చెప్పి మీరు అడిగితే కాలేనా ఇన్ కోర్స్ ఆఫ్ టైం యు విల్ గెట్ సాల్వేషన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అని చెప్పేసారండి అది ఎవరి మీద ఆధారపడి
(54:32) ఉంటుంది టైం వీడి సాధన మీద వీడు గనుక తీవ్రమైనటువంటి సాధన చేస్తే త్వరలోనే మోక్షం వస్తుంది నెమ్మదిగా ఆలోచిస్తే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు చూడండి కాలేనాత్మని విందతే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న మీరు విజయవాడ పోతున్నారు ండి ఇక్కడినుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ పోతున్నారు ఒకాయన ఇంతో చెప్పారు ఇది ఏవండీ నేను విజయవాడకి పోతున్నాను ఎప్పుడు చేరుతాను అని మీరు ఎవరినైనా అడిగితే వాడు ఏం చెప్తాడు చెప్పండి ఏం చెప్తాడు ఏ వాహనం మీద పోతున్నావో చెప్పవయ్యా అంటాడు కదండీ ఆ మీరు గనుక ఎద్దు బండి మీద వెళితే 15 రోజుల్లో విజయవాడు చేరుతారు గుర్ర బండి మీద పోతే
(55:07) ఏడు రోజుల్లో చేరుతారు మూటర్ కారు మీద పోతే ఎనిమిది గంటల్లో చేరుతారు విమానం మీద పోతే 10 నిమిషాల్లో చేరుతారు రాకెట్ మీద పోతే రెండు నిమిషాల్లో చేరుతారు కదలకపోతే ఇక్కడే పడి ఉంటారు లేకపోతే ఏమిటంటే సిల్లీ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ అది నేను ఎప్పుడు చేస్తాను ఆ విజయవా దానికి అర్థం ఉందా అదే విధంగా నేను మోక్షం ఎప్పుడు పోతాను అని చెప్పి శిష్యుడు గురువుగారిని అడిగితే ఏం చెప్పగలడు నువ్వు సాధన ఎట్లా చేస్తావ్ ఏ విధంగా నువ్వు నియమాలను ఆచరణలో పెడుతున్నావ్ నీ దుర్గుణాల్లో ఏమైనా పోగొట్టావా అని గురువుగారు ప్రశ్న చేస్తారు ఏమీ లేకుండా సాధన చేయకుండా
(55:39) మోక్షం పొందాలంటే సామాన్యం అండి కనుకనే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమి విద్యతే తత్స్వయం యోగసంసిద్ధతకాలేనాత్మనవిందతే అని శ్రద్ధ కలిగినవాడే మోక్షం పొందుతాడు సాక్షాత్కారం పొందుతాడని చక్కగా ఈ జ్ఞాన యోగంలో ప్రతిపాదించి ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన యోగాన్ని విరమించినారు
No comments:
Post a Comment