చిక్కుల ముడిగా మారిన
పెక్కు కలతల సంకెలతో
దిక్కే తెలియక డస్సిపోతున్న
ఒక్కో బ్రతుకును ఒడ్డుకు
చేర్చేస్తూ...
కాలపు రాకాసి చక్రాల
జాలము తెలియక
బేల అయిన మనుషుల
గోలగ తోచే సమస్యల
తుంచేస్తూ..
దహించే బాధల వేడిని
సహించే ఓర్పును కలిగి
వహించే బాధ్యతలకు
సహకారం కోరే మనసుని
ఆదరిస్తూ..
అహంకారపు చీకటిలో
అతిశయంగా జీవిస్తూ
అలవికాని ఆశలతో
అలజడి నిండిన మదిని
అదుపు చేస్తూ...
అవనికి అభయం ఇచ్చి
అవలీలగా అన్ని సరిచేసి
ఆశగా చూసే కళ్ళకు
అలంబనగా వచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment