🙏🙏*🌻శరణాగతి🌻*
*🌻భగవంతుడు భక్త సులభుడు🌻*
🍃🌹ఈ ప్రపంచంలో ఎందరో మానవులు ఉన్నారు. కాని అందరూ ధన్యులు కారు, అందరూ కృతకృత్యులు కారు, అందరూ అదృష్టవంతులుకారు.ఎవని హృదయంలో భగ వంతుని ఎడల భక్తి నెలకొని యుండునో, ఎవని చిత్తం భగవంతుని సదా ధ్యానించుచుండునో అతడే ధన్యుడు, అట్టివాడే కృతకృత్యుడు.
🍃🌹ఎందుకనగా సాక్షాత్ వైకుంఠ నాథుడగు పరమాత్మ వాని హృదయములోనికొచ్చి అచట తిష్ఠవేస్తారు.భక్తుని హృదయంలో భగవంతుడు కాపురముంటారు. ఎచట భగవంతుడు ఉండునో, అచట జయం, ధర్మం, నీతి, శాంతి, ఆనందం అనవరతమూ తాండవిస్తాయి. ఈ విషయం సంజయుడు భగవద్గీతలో చెప్పనే చెప్పారు.
🍃🌹గాలిపటం ఎంతదూరం ఎగిరిపోయినప్పటికి, దారం చేతిలో ఉన్నంతవరకు అది సమీపానికి ఎట్లా వచ్చి తీరుతుందో అదేవిధంగా భక్తి అను సూత్రం హృదయంలో పదిలంగా ఉంటే భగవానుడు వైకుంఠంలో ఉన్నా, కైలాసంలో ఉన్నా, ముల్లోకాల్లో మరి ఎక్కడవున్నా సరే భక్తుని హృదయం లోనికి తప్పక వచ్చి తీరుతారు.
🍃🌹భగవంతుడు భక్తవత్సలుడు. మార్జాల కిశోర న్యాయము ననుసరించి పిల్లి తనబిడ్డను ఎట్లా జాగరూకతతో సంరక్షిస్తుందో, అట్లే భగవంతుడు భక్తులను కాపాడుతుంటారు. వారి యోగ క్షేమాలను హమేషా విచారిస్తూంటారు.
🍃🌹భగవత్సాన్నిధ్యంచే అచిరకాలంలో అతనికి ఆత్మవిచారణ ఉదయిస్తుంది. దానిచే అతడు తానెవరో, జగత్తేమిటో చక్కగా తెలుసుకొంటాడు.తాను జడమైన దేహం కాదని, చైతన్యమైన ఆత్మనని బాగుగా గ్రహిస్తాడు.
🍃🌹అట్లు గ్రహించి అసత్యరూపాలయిన నామరూపాలయందు వైరాగ్యం కలిగి, సత్యమైన ఆత్మయందే ప్రతిష్ఠితుడయి యుంటాడు. అదే జీవన్ముక్త స్థితి. అదే మోక్షం.
🍃🌹కావున జీవుడా! దైవభక్తిని చక్కగా పెంపొందింపజేసుకో. ప్రతిదినం నియమపూర్వకంగా క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించు.ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప తక్కినదంతయు కాలగర్భంలో విలీనమయిపోతుంది.క్షణికమయిన వస్తువులకొరకై ప్రాకులాడటం విజ్ఞతకాదు. భగవంతుడొకడే శాశ్వతుడు. వారి పాదాలనాశ్రయించినవారు ధన్యులు.
🍃🌹జీవుడా! భగవచ్చరణాగతిని పొందు. వారి అను గ్రహంచే అంతాసవ్యంగా జరిగిపోతుంది. భగవంతుని యెడల శ్రద్ధా భక్తులను ఇనుమడింపజేసుకో. అప్పుడే నీ జీవితంసార్థకమవు తుంది. నీవు కృతార్థుడవౌతావు. పరమశాం తిని, ఆనందాన్ని అనుభవిస్తావు.
🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
No comments:
Post a Comment